అమెరికాకు ట్రంప్ ఆదేశాల దెబ్బ
అమెరికాకు ట్రంప్ ఆదేశాల దెబ్బ
Published Thu, Feb 2 2017 9:17 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM
వాషింగ్టన్ : ఇస్లామిక్ ఉగ్రవాదులను అమెరికాలోకి ప్రవేశించకుండా అరికట్టేందుకు ఏడు ముస్లిం దేశాలపై నిషేధం.. అమెరికన్ ఉద్యోగాలు అమెరిక్లకేనంటూ హెచ్-1బీ వీసాలపై కొరడా ఆ దేశ ఆర్థికవ్యవస్థకు ప్రతికూలంగా మారబోతున్నాయట. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో మళ్లీ అమెరికా ఎకానమీ కుదేలయ్యే స్థాయికి వెళ్లిపోతుందని ఆర్థికవేత్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దేశానికి టాప్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్టులుగా ఉన్న టూరిజం, ఉన్నతవిద్యపై దెబ్బకొట్టడం అమెరికా ఆర్థికవ్యవస్థ మందగిస్తుందని పేర్కొంటున్నారు. అమెరికాకు మళ్లీ ఉద్యోగాలు తీసుకురావడం అనే నెపంతో స్కిల్ స్పెక్ట్రమ్ వీసా కేటగిరీపై నిబంధనలు విధించడం వల్ల ఏం సాధించలేరని సౌత్ ఆసియా అమెరికన్స్ లీడింగ్ టుగెథర్ సుమన్ రఘునాథన్ చెప్పారు. హెచ్-1బీ వీసా సవరణలు, ఇతర ట్రంప్ ఆదేశాలు అమెరికా ఎకానమీని కుదుటపడేలా చేయలేవన్నారు.
మరోవైపు మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించడం, ఏడు దేశాలపై నిషేధం విధించడం అమెరికాను సందర్శించే ఇతర దేశాల పర్యాటకులపైన, విద్యార్థులపైన ప్రభావం చూపనుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఈ ఆదేశాలు కేవలం ఏడు దేశాలకే పరిమితం కావంటున్నారు. వస్తువులు, సర్వీసుల రూపంలో జరిగే గ్లోబల్ ఎక్స్చేంజ్ పాజిటివ్ అంశాలకు ట్రంప్ దెబ్బతీస్తున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. అమెరికా ఎకానమీకి విదేశీ పర్యాటకులే ఎంతో కీలకమైన మద్దతు అందిస్తున్నారు.
2015లో వీరి నుంచి 199 బిలియన్ డాలర్ల(రూ.13,40,464కోట్లకు పైగా) ఆదాయం చేకూరింది. ట్రావెల్, టూరిజం అమెరికా ఎక్స్పోర్టులో 9 శాతముంటోంది. కానీ ట్రంప్ ఆదేశాలు ఈ ఎక్స్పోర్టులపై దెబ్బకొడుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాక 9/11 పేలుళ్ల సమయంలో నెలకొన్న వాతావరణాన్ని ట్రంప్ ఆర్డర్లు సృష్టిస్తున్నాయని పలువురు ఆర్థికవేత్తంటున్నారు. కఠినతరమైన నిబంధనలతో అమెరికాకు వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గుతుందన్నారు. ఈ మెసేజ్ అమెరికా అన్ఫ్రెండ్లీ కంట్రీగా మారబోతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Advertisement
Advertisement