సిలికాన్ వ్యాలీలో టీ హబ్ ఔట్‌పోస్ట్ | T Hub Outpost in Silicon Valley | Sakshi
Sakshi News home page

సిలికాన్ వ్యాలీలో టీ హబ్ ఔట్‌పోస్ట్

Published Thu, Oct 6 2016 2:52 AM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM

T Hub Outpost in Silicon Valley

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ‘టీ హబ్ ఔట్ పోస్టు’ను ప్రవాస భారతీయుల సహకారంతో సిలికాన్ వ్యాలీలో మంత్రి కేటీఆర్ ఈ నెల 15న ప్రారంభించనున్నారు. ఈ నెల 12 నుంచి వారం రోజుల పాటు అమెరికాలో ఆయన పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఐటీ, పారిశ్రామిక, ఫార్మా రంగాలకు చెందిన సంస్థల ప్రతినిధులతో మంత్రి భేటీ అవుతారు.
 
 మూడు రోజుల పాటు మిన్నెపోలిస్‌లో జరిగే ‘అడ్వామెడ్-2016’ సదస్సులో 19న పాల్గొంటారు. వైద్య ఉపకరణాల తయారీలో దేశంలోనే అగ్రస్థానం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘మెడికల్ డివెజైస్’ పార్కు ఏర్పాటును ప్రతిపాదిస్తోంది. ఈ సదస్సులో ఈ పార్కు ప్రత్యేకతలు వివరించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement