
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును ఉపసంహరించుకోక పోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. మంగళవారం ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును వ్యతిరేకిస్తూ తెలంగాణ వామపక్ష విద్యార్థి సంఘాలు అసెంబ్లీ ముట్టడిని చేపట్టాయి.
ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే ఆలోచనను ప్రభుత్వం వెంటనే మానుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైవేటు యూనివర్సిటీ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల అసెంబ్లీ ముట్టడిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ ముట్టడిలో పలు విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment