గాడ్జిల్లా గుడ్డేం కాదు! | Japan Officials Clarity On White Mystery Ball | Sakshi
Sakshi News home page

మిస్టరీగా వైట్‌బాల్‌.. గాడ్జిల్లా గుడ్డేం కాదు!

Published Fri, Feb 24 2023 10:02 PM | Last Updated on Fri, Feb 24 2023 10:02 PM

Japan Officials Clarity On White Mystery Ball - Sakshi

వైరల్‌: జపాన్‌ తీరానికి కొట్టుకొచ్చిన వస్తువు ఒకదాని గురించి.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసే ఉంటుంది. బాగా మట్టికొట్టుకుపోయి.. లేత పసుపురంగులో బంతి ఆకారంలో ఉన్న ఆ వస్తువు ఏంటన్నదానిపై చర్చలు జరిగాయి. 

స్పై బెలూన్‌ అని, ఒక అడుగు ముందుకు వేసి కొందరైతే గాడ్జిల్లా గుడ్డు అంటూ చర్చించుకున్నారు కూడా. ఇదిలా ఉంటే.. హమామత్సు ప్రాంతం ఈ పరిణామంతో భయాందోళనకు గురైంది. 

అయితే.. ఎక్స్‌రే పరీక్ష ద్వారా ఇదేం పేలుడు పదార్థం కాదని అధికారులు నిర్ధారించారు. అంతేకాదు అది స్క్రాప్‌ మెటల్‌ అయ్యి ఉంటుందని భావిస్తున్నారు. బహుశా సముద్రతీరంలో ఉపయోగించే వస్తువు అయ్యి ఉంటుందని ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు అధికారులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement