'భారతీయ కంపెనీలకు భారీ ఫైన్' | Indian-American owned companies fined for misuse of H1B visa | Sakshi
Sakshi News home page

'భారతీయ కంపెనీలకు భారీ ఫైన్'

Published Tue, Nov 10 2015 8:41 AM | Last Updated on Sun, Sep 2 2018 4:12 PM

'భారతీయ కంపెనీలకు భారీ ఫైన్' - Sakshi

'భారతీయ కంపెనీలకు భారీ ఫైన్'

వాషింగ్టన్: భారతీయ సంతతికి వ్యక్తులకు చెందిన రెండు కంపెనీలకు అమెరికా కోర్టు భారీ మొత్తంలో ఫైన్ వేసింది. దాదాపు రూ.68,41,458.17(103000 డాలర్లు) మొత్తం ప్రభుత్వానికి చెల్లించాలని, మరో రూ.5579441.62(84,000డాలర్లు) ఉద్యోగులకు చెల్లించాలని ఆదేశించింది. ఇంతమొత్తంలో ఆ కంపెనీలకు ఎందుకు ఫైన్ వేశారని అనుకుంటున్నారా.. అందుకు ప్రధాన కారణం ఆ కంపెనీలు హెచ్-1బీ వీసాల విషయంలో ఉల్లంఘనలకు పాల్పడటమే.

సిలికాన్ వ్యాలీలో గల ప్రముఖ కంపెనీలైన స్కోపస్ కన్సల్టింగ్ గ్రూప్, ఆరియాన్ ఇంజినీర్స్ అనేవి భారతీయ సంతతికి చెందిన వ్యక్తులైన కిషోర్ కుమార్ మరో వ్యక్తికి సంబంధిన కంపెనీలు. ఈ కంపెనీ భారత్తోపాటు ఇతర దేశాల నుంచి కూడా తమ కంపెనీకి హెచ్-1బీ వీసాల ద్వారా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను ఈబే, ఆపిల్, సిస్కో సిస్టమ్ కంపెనీల మాదిరిగా రప్పించింది. అయితే, ఈ క్రమంలో ఆ కంపెనీలు వీసా ఉల్లంఘనలకు పాల్పడ్డాయని అమెరికాకు చెందిన లేబర్ వేజ్ డిపార్ట్ మెంట్ గుర్తించింది. వీసాల్లో పేర్కొన్న విధంగా సదరు ఉద్యోగులకు జీత భత్యాలు చెల్లించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటికి భారీ ఫైన్ వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement