తెలుగు భాషకు దక్కిన మరో గౌరవం | telugu language bags another credit through siliconandhra | Sakshi
Sakshi News home page

తెలుగు భాషకు దక్కిన మరో గౌరవం

Published Sun, Jul 3 2016 6:52 PM | Last Updated on Sun, Sep 2 2018 4:12 PM

తెలుగు భాషకు దక్కిన మరో గౌరవం - Sakshi

తెలుగు భాషకు దక్కిన మరో గౌరవం

సాన్ జోస్(యూఎస్):
కాలిఫోర్నియాలోలోని ఫ్రీమాంట్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్లో జరిగిన స్కూల్ బోర్డ్ సర్వసభ్య సమావేశంలో సిలికానాంధ్ర మనబడి నిర్వహించే తెలుగు 3, తెలుగు 4 తరగతులకు ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్ గుర్తింపును మంజూరు చేశారు. 2014లో సిలికానాంధ్ర మనబడి నిర్వహించిన తెలుగు1, తెలుగు2 కోర్సులకు  ఫారిన్  లాంగ్వేజ్ క్రెడిట్ గుర్తింపు లభించిన విషయం తెలిసిందే.

ఈ గుర్తింపు ద్వారా, 4 సంవత్సరాల ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్ నిర్ధేశించే.. ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వ విద్యాలయాల్లో చేరడానికి  మనబడి విద్యార్ధులు అర్హత సాధిస్తారు. ఈ అవకాశాన్ని ఫ్రీమాంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ పరిధిలోని తెలుగు విద్యార్ధులందరూ ఉపయోగించుకుని తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు నేర్చుకోవడమే కాకుండా ఉన్నత విద్యకు అవసరమైన ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్స్ కూడా సాధించవచ్చని మనబడి డీన్ రాజు చమర్తి తెలిపారు.    
    
2016-17 విద్యా సంవత్సరానికి, తరగతులు మిషన్ సానొసే హై స్కూల్లో సెప్టంబర్ 10 నుంచి ప్రారంభం అవుతాయని పాఠ్య ప్రణాళికా విభాగం ఉపాధ్యక్షులు శాంతి కూచిభొట్ల తెలిపారు. ఈ కోర్సులో చేరదలుచుకున్న విద్యార్ధులు, మనబడి.సిలికానాంధ్ర.ఓఆర్జీ(manabadi.siliconandhra.org) ద్వారా నమోదు  చేసుకోవాలని శాంతి కూచిభొట్ల సూచించారు. ఈ స్కూల్ బోర్డ్ ద్వారా పూర్తి స్థాయి ఫారిన్ లాంగ్వేజ్ గుర్తింపు సాధించడంలో సంచాలకులు శ్రీదేవి గంటి విశేష కృషి చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో దీనబాబు కొండుభట్ల, శరత్ వేట, భాస్కర్ రాయవరం, డాంజి తోటపల్లి, వెంకట్ కొండ, ఫణి మాధవ్ కస్తూరి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement