H 1B Visa
-
ట్రంప్ 2.0: ఎన్నారైల ఎదురుచూపులు ఫలించేనా? లేక..
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, సైనిక శక్తి కలిగి ఉన్న అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఇమ్మిగ్రేషన్, H1B, F1 వీసాలపై ట్రంప్ 2.O ప్రభావం ఎలా ఉంటుంది? అమెరికాలో విదేశీయుల విద్యకు ట్రంప్ విజయం అనుకూలమా? వ్యతిరేకమా? మరి అమెరికాలో చదువుకుంటే చదువు అయిపోగానే గ్రీన్ కార్డు ఇస్తామని ట్రంప్ గతంలో హామీ ఇచ్చాడు ? అమలు చేస్తాడా? లేదా ? అందరి మదిలో ఇదే ప్రశ్న.. మరోసారి వైట్‌హౌస్‌లో అడుగుపెడుతున్న ట్రంప్ అమెరికా విదేశాంగ విధానం రూపురేఖల్ని మార్చే అవకాశం ఉంది. స్పష్టమైన వివరాలు చెప్పకపోయినప్పటికీ, విదేశాంగ విధానంపై ఎన్నికల సమయంలో ట్రంప్ అనేక హామీలు ఇచ్చారు.ఇమ్మిగ్రేషన్ఇండియన్స్ పై తీవ్ర ప్రభావం చూపే అంశం ఇమ్మిగ్రేషన్. భారత్ నుంచి అమెరికాకు స్టెమ్ రంగాల్లో ఉద్యోగాల కోసం వేలమంది H1B వీసాలపై వెళుతుంటారు. దీంతో స్థానిక అమెరికన్లు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. దేశ జనాభాలో 60% వరకు ఉన్న స్థానిక అమెరికన్లలో ఈ అంశంపై నెలకొన్న అసహనం.. ట్రంప్ విజయానికి ఒక కారణం.గ్రీన్ కార్డు నిబంధనలు : మొదటి నుంచి అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకు వెళ్తున్న డొనాల్డ్ ట్రంప్.. ఈసారి కూడా అదే మంత్రం పఠిస్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన గ్రీన్ కార్డు హోల్డర్లపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. గ్రీన్ కార్డు నిబంధనలు మార్చేందుకు ట్రంప్ యోచిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న 10 లక్షల మంది భారతీయులపై ఆ ప్రభావం పడనుంది.అమెరికా పౌరసత్వం ఎవరికి వస్తుంది..? ఇప్పటివరకు అమెరికా నిబంధనల ప్రకారం.. వలసదారులు గ్రీన్ కార్డు పొందినట్లైతే.. వారికి పుట్టే పిల్లలకు కూడా పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అయితే ఇప్పుడు ఈ విధానానికే డొనాల్డ్ ట్రంప్ స్వస్తి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. అమెరికాలో కొత్తగా తీసుకురానున్న గ్రీన్ కార్డ్ రూల్స్ ముసాయిదా ప్రతిపాదన ప్రకారం.. అమెరికాలోని చట్టబద్ధమైన వలసదారులకు పుట్టబోయే పిల్లలు.. పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం పొందాలంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా అమెరికా పౌరుడు లేదా చట్టబద్ధంగా శాశ్వత నివాసి అయి ఉండాల్సిందేనని తెలుస్తోంది. ఇది ప్రవాస భారతీయులకు పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. ప్రస్తుతం అమెరికాలో 48 లక్షల మంది భారత అమెరికన్లు ఉన్నారు. వారిలో 34 శాతం మంది అంటే 16 లక్షల మంది అమెరికాలోనే పుట్టారు. అందువల్ల వారికి పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభించింది. కానీ ప్రస్తుతం వారిలో ఆందోళన మొదలైంది.అమెరికాలోకి అక్రమంగా వచ్చిన వారిని మూకుమ్మడిగా తిప్పి పంపడం.. డిపోర్టేషన్ పై ఇచ్చిన ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నానంటున్నారు ట్రంప్. దీని కోసం ఎంత ఖర్చైనా సరే, తగ్గేది లేదంటున్నారు. మరి అక్రమ వలసదారుల్ని సామూహికంగా తిప్పి పంపిస్తానన్న ఎన్నికల హామీని నిలబెట్టుకోవడం ట్రంప్‌కు అంత ఈజీయేనా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సరైనా డాక్యూమెంట్స్ లేకుండా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించి, అరెస్ట్ చేసి వారి సొంత దేశానికి పంపించడం క్లిష్టమైన వ్యవహారం అనే చెప్పాలి. కాగా ట్రంప్ అయినా, ఇంకొకరైనా అమెరికా అధ్యక్షునికి.. అమెరికా ప్రయోజనాలే ముఖ్యం. తరువాతే మరో దేశం. ఇంకా చెప్పాలంటే మొత్తం ప్రపంచాన్ని అమెరికా తమ మార్కెట్‌గా చూస్తుందినటంలో సందేహమే లేదు. మరి కొత్త ప్రభుత్వం ఇమిగ్రేషన్ విషయంలో ఎలాంటి మార్పులు తీసుకు వస్తుందో వేచి చూడాలి. -
H-1B visa: సిద్ధమవుతున్న కొత్త రూల్స్.. మనవాళ్లపైనే ప్రభావం!
హెచ్ -1బీ వీసాలకు సంబంధించిన కొత్త నిబంధనలను వెల్లడించడానికి యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) సన్నద్ధమవుతోంది. ప్రతిపాదిత నిబంధనలు జూలై 8న విడుదల కానున్నాయి.భారతీయ ఐటీ కంపెనీలు తమ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నిపుణులను అమెరికాలో పనిచేయడానికి పంపడానికి హెచ్ -1బీ వీసాలు ప్రాథమిక మార్గంగా పనిచేస్తాయి. చరిత్రాత్మకంగా హెచ్ -1బీ వీసాలు తీసుకునేవారిలో భారతీయులే అధిక సంఖ్యలో ఉంటున్నారు.మార్పులేంటి?హెచ్-1బీ వీసాల పొడిగింపునకు 4,000 డాలర్లు, ఎల్-1 వీసాల పొడిగింపునకు 4,500 డాలర్ల రుసుము, 9/11 రెస్పాన్స్, బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ ఫీజులను ప్రవేశపెట్టే ప్రతిపాదనలు ఉన్నాయి. బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ ఫీజు ప్రస్తుతం ప్రారంభ వీసా పిటిషన్లు, కంపెనీల మార్పులకు మాత్రమే వర్తిస్తోంది. గత ఏడాది అక్టోబర్ 23న యూఎస్సీఐఎస్ ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదిత నిబంధన ప్రస్తుతం 60 రోజుల పరిశీలన దశలో ఉంది. ఈ ఏడాది చివర్లో లేదా రాబోయే ఎన్నికల తర్వాత బైడెన్ ప్రభుత్వం ఈ నిబంధనను ఖరారు చేయవచ్చని ఫోర్బ్స్ నివేదికలు సూచిస్తున్నాయి.భారతీయులపైనే అధిక ప్రభావంఈ మార్పులు అనేక మంది భారతీయ హెచ్ -1బీ వీసా హోల్డర్లతోపాటు కొత్తగా దరఖాస్తు చేసేవారిని దెబ్బతీస్తాయి. ఇది అమెరికాలో నివసించడానికి, పనిచేయడానికి ప్రయత్నిస్తున్న భారత్‌కు చెందిన వేలాది మందిపై ప్రభావం చూపుతుంది. ప్రత్యేక వృత్తులను పునర్నిర్వచించడం ద్వారా హెచ్-1బీ-అర్హత కలిగిన ఉద్యోగాలపై పరిమితులను ప్రవేశపెట్టడం, ఉద్యోగ పాత్రలు నేరుగా సంబంధిత నిర్దిష్ట ప్రత్యేకతల నేపథ్యంలో ఉద్యోగానికి దగ్గరగా ముడిపడి ఉన్న నిర్దిష్ట డిగ్రీలు అవసరమని నిర్దేశించడం పరిశీలనలో ఉన్న చర్చనీయాంశం.హెచ్-1బీ, ఎల్-1 వీసా పొడిగింపుల కోసం కంపెనీలపై గణనీయమైన ఫీజులు విధించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) యోచిస్తోంది. ముఖ్యంగా ఈ వీసాలపై 50 శాతానికి పైగా శ్రామిక శక్తి ఉన్న సంస్థలను లక్ష్యంగా చేసుకుంది. వీసా పొడిగింపులపై ఆధారపడే కంపెనీలు గణనీయమైన ఆర్థిక ప్రభావాలను ఎదుర్కోవచ్చు. ఇది విదేశీ ఉద్యోగులకు సంబంధించి వారి నియామక వ్యూహాలను పునఃసమీక్షించడానికి ప్రేరేపిస్తుంది. -
H1B వీసా పునరుద్ధరణపై అమెరికా కీలక నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా పొరసత్వ ఇమిగ్రేషన్ సేవల సంస్థ H -1B వీసాల విషయమై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుపుతోంది అమెరికా విదేశాంగ శాఖ. ఇకపై అమెరికా రావాల్సిన అవసరం లేకుండానే వీసా పునరుద్ధరణ చేసుకోవచ్చని ప్రస్తుతం సన్నాహకంగా ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం అతి త్వరలోనే పూర్తిస్థాయిలో కూడా అమలవుతుందని తెలిపింది. భారత ప్రధాని అమెరికా పర్యటన మొదలైన ఒక్క రోజులోనే అమెరికా ప్రభుత్వం H-1B వీసాలపై కీలక నిర్ణయం తీసుకుంది అమెరికా ఇమిగ్రేషన్ శాఖ. భారత దేశంలోని నైపుణ్యమున్న యువత అమెరికాలో ఉపాధి పొందడానికి మరిన్ని అవకాశాలు కల్పించమన్న భారత ప్రధాని అభ్యర్ధన మేరకు అమెరికా ప్రభుత్వం కార్యాచరణను ప్రారంభించింది. అందులో భాగంగా మొదట వీసాల పునరుద్ధరణ విషయంలో యువతకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకూడదన్న ఉద్దేశ్యంతో అమెరికా రావాల్సిన అవసరం లేకుండా ఇంటినుంచే H-1B వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. US | The Biden administration will make it easier for Indians to live and work in the US, using this week's state visit by Prime Minister Narendra Modi to help some skilled workers enter or remain in the country, according to three people familiar with the matter: Reuters— ANI (@ANI) June 22, 2023 2022 ఆర్ధిక సంవత్సరంలో విదేశాల నుండి వచ్చి అమెరికాలో పనిచేస్తున్న 4,42,000 మందిలో భారతీయులే 73% ఉన్నందున అమెరికా ఇమిగ్రేషన్ శాఖ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు, మొదట స్వల్ప సంఖ్యలో లబ్దిదారులకు సన్నాహకంగా మొదలుపెట్టి తర్వాత విస్తృతం చేసే ప్రయత్నం చేస్తామని విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ ప్రయత్నం పూర్తిస్థాయిలో విస్తరించిన తర్వాత అధికారిక ప్రకటన చేస్తామని ఆయన అన్నారు. ఇది కూడా చదవండి: ఇది "సాంకేతిక దశాబ్దం".. అమెరికా పర్యటనలో భారత ప్రధాని -
భారత నిపుణుల చూపు కెనడా వైపు
వాషింగ్టన్: హెచ్–1బీ వీసాలు, తదితర కాలం చెల్లిన ఇమిగ్రేషన్ విధానాల ఫలితంగా భారతీయ నిపుణులు అమెరికాకు బదులు కెనడాకు తరలిపోతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డు (శాశ్వత నివాస) హోదాను దేశాలవారీ కోటా ప్రకారం మంజూరు చేయడం కూడా ఇందుకు కారణమని తెలిపారు. హెచ్–1బీ వీసా గానీ, శాశ్వత నివాస హోదా పొందడం గానీ కెనడాతో పోలిస్తే అమెరికాలో కష్టతరమైన విషయం కాబట్టే ఇలా జరుగుతోందన్నారు. అమెరికాకు రావాల్సిన భారత నిపుణులు, విద్యార్థులు కెనడా వైపు మొగ్గు చూపడాన్ని ఆపేందుకు తక్షణమే తగు చర్యలు చేపట్టాలని కోరారు. కాంగ్రెస్ అనుమతి కోసం ఎదురుచూడకుండా, ఉద్యోగిత ఆధారంగా భారతీయులకు ఇచ్చే మూడు రకాలైన వీసాల సంఖ్యను ప్రస్తుతమున్న 9,15,497 నుంచి 2030కల్లా 21,95,795కు పెరిగేలా చూడాలని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టువార్ట్ ఆండర్సన్ చెప్పారు. గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్లుగా, దశాబ్దాలుగా ఎదురుచూసే వారి సంఖ్యను 20 లక్షల నుంచి కనీస స్థాయికి తగ్గించాలంటూ ఆయన హౌస్ జ్యుడిషియరీ కమిటీలోని ఇమిగ్రేషన్, సిటిజన్‌షిప్ ఉపకమిటీ ఎదుట హాజరై తెలిపారు. అమెరికా యూనివర్సిటీల్లో ఇంజినీరింగ్ చదివే భారతీయ విద్యార్థుల సంఖ్య 2016–17, 2018–19 సంవత్సరాల్లో 25%పైగా తగ్గుముఖం పట్టిందని చెప్పారు. అమెరికా వర్సిటీల్లోని ఫుల్‌టైమ్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో 75% మంది విదేశీయులు కాగా, వారిలో 2016–17లో మూడింట రెండొంతులు భారతీయులే ఉన్నారని ఆయన వివరించారు. అదే సమయంలో, కెనడాలో చదివే భారతీయ విద్యార్థుల సంఖ్య 2016లో 76,075 కాగా 2018 నాటికి ఇది 127% పెరిగి 1,72,625కు చేరిందని పేర్కొన్నారు. -
అన్ని వర్క్ వీసాలపై తాత్కాలిక నిషేధం!
వాషింగ్టన్: అమెరికాలోకి కొత్త వలసలపై తాత్కాలికంగా నిషేధం విధించే దిశగా ట్రంప్ సర్కారు చర్యలు ముమ్మరం చేసింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశంలో నిరుద్యోగం పెరిగిన క్రమంలో.. కొత్తగా జారీ చేసే వర్క్ వీసాల జారీపై తాత్కాలిక నిషేధం విధించాలని నిర్ణయించింది. ఇమ్మిగ్రేషన్ అడ్వైజర్స్ ఈ మేరకు విధివిధానాలు, ప్రణాళికలు రచిస్తున్నారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. వృత్తి నిపుణులకు జారీ చేసే హెచ్-1 బీ, హెచ్-2 బీ వీసా సహా విద్యార్థి వీసాలపై కూడా దీని ప్రభావం పడనుందని వెల్లడించింది. ‘‘వర్క్ బేస్డ్ వీసాలపై తాత్కాలిక నిషేధం విధించేలా అధ్యక్షుడి ఇమ్మిగ్రేషన్ అడ్వైజర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ వీసాల జాబితాలో హెచ్-1 బీ, హెచ్-బీ, విద్యార్థి వీసాలు కూడా మమేకమై ఉంటాయి’’ అని పేర్కొంది. (హెచ్1బీ వీసాలు... తక్కువ జీతాలిచ్చేందుకే!) కాగా కరోనా వ్యాప్తి, లాక్డౌన్లో నేపథ్యంలో తమ దేశంలోకి అన్ని రకాల వలసలపై తాత్కాలిక నిషేధం విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని.. ఇది కేవలం గ్రీన్‌కార్డు కోరుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. అమెరికాలోని హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వామ్యులకు ఉద్యోగావకాశాలు కల్పించే నిబంధనను తొలగించేలా ఆదేశాలివ్వవద్దని ట్రంప్ ప్రభుత్వం వాషింగ్టన్‌లోని ఫెడరల్ కోర్టును కోరింది. వారు ఉద్యోగాలు పొందడం వల్ల అమెరికన్ల ఉద్యోగావకాశాలు అంతగా ప్రభావితం కావడం లేదని న్యాయస్థానానికి తెలిపింది. హెచ్4 వీసాదారుల వల్ల అమెరికన్ల ఉద్యోగాలకు తీవ్రస్థాయిలో ముప్పు ఏర్పడుతుందన్న ‘సేవ్ జాబ్స్ యూఎస్ఏ’వారి వాదన సరికాదని వాషింగ్టన్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టుకు ట్రంప్ ప్రభుత్వం మే 5న వివరించింది. కాగా హెచ్-1 బీ వీసాతో దాదాపు 5 లక్షల మంది విదేశీయులు అమెరికాలో ఉద్యోగం చేస్తున్న విషయం తెలిసిందే. (‘హెచ్4’ ఉద్యోగాలతో ముప్పేం లేదు!) -
హెచ్1బీ ఉద్యోగుల వేతనాలపై షాకింగ్ రిపోర్టు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన కొత్త వీసా సంస్కరణలు, తాజాగా కరోనా వైరస్ సంక్షోభంతో ఐటీ నిపుణులు ఇబ్బందుల్లో పడిన సమయంలో హెచ్ 1 బీ వీసాదారుల వేతనాలకు సంబంధించి షాకింగ్ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. ప్రధాన దిగ్గజ కంపెలన్నీ తక్కువ (స్థానిక మధ్యస్థ) వేతనాలను చెల్లించాయని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ప్రధాన అమెరికన్ టెక్నాలజీ సంస్థలైన ఫేస్బుక్, గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్ సహా ఇతర దిగ్గజ కంపెనీలు హెచ్ 1 బీ నిపుణులకు మార్కెట్ వేతనాల కంటే తక్కువ చెల్లించాయని తాజా నివేదిక పేర్కొంది. హెచ్ 1 బీ వీసాదారులను కలిగిన టాప్ 30 అమెరికా కంపెనీల్లో అమెజాన్, మైక్రోసాఫ్ట్, వాల్‌మార్ట్, గూగుల్, ఆపిల్, ఫేస్ బుక్ సహా ప్రధాన సంస్థలు ఇందులో ఉన్నాయి. వీరందరూ హెచ్ 1బీ ఉద్యోగుల్లో చాలామందికి స్థానిక సగటు కంటే తక్కువ జీతాలను చెల్లించాయట. స్థానిక వేతనాల కంటే తక్కువ జీతాల చెల్లింపుపై చట్టబద్ధంగా ఉన్న ప్రోగ్రామ్ నిబంధనలను ఉపయోగించుకుని ఇలా చేశాయని ఎకనామిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక తెలిపింది. (హెచ్1బీ వీసాదారులకు ఊరట) "హెచ్ 1 బీ వీసాలు , ప్రస్తుత వేతన స్థాయిలు" అనే పేరుతో డేనియల్ కోస్టా , రాన్ హీరా వెల్లడించిన ఈ నివేదిక ప్రకారం, యుఎస్ కార్మిక శాఖ (డీఓఎల్) ధృవీకరించిన 60 శాతం హెచ్1బీ వీసాదారులకు స్థానిక మధ్యస్థ వేతనాని కంటే చాలా తక్కువ వేతన స్థాయిలను అందించాయి. అంతేకాదు ఈ నిబంధనలను మార్చే అధికారం డీఓఎల్ కు ఉన్నప్పటికీ అలా చేయలేదని పేర్కొన్నారు. 2019 లో 53వేలకు పైగా కంపెనీలు హెచ్ 1బీ ప్రోగ్రామ్‌ను ఉపయోగించగా, 2019 లో యుఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఆమోదించిన 389,000 హెచ్ 1బీ ఉద్యోగుల టాప్ 30 కంపెనీలు నాలుగింటిలో ఒకటి ఉంది. టాప్ 30 కంపెనీల్లో సగానికి పైగా అత్యధిక ఉద్యోగులను అవుట్ సోర్సింగ్ ద్వారానే నియమించుకుంటున్నాయన్నారు. అయితే టెక్ కంపెనీలు నేరుగా నియమించుకుంటున్నా వేతనాలు మాత్రం లెవల్ 1, లేదా లెవల్ 2 స్థాయిలోనే ఉన్నాయని నివేదించారు. -
వేలాడుతున్న హెచ్1బీ కత్తి!
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : అమెరికా వెళ్లి ఉన్నత విద్య పూర్తి చేసి, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) అర్హతతో ఉద్యోగం చేస్తున్న దాదాపు 68 వేల మంది భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇప్పుడు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. మూడేళ్ల కాలవ్యవధి కోసం ఇచ్చే ఓపీటీ ఈ ఏడాదితో పూర్తి కానుండటమే దీనికి కారణం. ఇప్పటికే రెండుసార్లు హెచ్1బీ వీసా అవకాశం కోల్పోయిన ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఈ ఏప్రిల్ చివరి అవకాశం. అప్పటికీ వీసా రాకపోతే స్వదేశానికి తిరిగి వెళ్లడం లేదా మళ్లీ విశ్వవిద్యాలయంలో చేరి పీహెచ్‌డీలో చేరడం (అన్ని అర్హతలు ఉంటే)లేదా ఎంఎస్‌లో మరో కోర్సు చేయడమే ప్రత్యామ్నాయం. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిలో అత్యధికులు తిరిగి ఎంఎస్‌లో చేరడానికి సుముఖంగా లేరు. ఒకవేళ వీసా రాకపోతే భారత్ తిరిగి వెళ్లడం తప్ప మరో మార్గం లేదు. 2015–16లో అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన వారు ఇప్పుడు వీసా సమస్యలు ఎదుర్కొంటున్నారు. 2014 నుంచి ఉన్నత విద్య కోసం వెళుతున్న వారి సంఖ్య రెట్టింపు కావడమే దీనికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కంప్యూటర్ రంగంలో పని చేసేవారికి అమెరికా ఏటా 85 వేల మందికి హెచ్1బీ వీసాలు మంజూరు చేస్తోంది. కానీ, భారత్ నుంచి ఉన్నత విద్యకు వెళ్లి ఆపైన హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య 2016లోనే లక్ష దాటింది. ఈ ఏడాది భారతీయుల సంఖ్య 1.5 లక్షలు దాటుతుందని న్యూయార్క్‌కు చెందిన హెచ్1బీ వ్యవహారాల నిపుణుడు అటార్నీ నీల్ ఏ వెయిన్‌రిచ్ అంచనా వేస్తున్నారు. వచ్చే రెండేళ్లలో హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేసే భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సంఖ్య 2 లక్షలు దాటినా ఆశ్చర్యం లేదని, వారిలో 65 నుంచి 70 వేల మందికి మాత్రమే వీసాలు దక్కుతాయని చెబుతున్నారు. చదవండి : కూలిన మార్కెట్, 12వేల దిగువకు నిఫ్టీచదవండి హెచ్1బీ ఉన్న వారి కోసం వేట.. వీసా సమస్య నుంచి బయటపడేందుకు భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హెచ్1బీ వీసా కలిగి ఉన్న వారిని జీవిత భాగస్వాములను చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికాలో హెచ్1బీ వీసా ఉన్న వారి సంబంధాలు చూడాలని భారత్‌లో తమ తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు. హెచ్1బీ వీసా కలిగి ఉండి (గ్రీన్‌కార్డు కోసం వెయిటింగ్లో ఉంటే) జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకునే వీలు ఉంటుంది. గ్రీన్‌కార్డు కోసం వెయిటిం గ్లో లేని హెచ్1బీ వీసా అబ్బాయి లేదా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమెరికాలో చట్ట బద్ధంగా ఉండేందుకు అవకాశముంది. ఇప్పుడు భారత్‌లో మ్యారేజ్ బ్యూరోలు దీన్నో లాభసాటి వ్యాపారంగా మలుచుకున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 24 వేల మంది! ఓపీటీ గడువు దాటుతున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు 20 నుంచి 24 వేల మంది ఇంజనీర్లు ఉంటారని అంచనా. నిర్ణీత గడువులో వీసా రాకపోతే స్వదేశానికి వెళ్లి మళ్లీ హెచ్1బీ దరఖాస్తు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బంది లేని భారతీయ టెకీలు అక్కడే ఉండేం దుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నారు. ‘డబుల్ డిగ్రీ ఓ ప్రయాస. మా విశ్వవిద్యాలయంలో డబుల్ కోర్సు చేసిన అనేక మంది విద్యార్థులు చివరికి వారికి తగిన ఉద్యోగాలు రాక కెనడా, అస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాలకు వెళ్లారు. ఉద్యోగం కోసమే అమెరిక వస్తే సమస్యలు తప్పవు’అని యూనివర్సిటీ అఫ్ కాలిఫోర్నియా (బర్క్లీ) కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ ఎరిక్ అలెన్ బ్రూవర్ ఇటీవల న్యూయార్క్ టైమ్స్‌కు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ఉన్నత విద్య కోసం వస్తున్న వారు ఉపాధి అవకాశాలను లక్ష్యం చేసుకుని వస్తున్నారా లేదా విజ్ఞానం పెంపొందించుకోవడానికి వస్తున్నారా అనే దానిపై భారత్ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఇటీవల ముంబైలో యూనివర్సిటీ అఫ్ సదరన్ కాలిఫోర్నియ ప్రొఫెసర్ బారీ విలియమ్స్ అన్నారు. హెచ్1బీ రాకపోతే భారత్‌కు వెళ్లిపోతా.. 2015లో అమెరికా వచ్చి అలబామ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ పూర్తి చేశా. 2017లో ఓపీటీ కార్డు రావడంతో శాన్ఫ్రాన్సిస్కోలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేరా. 2018, 2019లో హెచ్1బీ కోసం దరఖాస్తు చేశా. లాటరీలో నా దరఖాస్తు పిక్ కాలేదు. ఈ ఏడాదైనా లాటరీలో పిక్ అవుతుందన్న ఆశతో ఉన్నా. లేదంటే భారత్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా.– గాయం రామాంజనేయరెడ్డి, ఎర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా పీహెచ్‌డీలో చేరుతా.. ఈ ఏప్రిల్‌లో నాకు హెచ్1బీ వీసా రాకపోతే పీహెచ్‌డీలో చేరుదామని అనుకుంటున్నా. ఒక్లహమా విశ్వవిద్యాలయంలో ఎంఎస్ పూర్తి చేసి ప్రస్తుతం షికాగోలో సిస్టమ్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నా. ఇప్పటికీ 2 సార్లు నా దరఖాస్తు రిజెక్ట్ అయ్యింది. ఈసారి కూడా అదే జరిగితే ఉద్యోగం ద్వారా ఇప్పటిదాకా సంపాదించి దాచుకున్న మొత్తాన్ని పీహెచ్డీ కోసం ఖర్చు చేస్తా. తిరిగి ఇండియా వెళ్లాలన్న ఆలోచన లేదు.– వల్లబ్‌రెడ్డి సతీశ్, కోదాడ, నల్లగొండ జిల్లా అమెరికాలో పరిస్థితులు మారాయి.. ఇప్పటికే 2 సార్లు లాటరీలో నాకు అవకాశం రాలేదు. ఈ ఏప్రిల్‌లో రాకపోతే ఇండియా తిరిగి వెళ్లడం తప్ప మరో మార్గం లేదు. అమెరికాలో పరిస్థితులు మారిపోయాయి. హెచ్1బీ వీసా మరింత కష్టమవుతుంది. ఐటీ ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఉంది. నాలుగైదేళ్లలోనే పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ఒక్క ఉద్యోగానికి ఐదారుగురు తెలుగు టెకీలే పోటీ పడుతున్నారు.– ఈలి అనసూయ, ద్వారకానగర్, విశాఖపట్నం -
హెచ్-1బీ వీసాలు: ట్రంప్‌కు సంచలన లేఖ
న్యూయార్క్: అమెరికా ఇమ్మిగ్రేషన్ (వలస) విధానంలో సత్వరమే మార్పులు తీసుకురావాలని, మంచి నైపుణ్యం గల విదేశీ వర్కర్స్‌ను మరింతగా దేశంలోకి అనుమతించాలని, అమెరికా ఆర్థిక వృద్ధికి, భవిష్యత్ సాంకేతిక రంగ పునర్నిర్మాణానికి ఇది అత్యవసరమని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆ దేశ బిజినెస్ విశ్వవిద్యాలయాలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కోరాయి. మంచి నైపుణ్యం గల వర్కర్స్‌ను ఆకర్షించేవిధంగా దేశ ఇమ్మిగ్రేషన్ విధానాన్ని సమీక్షించాలని ట్రంప్‌తోపాటు అమెరికా చట్టసభ నాయకులను అభ్యర్థిస్తూ 50 బిజినెస్ స్కూళ్ల డీన్స్ ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను వాల్‌స్ట్రీట్ జనరల్ బుధవారం ప్రచురించింది. యేల్, కొలంబియా, స్టాన్ఫోర్డ్, డ్యూక్, న్యూయార్క్ యూనివర్సిటీ వంటి ప్రఖ్యాత వర్సిటీల అధిపతులు ఈ లేఖపై సంతకం చేశారు. వివిధ దేశాలకు ఇస్తున్న వీసాల మీద పరిమితులు ఎత్తివేయాలని, అత్యున్నత నైపుణ్యం గల వ్యక్తులు అమెరికాకు వచ్చేందుకు వీలుగా హెచ్-1బీ వీసా విధానంలో సంస్కరణలు తీసుకురావాలని, స్కిల్డ్ వర్కర్స్ అమెరికా రాకను ప్రోత్సహించేందుకు ‘హార్ట్‌ల్యాండ్ వీసా’ లాంటి విధానాన్ని అమల్లోకి తీసుకురాలని వారు తమ లేఖలో కోరారు. కాలం చెల్లిన చట్టాలు, ఇమ్మిగ్రేషన్‌పై ప్రాంతాల వారీగా విధిస్తున్న పరిమితులు, ఇటీవలి అస్థిర వాతావరణం వంటి కారణాలు.. అత్యున్నత నైపుణ్యంగల వలసదారులను దేశంలోకి రాకుండా అడ్డుకుంటున్నాయని, దేశ ఆర్థిక వృద్ధికి వారి రాక కీలకమని డీన్స్ పేర్కొన్నారు. గత మూడేళ్లుగా అమెరికా యూనివర్సిటీల్లో, బిజినెస్ స్కూళ్లలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గిందని తాము చేపట్టిన విశ్లేషణలో వెల్లడయిందని డీన్స్ పేర్కొన్నారు. ప్రతిభను, నైపుణ్యాన్ని గుర్తించకపోతే అది దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థకు చేటు తెస్తుందని డీన్స్ హెచ్చరించారు. చదవండి: అమెరికాలో ఎంబీఏకు గడ్డుకాలం అమెరికా విధించిన పరిమితుల కారణంగా హెచ్-1బీ వీసాలు గణనీయంగా తగ్గిపోయాయని, 2004లో లక్ష95వేల హెచ్-1బీ వీసాలు జారీచేయగా.. ప్రస్తుతం 85వేల వీసాలు మాత్రమే జారీచేస్తున్నారని, డొనాల్డ్ ట్రంప్ హయాంలో హెచ్-1బీ వీసాల తిరస్కరణ గణనీయంగా పెరిగిందని, 2015లో 6శాతం వలసదారులకు మాత్రమే ఈ వీసాలు తిరస్కరించగా.. 2019లో అది ఏకంగా 32శాతానికి ఎగబాకిందని తెలిపారు. అంతేకాకుండా హెచ్-1బీ వీసాల కోసం వస్తున్న దరఖాస్తులు కూడా గణనీయంగా తగ్గిపోయాయని, 2017లో రెండు లక్షల 36వేల హెచ్-1బీ వీసా దరఖాస్తులు రాగా, 2018కి అవి లక్షా 99వేలకు పడిపోయాయని డీన్స్ వెల్లడించారు. ట్రంప్ సర్కారు ఆలాపిస్తున్న వలస వ్యతిరేక రాగం.. తీవ్ర ప్రభావం చూపుతోందని, దీంతో విదేశీ వలసదారుల్లో ఒకరకమైన భయం ఆవరించిందని వారు తెలిపారు. -
హెచ్1బీ దరఖాస్తు రుసుం పెంపు!
వాషింగ్టన్: నైపుణ్య ఉద్యోగాలు చేసేవారికి తాము మంజూరుచేసే హెచ్–1బీ వీసా దరఖాస్తు రుసుంను పెంచాలని అమెరికా యోచిస్తోంది. తమ దేశంలో అప్రెంటిస్ ప్రోగ్రాంను విస్తరించేందుకు రుసుం పెంచాలని భావిస్తున్నట్లు అమెరికా కార్మిక శాఖ మంత్రి అలెగ్జాండర్ అకోస్టా తెలిపారు. రుసుం పెంచితే భారతీయ ఐటీ కంపెనీలపై భారీగా ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. మంగళవారం అమెరికా కాంగ్రెస్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. అప్రెంటిస్ కార్యక్రమాన్ని దుర్వినియోగపరిచే వారి నుంచి అమెరికా కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు ఇప్పటికే హెచ్–1బీ వీసా దరఖాస్తులో మార్పులు చేశామని, దీనివల్ల పారదర్శకత పెరుగుతుందని అకోస్టా వివరించారు. అయితే దరఖాస్తు రుసుం ఎంత పెంచుతారో, ఏఏ కేటగిరీ దరఖాస్తుల్లో ఎంత పెంచుతారనే విషయాలు వెల్లడించలేదు. ‘2020 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కార్మిక శాఖకు 160 మిలియన్ డాలర్లు కేటాయిస్తాం. అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రాంను విస్తరిస్తాం. ఇందుకోసం హెచ్–1బీ వీసా దరఖాస్తు రుసుం పెంచి అధిక రెవెన్యూ రాబడతాం’ అని వివరించారు. అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రాం ద్వారా అమెరికా యువతకు సాంకేతికపరమైన అంశాల్లో శిక్షణ అందిస్తారు. కాగా, గతేడాది హెచ్–1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి నలుగురిలో ఒకరికి వీసా ఇచ్చేందుకు ఇమిగ్రేషన్ అధికారులు నిరాకరించినట్లు సీటెల్ టైమ్స్ పత్రిక కథనం ప్రచురించింది. అయితే ఏటా దాదాపు లక్ష మంది విదేశీ ఉద్యోగులు హెచ్–1బీ వీసా ద్వారా అమెరికాకు వస్తున్నారని, వారిని ఆరేళ్ల వరకు అమెరికాలో ఉండేందుకు అనుమతిస్తున్నారని బ్రిట్‌బార్ట్ న్యూస్ తన కథనంలో పేర్కొంది. ఏ సమయంలో చూసినా అమెరికాలో హెచ్–1బీ వీసా కలిగిన విదేశీ ఉద్యోగులు దాదాపు 6.5 లక్షల మంది ఉంటున్నారని వివరించింది. -
వృత్తి నిపుణులకే హెచ్–1బీ
వాషింగ్టన్: అమెరికాలోకి అత్యంత నైపుణ్యవంతులైన విదేశీయులు ప్రవేశించడంలో హెచ్–1బీ వీసాలు మెరుగైన పాత్ర పోషించేలా వలస విధానాలు ఉండాలని అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం కోరుకుంటోందని వైట్‌హౌజ్ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. ప్రస్తుత హెచ్–1బీ వీసాల విధానం ‘ఔట్ సోర్సింగ్’ నియామకాల మాదిరిగా ఉండకూడదని వారన్నారు. కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో విదేశీయులను నియమించుకునేందుకు అమెరికా సంస్థలను అనుమతించేవే హెచ్1బీ వీసాలు. ప్రత్యేక నైపుణ్యాలు అంటే ఏంటో, హెచ్–1బీ వీసా కింద ఉపాధి అంటే ఏంటో పునర్నిర్వచించేందుకు అమెరికా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. శ్వేతసౌధం ఉన్నతాధికారి క్రిస్ లిడ్డెల్ మాట్లాడుతూ ‘అత్యంత ప్రతిభావంతులైన విదేశీయులు మాత్రమే అమెరికాలో ఉండేలా చూసేందుకు ఆయన విధానాలు రూపొందిస్తున్నారు. ఈ రకమైన వలసలపైన మాత్రమే ఆయన సానుకూలంగా ఉన్నారు’ అని తెలిపారు. ‘హెచ్–1బీ’లను అడ్డుకోవడం పెరిగింది: కంపీట్ అమెరికా ట్రంప్ అధికారంలోకి వచ్చాక హెచ్–1బీ వీసా దరఖాస్తుల తిరస్కరణ, దరఖాస్తులను తొక్కిపెట్టడం తదితరాలు పెరిగాయని కంపీట్ అమెరికా ఆరోపించింది. సాంకేతిక దిగ్గజాలు గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థల సమాఖ్యయే ఈ కంపీట్ అమెరికా. ‘హెచ్–1బీ వీసాల జారీలో ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో 3 మార్పులను గమనించాం. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు అమెరికా కంపెనీల హెచ్–1బీ వీసాల దరఖాస్తులను ఎక్కువ సంఖ్యలో తొక్కిపెడుతున్నారు. ఈ విధంగా చేయడానికి మీకు చట్టబద్ధంగా అధికారం లేదు. మీ విధానాలు, పద్ధతులపై కంపెనీలకు స్పష్టత లేకుండా పోతోంది. దీంతో విదేశీయులను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్న కంపెనీలకు భారీ నష్టం జరిగే అవకాశం ఉంది’ అని అమెరికా హోంలాండ్ సెక్రటరీకి, వలస సేవల విభాగం డైరెక్టర్‌కు ఈ నెల 1న కంపీట్ అమెరికా లేఖలు రాసింది. గత 18 నెలల్లో హెచ్1బీ దరఖాస్తులను తిరస్కరించడం, రిక్వెస్ట్స్ ఫర్ ఎవిడెన్స్‌లను కోరడం పెరిగిందని కంపీట్ అమెరికా ఆరోపించింది. హెచ్–4పై ప్రజాభిప్రాయం తీసుకుంటాం హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు, పిల్లలకు ఇచ్చే హెచ్–4 వీసాలకు ఉద్యోగానుమతుల రద్దు విషయంపై ప్రజాభిప్రాయం కోరతామని ట్రంప్ ప్రభుత్వం వెల్లడించింది. హెచ్–4 వీసాలు ఉన్న వారూ ఉద్యోగాలు చేసుకునేందుకు గతంలో ఒబామా సర్కారు అనుమతులివ్వడం తెల్సిందే. హెచ్–4 వీసాలకు ఉద్యోగ అనుమతులను రద్దు చేయాలా? వద్దా? అనే దానిపై ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వలస సేవల విభాగం డైరెక్టర్ ఫ్రాన్సిస్ సిస్నా తెలిపారు. హోండురాస్, గ్వాటెమాల, ఎల్ సాల్వడార్ దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే వారికి శరణార్థి హోదా ఇవ్వకూడదంటూ ట్రంప్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత శరణార్థి చట్టం కింద ఈ దేశాల నుంచి వచ్చే వారికి అమెరికాలో ఆశ్రయం లభిస్తోంది. ఇకపై కొన్ని అధికారిక మార్గాల్లో వస్తేనే శరణార్థి హోదా దక్కుతుందంటూ అమెరికా న్యాయ విభాగం, హోంలాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపాయి. -
హెచ్4 వీసా రద్దు వద్దు : లక్షమంది మహిళలకు నష్టం
వాషింగ్టన్: అమెరికాలో పనిచేస్తున్న లేదా స్థిరపడినవారి జీవితభాగస్వాములుకు సంబంధించిన హెచ్-4 వీసాదారుల వర్క్ పర్మిట్ రద్దుపై ఇద్దరుమహిళా సెసేటర్లు స్పందించారు. ఈ వీసాలను రద్దు చేస్తే లక్ష మంది మహిళలు, వారి కుటుంబాలు నష్టపోతారని డెమోక్రటిక్ పార్టీ కాలిఫోర్నియా సెనేటర్, తొలి భారతీయ అమెరికన్ మహిళ కమలా హారిస్, న్యూయార్క్ సెనేటర్ కిర్‌స్టన్ గిల్లిబ్రాండ్ ట్రంప్ ప్రభుత్వానికి లేఖ రాశారు. హెచ్-4 వీసాదారుల వర్క్‌పర్మిట్‌ను రద్దు చేస్తే లక్షమంది మహిళలపై ప్రభావం చూపుతుందని, వీరిలో భారతీయ-అమెరికన్లు ఉన్నారని తెలిపారు. హెచ్-4 వీసాపై ఆధారపడి ఉద్యోగాలు చేస్తున్న మహిళలు అటు వృత్తిపరంగానే కాకుండా కుటుంబపరంగానూ కష్టాలు ఎదుర్కొంటారని తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ఈ పరిణామం వారి పిల్లలకు తీవ్ర హాని చేస్తుందన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని హెచ్-4వీసాను రద్దు చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. అమెరికన్లకు ఉద్యోగావకాశాలు పెంచేందుకు ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా హెచ్-4 వీసాలను రద్దు చేయనున్నామని గత వారం ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. మూడు నెలలో ఒక నోటిఫికేషన్ విడుదల చేయనునున్నామని అమెరికా పౌరసత్వం మరియు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది. హెచ్1 బీ వీసాల జారీ పక్రియ సమీక్షలో భాగంగా అమెరికన్లను నియమించకునేక్ రమంలో అమెరికన్ కంపెనీ లద్వారా ఈ వీసా దుర్వినియోగమవుతోందని తెలిపింది. అందుకే హెచ్ 4వీసాలను రద్దు చేయాలని భావిస్తున్నన్నామని ట్రంప్ సర్కార్ ఫెడరల్ కోర్టుకు తెలియజేసింది. హెచ్-4 వీసాలను రద్దు అమల్లోకి వస్తే అత్యధికంగా నష్టపోయేది మన భారతీయులే. అమెరికాలో పనిచేస్తున్న లేదా స్థిరపడినవారి జీవితభాగస్వాములు ఇక అమెరికాలో ఎక్కడా ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉండదు. దీంతో వారికి అనేక ఇబ్బందులుతప్పవు. అలాగే హెచ్-4 వీసాలపై అమెరికా వెళ్లాలనుకొన్నవారికీ నిరాశ తప్పదు. 2017, డిసెంబర్ 25 నాటి లెక్కల ప్రకారం అమెరికాలో మొత్తం 1,26,853 మంది పనిచేస్తుండగా, హెచ్-4 వీసాలతో పనిచే వారిలో సుమారు 93 శాతం మంది భారతీయులే. మిగిలిన 7 శాతం ఇతర దేశాలవారు. -
హెచ్1 బీ ఫ్రాడ్ : ఇండియన్ సీఈవో అరెస్టు
న్యూయార్క్: హెచ్1-బీ వీసా, గ్రీన్ కార్డుల దరఖాస్తుల్లో అక్రమాలకు పాల్పడుతున్న ఒక ఇండియన్ సీఈవోకు అమెరికా ప్రభుత్వం చెక్ చెప్పింది. తప్పుడు, మోసపూరిత పత్రాలతో దాదాపు 200 హెచ్1 బీ వీసాలను పొందిన కేసులో అమెరికాలో అజీమెట్రీ, డివెన్సి అనే రెండు ఐటీ కంపెనీలకు సీఈవో ప్రద్యుమ్న కుమార్ సామల్ (49) ను అధికారులు అరెస్ట్ చేశారు. నకిలీ, మోసపూరితమైన డాక్యుమెంట్లతో 200మంది విదేశీయులకు హెచ్1 బీ వీసాలు సాధించారనే ఆరోపణలతో కమార్‌ను అరెస్ట్ చేశారు. ఇండియానుంచి తిరిగి అమెరికా వస్తుండగా సియాటెల్ విమానాశ్రయం వద్ద ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. 2018, ఏప్రిలో నమోదైన వీసా ఫ్రాడ్ కేసు విచారణ జరుగుతుండగా నిందితుడు సామల్ పారిపోయాడని అధికారులు తెలిపారు. 2010, 2011 సంవత్సరాల్లో వాషింగ్టన్ లో హెచ్1-బీ వీసా, గ్రీన్ కార్డుల పేరుతో భారీ మోసాలకి పాల్పడాడనీ, బెంచ్-అండ్-స్విచ్ స్కీం కింద వీసా దరఖాస్తుల కోసం కస్టమర్ల నుంచి డబ్బును నేరుగా తన ఖాతాలోకి మళ్లించి, తద్వారా ప్రభుత్వాన్ని మోసగించాడని అధికారులు ఆరోపించారు. కాగా వీసా మోసం కేసులో పది సంవత్సరాల జైలుతో పాటు, 250,000 డాలర్లు జరిమానా విధించే అవకాశం ఉంది. -
భారత్ టెకీలపై మరో పిడుగు..!
అమెరికాలో పనిచేస్తున్న భారత టెకీలపై మరో పెద్ద పిడుగు పడనుంది. హెచ్-1బి వీసాదారుల జీవిత భాగస్వామి (భార్య లేదా భర్త) వర్క్ పర్మిట్ల తొలగింపుతో పాటు హెచ్-1బి వీసాల జారీ ప్రక్రియ క్రమబద్ధీకరణకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ దిశలో చర్యలు తీసుకోనున్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నా, తాజా పరిణామాలు మాత్రం వాటిని నిజం చేసే విధంగానే ఉన్నాయి. వీటి ప్రభావం వేలాది మంది భారతీయులపై తీవ్రంగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2015లో బరాక్ ఒబామా హయాంలో హెచ్-1బి వీసాహోల్డర్ల జీవితభాగస్వాముల (భార్య లేదా భర్త)కు అక్కడ పనిచేసేందుకు చట్టం ద్వారా కల్పించిన ఈ అవకాశాన్ని ట్రంప్ ప్రభుత్వం ప్రస్తుతం రద్దు చిట్టాలో చేర్చుతోంది. హెచ్-1బి వీసాదారుల జీవిత భాగస్వాములు చట్టపరంగా పనిచేసేందుకు, వ్యాపారాలు చేసుకునేందుకు ఇప్పటివరకు వర్క్ పర్మిట్లు ఉపయోగపడుతూ వచ్చాయి. అయితే తాజాగా వీటి రద్దు ప్రణాళికలకు అక్కడి ప్రభుత్వ యంత్రాంగం తుదిరూపునిస్తోంది. ఈ విషయాన్ని శాసనకర్తలకు (సెనెటర్లు) అమెరికా పౌరసత్వం, వలస సేవల (యూఎస్సీఐఎస్) డైరెక్టర్ ప్రాన్సిస్ సిస్నా వెల్లడించారు. వచ్చే ఆగస్టుకల్లా దీనిని అమల్లోకి తెచ్చే విషయంపై కార్యనిర్వాహక ఉత్తర్వు (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్) జారీ కావచ్చని తెలుస్తోంది. ‘ అమెరికాలో హెచ్-4 డిపెండెంట్ భాగస్వాములు ఉద్యోగం చేసేందుకు కల్పించే అధికారం రద్దుకు అవసరమైన మార్పులు తీసుకొచ్చే ఫ్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ పాత ఉత్తర్వుల స్థానంలో ప్రస్తుత ఇమిగ్రేషన్ సిస్టమ్‌లో అమెరికా ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు కొత్త నిబంధనలు, మార్గదర్శకాలు ప్రతిపాదిస్తాం. దీనికి సంబంధించి ఇచ్చే నోటీస్, దానిపై స్పందించేందుకు ఇచ్చే నిర్ణీత కాలంలో తమ అభిప్రాయాలు తెలిపేందుకు ప్రజలకు అవకాశం ఉంటుంది ’ అని సిస్నా స్పష్టంచేశారు. గతంలో ఒబామా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల లక్షకు పైగా హెచ్-4 వీసాహోల్డర్లు లబ్దిపొందారు. హెచ్ 1బి భాగస్వాములు అమెరికాలో చట్టబద్ధంగా పనిచేసేందుకు అనుమతినిస్తూ హెచ్-4 వీసాలు ఇచ్చారు. వీరిలో భారత అమెరికన్ల సంఖ్యే ఎక్కువ. అక్కడ శాశ్వత నివాస హోదా(గ్రీన్‌కార్డ్) కోసం దరఖాస్తు చేసుకున్నాక ఆ ప్రక్రియ పూర్తయ్యేందుకు పదేళ్లు, అంతకుపైగానే సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో హెచ్-1బి వీసా హోల్డర్ల భార్య లేదా భర్త ఉద్యోగం చేసేందుకు వీలుగా వర్క్ పర్మిట్ల జారీకి ఒబామా ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రస్తుతం ఈ నిబంధననే రద్దు చేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. హెచ్-4 ఏమిటీ ? అమెరికాలో హెచ్-1బీ వీసాపై ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నవారి జీవిత భాగస్వాములకు ఇచ్చే హెచ్-4 వీసా ద్వారా వర్క్ పర్మిట్ లభిస్తుంది. వీటి ద్వారా మనదేశానికి చెందిన వేలాది మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం హెచ్-4 వీసాపై దాదాపు లక్ష మంది వరకు భారతీయులు ఆ దేశంలోనే ఉంటున్నారు. 2017లో మొత్తం 1,36,393 మందికి హెచ్-4 వీసాలివ్వగా వాటిలో భారతీయులు 1,17,522 మంది (86శాతం), చైనీయులు 4,770 మంది (3 శాతం), మెక్సికన్లు 2,066 మంది (2 శాతం) కి వర్క్‌పర్మిట్లకు అనుమతినిస్తూ పత్రాలు జారీ చేసినట్టు ఓ అధ్యయనం వెల్లడించింది. గతేడాది మొదట్లో హెచ్-4 వీసాతో పనిచేసేందుకు అనుమతి పొందిన వారిలో 94 శాతం మంది మహిళలున్నారు. వారిలోనూ భారతీయులు 93 శాతం, చైనా నుంచి కేవలం నాలుగు శాతమే ఉన్నారు. హెచ్-1బి క్రమబద్ధీకరణ విదేశాలకు చెందిన ఉత్తమ మేథాశక్తి, నైపుణ్యాలను ఆకర్షించే లక్ష్యంతో హెచ్-1బి వీసా జారీ ప్రక్రియలో అమెరికా ప్రభుత్వం మార్పులు తీసుకురానుంది. ఈ వీసాల కోసం మనదేశ టెకీలు అత్యధికంగా పోటీపడుతున్న నేపథ్యంలో వీటి జారీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. హెచ్-1బి వీసా ప్రోగ్రామ్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకు వీలుగా వీసాల జారీ సంఖ్యపై నియంత్రణ, లాటరీ విధానంలో మార్పులకు తెరతీయనుంది. దీనితో పాటు అత్యున్నత నైపుణ్యం ఉన్న వారికే ప్రవేశం కల్పించేందుకు ప్రత్యేక వృత్తి అంటే ఏమిటన్న దానిపై గతంలో ఇచ్చిన నిర్వచనాలకు భిన్నంగా స్పష్టమైన వివరణనిస్తారు. అంటే సాంకేతికంగానూ, ఉన్నత డిగ్రీల పరంగానూ అత్యున్నతస్థాయిలో ఉన్న విదేశీయులకు అవకాశం కల్పిస్తారు. అమెరికన్ ఉద్యోగులు, వారికిచ్చే వేతనాలు పరిరక్షించడంలో భాగంగా ఉద్యోగం, యజమాని, ఉద్యోగి సంబంధాలపై స్పష్టతనిస్తారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అమెరికాకు ట్రంప్ ఆదేశాల దెబ్బ
వాషింగ్టన్ : ఇస్లామిక్ ఉగ్రవాదులను అమెరికాలోకి ప్రవేశించకుండా అరికట్టేందుకు ఏడు ముస్లిం దేశాలపై నిషేధం.. అమెరికన్ ఉద్యోగాలు అమెరిక్లకేనంటూ హెచ్-1బీ వీసాలపై కొరడా ఆ దేశ ఆర్థికవ్యవస్థకు ప్రతికూలంగా మారబోతున్నాయట. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో మళ్లీ అమెరికా ఎకానమీ కుదేలయ్యే స్థాయికి వెళ్లిపోతుందని ఆర్థికవేత్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దేశానికి టాప్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్టులుగా ఉన్న టూరిజం, ఉన్నతవిద్యపై దెబ్బకొట్టడం అమెరికా ఆర్థికవ్యవస్థ మందగిస్తుందని పేర్కొంటున్నారు. అమెరికాకు మళ్లీ ఉద్యోగాలు తీసుకురావడం అనే నెపంతో స్కిల్ స్పెక్ట్రమ్ వీసా కేటగిరీపై నిబంధనలు విధించడం వల్ల ఏం సాధించలేరని సౌత్ ఆసియా అమెరికన్స్ లీడింగ్ టుగెథర్ సుమన్ రఘునాథన్ చెప్పారు. హెచ్-1బీ వీసా సవరణలు, ఇతర ట్రంప్ ఆదేశాలు అమెరికా ఎకానమీని కుదుటపడేలా చేయలేవన్నారు. మరోవైపు మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించడం, ఏడు దేశాలపై నిషేధం విధించడం అమెరికాను సందర్శించే ఇతర దేశాల పర్యాటకులపైన, విద్యార్థులపైన ప్రభావం చూపనుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఈ ఆదేశాలు కేవలం ఏడు దేశాలకే పరిమితం కావంటున్నారు. వస్తువులు, సర్వీసుల రూపంలో జరిగే గ్లోబల్ ఎక్స్చేంజ్ పాజిటివ్ అంశాలకు ట్రంప్ దెబ్బతీస్తున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. అమెరికా ఎకానమీకి విదేశీ పర్యాటకులే ఎంతో కీలకమైన మద్దతు అందిస్తున్నారు. 2015లో వీరి నుంచి 199 బిలియన్ డాలర్ల(రూ.13,40,464కోట్లకు పైగా) ఆదాయం చేకూరింది. ట్రావెల్, టూరిజం అమెరికా ఎక్స్పోర్టులో 9 శాతముంటోంది. కానీ ట్రంప్ ఆదేశాలు ఈ ఎక్స్‌పోర్టులపై దెబ్బకొడుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాక 9/11 పేలుళ్ల సమయంలో నెలకొన్న వాతావరణాన్ని ట్రంప్ ఆర్డర్లు సృష్టిస్తున్నాయని పలువురు ఆర్థికవేత్తంటున్నారు. కఠినతరమైన నిబంధనలతో అమెరికాకు వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గుతుందన్నారు. ఈ మెసేజ్ అమెరికా అన్ఫ్రెండ్లీ కంట్రీగా మారబోతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
'భారతీయ కంపెనీలకు భారీ ఫైన్'
వాషింగ్టన్: భారతీయ సంతతికి వ్యక్తులకు చెందిన రెండు కంపెనీలకు అమెరికా కోర్టు భారీ మొత్తంలో ఫైన్ వేసింది. దాదాపు రూ.68,41,458.17(103000 డాలర్లు) మొత్తం ప్రభుత్వానికి చెల్లించాలని, మరో రూ.5579441.62(84,000డాలర్లు) ఉద్యోగులకు చెల్లించాలని ఆదేశించింది. ఇంతమొత్తంలో ఆ కంపెనీలకు ఎందుకు ఫైన్ వేశారని అనుకుంటున్నారా.. అందుకు ప్రధాన కారణం ఆ కంపెనీలు హెచ్-1బీ వీసాల విషయంలో ఉల్లంఘనలకు పాల్పడటమే. సిలికాన్ వ్యాలీలో గల ప్రముఖ కంపెనీలైన స్కోపస్ కన్సల్టింగ్ గ్రూప్, ఆరియాన్ ఇంజినీర్స్ అనేవి భారతీయ సంతతికి చెందిన వ్యక్తులైన కిషోర్ కుమార్ మరో వ్యక్తికి సంబంధిన కంపెనీలు. ఈ కంపెనీ భారత్‌తోపాటు ఇతర దేశాల నుంచి కూడా తమ కంపెనీకి హెచ్-1బీ వీసాల ద్వారా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను ఈబే, ఆపిల్, సిస్కో సిస్టమ్ కంపెనీల మాదిరిగా రప్పించింది. అయితే, ఈ క్రమంలో ఆ కంపెనీలు వీసా ఉల్లంఘనలకు పాల్పడ్డాయని అమెరికాకు చెందిన లేబర్ వేజ్ డిపార్ట్ మెంట్ గుర్తించింది. వీసాల్లో పేర్కొన్న విధంగా సదరు ఉద్యోగులకు జీత భత్యాలు చెల్లించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటికి భారీ ఫైన్ వేసింది.