వాషింగ్టన్: అమెరికాలో పనిచేస్తున్న లేదా స్థిరపడినవారి జీవితభాగస్వాములుకు సంబంధించిన హెచ్-4 వీసాదారుల వర్క్ పర్మిట్ రద్దుపై ఇద్దరుమహిళా సెసేటర్లు స్పందించారు. ఈ వీసాలను రద్దు చేస్తే లక్ష మంది మహిళలు, వారి కుటుంబాలు నష్టపోతారని డెమోక్రటిక్ పార్టీ కాలిఫోర్నియా సెనేటర్, తొలి భారతీయ అమెరికన్ మహిళ కమలా హారిస్, న్యూయార్క్ సెనేటర్ కిర్‌స్టన్ గిల్లిబ్రాండ్ ట్రంప్ ప్రభుత్వానికి లేఖ రాశారు. హెచ్-4 వీసాదారుల వర్క్‌పర్మిట్‌ను రద్దు చేస్తే లక్షమంది మహిళలపై ప్రభావం చూపుతుందని, వీరిలో భారతీయ-అమెరికన్లు ఉన్నారని తెలిపారు. హెచ్-4 వీసాపై ఆధారపడి ఉద్యోగాలు చేస్తున్న మహిళలు అటు వృత్తిపరంగానే కాకుండా కుటుంబపరంగానూ కష్టాలు ఎదుర్కొంటారని తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ఈ పరిణామం వారి పిల్లలకు తీవ్ర హాని చేస్తుందన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని హెచ్-4వీసాను రద్దు చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.
అమెరికన్లకు ఉద్యోగావకాశాలు పెంచేందుకు ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా హెచ్-4 వీసాలను రద్దు చేయనున్నామని గత వారం ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. మూడు నెలలో ఒక నోటిఫికేషన్ విడుదల చేయనునున్నామని అమెరికా పౌరసత్వం మరియు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది. హెచ్1 బీ వీసాల జారీ పక్రియ సమీక్షలో భాగంగా అమెరికన్లను నియమించకునేక్ రమంలో అమెరికన్ కంపెనీ లద్వారా ఈ వీసా దుర్వినియోగమవుతోందని తెలిపింది. అందుకే హెచ్ 4వీసాలను రద్దు చేయాలని భావిస్తున్నన్నామని ట్రంప్ సర్కార్ ఫెడరల్ కోర్టుకు తెలియజేసింది.
హెచ్-4 వీసాలను రద్దు అమల్లోకి వస్తే అత్యధికంగా నష్టపోయేది మన భారతీయులే. అమెరికాలో పనిచేస్తున్న లేదా స్థిరపడినవారి జీవితభాగస్వాములు ఇక అమెరికాలో ఎక్కడా ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉండదు. దీంతో వారికి అనేక ఇబ్బందులుతప్పవు. అలాగే హెచ్-4 వీసాలపై అమెరికా వెళ్లాలనుకొన్నవారికీ నిరాశ తప్పదు. 2017, డిసెంబర్ 25 నాటి లెక్కల ప్రకారం అమెరికాలో మొత్తం 1,26,853 మంది పనిచేస్తుండగా, హెచ్-4 వీసాలతో పనిచే వారిలో సుమారు 93 శాతం మంది భారతీయులే. మిగిలిన 7 శాతం ఇతర దేశాలవారు.
Comments
Please login to add a commentAdd a comment