IT experts
-
తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర సంస్థ ఏర్పాటుకు ఆమోదం
కేంద్రం పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. అందుకు అనువుగా కేంద్రం తాజాగా సికింద్రాబాద్, తిరుపతి నగరాల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(నీలిట్) కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆమోదించింది. ఈ సెంటర్లను తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీకి, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు చెప్పారు. ఈ కేంద్రాల్లో రానున్న రోజుల్లో ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఐఈసీటీ)కు సంబంధించిన వివిధ రకాల కోర్సులపై అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇవ్వనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఈ రెండు కేంద్రాలు నీలిట్-చెన్నై ఆధ్వర్యంలో పనిచేయనున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: రూ.కోటి ప్యాకేజీతో ఉద్యోగం! ఈ సంస్థల్లో శిక్షణ తీసుకున్న అభ్యర్థులతో టెక్నాలజీ కంపెనీలకు మానవ వనరుల కొరత తీరనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. రాబోయే 3 ఏళ్లలో ఒక్కో కేంద్రం ద్వారా కనీసం 5,000 మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. -
10న విశాఖలో ఏఐ, క్లౌడ్ సమ్మిట్
సాక్షి, విశాఖపట్నం: జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు కీలక వేదికగా నిలిచిన విశాఖ మరో ముఖ్యమైన సదస్సుకు ముస్తాబవుతోంది. కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్‌కు సంబంధించిన విప్లవాత్మక మార్పులపై ఫిబ్రవరి 10న ఏఐ క్లౌడ్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి. ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డీప్‌టెక్ సమ్మిట్స్ ఆధ్వర్యంలో వీఎంఆర్డీఏ చిల్డ్రన్ థియేటర్లో సదస్సు జరుగనుంది. పలు అంతర్జాతీయ సంస్థలకు చెందిన చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్లు, ఐటీ నిపుణులు, ప్రొఫెసర్లు, స్టార్టప్ సంస్థల ప్రతినిధులు, ఇంక్యుబేటర్స్, కృత్రిమ మేధ, క్లౌడ్ టెండర్ నిపుణులు పాల్గొననున్నారు. -
భారతీయ ఐటీ నిపుణులకు భారీ ఊరట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత ఐటీ నిపుణులకు తీపి కబురు అందించారు. ఇప్పటిదాకా అమెరికాలోకి ప్రవేశించకుండా అనేకమంది గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులను అడ్డుకున్న గత ప్రభుత్వం ఆర్డర్‌ను జో బైడెన్ బుధవారం ఉపసంహరించుకున్నారు. దీంతో గ్రీన్ కార్డ్ కోరుకునేవారికి భారీ ఉపశమనం కలిగించారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద ఆర్డర్లపై బైడెన్ తీసుకున్నంటున్న సంచలన నిర్ణయాల్లో భాగంగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం విధించిన వీసా నిషేధం మార్చి 31తో ముగుస్తున్న నేపథ్యంలో తాజా నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. (అదిగదిగో గ్రీన్ కార్డు) కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలను సరళీకృతం చేస్తానంటూ డెమొక్రాటిక్ అధ్యక్షుడు బైడెన్ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. గత ఏడాది కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన అమెరికా వర్కర్ల హక్కులను కాపాడే చర్యల్లో భాగంగా ట్రంప్ ప్రభుత్వం గ్రీన్ కార్డుల జారీ వీసాలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ట్రంప్ అప్పటి ఆంక్షలు సరైనవి కాదంటూ తాజా ప్రకటనలో బైడెన్ స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు అమెరికాలోని కుటుంబాలను తిరిగి కలవకుండా నిరోధించాయని, అమెరికా వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీశాయని బైడెన్ పేర్కొన్నారు. కాగా గత ఏడాది అక్టోబరులో ఇమ్మిగ్రెంట్స్‌పై ట్రంప్ నిషేధాన్ని ఇమ్మిగ్రేషన్ అటార్నీ కర్టిస్ మోరిసన్ తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి, లాక్డౌన్ సంక్షోభంలో వీసా ప్రాసెసింగ్‌ను మూసివేత నెలల తరబడి సాగుతున్న దరఖాస్తుల బ్యాక్‌లాగ్‌ను పరిష్కరించాల్సి ఉంటుందని మారిసన్ వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియకు సంవత్సరాలు పట్టవచ్చని కూడా ఆయన అన్నారు. “ఇది ట్రంప్ సృష్టించిన బ్యాక్లాగ్”, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను నాశనం చేశాడంటూ మోరిసన్ మండిపడ్డారు. -
భారత ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్
వాషింగ్టన్: అమెరికా వెళ్లాలనుకునే భారతీయ ఐటీ నిపుణులకు అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ శుభవార్త అందించారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే ట్రంప్ తెచ్చిన ఇమ్మిగ్రేషన్ చట్టాలు రద్దు చేస్తామని ఆయన వెల్లడించారు. కొత్త ఇమ్మిగ్రేషన్ విధానాన్ని తీసుకురానున్నామని ప్రకటించారు. ముఖ్యంగా ఐటీ నిపుణులకు అందించే హెచ్1బీ వీసాల జారీపై ట్రంప్ విధించిన ఆంక్షలను ఎత్తి వేస్తామని బైడెన్ ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 31 వరకు ఉన్న నిషేదాన్ని రద్దు చేయడంతోపాటు, ఇందుకు వీలుగా నిబంధనల్లో తుది సవరణలు చేపట్టనున్నారు. కొత్త ఇమ్మిగ్రేషన్ బిల్లును పరిశీలనకు కమిటీలకు పంపించనున్నారు. దీంతోపాటు ప్రస్తుతం ఉన్న హెచ్1బీ వీసాల లాటరీ విధానానికి బైడెన్ స్వస్తి చెప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు. నాన్‌ఇమ్మిగ్రెంట్ వీసాలైన హెచ్1బీ వీసా జారీకి ఇప్పటివరకూ అనుసరిస్తున్న లాటరీ విధానానికి స్వస్తి చెప్పి వేతనాలు, నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అలాగే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్‌లలో..పీహెచ్డీ చేసిన వారికి గ్రీన్‌కార్డు ఇచ్చే యోచనలో కూడా బైడెన్ ఉన్నారు. జనవరి 20 న పదవీ స్వీకారం తరువాత ఏం చేస్తారన్న ప్రశ్నలకు బైడెన్ స్పందించారు. అలాగే కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు తక్షణమే ఆర్థిక సాయం చేయాల్సిందిగా కాంగ్రెస్‌ను అర్థిస్తానని కూడా బైడెన్ తెలిపారు. అధ్యక్ష పదవినిచేపట్టిన మొదటి రోజున పారిస్ వాతావరణ ఒప్పందంలో తిరిగి చేరతామని కూడా బైడెన్ తెలిపారు. కాగా ట్రంప్ తీసుకొచ్చిన "క్రూరమైన" ఇమ్మిగ్రేషన్ విధానాలను రద్దుచేస్తామనేది బైడెన్ ఎన్నికల వాగ్దానాలలో ఒకటి. (అమెరికాలో కొత్త కరోనా స్ట్రెయిన్ కలకలం) -
హెచ్1బీ వీసా : ఐటీ నిపుణులకు భారీ ఊరట
వాషింగ్టన్: హెచ్1బీ నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన హెచ్1బీ వీసాల ఆంక్షలపై అమెరికా ఫెడరల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షలను కాలిఫోర్నియాలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి జెఫ్రీ వైట్ తోసిపుచ్చారు. ఈ విషయంలో ట్రంప్ ప్రభుత్వం పారదర్శక విధానాలను పాటించలేదని ఈ మార్పులు కరోనా మహమ్మారి ఉద్యోగ నష్టాలను పూడ్చడంకోసం అని వాదించడం సరికాదని తెలిపింది. ఎందుకంటే ట్రంప్ సర్కార్‌కు అందకుముందే ఈ ఆంక్షల ఆలోచన ఉందనీ, కానీ అక్టోబరులో ఆదేశాలు జారీ చేసిందని జెఫ్రీ వ్యాఖ్యానించారు. ఈ తీర్పుతో బే ఏరియా కౌన్సిల్, స్టాన్‌ఫర్డ్ శ్వవిద్యాలయం, ఇతర విద్యా వ్యాపార వర్గం డొనాల్డ్ ట్రంప్ పరిపాలనపై చట్టపరమైన విజయం సాధించారు. ఇది మన ఆర్థిక వ్యవస్థకు, చెత్త ఆదేశాలపై సాధించిన పెద్ద విజయం" అని బే ఏరియా కౌన్సిల్ సీఈవో జిమ్ వుండెర్మాన్ ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు ట్రంప్ ఓటమి, జో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవిని స్వీకరించనున్న నేపథ్యంలో తాజా ఆదేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అమెరికాలోకి విదేశీ నిపుణుల రాకను అడ్డుకోవడం ద్వారా స్ధానికులకు ఉపాధి పెంచేందుకు ట్రంప్ సర్కార్ వీసాలపై ఆంక్షలు విధిస్తూ అక్టోబర్ లో ఆదేశాలు జారీ చేసింది. హెచ్ 1బీ వీసాలపై మూడవ పార్టీ సంస్థలలో హెచ్ 1బీ ఉద్యోగాల నియామకాలపై ఏడాది పాటునిషేధం విధించింది. దీనిపై బే ఏరియా కౌన్సిల్, స్టాన్‌ఫర్డ్, యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మానుఫ్యాక్చరర్స్ , ఇతర గ్రూపులు సవాల్చేసిన సంగతి తెలిసిందే. అమెరికా ప్రతీ ఏడాదీ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి రంగాల్లో కలిపి దాదాపు 85 వేల వీసాలను ఇస్తుంది. ఇవి మూడేళ్ల పాటు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత వీటిని రెన్యువల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలా అమెరికాలో హెచ్1బీ వీసాలు పొందిన వారిలో 6 లక్షల మంది భారత్, చైనాకు చెందిన వారే ఉన్నారు. కాగా అమెరికా నూతన అధ్యక్షునిగా పదవిని చేపట్టనున్న జో బైడెన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్రంప్ ఆంక్షలను రద్దు చేయవచ్చునని భావిస్తున్నారు. తద్వారా లక్షలాది భారతీయుల వీసా ఇబ్బందులు చెక్‌పడనుందనే అంచనాలకు మరింత బలం చేకూరింది. బైడెన్ వాగ్దానం ప్రకారం హెచ్1బీ వీసాలతో బాటు హై స్కిల్డ్ వీసాల సంఖ్యను ఆయన పెంచవచ్చునని, అలాగే ఇమ్మిగ్రేషన్ పాలసీని సైతం సవరించే అవకాశం ఉందని అంచనా. -
తల్లిదండ్రులకు ఐటీ నిపుణుల హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: కనీస వయస్సు ఎనిదేళ్లు దాటిన పిల్లలకే మొబైల్ ఫోన్లను వినియోగించేందుకు ఇవ్వాలని ఐటీ కమ్యూనికేషన్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో రెండెళ్లు కూడా నిండని వారికి కూడా స్మార్ట్ఫోన్లు ఇచ్చి వారిని వ్యసన పరులుగా మారుస్తున్నారని, దీని ద్వారా వారి మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని బుధవారం జరిగిన ఓ సదస్సులో హెచ్చరించారు. తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నెలరోజుల పాటు నిర్వహిస్తున్న సైబ్- హర్ కార్యక్రమంలో భాగంగా ‘‘సాంకేతికతకు నేటి తరం పిల్లలు వ్యసన పరులవుతున్నారా’’ అనే అంశంపై ఇవాళ సాయంత్రం రాష్ట్రంలోని మహిళలు, యువతకు వెబ్ ఆధారిత చైతన్య సదస్సు నిర్వహించారు. సింబయాసిస్‌లా స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ల సహకారంతో నిర్వహించిన ఈ సదస్సులో భారతీయ సైనిక దళాలకు మీడియా శిక్షకురాలుగా ఉన్న జూహీకౌల్ ప్రధాన వక్తగా ప్రసంగించారు. ఈ సందర్బంగా జూహికౌల్ మాట్లాడుతూ.. కోవిడ్ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా ఆన్లైన్ క్లాసులు అనివార్యమయ్యాయని అన్నారు. అయితే, కనీసం ఎనిమిదేళ్ల పైన వయస్సు ఉన్నపిల్లలకు మాత్రమే ఈ క్లాసులు వర్తింప చేయాలని ఆమె సూచించారు. పదేళ్ల లోపు పిల్లలకు రోజూ కనీసం ఒక గంటకన్నా ఎక్కువ సేపు ఈ ఆన్ లైన్ క్లాసులు ఉండొద్దని, ఈ వయస్సులో పిల్లలకు వివిధ అంశాలపై సహజంగా ఉండే ఆసక్తి, నిశిత పరిశీలన, ఇమాజినేషన్ లకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. ఇటీవలి కాలంలో పిల్లలు ముఖ్యంగా యువత ఇంటర్నెట్, సోషల్ మీడియాకు బానిసలుగా మారి అధిక సమయం ప్రధానంగా అర్ద రాత్రివరకూ మొబైల్ ఫోన్లను ఉపయోగించడం అధికమైందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల జ్ఞాపక శక్తి తగ్గడం, చిరాకు, అసహనం అధికం కావడం, శారీరక శ్రమకు దూరం కావడంతో పలు రకాల సమస్యలను ఎదుర్కుంటున్నారని వివరించారు. పిల్లలు, యువకులు రోజుకు కనీసం ఎనిమిది గంటలపాటు నిద్రపోయే విధంగా పేరెంట్స్ తగు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుత అనివార్య పరిస్థితుల్లో ఇంటర్నెట్ ఆధారిత మొబైల్ ఫోన్, టాబ్, లాప్ టాప్ ల ఉపయోగాన్ని పరిమిత సమయంలోనే వినియోగించేలా చూడాలని సూచించారు. సోషల్ మీడియా పై మన నియంత్రణ ఉండాలి కానీ అవే మనను నియంత్రించే స్థాయికి తీసుకురావోద్దని జూహీకౌల్ హెచ్చరించారు. టాబ్, మొబైల్, లాప్ టాప్ లలో అనవసరం , ఎప్పుడూ ఉపయోగించని యాప్ లను డిలీట్ చేయాలని అన్నారు. ఎవరైనా రోజుకు నాలుగు గంటలకన్నా అధికంగా ఇంటర్నెట్ ఉపయోగిస్తే అది వ్యసనం కిందకి వస్తుందన్నారు. అనవసర యాప్‌లను తొలగించడంతో పాటు కేవలం విద్యా పరమైన అవసరాలకే ఇంటర్నెట్ ఉపయోగించడం, అధికంగా ఉపయోగిస్తే కలిగే అనర్థాలను పిల్లలకు అర్ధమయ్యీట్టు చెప్పడం చేయాలని అన్నారు. ప్రతి రోజూ ఇంట్లోనే యోగా, సంగీత సాధన, వ్యాయామం చేయడం లాంటివి చేయించాలని ఆమె తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐడీ విభాగానికి చెందిన రవి కుమార్ రెడ్డి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ బాలి, నీతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ తో పాటు ఢిల్లీ తదితర రాష్ట్రాలకు చెందిన దాదాపు మూడు వేలమంది విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
చెదురుతున్న ‘డాలర్ డ్రీమ్స్’!
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికాలో భారతీయుల డాలర్ డ్రీమ్స్ చెదిరిపోతున్నాయి. అమెరికా ప్రభుత్వం రక్షణాత్మకంగా వ్యవహరిస్తుండటంతో అక్కడ పనిచేస్తున్న వేలాది మంది భారత ఐటీ నిపుణులు వీసా తిరస్కరణ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. తమ వీసా గడువును పొడిగించాల్సిందిగా దాఖలు చేస్తున్న దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తున్నారు. లేదంటే రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్(ఆర్ఎఫ్ఈ)లను సమర్పించాల్సిందిగా పదేపదే అడుగుతున్నారు. ఆర్‌ఎఫ్‌ఈలను పొందిన ఉద్యోగులకు వీసా పొడిగింపు దక్కుతుందన్న గ్యారెంటీ ఏమీలేదు. ‘నా స్నేహితురాలు ఇక్కడే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమెకు ఓ బాబు ఉన్నాడు. హెచ్1బీ వీసా పొడిగింపుతో పాటు గ్రీన్‌కార్డు కోసం ఆమె దరఖాస్తు చేసుకుంది. కానీ ఆ రెండు దరఖాస్తులూ తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఆమె కుమారుడితో కలిసి అమెరికాను వీడాల్సి వచ్చింది’అని జునేజా అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పారు. అమెరికాలో ఉండేందుకే మొగ్గు.. హెచ్1బీ వీసాల పొడిగింపు దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నప్పటికీ చాలామంది టెక్కీలు స్వదేశానికి తిరిగివచ్చేందుకు బదులుగా అమెరికాలోనే పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ భారత్‌కు తిరిగివచ్చి అదే సంస్థలో పనిచేయాలన్నా, కొత్త కంపెనీలకు మారాలన్నా ఇబ్బందికరంగా ఉంటుం దని వారు భావిస్తున్నారు. అమెరికాలో దశాబ్ద(2007–17)కాలంలో 34 లక్షల మందికి హెచ్1బీ వీసాలు జారీకాగా, వీటిలో 22 లక్షల వీసాలను భారతీయులే దక్కించుకున్నారు. కఠినంగా ఇమిగ్రేషన్ ‘ఆర్ఎఫ్ఐ (రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్) అప్రూవల్ శాతం చాలా తక్కువగా ఉంది. దీంతో నా లగేజీని ప్యాక్ చేసుకున్నా. దీని కారణంగా నా ప్రాజెక్టుపై తక్కువ సమయం, వీసా పొడిగింపుపై తిరిగేందుకు ఎక్కువ సమయం తిరగాల్సి వస్తోందని క్లయింట్‌కు చెప్పడం చాలా ఇబ్బందికరంగా మారింది. ఆర్ఎఫ్ఐ ప్రక్రియలో భాగంగా 21 చెక్లిస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. అలాగే రాబోయే రెండున్నరేళ్ల కాలానికి సంబంధించి మీ పని ప్రణాళికలను ఇవ్వాల్సి ఉంటుంది’అని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పారు. మరోవైపు ఈ పరిస్థితిపై ఇమిగ్రేషన్ కేసులను వాదించే లాక్వెస్ట్ సంస్థ యజమాని పూర్వీ స్పందిస్తూ.. ‘అమెరికన్లుకు ఉద్యోగాలు దక్కాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వీసా విధానాలను మార్చడంతో ప్రస్తుతం ఇక్కడ ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది’ అని అన్నారు. గ్రీన్‌కార్డుకు పదేళ్లు ఆగాల్సిందే.. 2018లో 30 సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించి 13,177 మంది హెచ్1బీ వీసా పొడిగింపునకు దరఖాస్తు చేసుకోగా, 8,742 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇలా వీసా లు తిరస్కరణకు గురైనవారిలో కాగ్నిజెంట్ సంస్థకు చెందిన 3,548 ఉద్యోగులు, ఇన్ఫోసిస్‌కు చెందిన 2,042 మంది ఉద్యోగులు, టీసీఎస్‌కు చెందిన 1,744 మంది ఉద్యోగులు ఉన్నారు. అమెరికాలో మూడేళ్ల కాలానికి జారీచేసే హెచ్1బీ వీసాను మరో మూడేళ్లకు పొడిగించుకోవచ్చని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ చెప్పింది. హెచ్1బీ వీసా గడువు ముగిసే సమయంలో చాలామంది భారతీయులు అమెరికాలో శాశ్వత నివాసానికి గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకుంటారంది. ప్రస్తుతం గ్రీన్‌కార్డును పొందేందుకు భారతీయ ఐటీ నిపుణులకు సగటున పదేళ్లు పడుతోందని చెప్పింది. -
బ్రిటన్ ‘వీసా’ సరళతరం!
లండన్: బ్రెగ్జిట్ తర్వాత తీవ్రమైన మానవవనరుల కొరతతో సతమతమవుతున్న బ్రిటన్ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలుచేస్తున్న వలస విధానం(ఇమిగ్రేషన్ పాలసీ)లో సవరణలను బ్రిటన్ ప్రభుత్వం పార్లమెంటు ముందు ఉంచింది. ఇందులో భాగంగా వ్యాపార సంస్థలు మరింతమంది విదేశీ నిపుణుల్ని నియమించుకునేందుకు వీలుగా వీసా నిబంధనల్ని సరళతరం చేయాలని ప్రతిపాదించింది. దీనివల్ల భారత్‌కు చెందిన ఐటీ నిపుణులకు గణనీయమైన లబ్ధి కలగనుంది. ప్రస్తుతం వేర్వేరు రంగాల్లో ఉద్యోగుల కొరతపై నెలవారీ సమీక్ష నిర్వహించాల్సిందిగా స్వతంత్ర వలసల సలహా కమిటీని కోరతామని ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. సృజనాత్మకత ఉన్న ఫ్యాషన్ డిజైనర్లకు టాలెంట్ వీసాను జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఐరోపాయేతర దేశాల నుంచి బ్రిటన్‌లో పనిచేయడానికి వచ్చే నర్సులకు ఇస్తున్న టైర్–2 వీసాల గరిష్ట పరిమితిని బ్రిటన్ ఇంతకుముందు ఎత్తివేసిన సంగతి తెలిసిందే. నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) ఆస్పత్రుల్లో వైద్య నిపుణులు, సిబ్బంది కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. -
విదేశీ నిపుణులకు పెరుగుతున్న అవకాశాలు
అమెరికా సర్కారు దేశంలోకి వలసొచ్చే ఐటీ, ఇతర రంగాల నిపుణులను కట్టడిచేసే విధానాల అమలు పొరుగున ఉన్న కెనడాకు ప్రయోజనకరంగా మారింది. కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికాలో పనిచేయడానికి వీలు కల్పించే ప్రత్యేక వీసా కార్యక్రమాలను అధ్యక్షుడు డొనాల్డ్ ప్రభుత్వం సమీక్షిస్తూ వాటి కింద తాత్కాలికంగా వలసొచ్చే విదేశీయుల సంఖ్య తగ్గిస్తోంది. వీసా గడువు దాటిన కార్మికులు, సరైన పత్రాలు లేని పొరుగు దేశాలవారిని బలవంతంగా వెనక్కి పంపడం వంటి చర్యలతో టెక్నాలజీ రంగాలకు చెందిన అనేక మంది విదేశీయులు అమెరికా నుంచి నేరుగా కెనడాలో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ట్రంప్ సర్కారు చర్యల వల్ల తమకు, దేశ ఆదాయానికి ఎనలేని నష్టమని మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, యాపిల్ వంటి టెక్ దిగ్గజాలు గగ్గోలు పెట్టిన ప్రయోజనం ఉండడం లేదు. అయితే, కెనడాలోని టెక్నాలజీ కంపెనీలు అగ్రరాజ్యం తాజా విధానాలను ఆహ్వానిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు విదేశీ నిపుణులను అనుమతించే విషయంలో కరకుగా వ్యవహరించిన కారణంగా కెనడాలో పెద్ద నగరం టోరంటోలోని టెక్నాలజీ కంపెనీలకు ఉద్యోగాలు కోరుతూ వచ్చే దరఖాస్తులు కిందటేడాది బాగా పెరిగాయి. ఏడాదికి పది లక్షల డాలర్లకు మించిన వార్షికాదాయం వచ్చే 55 టెక్కంపెనీలపై జరిపిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అంతర్జాతీయ అప్లికేషన్లు పెరిగాయి! 2016తో పోల్చితే 2017లో తమ కంపెనీల్లో ఉద్యోగాల కోసం వివిధ దేశాల నుంచి అందే అంతర్జాతీయ దరఖాస్తుల సంఖ్య పెరిగిందని ఈ సర్వేలో పాల్గొన్న 53 శాతం కంపెనీలు తెలిపాయి. వీటిలో 45 శాతం కంపెనీలు విదేశీ ఉద్యోగులను పనిలోకి తీసుకున్నామని వెల్లడించాయని టోరంటో నగరంలో టెక్ కంపెనీలకు అవసమైన సౌకర్యాలు కల్పించే మార్స్ డిస్కవరీ డిస్ట్రిక్ట్ అనే సంస్థ జరిపిన ఈ సర్వే వివరించింది. కెనడా కంపెనీల్లో విదేశీ టెక్నిపుణులు పెద్ద సంఖ్యలో వచ్చి చేరడానికి అమెరికా వలస విధానాల్లో మార్పులు ఒక్కటే కారణం కాదు. అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ మంది ఐటీ నిపుణులను ఆకర్షించడానికి త్వరగా వీసాల జారీచేయడం వంటి అనేక సానుకూల అంశాలతో కూడిన కొత్త ‘గ్లోబల్ స్కిల్ స్ట్రాటజీ’ని ఇటీవల కెనడా ప్రభుత్వం ప్రారంభించింది. మంచి నైపుణ్యం, ప్రతిభా పాటవాలున్న కార్మికులను కెనడా రప్పించడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమం కారణంగా ఇండియా, చైనా, బ్రెజిల్, ఇంగ్లండ్, అమెరికా నుంచి ఉద్యోగులను ఆకట్టుకోవడానికి వీలవుతోంది. ఈ కొత్త విధానం వల్ల బాగా చదువుకున్న నిపుణులు కెనడాకు అవసరమైన సంఖ్యలో సునాయాసంగా లభిస్తున్నారు. ఇలా కెనడా టెక్ కంపెనీల్లో చేరుతున్న సిబ్బందిలో నాలుగింట మూడొంతులు ఇంజనీర్లు, డేటా సైంటిస్టులే ఉన్నారు. అమెరికా ఐటీ పరిశ్రమకు కేంద్రస్థానమైన కాలిఫోర్నినియా సిలికాన్ వ్యాలీ నుంచి అయాన్ లోగాన్అనే నిపుణుడు టోరంటోకు చెందిన ఓ టెక్నాలజీ కంపెనీలో ఇంజనీరింగ్ విభాగంలో వైస్ ప్రెసిడెంట్ గా చేరడంతో పాటు తాజా పరిణామాలు కెనడాకు మేలు చేసేలా ఉన్నాయని చెప్పారు. కెనడాతో సంబంధాలున్న దాదాపు పది పదిహేను మంది ఉన్నత స్థాయి టెక్నాలజీ నిపుణులు కూడా కెనడా రావడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. - (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
ఐటీపై హైదరాబాద్ మార్క్
సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత సాఫ్ట్వేర్ దిగ్గజం గూగుల్ తన రెండో అతిపెద్ద ప్రాంగణాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పనున్నట్లు ప్రకటించడంతో ప్రపంచ ఐటీ పటంపై తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో 60 శాఖలు క లిగిన గూగుల్ సంస్థ... అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న కేంద్ర కార్యాలయం తర్వాత (సొంత క్యాంపస్) అంత పెద్ద మరో క్యాంపస్‌ను నెలకొల్పేందుకు హైదరాబాద్‌ను ఎంచుకోవడం అరుదైన అంశమని ఐటీ నిపుణులు అంటున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నందున త్వరలోనే క్యాంపస్ పనులు మొదలు కానున్నాయి. ఈ క్యాంపస్ ఏర్పాటు అనంతరం గూగుల్ ఉత్పత్తులకు సంబంధించిన పైలట్ ప్రాజెక్టులకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు వేదిక లుగా మారనున్నాయి. ప్రజలకు వైవిధ్యమైన సేవలు లభిస్తాయి. గూగుల్ రాకతో మిగతా దిగ్గజ కంపెనీలను కూడా హైదరాబాద్ ఆకర్షించే అవకాశముంది. గూగుల్ స్ట్రీట్ వ్యూతో.. ఆకాశం నుంచి పక్షులకు కనిపించే విధంగా హైదరాబాద్ నగరమంతటినీ అతి సమీపంగా, స్పష్టంగా 360 డిగ్రీల్లో కంప్యూటర్లో వీక్షించే అవకాశం ఉంటుంది. దేశంలో ఇప్పటివరకు చారిత్రక కట్టడాలైన తాజ్‌మహల్, కుతుబ్ మినార్లకు మాత్రమే గూగుల్ స్ట్రీట్వ్యూసదుపాయం ఉంది. హైదరాబాద్‌కు గూగుల్ స్ట్రీట్‌వ్యూ సదుపాయం అందుబాటులోకి వస్తే నావిగేషన్ ఎంతో సులువు అవుతుంది. ట్రాఫిక్ సమస్యల నుంచి నగర వాసులకు కష్టాలు తప్పుతాయి. గూగుల్ స్ట్రీట్‌వ్యూ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతోకాలంగా ఎదురుచూస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ సేవలు మిషన్ భగీరథ (వాటర్‌గ్రిడ్) ప్రాజెక్టుతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మంచినీటిని అందించనున్న ప్రభుత్వం.. ఆ పైప్‌లైన్‌తో పాటు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వేసి ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని నిర్ణయించడం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు గూగుల్ సంస్థ సంపూర్ణ సహకారాన్ని అందిస్తుండడంతో.. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఇంటర్నెట్తో పాటు కేబుల్ టీవీ, మొబైల్ సేవలు చవకగా లభ్యం కానున్నాయి. డిజిటల్ లిటరసీ పెరగడం ద్వారా ప్రతి ఒక్కరికీ విద్యా, ఆరోగ్య రంగాలకు సంబంధించిన సేవలు అతి తక్కువ ధరకు దొరికే అవకాశముంది. గూగుల్ క్యాంపస్.. విశేషాలివీ * హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో గూగుల్ ప్రాంగణం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 7.20 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. * ఇక్కడ గూగుల్ మూడేళ్లలో సుమారు రూ.వెయ్యి కోట్లతో అతిపెద్ద ప్రాంగణాన్ని నిర్మించనుంది. * సుమారు 13 వేల మంది ఉద్యోగులు పనిచేసేలా అధునాతన వసతులతో ప్రాంగణాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించింది. * నాస్కామ్ నివేదిక ప్రకారం... ఒక ఐటీ కంపెనీ రూపాయి పెట్టుబడి పెడితే, దాని ద్వారా పలు రకాలుగా ప్రభుత్వానికి రెండు రూపాయల రెవెన్యూ లభిస్తుంది. ఈ లెక్కన గూగుల్ రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెడితే, రాష్ట్ర ప్రభుత్వానికి రూ. రెండు వేల కోట్లు రెవెన్యూ రానుంది. * ప్రత్యక్షంగా ఒక ఐటీ ఉద్యోగం కల్పనతో పరోక్షంగా ముగ్గురికి ఉపాధి లభిస్తుంది. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్, సెక్యూరిటీ, క్యాంటీన్ అవసరాలకే సుమారు 40 వేల మంది అవసరమవుతారని అంచనా. * ఒక పెద్ద ఐటీ కంపెనీ ఏర్పాటు ద్వారా స్థానికంగా రియల్ ఎస్టేట్, ఎంటర్టైన్మెంట్ వంటి ఇతర రంగాల్లోనూ వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. * భారీ వరదల కారణంగా చెన్నై ఐటీ పరిశ్రమ ఛిన్నాభిన్నం కావడంతో దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ హైదరాబాద్‌పై దృష్టిపెట్టాయి. * ప్రముఖ కంపెనీల కేంద్ర కార్యాలయాలు (సొంత ప్రాంగణాలు) హైదరాబాద్‌కు రావడం ద్వారా రాష్ట్రంలోని ఇతర (టైర్ టూ) నగరాలకూ ఐటీ పరిశ్రమ విస్తరించే అవకాశాలు ఉన్నాయి. పపంచ ఐటీ రాజధానిగా.. హైదరాబాద్ నగరం ప్రపంచ ఐటీ రాజధానిగా అభివృద్ధి చెందడానికి ఇదే సరైన సమయం. చెన్నైలో భారీ వరదల కారణంగా పరిశ్రమ తీవ్రంగా దెబ్బతినడంతో అన్ని కంపెనీలు హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నాయి. ఈ సమయంలో ైెహ దరాబాద్‌కు ఐటీ కంపెనీలను ఆకర్షించేలా రాయితీలు, మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. - సందీప్‌కుమార్ మక్తాల, రాష్ట్ర ఐటీ అసోసియేషన్ అధ్యక్షుడు హైదరాబాద్ గ్లామర్ ఇదీ.. మే నెలలో అమెరికా పర్యటన సందర్భంగా మాతో గూగుల్ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. దానికి కట్టుబడి అమెరికా వెలుపల అతిపెద్ద క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తుండడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతమున్న 6,400 మంది ఉద్యోగుల సంఖ్యను త్వరలోనే రెట్టింపు చేస్తామని గూగుల్ చెప్పింది. హైదరాబాద్ గ్లామర్ ఏమిటో, పొటెన్షియాలిటీ ఏమిటో ప్రపంచానికి అర్థమవుతోంది. ఇప్పటికే ఫేస్బుక్, అమెజాన్, నోవార్టిస్ తదితర మల్టీ నేషనల్ కంపెనీలను హైదరాబాద్ ఆకర్షిస్తోంది. పెట్టుబడులను ఆకర్షించే విధంగా మంచి పాలసీలను తెస్తాం. త్వరలోనే నాలుగు ఐటీ పార్కులను ఏర్పాటు చేయబోతున్నాం. - కె.తారక రామారావు, ఐటీశాఖ మంత్రి -
సత్యం.. శివం.. సుందరం
సత్యం.. శివం.. సుందరం. ఐటీ రంగంలో త్రిమూర్తులు సత్య నాదెళ్ల, శివ నాడార్, సుందర్ పిచాయ్ వెలిగిపోతున్నారు. తెలుగుతేజం సత్య నాదెళ్ల ప్రఖ్యాత మైక్రోసాప్ట్ సీఈఓగా .. తమిళులు శివ నాడర్ దేశీయ సాఫ్ట్వేర్ సంస్థల దిగ్గజం హెచ్‌సీఎల్ చైర్మన్‌గా, సుందర్ పిచాయ్ ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సీఈఓగా.. ఐటీ రంగాన్ని శాసిస్తున్నారు. ఐటీ అంటేనే భారత్ అంటూ ప్రపంచం గుర్తించేలా చేశారు. అంతర్జాతీయ ఐటీ రంగంలో భారత్‌ది ప్రత్యేక స్థానం. సత్య నాదెళ్ల.. మైక్రోసాప్ట్ సీఈఓ పదవి తెలుగువాడికి దక్కింది. సాప్ట్వేర్ దిగ్గజం బిల్‌గేట్స్ వారసుడిగా మైక్రోసాప్ట్ కార్పోరేషన్ కొత్త సీఈఓగా హైదరాబాద్‌కు చెందిన ప్రవాస భారతీయుడు సత్య నాదెళ్ల ఎంపికయ్యారు. గత 38 ఏళ్లలో సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, స్టీవ్ బాల్మేర్ తర్వాత మూడవ సీఈఓగా సత్య నాదెళ్ల బాధ్యతలు చేపట్టారు. ఇటువంటి గొప్ప అవకాశం భారతీయులకు, అందులోనూ తెలుగువాళ్లకు లభించడం గర్వించదగిన విషయం. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న సత్య మంగళూరు యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేశారు. ఆ తరువాత అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్లో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో ఎంబీఏ పూర్తి చేశారు. ఆయన వార్షిక జీతం ప్రసుత్తం 84.3 మిలియన్ డాలర్లు (రూ.525 కోట్లు). శివనాడార్.. 1945లో తమిళనాడులోని తూతుకుడి జిల్లా తిరుచెందూరుకు 10 కిలో మీటర్ల సమీపంలో మూలైపొజి గ్రామంలో శివనాడార్ జన్మించారు. కుంభకోణంలో పాఠశాల విద్య అభ్యసించారు. మధురైలోని ద అమెరికన్ కాలేజీలో ప్రీ యూనివర్సిటీ డిగ్రీ, కోయంబత్తూరులోని పీఎస్జీ కాలేజీ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్ చేశారు. పుణెలో వాల్చంద్ గ్రూపు కూపర్ ఇంజినీరింగ్ కాలేజీలో కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత మిత్రులతో కలసి 1976లో హెచ్సీఎల్ను స్థాపించారు. ఐటీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా నాడార్కు 2008లో పద్మభూషణ్ అవార్డు వరించింది. విద్యారంగంలోనూ నాడార్ విరాళాలు ఇస్తూ ఎంతో కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వ్యక్తిగత సంపద దాదాపు 88 వేల కోట్ల రూపాయలు. సుందర్ పిచాయ్.. అంతర్జాతీయ స్థాయి ఐటీ రంగంలో మరో భారత సంతతి వ్యక్తి అత్యున్నత పదవి అలంకరించారు. తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ (43) ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సీఈవోగా నియమితులయ్యారు. తమిళనాడు రాజధాని చెన్నైలో సుందర్ 1972లో జన్మించారు. ఆయన ఐఐటీ- ఖరగ్‌పూర్ నుంచి ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ సంపాదించారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్, వార్టన్ స్కూల్ ఆఫ్ పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టాను సుందర్ పొందారు. పిచాయ్ 2004 లో గూగుల్ లో చేరి అంచెలంచెలుగా ఎదిగి సీఈఓ స్థాయికి చేరారు. ఆయన వార్షిక జీతం రూ. 310 కోట్లు. -
రియల్ పట్టాలపైకి!
రెండేళ్ల నుంచి చాలా మందిలో ఒకటే సందేహం. హైదరాబాద్‌లో స్థిరాస్తి కొనాలా.. వద్దా? కొంటే ఏమవుతుందనే అందోళన! సొంతింటికి ఇది సరైన సమయం కాదేమోనన్న అనుమానం!! బిల్డర్లు డబ్బుల్లేక గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తారో లేదోననే భయం!!! కానీ, నేడీ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. బెంగళూరు, అహ్మదాబాద్, పుణే నగరాలకు చెందిన పలు నిర్మాణ సంస్థలు నగరంలో పలు ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టాయి. దీంతో నగర బిల్డర్లలోనూ ఉత్సాహం నెలకొంది. మరోవైపు భవిష్యత్తులో రేట్లు పెరిగే అవకాశమున్నందున ఇప్పుడు కొనటమే మంచిదనే నిర్ణయానికి కొనుగోలుదారులూ వస్తున్నారంటున్నారు నిపుణులు. - సాక్షి, హైదరాబాద్ భాగ్యనగరాన్ని విశ్వనగరంగా మార్చే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయటం, పలు పరిశ్రమలూ పెట్టుబడులతో ముందుకు రావటం హైదరాబాద్ భవిష్యత్తుకు ఢోకా ఉండదన్న సంకేతాలు లభించడంతో స్థిరాస్తి రంగంలో సానుకూల వాతావరణం నెలకొంది. పెపైచ్చు గతంలో ప్రారంభించిన నిర్మాణాలు చివరి దశలోకి రావటం, కొన్ని గృహప్రవేశానికి సిద్ధం కావటం, ఇతర నగరాలకు చెందిన నిర్మాణ సంస్థలు సరికొత్త ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టడం మరింత కలిసొస్తున్నాయి. మదుపరులు వెనక్కి.. కొంతకాలంగా బెంగళూరు, ఆంధ్రప్రదేశ్‌లకు వెళ్లిన పెట్టుబడులు ఇప్పుడు యూ టర్న్‌ను తీసుకున్నాయంటున్నారు ట్రాన్కాన్ లైఫ్‌స్పేసెస్ ప్రై.లి. శ్రీధర్ రెడ్డి. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమ వృద్ధి లేదు. ఉద్యోగావకాశాలూ తక్కువే. కొత్త పరిశ్రమలు ఫౌండేషన్లు వేస్తున్నాయి తప్ప.. నిర్మాణ పనుల్ని చేయట్లేదని’’ చెప్పారు. మరోవైపు బెంగళూరులో స్థిరాస్తి ధరలు ఆకాశాన్ని దాటేశాయి. ఇక్కడ 70 శాతం మంది ఐటీ నిపుణులు తెలుగువారే. బెంగళూరులో చ.అ. రూ.8 వేలు, గుంటూరు టౌన్లో చ.అ. 4 వేలుంటే.. నేటికీ ఉప్పల్‌లో 2,400లు, గచ్చిబౌలిలోని కొన్ని ప్రాంతాల్లో రూ.3,400లకూ దొరికే ప్రాజెక్ట్‌లూ ఉన్నాయనే విషయం వారికి తెలుసు. దీంతో అక్కడ వెచ్చించే సొమ్ములో సగంతోనే హైదరాబాద్‌లో ప్రీమియం ఫ్లాట్లనే దక్కించుకుంటున్నారు. ‘గతేడాది ఏప్రిల్‌లో మా ప్రాజెక్ట్‌లో నలుగురు వాకిన్స్ చేస్తే.. ఇప్పుడది 60కి చేరింది అన్నారాయన. ఇది చాలు పెట్టుబడులు నగరానికి తిరిగొస్తున్నాయని చెప్పేందుకు. పెపైచ్చు హైదరాబాద్ భౌగోళికంగానూ సేఫ్, రాజకీయ అస్థిరత సర్దుమణిగింది కూడా. ఇక అభివృద్ధికి బాటలు వేస్తోంది ప్రభుత్వం. ధరలు తక్కువే.. బెంగళూరు, పుణే, చెన్నై వంటి నగరాలతో పోల్చితే.. హైదరాబాద్‌లో ప్రస్తుతం ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. రెండేళ్ల క్రితం కంటే ధరలు తగ్గడంతో ఐటీ నిపుణులు పెట్టుబడి దృష్టితో కాకుండా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఇళ్లను కొంటున్నారు. సిమెంటు, ఉక్కు వంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరిగే అవకాశమున్నందున ఫ్లాట్ల ధరలూ పెరగొచ్చు. కాబట్టి ఇల్లు కొనుక్కోవడానికి ఇదే మంచి సమయం. ఐటీ, ఐటీఈఎస్ బెంగళూరు, పుణే వంటి ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసినా.. హైదరాబాద్ ఇళ్లకు మంచి అద్దె లభిస్తుందనే ధీమా వీరిలో నెలకొంది. అయితే కొత్త వాటిలో కాకుండా ఏడాదిలోపు పూర్తయ్యే వాటికి ప్రాధాన్యమిస్తున్నారు. రెండేళ్ల క్రితం నిర్మాణంలో ఉన్న ఫ్లాటును కొనాలంటే సందేహించాల్సిన పరిస్థితి. అప్పుడే ఆరంభమైన వాటిలో కొనడానికి ధైర్యం చాలట్లేదంటున్నారు కస్టమర్లు. ఇతర నగరాల ప్రాజెక్ట్‌లు.. మార్కెట్‌తో సంబంధం లేకుండా ఉప్పల్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో చేపట్టే నిర్మాణాలకు గిరాకీ ఎప్పుడూ ఉంటుంది. ప్రెస్టిజ్ గ్రూప్ కొండాపూర్‌లో 4.96 ఎకరాల్లో 349 ఫ్లాట్లను, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 21.85 ఎకరాల్లో 2,240 ఫ్లాట్లు గల పలు ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టింది. పూర్వాంకర గ్రూప్ కొండాపూర్‌లో పూర్వ సమ్మిట్ పేరుతో గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ ప్రాజెక్ట్‌నూ నిర్మించనుంది. గనార్సింగిలో ఆక్యురేట్ డెవలపర్స్ 6.5 ఎకరాల్లో 722 ఫ్లాట్ల ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. పసిఫికా సంస్థ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో హిల్‌క్రెస్ట్ ప్రాజెక్ట్‌ను ఆరంభించడానికి సన్నాహాలు చేస్తోంది.