Sakshi News home page

ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఎఫెక్ట్.. H1B రెన్యూవల్ భారత్ నుంచే

Published Thu, Jun 22 2023 9:14 AM

US New Move On H-1B Visa Amid PM Modi Visit - Sakshi

వాషింగ్టన్: అమెరికా పొరసత్వ ఇమిగ్రేషన్ సేవల సంస్థ H -1B వీసాల విషయమై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుపుతోంది అమెరికా విదేశాంగ శాఖ. ఇకపై అమెరికా రావాల్సిన అవసరం లేకుండానే వీసా పునరుద్ధరణ చేసుకోవచ్చని ప్రస్తుతం సన్నాహకంగా ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం అతి త్వరలోనే పూర్తిస్థాయిలో కూడా అమలవుతుందని తెలిపింది. 

భారత ప్రధాని అమెరికా పర్యటన మొదలైన ఒక్క రోజులోనే అమెరికా ప్రభుత్వం H-1B  వీసాలపై కీలక నిర్ణయం తీసుకుంది అమెరికా ఇమిగ్రేషన్ శాఖ. భారత దేశంలోని నైపుణ్యమున్న యువత అమెరికాలో ఉపాధి పొందడానికి మరిన్ని అవకాశాలు కల్పించమన్న భారత ప్రధాని అభ్యర్ధన మేరకు అమెరికా ప్రభుత్వం కార్యాచరణను ప్రారంభించింది. అందులో భాగంగా మొదట వీసాల పునరుద్ధరణ విషయంలో యువతకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకూడదన్న ఉద్దేశ్యంతో అమెరికా రావాల్సిన అవసరం లేకుండా ఇంటినుంచే  H-1B వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. 

2022 ఆర్ధిక సంవత్సరంలో విదేశాల నుండి వచ్చి అమెరికాలో పనిచేస్తున్న 4,42,000 మందిలో భారతీయులే 73% ఉన్నందున అమెరికా ఇమిగ్రేషన్ శాఖ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు, మొదట స్వల్ప సంఖ్యలో లబ్దిదారులకు సన్నాహకంగా మొదలుపెట్టి తర్వాత విస్తృతం చేసే ప్రయత్నం చేస్తామని విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ ప్రయత్నం పూర్తిస్థాయిలో విస్తరించిన తర్వాత అధికారిక ప్రకటన చేస్తామని ఆయన అన్నారు. 

ఇది కూడా చదవండి: ఇది "సాంకేతిక దశాబ్దం".. అమెరికా పర్యటనలో భారత ప్రధాని 

Advertisement

What’s your opinion

Advertisement