
సాక్షి, విశాఖపట్నం: జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు కీలక వేదికగా నిలిచిన విశాఖ మరో ముఖ్యమైన సదస్సుకు ముస్తాబవుతోంది. కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్‌కు సంబంధించిన విప్లవాత్మక మార్పులపై ఫిబ్రవరి 10న ఏఐ క్లౌడ్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి.
ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డీప్‌టెక్ సమ్మిట్స్ ఆధ్వర్యంలో వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ థియేటర్‌లో సదస్సు జరుగనుంది. పలు అంతర్జాతీయ సంస్థలకు చెందిన చీఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్లు, ఐటీ నిపుణులు, ప్రొఫెసర్లు, స్టార్టప్ సంస్థల ప్రతినిధులు, ఇంక్యుబేటర్స్, కృత్రిమ మేధ, క్లౌడ్ టెండర్ నిపుణులు పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment