revoke
-
జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబర్‌లోగా ఎన్నికలు: అమిత్ షా
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ప్రత్యేక సైనిక దళాల చట్టాన్ని ఉపసంహరించుకునే దిశగా కేంద్రం యోచిస్తుంది. జమ్మూలో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టాన్ని వెనక్కి తీసుకునే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. బలగాలను ఉపసంహరించుకొని శాంతిభద్రతలను జమ్మూ కశ్మీర్ పోలీసులకే అప్పగించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు. గతంలో జమ్మూకశ్మీర్ పోలీసులపై నమ్మకం ఉండేది కాదని కానీ ప్రస్తుతం వారు సమర్థవంతంగా పనిచేస్తున్నారని, అనేక ఆపరేషన్లను లీడ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. జమ్మూలో అమలులో ఉన్న AFSPAను.. ఈశాన్య రాష్ట్రాల్లోని 70% ప్రాంతాల్లో తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని అనేక సంస్థలు, వివిధ వ్యక్తుల నుంచి డిమాండ్లు వస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా సెప్టెంబర్‌లోపు జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు అమిత్‌షా చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని, దానిని నెరవేరుస్తారని తెలిపారు. అయితే ఈ ప్రజాస్వామ్యం కేవలం మూడు కుటుంబాలకే పరిమితం కాదని.. ప్రజల ప్రజాస్వామ్యమని అన్నారు. ఇదిలా ఉండా జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో సెప్టెంబర్‌లోపు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా ఏఎఫ్ఎస్పీఏ చట్టం కేంద్ర సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాలను కల్పిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల నిర్వహణలో భాగంగా కేంద్ర బలగాలకు శోధనలు చేపట్టడానికి, అరెస్టులు, అవసరమైతే కాల్పులు చేపట్టడానికి ఈ చట్టం విస్తృత అధికారాలను కల్పిస్తోంది. సాయుధ బలగాల కార్యకలాపాలను సులభతరం చేయడానికి ఈ చట్టాన్ని రూపొందించారు. -
69 జీఓను రద్దు చేయాలి: పలు సంఘాల సంయుక్త ప్రకటన
సాక్షి, హైదరాబాద్: జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన 111 జీఓను ఎత్తివేస్తూ ప్రభుత్వం జారీ చేసిన 69 జీఓను తక్షణం రద్దు చేయాలని పలు సంఘాల ప్రతినిధులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 84 గ్రామాల పరిధిలో పట్టణీకరణ కోసం జారీచేసిన తాజా జీఓతో జంట జలాశయాలు మురుగు కాల్వల్లా మారతాయని ఆక్షేపించారు. నగర జనాభా 2050 నాటికి రెట్టింపవుతుందని, తాగునీటి అవసరం అనూహ్యంగా పెరుగుతుందన్నారు. పట్టణీకరణ వల్ల వర్షపునీటి ప్రవాహానికి అడ్డంకులు తలెత్తి వరదల ఉద్ధృతి పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రకటన విడుదల చేసినవారిలో హెచ్ఆర్ఎఫ్ ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.బాల్‌రాజ్, తిరుపతయ్య, ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు వి.వసంతలక్ష్మి, డబ్ల్యూఐసీసీఐ అధ్యక్షుడు లుబ్నాసర్వత్, సిటిజన్స్ ఫర్ హైదరాబాద్ ప్రతినిధి కాజల్ మహేశ్వరి, ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ప్రతినిధి ఫరిహా ఫాతిమా, అనన్య సంగమేశ్వర్లున్నారు. (క్లిక్: హైదరాబాద్ కలెక్టర్‌గా అమయ్‌కుమార్) -
‘ఈ పన్నుని రద్దు చేయండి’- కేంద్రానికి వినతుల వెల్లువల
న్యూఢిల్లీ: వచ్చే నెల మొదట్లో ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ లావాదేవీ పన్ను(ఎస్టీటీ)ను రద్దు చేయాలని మార్కెట్ నిపుణులు అభ్యర్థించారు. తద్వారా ఈక్విటీ ట్రేడర్లకు ఉపశమనం కల్పించవలసిందిగా కోరారు. ఈ నిర్ణయం క్యాపిటల్ మార్కెట్లను బలపరచడంతోపాటు కొత్త ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తుందని పేర్కొన్నారు. 2004లో ప్రభుత్వం వివిధ రకాల సెక్యూరిటీలు, కొనుగోళ్లు లేదా అమ్మకపు లావాదేవీల ఆధారితంగా ఎస్టీటీని ప్రవేశపెట్టింది. దీంతో వివిధ సెక్యూరిటీలు, విభిన్న లావాదేవీల ఆధారంగా 0.025 శాతం నుంచి 0.25 శాతం మధ్య ఎస్టీటీ విధింపు అమలవుతోంది. అటు దీర్ఘకాలిక, ఇటు స్వల్పకాలిక పెట్టుబడి లాభాలపై ఎస్టీటీ రద్దయితే పెట్టుబడులు మరింత ఊపందుకునే వీలున్నట్లు జిరోధా సహవ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పేర్కొన్నారు. ఒకవేళ ఎస్టీటీని రద్దుచేయకుంటే దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలపై పన్నునైనా తొలగించేందుకు ప్రభుత్వం దృష్టిపెట్టవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. -
పబ్జీ, టిక్‌టాక్‌ల పరిస్థితి ఏంటి.. చైనా యాప్‌లపై కేంద్రం క్లారిటీ
న్యూఢిల్లీ: చైనా యాప్‌లపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేసే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. యాప్‌లపై విధించిన బ్యాన్‌ని వెనక్కి తీసుకునే ప్రతిపాదన ఏదీ మంత్రిత్వశాఖ వద్ద లేదని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గతంలో నిషేధించిన చైనా అప్లికేషన్ల వినియోగాన్ని దేశంలో పునఃప్రారంభించాలని ప్రభుత్వం ప్రతిపాదించిందా అనే ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. గత సంవత్సరం, భారతదేశంలో పబ్జీ, టిక్‌టాక్, వీబో, వీచాట్, అలీఎక్స్‌ప్రెస్‌తో సహా వందలాది చైనీస్ యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. నవంబర్ 2020లో, కేంద్రం 43 మొబైల్ యాప్‌లకు యాక్సెస్‌ను బ్లాక్ చేస్తూ ఐటీ చట్టంలోని సెక్షన్ 69 ఏ కింద ఉత్తర్వులు జారీ చేసింది. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, దేశ రక్షణ, రాష్ట్ర భద్రత, ప్రజా శాంతి భద్రతల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. అంతకుముందు జూన్ 29, 2020న, భారతదేశం 59 మొబైల్ యాప్‌లకు యాక్సెస్‌ను బ్లాక్ చేస్తూ సెప్టెంబర్ 2న ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద 118 యాప్‌లు నిషేధించింది. చదవండి: అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నాసా..! తొలిసారిగా సూర్యుడి వాతావరణంలోకి..! అదెలా సాధ్యమైదంటే..? -
భారతీయ ఐటీ నిపుణులకు భారీ ఊరట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత ఐటీ నిపుణులకు తీపి కబురు అందించారు. ఇప్పటిదాకా అమెరికాలోకి ప్రవేశించకుండా అనేకమంది గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులను అడ్డుకున్న గత ప్రభుత్వం ఆర్డర్‌ను జో బైడెన్ బుధవారం ఉపసంహరించుకున్నారు. దీంతో గ్రీన్ కార్డ్ కోరుకునేవారికి భారీ ఉపశమనం కలిగించారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద ఆర్డర్లపై బైడెన్ తీసుకున్నంటున్న సంచలన నిర్ణయాల్లో భాగంగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం విధించిన వీసా నిషేధం మార్చి 31తో ముగుస్తున్న నేపథ్యంలో తాజా నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. (అదిగదిగో గ్రీన్ కార్డు) కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలను సరళీకృతం చేస్తానంటూ డెమొక్రాటిక్ అధ్యక్షుడు బైడెన్ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. గత ఏడాది కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన అమెరికా వర్కర్ల హక్కులను కాపాడే చర్యల్లో భాగంగా ట్రంప్ ప్రభుత్వం గ్రీన్ కార్డుల జారీ వీసాలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ట్రంప్ అప్పటి ఆంక్షలు సరైనవి కాదంటూ తాజా ప్రకటనలో బైడెన్ స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు అమెరికాలోని కుటుంబాలను తిరిగి కలవకుండా నిరోధించాయని, అమెరికా వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీశాయని బైడెన్ పేర్కొన్నారు. కాగా గత ఏడాది అక్టోబరులో ఇమ్మిగ్రెంట్స్‌పై ట్రంప్ నిషేధాన్ని ఇమ్మిగ్రేషన్ అటార్నీ కర్టిస్ మోరిసన్ తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి, లాక్డౌన్ సంక్షోభంలో వీసా ప్రాసెసింగ్‌ను మూసివేత నెలల తరబడి సాగుతున్న దరఖాస్తుల బ్యాక్‌లాగ్‌ను పరిష్కరించాల్సి ఉంటుందని మారిసన్ వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియకు సంవత్సరాలు పట్టవచ్చని కూడా ఆయన అన్నారు. “ఇది ట్రంప్ సృష్టించిన బ్యాక్లాగ్”, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను నాశనం చేశాడంటూ మోరిసన్ మండిపడ్డారు. -
హెచ్4 వీసా రద్దు వద్దు : లక్షమంది మహిళలకు నష్టం
వాషింగ్టన్: అమెరికాలో పనిచేస్తున్న లేదా స్థిరపడినవారి జీవితభాగస్వాములుకు సంబంధించిన హెచ్-4 వీసాదారుల వర్క్ పర్మిట్ రద్దుపై ఇద్దరుమహిళా సెసేటర్లు స్పందించారు. ఈ వీసాలను రద్దు చేస్తే లక్ష మంది మహిళలు, వారి కుటుంబాలు నష్టపోతారని డెమోక్రటిక్ పార్టీ కాలిఫోర్నియా సెనేటర్, తొలి భారతీయ అమెరికన్ మహిళ కమలా హారిస్, న్యూయార్క్ సెనేటర్ కిర్‌స్టన్ గిల్లిబ్రాండ్ ట్రంప్ ప్రభుత్వానికి లేఖ రాశారు. హెచ్-4 వీసాదారుల వర్క్‌పర్మిట్‌ను రద్దు చేస్తే లక్షమంది మహిళలపై ప్రభావం చూపుతుందని, వీరిలో భారతీయ-అమెరికన్లు ఉన్నారని తెలిపారు. హెచ్-4 వీసాపై ఆధారపడి ఉద్యోగాలు చేస్తున్న మహిళలు అటు వృత్తిపరంగానే కాకుండా కుటుంబపరంగానూ కష్టాలు ఎదుర్కొంటారని తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ఈ పరిణామం వారి పిల్లలకు తీవ్ర హాని చేస్తుందన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని హెచ్-4వీసాను రద్దు చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. అమెరికన్లకు ఉద్యోగావకాశాలు పెంచేందుకు ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా హెచ్-4 వీసాలను రద్దు చేయనున్నామని గత వారం ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. మూడు నెలలో ఒక నోటిఫికేషన్ విడుదల చేయనునున్నామని అమెరికా పౌరసత్వం మరియు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది. హెచ్1 బీ వీసాల జారీ పక్రియ సమీక్షలో భాగంగా అమెరికన్లను నియమించకునేక్ రమంలో అమెరికన్ కంపెనీ లద్వారా ఈ వీసా దుర్వినియోగమవుతోందని తెలిపింది. అందుకే హెచ్ 4వీసాలను రద్దు చేయాలని భావిస్తున్నన్నామని ట్రంప్ సర్కార్ ఫెడరల్ కోర్టుకు తెలియజేసింది. హెచ్-4 వీసాలను రద్దు అమల్లోకి వస్తే అత్యధికంగా నష్టపోయేది మన భారతీయులే. అమెరికాలో పనిచేస్తున్న లేదా స్థిరపడినవారి జీవితభాగస్వాములు ఇక అమెరికాలో ఎక్కడా ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉండదు. దీంతో వారికి అనేక ఇబ్బందులుతప్పవు. అలాగే హెచ్-4 వీసాలపై అమెరికా వెళ్లాలనుకొన్నవారికీ నిరాశ తప్పదు. 2017, డిసెంబర్ 25 నాటి లెక్కల ప్రకారం అమెరికాలో మొత్తం 1,26,853 మంది పనిచేస్తుండగా, హెచ్-4 వీసాలతో పనిచే వారిలో సుమారు 93 శాతం మంది భారతీయులే. మిగిలిన 7 శాతం ఇతర దేశాలవారు. -
అసెంబ్లీ ముట్టడికి యత్నం, ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును ఉపసంహరించుకోక పోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. మంగళవారం ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును వ్యతిరేకిస్తూ తెలంగాణ వామపక్ష విద్యార్థి సంఘాలు అసెంబ్లీ ముట్టడిని చేపట్టాయి. ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే ఆలోచనను ప్రభుత్వం వెంటనే మానుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైవేటు యూనివర్సిటీ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల అసెంబ్లీ ముట్టడిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ ముట్టడిలో పలు విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. -
విజయ్ మాల్యా పాస్ పోర్టు రద్దు
బ్రిటన్‌లో ఉన్నట్లు భావిస్తున్న ‘ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారు’ విజయ్ మాల్యా మరింత ఇరుకున పడ్డారు. విజయ్ మాల్యా డబ్బు లావాదేవీల్లో చట్టాన్ని ఉల్లంఘించారని, కేసు విచారణకు సరిగా సహకరించడంలేదని ఈ నేపథ్యంలో మాల్యా పాస్ పోర్టు రద్దు చేస్తున్నట్టు ఆదివారం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. సెక్షన్ 10(3)(సీ) అండ్(హెచ్) ఆఫ్ పాస్ పోర్ట్ ఆక్ట్ ప్రకారం విజయ్ మాల్యా పాస్ పోర్టు ను రద్దు చేశామని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మాల్యాను స్వదేశానికి రప్పించే డిపోర్టేషన్ ప్రక్రియ ప్రారంభించాలంటూ విదేశీ వ్యవహారాల శాఖను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ఆశ్రయించింది. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు (ఆర్సీఎన్) వచ్చేలా సీబీఐ కి త్వరలోనే ఈడీ లేఖ రాయనుంది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు తీసుకున్న రుణంలో మాల్యా 430 కోట్ల రూపాయల వరకూ విదేశాలకు మళ్ళించారన్నది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వాదన. మరోవైపు తొమ్మిదివేల కోట్ల బ్యాంకు రుణ కుంభకోణం కేసుకు సంబంధించి మాల్యాపై ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే ముందు నిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలిపింది. తన విదేశీ ఆస్తుల వివరాలను అడిగే అధికారం బ్యాంకులకు లేదని, తన భార్యా, పిల్లలు ఎన్నారైలు కావడంతో తన ఆస్తుల వివరాలను వెల్లడించక్కర లేదని మాల్యా ఇప్పటికే సుప్రీం కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. After having considered replies by @TheVijayMallya, MEA revokes his passport under S.10(3)(c) & (h) of Passports Act pic.twitter.com/Stb9rX63OV — Vikas Swarup (@MEAIndia) 24 April 2016