వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత ఐటీ నిపుణులకు తీపి కబురు అందించారు. ఇప్పటిదాకా అమెరికాలోకి ప్రవేశించకుండా అనేకమంది గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులను అడ్డుకున్న గత ప్రభుత్వం ఆర్డర్‌ను జో బైడెన్ బుధవారం ఉపసంహరించుకున్నారు. దీంతో గ్రీన్ కార్డ్ కోరుకునేవారికి భారీ ఉపశమనం కలిగించారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద ఆర్డర్లపై బైడెన్ తీసుకున్నంటున్న సంచలన నిర‍్ణయాల్లో భాగంగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం విధించిన వీసా నిషేధం మార్చి 31తో ముగుస్తున్న నేపథ్యంలో తాజా నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. (అదిగదిగో గ్రీన్ కార్డు)
కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలను సరళీకృతం చేస్తానంటూ డెమొక్రాటిక్ అధ్యక్షుడు బైడెన్ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. గత ఏడాది కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన అమెరికా వర్కర్ల హక్కులను కాపాడే చర్యల్లో భాగంగా ట్రంప్ ప్రభుత్వం గ్రీన్ కార్డుల జారీ వీసాలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ట్రంప్ అప్పటి ఆంక్షలు సరైనవి కాదంటూ తాజా ప్రకటనలో బైడెన్ స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు అమెరికాలోని కుటుంబాలను తిరిగి కలవకుండా నిరోధించాయని, అమెరికా వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీశాయని బైడెన్ పేర్కొన్నారు. కాగా గత ఏడాది అక్టోబరులో ఇమ్మిగ్రెంట్స్‌పై ట్రంప్ నిషేధాన్ని ఇమ్మిగ్రేషన్ అటార్నీ కర్టిస్ మోరిసన్ తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ సంక్షోభంలో వీసా ప్రాసెసింగ్‌ను మూసివేత నెలల తరబడి సాగుతున్న దరఖాస్తుల బ్యాక్‌లాగ్‌ను పరిష్కరించాల్సి ఉంటుందని మారిసన్ వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియకు సంవత్సరాలు పట్టవచ్చని కూడా ఆయన అన్నారు. “ఇది ట్రంప్ సృష్టించిన బ్యాక్‌లాగ్”, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను నాశనం చేశాడంటూ మోరిసన్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment