శాన్‌ఫ్రాన్సిస్కో : సిలికాన్ వ్యాలీ ఆధారిత ఐటీ సంస్థ అమెరికా ప్రభుత్వంపై లా సూట్ ఫైల్ చేసింది. భారతీయ ఐటీ ప్రొఫెషనల్‌కు హెచ్-బీ వీసా జారీ నిరాకరణపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ దావా దాఖలు చేసింది. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేసిన తమ ఉద్యోగికి వీసా నిరాకరణ ఏకపక్షమైనందనీ విచక్షణ పూరితమైందని వ్యాఖ్యానించింది. తమ సంస్థలో బిజినెస్ సిస్టం ఎనలిస్టు ప్రహర్ష్ చంద్ర సాయి వెంకట అనిశెట్టి( 28) కి హెచ్-1బీ వీసాను యుఎస్ సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ నిరాకరించిందని ఎక్స్ టెర్రా సొల్యూషన్స్ అనే ఐటీ సంస్థ ఆరోపించింది. ఫిబ్రవరి 19, 2019 ఇమ్మిగ్రేషన్ విభాగం విచక్షణా రహితంగా, చట్ట విరుద్ధంగా అనిశెట్టి వీసాను తీరస్కరించిదని పేర్కొంటూ దావా వేసింది. అన్ని అర్హతలున్నప్పటికీ ఏకపక్షంగా వ్యవహరించిందని కంపెనీ ఆరోపించింది.
అనిశెట్టి బీటెక్(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) డిగ్రీతోపాటు డాలస్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ లో మాస్ట్‌ర్స్ డిగ్రీ చేశారని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం అనిశెట్టి (భార్య ద్వారా) హెచ్-4 డిపెండెంట్ వీసాతో ఉన్నారని తెలిపింది.
మరోవైపు దీనిపై స్పందించేందుకు ఇమ్మిగ్రేషన్ విభాగం తిరస్కరించింది.
కాగా మొత్తం 65,000 మందికి హెచ్1 బీ వీసా ఇవ్వాలని ట్రంప్ సర్కారు నిర్ణయించింది. వీరితోపాటు లబ్ధిదారుల తరపున వచ్చిన మొదటి 20వేల మంది విదేశీయులకు అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ఈ లిమిట్‌నుంచి మినహాయింపునిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment