తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర సంస్థ ఏర్పాటుకు ఆమోదం | Approval For Setting Up Central Organization In Telugu States | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర సంస్థ ఏర్పాటుకు ఆమోదం

Published Wed, Feb 14 2024 2:54 PM | Last Updated on Wed, Feb 14 2024 2:55 PM

Approval For Setting Up Central Organization In Telugu States - Sakshi

కేంద్రం పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. అందుకు అనువుగా కేంద్రం తాజాగా సికింద్రాబాద్, తిరుపతి నగరాల్లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(నీలిట్‌) కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆమోదించింది. 

ఈ సెంటర్లను తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీకి, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు చెప్పారు. ఈ కేంద్రాల్లో రానున్న రోజుల్లో ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్‌  కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఐఈసీటీ)కు సంబంధించిన వివిధ రకాల కోర్సులపై అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇవ్వనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఈ రెండు కేంద్రాలు నీలిట్‌-చెన్నై ఆధ్వర్యంలో పనిచేయనున్నట్లు తెలిసింది. 

ఇదీ చదవండి: రూ.కోటి ప్యాకేజీతో ఉద్యోగం!

ఈ సంస్థల్లో శిక్షణ తీసుకున్న అభ్యర్థులతో టెక్నాలజీ కంపెనీలకు మానవ వనరుల కొరత తీరనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. రాబోయే 3 ఏళ్లలో ఒక్కో కేంద్రం ద్వారా కనీసం 5,000 మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement