Manabadi
-
నెం. 1 స్థానంలో ఏపీ
-
తరగతి మారిపోయింది
ఇప్పుడు ఆ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు కూడా అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశ ముగిసిన వెంటనే ప్రభుత్వం గతేడాది జూలైలో నాడు–నేడు రెండో దశ పనులను రూ.8 వేల కోట్ల వ్యయంతో చేపట్టింది. 22,217 పాఠశాలలను రెండో దశలో ఎంపిక చేసి, నిర్మాణ పనులు ప్రారంభించింది. ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో 2023 మార్చిలో ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలో అత్యధిక మార్కులు సాధించి, మొదటి స్థానాల్లో నిలిచిన 22,768 మంది పిల్లలకు అవార్డులు అందించింది. – సాక్షి, అమరావతి నాడు పెచ్చులూడిన స్లాబులు 4 నెర్రలు బారిన గోడలు విరిగిపోయిన బెంచీలు 4 కటిక నేలపై చదువులు వస్తారో రారో తెలియని అయ్యవార్లు మచ్చుకైనా కనిపించని వాష్ రూమ్‌లు కొన్ని చోట్ల పశువులకు నెలవు ఎక్కడో ఒక చోట మాత్రమే టీవీలు సబ్జెక్ట్ టీచర్లు కరువు విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదనేలా ప్రభుత్వ తీరు నేడు కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా నూతన భవనాలు చిన్నారులను ఆకట్టుకునేలా పెయింటింగ్స్ సైన్స్ ల్యాబ్‌లు సరికొత్తగా డెస్‌్కలు, కుర్చీలు, ఇతర పరికరాలు రన్నింగ్ వాటర్‌తో టాయ్లెట్లు ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అదనపు తరగతి గదులు, వంటషేడ్లు పరిశుభ్రమైన మంచి నీరు ప్రతి పాఠశాలకూ రక్షణ గోడ ప్రతి తరగతి గది డిజిటలైజేషన్ మొత్తంగా 12 రకాల సదుపాయాలు ఇంగ్లిష్ మీడియం, బైజూస్ పాఠాలు 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ కౌమార దశలోని బాలికలకు స్వేచ్ఛ శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’ పథకం మొదటి దశలో రూ.3,700 కోట్లతో 15,715 స్కూళ్లను అభివృద్ధి చేసింది. -
ఏపీలో ప్రభుత్వ బడికి సరికొత్త శోభ
-
బాబుకు స్క్రిప్టు కోసమే! మనబడి నాడు–నేడుపై ‘ఈనాడు’ కబోది కథనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లు బాగు పడుతుంటే ఆనందించాల్సింది పోయి.. అదెక్కడ టీడీపీ కొంప ముంచుతుందోనని ‘ఈనాడు’ పనిగట్టుకుని తప్పుడు రాతలు రాస్తోంది. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను సకల వసతులతో తీర్చిదిద్దుతుండటం కళ్లెదుటే కనిపిస్తున్నా, లేదు లేదంటూ ప్రజల్లో విష బీజాలు నింపడానికి విఫలయత్నం చేస్తోంది. నాడు–నేడు రెండో దశ కింద ఏకంగా 22,344 స్కూళ్లలో పనులు జరుగుతుంటే.. అక్కడెక్కడో పనులు ఆగిపోయాయని యాగీ చేస్తోంది. చంద్రబాబు హయాంలో కనీసం చాక్‌పీస్‌లకు కూడా గతిలేని వైనాన్ని మరచిపోయి.. ఇప్పుడు తగుదునమ్మా అంటూ కోడి గుడ్డుపై ఈకలు పీకుతోంది. వేల కోట్ల రూపాయలతో ఊరూరా ప్రభుత్వ స్కూళ్లలో పనులు జరుగుతుండటం ప్రత్యక్షంగా కనిపిస్తున్నా కూడా దిగజారుడు రాతలు రాస్తోంది. ప్రజలేమనుకుంటారోనన్న భయం లేకుండా తన చంద్రబాబుకు లబ్ధి చేకూర్చాలని ఉవ్విళ్లూరుతూ రోజుకో రీతిలో తప్పుడు కథనం ద్వారా ప్రభుత్వంపై బురద చల్లుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగం అనూహ్య రీతిలో అద్భుత ఫలితాలిస్తోందని వేనోళ్లా ప్రశంసలు వ్యక్తమవుతుండటాన్ని జీర్ణించుకోలేని రామోజీ రావు ఏదో ఒక రీతిలో ప్రభుత్వ ప్రతిష్టను మసకబారేలా చేయడమే పనిగా పెట్టుకుని ముందుకు వెళుతుండటం స్పష్టంగా కనిపిస్తోంది. ‘నాడు–నేడుకు నిధుల్లేవ్’ అంటూ తాజాగా తన అక్కసు వెళ్లగక్కింది. ఒక్క అధికారితో మాట్లాడకుండా, విద్యా శాఖ నుంచి వివరాలు తీసుకోకుండా తనకు తోచిన లెక్కలతో బాబుకు స్క్రిప్టు అందిస్తోంది. ఆరోపణ: నాడు–నేడుకు నిధులు లేవు వాస్తవం: ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలుగా తీర్చిదిద్దేలా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. పేదల బతుకులు మార్చే ఏకైక సాధనం విద్య మాత్రమే అని బలంగా విశ్వసించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు సమూలంగా మార్చే నాడు–నేడు కార్యక్రమంతో పాటు, మరెన్నో సంస్కరణలు, గొప్ప గొప్ప మార్పులు తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్ అవతరించాక ప్రభుత్వ విద్యా రంగంపై ఇంతటి వ్యయం కాని, దృష్టి కాని ఎన్నడూ.. ఎవ్వరూ పెట్టలేదు. మన బడి నాడు – నేడు మొదటి దశలో రూ.3,669 కోట్లతో 15,713 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టి, 2021–22లో పూర్తి చేశారు. 2021–22లో 22,344 విద్యా సంస్థల్లో రూ.8,000 కోట్లతో రెండవ దశ పనులు చేపట్టారు. విద్యా రంగం నాడు–నేడు ఇదీ పరిస్థితి ► గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–2019 మధ్య ఐదేళ్లపాటు పాఠశాలల్లో అభివృద్ధి కోసం రూ.1,709.64 కోట్లు మాత్రమే కేటాయించారు. అవీ పూర్తిగా ఖర్చు చేయలేదు. ఉదాహరణకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2014–2019 వరకు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరచడానికి ఐదేళ్ల కాలంలో నాటి ప్రభుత్వం రూ.76.85 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. ఈ ప్రభుత్వం వచ్చాక నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా ఫేజ్–1, ఫేజ్–2లో చిత్తూరు జిల్లాకు ఏకంగా రూ.1,133.09 కోట్లు కేటాయించింది. ఫేజ్ –1 కింద ఇప్పటికే పనులు పూర్తయ్యాయి. ► రూ.668 కోట్లతో ట్యాబులను, రూ.778 కోట్ల విలువగల బైజూస్ కంటెంట్‌తో ఎనిమిదో తరగతి చదివే 4,59,564 మంది విద్యార్థులకు, 59,176 మంది ఉపాధ్యాయులకు ఈ విద్యా సంవత్సరం పంపిణీ చేశారు. ► 5,800 పాఠశాలలకు 6వ తరగతిపైన ఉన్న 30,302 తరగతి గదులకు డిజిటల్ బోర్డు (ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్) 2023 జూన్ నాటికే అందించేలా సన్నాహాలు చేపట్టారు. దిగువ తరగతులు ఉన్న స్కూళ్లకు అంటే, ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలలో 10 వేల స్మార్ట్ టీవీలను అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ► పిల్లల చదువుకు తల్లిదండ్రుల పేదరికం అడ్డు రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘జగనన్న అమ్మఒడి’ అనే వినూత్న పథకాన్ని అమలు చేస్తోంది. ఈపథకం కింద అర్హులైన తల్లులు, సంరక్షకులకు ఏటా రూ.15 వేల చొప్పున అందిస్తోంది. 2019–20లో 42,33,098 మంది, 2020–21లో 44,48,865, 2021–22లో 43,96,402 మంది తల్లులకు సాయం అందించారు. ► రాష్ట్రంలోని లోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యా బోధనను ప్రవేశ పెట్టారు. 1 నుంచి 6 తరగతుల వరకు పాఠ్య పుస్తకాలను ఆంగ్లం, తెలుగు మాధ్యమంలో, ద్విభాషా విధానంలో రూపొందించారు. 1 నుంచి 5 తరగతుల వరకు పాఠ్య పుస్తకాలతో పాటు వర్క్ బుక్ లను ప్రవేశపెట్టారు. ► ఆంగ్ల భాషలో నైపుణ్యం పెంచడం కోసం ప్రాథమిక స్థాయిలో 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు చిత్రాలతో కూడిన డిక్షనరీ ఇస్తున్నారు. 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇస్తున్నారు. విద్యార్థులకు మిర్రర్ ఇమేజ్‌లో ద్విభాషా పాఠ్య పుస్తకాలను అందిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఇంతకుముందు 3, 4, 5 తరగతులకు ఇంటర్మీడియట్, డీఎడ్ మాత్రమే విద్యార్హతలుగా ఉన్న ఉపాధ్యాయులు బోధించేవారు. ఇప్పుడు, ఈ తరగతులకు బీఎస్సీ, బీఈడీ అర్హతలున్న ఉపాధ్యాయులతో బోధన చేయిస్తున్నారు. ప్రభుత్వం 10,114 మంది సబ్జెక్ట్ టీచర్లను ఏర్పాటు చేసింది. ► జగనన్న విద్యా కానుక కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు రు.2323.99 కోట్లు ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థికి స్కూలు ప్రారంభం రోజు 3 జతల బట్టలు, షూస్, బెల్ట్, స్కూల్ బ్యాగ్, డిక్షనరీ, టెక్స్ బుక్స్, తదితరాలను ఇస్తోంది. 2016–17లో ప్రభుత్వ బడులలో 37,57,474 విద్యార్థులు ఉండగా, ఈ కార్యక్రమాలన్నింటి వల్ల విద్యార్థుల సంఖ్య బాగా పెరుగుతోంది. ఆరోపణ: రంగులు వెలుస్తున్నాయి వాస్తవం: పనులే జరగలేదని చెబుతున్న ఈనాడు రంగులు వెలిసిపోతున్నాయని చెప్పడం విడ్డూరం. ప్రభుత్వ పాఠశాలల్లో రన్నింగ్ వాటర్‌తో టాయిలెట్లు, తాగునీటి సరఫరా, చిన్న, పెద్ద మరమ్మతులు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లతో విద్యుదీకరణ, ప్రహరీ, ఫర్నీచర్, క్యాంపస్ మొత్తానికి పెయింటింగ్, గ్రీన్ బోర్డు, ఇంగ్లిష్ ల్యాబ్ (స్మార్ట్ టీవీలు), కిచెన్ షెడ్లు, అదనపు తరగతి గదులు, డిజిటల్ తరగతులు (ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, స్మార్ట్ టీవీలు) ఇలా 12 రకాల సదుపాయాలను కల్పిస్తోంది. వేలాది స్కూళ్లలో ఇంతగా మేలు చేస్తుండటం రామోజీరావుకు కనిపించడం లేదు కాబోలు. రంగులు ఎక్కడ వెలిసిపోయాయో చెప్పకుండా, చూపకుండా ఆవు కథ రాశారు. ఆరోపణ : రూ.1,000 కోట్ల చెల్లింపులు ఆగిపోయాయి వాస్తవం: మన బడి నాడు – నేడు రెండవ దశ కింద రూ.8,000 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు రూ.3,750 కోట్లు విడుదల చేశారు. దశల వారీగా నిధులు విడుదలవుతాయనే కనీస పరిజ్ఞానం లేని వారెవరూ ఉండరు. ఈనాడు చెబుతున్న రూ. వెయ్యి కోట్ల చెల్లింపులు గత నెలవి అయ్యుంటాయి. అవి ఈ నెలలోనో.. వచ్చే నెలలోనో విడుదలవుతాయి. రూ.8 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నప్పుడు రూ.వెయ్యి కోట్లు పెండింగ్‌లో ఉంటే.. మొత్తం నాడు–నేడు కార్యక్రమమే ఆగిపోయినట్లు తప్పుడు రాతలు రాయడం చంద్రబాబు కోసమే కదా! ఆ తప్పుల తడక చిట్టా పట్టుకుని చంద్రబాబు ఊదరగొట్టాలనేగా! ఈ లెక్కన బిల్లులు రావని కాంట్రాక్టర్లలో భయం పెంచి, ఎలాగైనా సరే ఆ పనులు ఆపేయించాలన్నది రామోజీ పన్నాగం అని స్పష్టమవుతోంది. ఇది నిజం కాకపోతే రూ.3,750 కోట్లు చెల్లించారనే వాస్తవాన్ని ఎందుకు రాయలేదు రామోజీ? ఆరోపణ : విద్యార్థుల అవస్థలు వాస్తవం: పెద్ద ఎత్తున్న పనులు జరుగుతున్నప్పుడు అక్కడక్కడ చిన్న పాటి అసౌకర్యాలు సహజం. దాన్ని కూడా భూతద్దంలో చూపడం దారుణం. ఈనాడు చెబుతున్నట్లు రాష్ట్రంలోని పాఠశాలలన్నింటిలోనూ పిల్లలు ఇబ్బంది పడటం లేదు. చంద్రబాబునాయుడి ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ పాఠశాలలను గాలికి వదిలేసినా, తూతూమంత్రంగా నిధులు విదిలించినా ఒక్క మాటా రాయని ఈనాడు నేడు వేల కోట్లతో అన్ని విద్యా సంస్థలనూ సర్వాంగ సుందరంగా మారుస్తున్న ప్రభుత్వంపై దుష్ప్రచారం సాగిస్తోంది. -
మన బడి నాడు-నేడుతో పాఠశాలల్లో ఆధునిక వసతులు
-
అటెండెన్స్ యాప్‌తో డుమ్మాలకు చెక్.. గంటలోనే సమాచారం
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. మనబడి నాడు–నేడుతో ఎన్నో బడుల రూపురేఖలు మారిపోయాయి. మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు తెచ్చారు. రోజుకో మెనూతో పౌష్టికాహారం అందిస్తున్నారు. విద్యాకానుక అందజేస్తున్నారు. బోధనపై ప్రత్యేక దృష్టి సారించారు. తాజాగా విద్యార్థుల హాజరును పర్యవేక్షించేందుకు స్కూల్ అటెండెన్స్ యాప్‌ను తెచ్చారు. దీంతో పిల్లలు సరైన సమయానికి పాఠశాలలకు వెళ్లి చదువుకునే అవకాశం ఉండడంతో వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు(టౌన్): పాఠశాలల్లో విద్యార్థుల హాజరును ఉపాధ్యాయులు రిజిస్టర్లో నమోదు చేస్తుంటారు. కొంతమంది పిల్లలు బడికి వెళ్లకుండా క్లాసులకు డుమ్మా కొట్టేవారు. దీంతో వారు చదువులో వెనుకంజలో ఉండేవారు. ఈ విషయంలో విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా అంతంతమాత్రంగానే ఉండేది. విద్యార్థుల హాజరు పక్కాగా ఉండాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ అటెండెన్స్ యాప్‌ను కొంతకాలం క్రితం ప్రారంభించింది. సెప్టెంబర్ నెల ప్రారంభం నుంచి విద్యార్థుల హాజరును మాన్యువల్ పద్ధతితోపాటు ఆన్లైన్ ద్వారా కూడా నమోదు చేస్తున్నారు. యాప్‌లో రోజూ ఉదయం 10 గంటల్లోపే వివరాలు నమోదు చేస్తున్నారు. వీరు భోజనం కూడా చేస్తారా లేదా అనే విషయాన్ని మరో విండోలో ఉంచుతారు. ఈ ప్రక్రియను ప్రధానోపాధ్యాయుడు పరిశీలించి హెచ్ఎం లాగిన్ ద్వారా ఆన్లైన్ చేయనున్నారు. ఏమి చేస్తారంటే.. రోజూ అటెండెన్స్ యాప్‌లో విద్యార్థుల హాజరు నమోదు చేస్తారు. విద్యార్థి గైర్హాజరైన సమాచారాన్ని హెచ్ఎం లాగిన్‌లో అప్లోడ్ చేయడం ద్వారా ఈ విషయం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌కు వెళ్తుంది. అనంతరం హాజరు కాని విద్యార్థుల సమాచారం తల్లిదండ్రుల సెల్‌ఫోన్‌కు మెసేజ్ రూపంలో వెళ్తుంది. ఆ పాఠశాల ఉపాధ్యాయులతోపాటు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు సైతం గైర్హాజరైన విద్యార్థి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడతారు. అలాగే విద్యార్థి వరుసగా మూడు రోజులు గైర్హాజరైతే సంబంధిత సచివాలయ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్, వలంటీర్‌కు సమాచారం పంపుతారు. దీంతో వారు స్వయంగా విద్యార్థి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలకు ఎందుకు గైర్హాజరయ్యారన్న కారణం తెలుసుకుంటారు. రోజూ బడికి హాజరయ్యేలా చర్యలు తీసుకుంటారు. దీంతో పిల్లలు చదువుపై దృష్టి సారిస్తారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. రాణించాలంటే.. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు పిల్లలను బడిలో చేర్పించి పని ఉన్న సమయంలో తమ వెంట తీసుకెళ్తుంటారు. దీని వల్ల వాళ్లకి చాలా పాఠాలపై అవగాహన ఉండదు. ఈ పరిస్థితిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యా సంవత్సరంలో 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి అందుతుందని నిబంధన విధించింది. ఈ విధంగానైనా తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపిస్తారని భావించింది. కాగా విద్యార్థి బడికి వచ్చే బాధ్యతను తల్లిదండ్రులకే వదిలేయకుండా ప్రభుత్వం అటెండెన్స్ యాప్‌ను తెచ్చింది. దీంతోపాటు రోజూ క్రమం తప్పకుండా స్కూల్‌కి వస్తేనే చదువు మెరుగుపడుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది పేద విద్యార్థులు చదువుతున్న పరిస్థితి ఉంది. వీరు ఉన్నత విద్యలో రాణించాలంటే బేసిక్ లెవల్ గట్టిగా ఉండాలని ప్రభుత్వం భావించింది. పిల్లలు సక్రమంగా బడికి వచ్చే బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడంతో తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్ చేయండి: నాడు-నేడు తొలివిడత స్కూళ్లకు ఈ–కంటెంట్) బడికి రావాలన్నదే లక్ష్యం ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా బడికి వచ్చి చదువులో రాణించాలన్నదే ప్రభుత్వం లక్ష్యం. ఇప్పటికే కార్పొరేట్ పాఠశాలలకు మించి ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు ఏర్పాటు చేశారు. పిల్లలపై పర్యవేక్షణకు కొత్తగా అటెండెన్స్ యాప్‌ను అమల్లోకి తెచ్చారు. ఆయా తరగతి టీచర్ హాజరును యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థులు కూడా బడికి రెగ్యులర్‌గా వస్తారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం హాజరు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – పి.రమేష్, నెల్లూరు డీఈఓ -
నాడు-నేడుతో విద్యారంగంలో అనేక సంస్కరణలు: సీఎం జగన్ (ఫొటోలు)
-
మనబడి నాడు–నేడు.. నాణ్యతకు పెద్దపీట
సాక్షి, అమరావతి: మనబడి నాడు–నేడు పనుల్లో నాణ్యతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ స్కూళ్లలో చేపడుతున్న మౌలిక వసతులు, అదనపు తరగతి గదుల నిర్మాణాలు కనీసం 80ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండేలా నాణ్యతకు పెద్దపీట వేస్తోంది. అంతేకాక.. వాటి నిర్వహణకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగా.. ఇప్పటికే స్కూళ్లు, టాయిలెట్ల నిర్వహణకు నిధులను అందుబాటులో ఉంచింది. అలాగే, పాఠశాలల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఓ ఐఏఎస్ అధికారిని సైతం ఇటీవలే నియమించింది. క్షేత్రస్థాయిలో పనుల నాణ్యత తనిఖీ ఇక గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏకంగా రూ.16,450 కోట్ల అంచనాలతో పనులను చేపడుతోంది. ఇప్పటికే మనబడి నాడు–నేడు తొలిదశలో 15,715 స్కూళ్లలో మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు వాటి రూపురేఖలను విజయవంతంగా మార్చింది. ఇప్పుడు రెండో దశలో ఏకంగా రూ.8వేల కోట్ల వ్యయంతో 22,344 స్కూళ్లలో మౌలిక సదుపాయాలు, అదనపు గదుల నిర్మాణాలను చేపట్టింది. వీటిని అత్యంత నాణ్యతతో చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడొద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. నాడు–నేడు కింద సమకూరుతున్న విద్యా సంస్థల ఆస్తులు కనీసం 80 ఏళ్ల పాటు మన్నికతో ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఇందులో భాగంగా ప్రతీ దశ పనుల్లోనూ క్షేత్రస్థాయిలో నాణ్యతను తనిఖీ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇందుకోసం.. పనులు అమలుచేస్తున్న ఏజెన్సీలు, తనిఖీలు చేసే ఇంజనీర్లకు స్పష్టమైన మార్గదర్శకాలను కూడా జారీచేసింది. మార్గదర్శకాలు ఇవే.. ⇒ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఎమినిటీస్ కార్యదర్శి తమ పరిధిలోని నూటికి నూరు శాతం స్కూళ్లలో నాడు–నేడు పనులను రోజు విడిచి రోజు తనిఖీ చేయాలి. ⇒మండల ఇంజనీర్ అన్ని స్కూళ్ల పనులను కనీసం 15 రోజులకోసారి సందర్శించి పనులను పరిశీలించాలి. ⇒డిప్యూటీ ఈఈ నెలలో కనీసం 30 స్కూళ్లను సందర్శించాలి. ⇒ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నెలలో 10 స్కూళ్లలో నాడు–నేడు పనుల నాణ్యతను తనిఖీచేయాలి. ⇒ఇక క్వాలిటీ కంట్రోల్ బృందాలు నెలలో 20 స్కూళ్లకు వెళ్లాలి. ⇒ఎస్ఈ, సీఈ నెలలో కనీసం ఐదు స్కూళ్లను పరిశీలించాలి. ⇒ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ రెండు శాతం పనులను, థర్డ్ పార్టీ రెండు శాతం పనులను తనిఖీలు చేయాలి. ⇒తనిఖీలు చేసే ఇంజనీర్లందరికీ మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులో ఉంచుతారు. ⇒తనిఖీల నివేదికలను ఈ అప్లికేషన్ ద్వారా సంబంధిత శాఖలకు పంపాలి. ⇒తనిఖీల సమయంలో తమ దృష్టికి వచ్చిన అంశాలను సంబంధిత క్షేత్రస్థాయి అధికారులకు, ఏజెన్సీలకు తెలియజేయాలి. చదవండి: మునుపెన్నడూ ఇటు చూడని పారిశ్రామిక దిగ్గజాలు.. ఇప్పుడు ఏపీకీ వస్తున్నారు -
నాడు నేడు పనుల నాణ్యతలో రాజీ పడొద్దు
సాక్షి, అమరావతి: మన బడి నాడు– నేడు రెండో దశ పనులు వేగవంతం చేయాలని, నాణ్యతలో రాజీ పడొద్దని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన మన బడి నాడు–నేడు పనుల తీరుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన బడి నాడు – నేడు రెండో దశ పనుల కింద 22,344 పాఠశాలలకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా, 20,757 స్కూళ్ల వివరాలను స్కూల్ ట్రాన్సఫర్మేషన్ మానిటరింగ్ సిస్టం (ఎస్టీఎంఎస్) వెబ్సైట్లో ఉంచామన్నారు. పది రోజుల్లో 100 శాతం పాఠశాలల్లో పనులు ప్రారంభించాలని చెప్పారు. ఇందుకు కావాల్సిన అనుమతులను కలెక్టర్లు వెంటనే మంజూరు చేయాలని ఆదేశించారు. 10,891 పాఠశాలలకు రూ.554 కోట్లు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చామని, మిగిలిన వాటికీ నిధులివ్వడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం మంచి చేయాలనే ఆలోచనతోనే పాఠశాలల విలీనంపై నిర్ణయం తీసుకుందన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా సందేహాలు, సమస్యలు తలెత్తితే స్థానిక అధికారులు స్పందించి సత్యాసత్యాలు తెలుసుకొని, సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్లు, ఆర్డీవోలకు చెప్పారు. ఈ విషయంలో భేషజాలకు పోవద్దన్నారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు (ఇన్చార్జి) ఎస్.సురేష్ కుమార్, పాఠశాల విద్యా సలహాదారు ఎ.మురళి, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ సీఎన్ దీవెన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
38 విద్యాలయాలు భేష్..!
విజయనగరం: పరిశుభ్రత, పారిశుద్ధ్యం నిర్వహణలో శ్రేష్టతను గుర్తించి, ప్రేరేపించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ పథకానికి జిల్లా నుంచి 38 పాఠశాలలు ఎంపికయ్యాయి. పారిశుద్ధ్యం, తాగునీరు, సబ్బుతో చేతులు కడుక్కోవడం, ప్రవర్తన మార్పు, సామర్థ్య పెంపు, కోవిడ్ సంసిద్ధత కేటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పాఠశాలలను గుర్తించి అవార్డులు అందజేశారు. పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించగా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు సురేష్ బాబు, ఇందుకూరు రఘు రాజు, పాకలపాటి రఘువర్మ ముఖ్య అతిథులుగా హాజరై అవార్డులను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలకు అందజేశారు. అవార్డులతో మరితం ప్రేరణ ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇలాంటి అవార్డులు ఉపాధ్యాయుల్లో మరింత ప్రేరణ కలిగించి మరిన్ని ఉత్తమ ఫలితాల సాధన దిశగా స్ఫూర్తిని నింపుతాయని అభిప్రాయ పడ్డారు. ప్రతి ఒక్కరూ శ్రమించి స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలను అందుకున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, నాడు–నేడు తో పాఠశాలల రూపురేఖలే మారిపోయాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల మధ్య ఈ రోజు పోటీ వాతావరణం నెలకొందని, విద్యారంగంలో సంభవిస్తున్న మంచి పరిణామానికి ఇది నిదర్శనమన్నారు. సమాజ అవసరాలకు తగ్గట్టుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి దూరదృష్టి వల్లే విద్యారంగంలో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయన్నారు. విద్యావ్యవస్థలో మంచి సంస్కరణలు నాడు–నేడు ద్వారా జరిగిన పనుల వల్ల పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొందని, తద్వారా విద్యార్థులు మంచిగా చదువుకుంటున్నారని ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ అన్నారు. ముఖ్యమంత్రి మంచి విజన్‌తో ముందుకెళ్తూ విద్యా వ్యవస్థలో మంచి సంస్కరణలు తీసుకువచ్చారని ప్రశంసించారు. ఆయన స్ఫూర్తితో ఎస్.కోట నియోజవర్గ పరిధిలో ఒక పాఠశాలను దత్తత తీసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ప్రకటించారు. అనంతరం పురస్కారాలకు ఎంపికైన పాఠశాలల పరిధిలో ఎలాంటి విధానాలు అమలు చేశారు. అవార్డులకు ఎంపిక కావడానికి తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనుల గురించి అవార్డు గ్రహీతలైన ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు వారి అభిప్రాయాలను వివరించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, డైట్ ప్రిన్సిపాల్ ఎన్.టి. నాయుడు, సమగ్ర శిక్షా సీఎంవో శ్రీనివాసరావు, వివిధ మండలాల ఎంఈవోలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సమగ్ర శిక్ష, పాఠశాల విద్యాశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (చదవండి: అమ్మవారి హుండీల్లో ఫారిన్ కరెన్సీ) -
కలలో కూడా ఊహించని మహర్దశ
మానవ మనుగడలో సామాజిక, ఆర్థికాభివృద్ధిలో విద్య ప్రధాన భూమిక పోషిస్తుంది. ఈ కారణంగానే 2002వ సంవత్సరంలో ఆరు సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకు 86 రాజ్యాంగ సవరణ ద్వారా నిర్బంధ విద్యను అమలు పరచాలని కేంద్రం చట్టం చేసింది. అత్యంత ప్రాధాన్యత కలిగిన విద్యా వ్యవస్థ గత మాడు దశాబ్దాల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో అస్తవ్యస్తం అయ్యింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్ విద్యా సంస్థలు ఆంగ్ల విద్యతో పట్టణాలతో పాటూ గ్రామీణ ప్రాంతాలకూ వ్యాపించాయి. మారిన పరిణామాల దృష్ట్యా విద్యార్థుల భవిష్యత్తుకు ఆంగ్ల విద్య తప్పనిసరి అయ్యింది. డబ్బున్నవారు తమ పిల్లల చదువు కోసం పట్టణాలకు వెళ్లిపోతుంటే... పేదవారు మాత్రం వసతులూ, సిబ్బంది లేమితో కునారిల్లిపోతున్న ప్రభుత్వ పాఠశాలలకే పిల్లల్ని పంపుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన పాదయాత్ర సమయంలో క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఏ విధంగా నిర్వీర్యం అయ్యిందో ప్రత్యక్షంగా చూశారు. అందుకే 2019 ఎన్నికలలో విజయం సాధించిన వెంటనే ముఖ్యమంత్రి హోదాలో విద్యపై దృష్టి సారించారు. రాష్ట్రంలో నానాటికీ దిగజారుతున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు ‘నాడు–నేడు’లాంటి అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఉన్న 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 42 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశ శాతం రోజు రోజుకూ క్షీణించడం జగన్ గ్రహించారు. దీనిని అరికట్టేందుకు కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో ‘నాడు–నేడు’ పథకానికి రూప కల్పన చేసి 2019, నవంబర్ 14న ప్రారంభించారు. ఈ పథకం ద్వారా శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలను పునర్నిర్మాణం చేయడం, క్షీణ దశకు చేరుకున్న ఫ్లోరింగ్, ప్లాస్టరింగ్ లాంటి అన్ని రకాల డ్యామేజ్లను బాగుచేయడం; టాయ్లెట్లు, కాంపౌండ్ వాల్లను నిర్మించడం, బెంచీలు, కంప్యూటర్ ల్యాబ్‌లు, గ్రీన్ బోర్డ్‌లు, వాటర్ ప్లాంట్లు, పటిష్టమైన తలుపులు ఏర్పాటు చేయడం; పాఠశాలకు ఆకర్షణీయమైన రంగులు వేయించడం లాంటి అనేక పనులు పూర్తి చేశారు. మొదటి దశలో రూ. 3,585 కోట్ల ఖర్చుతో 15,715 ప్రభుత్వ పాఠశాలలనూ, రెండో దశలో రూ. 4,732 కోట్ల ఖర్చుతో 14,584 ప్రభుత్వ పాఠశాలలనూ ఆధునికీకరించారు. అదే విధంగా 3వ దశలో రూ. 2,969 కోట్లు ఖర్చు చేసి 16,489 ప్రభుత్వ పాఠశాలలను సుందరీకరించే పని ప్రభుత్వం చేపట్టింది. అదే సమయంలో విద్యార్థుల ప్రవేశ శాతం పెంచేందుకు, తల్లిదండ్రులకు పిల్లల విద్య ఏమాత్రం భారం కాకుండా చూసేందుకు ‘అమ్మ ఒడి’, ‘జగనన్న విద్యాదీవెన’, ‘జగనన్న వసతి దీవెన’ వంటి పథకాలను వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చి అమలు చేస్తున్నది. దేశ రాజకీయాలలో ఇంతవరకు ఎవరూ చేయని విధంగా కేవలం ఈ రెండు సంవత్సరాల పదినెలల కాలంలో ఒక్క విద్య పైనే 25 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం విశేషం. దీని వలన కోటీ ఇరవై లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు. ఈ పరిణామంతో ఇప్పటి వరకూ ఏడు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా అడ్మిషన్లు పొందారు. కొన్ని పాఠశాలల్లో ‘సీట్లు లేవు’ అనే బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. సీట్ల కొరకు తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులను సిఫార్సు చేయమని అడుగుతున్నారు. ఈ స్థాయికి మన ప్రభుత్వ పాఠ శాలలు చేరతాయని మూడేళ్ల క్రితం కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. (క్లిక్: అనితర సాధ్య సామాజిక నమూనా!) - కైలసాని శివప్రసాద్ సీనియర్ పాత్రికేయులు -
నాడు–నేడు మిగులు నిధులు నాబార్డు స్కూళ్ల పనులకు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మనబడి నాడు–నేడు కింద తొలివిడతలో అభివృద్ధి పనులు చేపట్టిన స్కూళ్లకు కేటాయించిన నిధుల్లో మిగిలిన సొమ్మును నాబార్డు ఆర్థిక సాయంతో పనులు చేపట్టిన స్కూళ్లకు వినియోగించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.చినవీరభద్రుడు అన్ని జిల్లాల విద్యాధికారులు, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లను ఆదేశించారు. నాడు–నేడు తొలివిడతలో 15,715 స్కూళ్లను ప్రభుత్వం అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. నీటి సదుపాయంతో మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, విద్యార్థులు, టీచర్లకు కుర్చీలు, బెంచీలు సహా ఫర్నిచర్, గ్రీన్‌చాక్‌బోర్డులు, విద్యుత్తు సదుపాయం, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, మరమ్మతులు, ప్రహరీలు, కిచెన్షెడ్లు, రంగులు వేయడం వంటి వాటికి రూ.3,669 కోట్ల వరకు వెచ్చించింది. ఈ నిధులను పాఠశాలల వారీగా కేటాయించింది. ఆ స్కూళ్లలో పనులన్నీ పూర్తయిన తరువాత పేరెంట్స్ కమిటీల వద్ద మొత్తం రూ.59 కోట్లు మిగిలాయి. ఈ సొమ్మును నాబార్డు నిధులతో పనులు చేపట్టిన 516 స్కూళ్లలో కార్యక్రమాలు పూర్తిచేసేందుకు బదలాయించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు. -
ప్రపంచంతో పోటీ
కోవిడ్ తగ్గుతున్నందున వచ్చే ఏడాది పిల్లలు స్కూళ్లకు వెళ్లే నాటికే విద్యా కానుక అందించాలి. ఇందుకోసం ఇప్పుడే టెండర్లు పిలిచేలా చర్యలు తీసుకోవాలి. ఈ కిట్‌లో వస్తువులు మరింత నాణ్యతగా ఉండేలా దృష్టి సారించాలి. వచ్చే ఏడాది నుంచి విద్యా కానుకలో భాగంగా మూడు జతల దుస్తులకు అదనంగా స్పోర్ట్స్ డ్రస్, స్పోర్ట్స్ షూ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. ఇవి మంచి డిజైన్‌తో ఉండేలా చూడాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రపంచ స్థాయిలో పోటీకి తగినట్టుగా విద్యార్థులను తయారు చేసేందుకు ఉద్దేశించిన నూతన విద్యా విధానం అమలుపై అన్ని రకాలుగా సిద్ధం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ఈ విధానం సమర్థవంతంగా అమలు జరిగినప్పుడే మన పిల్లలు ప్రపంచ స్థాయిలో రాణిస్తారని, వారిని ఆ దిశగా సన్నద్ధం చేసేందుకు అడుగులు ముందుకు వేయాలన్నారు. చాలా స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించామని, ఈ దశలో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యా శాఖలో నాడు–నేడుతో పాటు ఫౌండేషన్ స్కూళ్లపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్య పుస్తకాల ముద్రణలో నాణ్యత మరింతగా పెంచాలని సూచించారు. ఇప్పటి నుంచే టెండర్ల ప్రక్రియ ప్రారంభించడంపై దృష్టి సారించాలని చెప్పారు. మూడో తరగతి నుంచి సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీబీఎస్ఈ అఫిలియేషన్ గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరిస్తూ.. తొలుత వెయ్యి స్కూళ్లను అఫిలియేషన్ చేస్తున్నామని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. అన్ని రకాల స్కూళ్లకు సీబీఎస్ఈ అఫిలియేషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. విద్యాశాఖలో నాడు–నేడు, ఫౌండేషన్ స్కూళ్లపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 12,663 స్కూళ్లలో రెండో విడత నాడు–నేడు ► రూ.4,535.74 కోట్ల వ్యయంతో రెండో విడతలో 12,663 స్కూళ్లలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి, రూపురేఖలు మార్చాలి. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. (రెండో విడతలో 18,498 అదనపు తరగతి గదులు నిర్మించనున్నారు. మూడో విడత రూ.7,821 కోట్ల వ్యయంతో 24,900 స్కూళ్లలో నాడు–నేడు చేపట్టనున్నారు.) ► నాడు –నేడు కార్యక్రమం ద్వారా ఇంత డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత కచ్చితంగా స్కూళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. లేకపోతే మళ్లీ పూర్వపు స్థితికి వెళ్లిపోతాయి. స్కూళ్లలో టాయిలెట్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ► ప్రతి స్కూల్లో మరమ్మతుల కోసం, సమస్యల పరిష్కారం కోసం కంటింజెన్సీ ఫండ్ ఏర్పాటు చేయాలి. దీనిపై ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) తయారు చేయాలి. అప్పుడే స్కూళ్లు నిత్యనూతనంగా ఉంటాయి. నాడు–నేడు పనులపై శిక్షణ ► ఈ ఏడాది విద్యా కానుక నూటికి నూరు శాతం పంపిణీ పూర్తయిందని అధికారులు సీఎంకు వివరించారు. నాడు–నేడు పనులకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల్లోని సుమారు 12 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం పేరెంట్స్ కమిటీలకు కూడా శిక్షణ ఇస్తామన్నారు. ► స్వేచ్ఛ కార్యక్రమం కింద స్కూల్లో ఆడపిల్లలకు శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్‌లో ఈ కార్యక్రమం ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ► ఈ సమీక్షలో పాఠశాల విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, సర్వ శిక్షా అభయాన్ స్టేట్ ప్రోజెక్ట్ డైరెక్టర్ వెట్రి సెల్వి, పాఠశాల విద్యా శాఖ సలహాదారు ఎ.మురళి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ (ఎస్సీఈఆర్టీ) బి.ప్రతాప్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
గిరిజనగూడెం.. ‘నాడు–నేడు’తో శోభాయమానం
సాక్షి, అమరావతి: వాగు వంకలు.. కొండలు కోనలు గుట్టలు దాటుకొని ఆ గ్రామాలకు మామూలుగా చేరుకోవడమే కష్టం. అటువంటి గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమంతో కళకళలాడుతున్నాయి. దశాబ్దాలుగా ఈ స్కూళ్లను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. పశువుల కొట్టాలకన్నా దారుణమైన పరిస్థితులున్నా వాటిని బాగు చేయాలన్న తలంపు ఏనాడూ చేయలేదు. కానీ నేడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మనబడి నాడు–నేడు కార్యక్రమం కింద మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోని పాఠశాలలను పదిరకాల సదుపాయాలతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. సుందరంగా మారిన విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలంలోని నల్లగొండ ఎంపీపీ స్కూల్ రూ.312 కోట్లతో 1,226 గిరిజన పాఠశాలల అభివృద్ధి రాష్ట్రంలోని మొత్తం 45 వేలకు పైగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లన్నిటినీ నాడు–నేడు కార్యక్రమం కింద ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వీటికి శాటిలైట్ ఫౌండేషన్, ఫౌండేషన్ స్కూళ్లు కలిపి దాదాపు 57 వేలకు చేరుతున్నాయి. వీటన్నిటినీ పూర్తిస్థాయిలో తీర్చిదిద్దడానికి ప్రభుత్వం రూ.16 వేల కోట్లను ఖర్చుచేస్తోంది. ఇప్పటికే తొలిదశలో 15,715 స్కూళ్లను రూ.3,669 కోట్లతో అభివృద్ధి చేసింది. 7 జిల్లాల పరిధిలో ఉన్న 1,226 గిరిజన స్కూళ్లను తొలిదశ కింద అభివృద్ధి చేశారు. రూ.312.5 కోట్లతో వీటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఏర్పాటు చేసిన సదుపాయాలివీ.. గతంలో చూడడానికే అందవికారంగా, ఎప్పుడు కూలుతాయో అని లోపలకు వెళ్లడానికే భయపడే విధంగా ఉన్న ఈ స్కూళ్లు ఇప్పుడు గిరిజన తల్లిదండ్రులు, పిల్లలను ఆకర్షిస్తున్నాయి. గతంలో స్కూళ్లకు రావడానికి కూడా మారాం చేసే పిల్లలు ఈనెల 16వ తేదీ నుంచి స్కూళ్లు తెరిచిన నేపథ్యంలో వాటివైపు ఉత్సాహంగా అడుగులు వేస్తున్నారు. మరుగుదొడ్లు, అందమైన ఆవరణ, మంచినీటి సదుపాయం, తరగతి గదుల్లో డ్యూయెల్ డెస్కులు, టీచర్లకు అనువైన కుర్చీలు, అల్మారాలు, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, పాఠశాలల చుట్టూ ప్రహరీతో స్కూళ్లు కళకళలాడుతున్నాయి. పాఠశాల భవనం మొత్తం ఆకర్షణీయమైన రంగులతో, గోడలపై విద్యార్థులకు విజ్ఞానం అందించే చిత్రాలతో తీర్చిదిద్దారు. విద్యారంగంలో సీఎం కొత్త చరిత్ర సృష్టించారు రాష్ట్ర విద్యా రంగంలో నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, అమ్మఒడి పథకాలను ప్రవేశపెట్టిన సీఎం జగన్మోహన్రెడ్డి కొత్త చరిత్ర సృష్టించారు. నాడు–నేడు మొదటి దశలో 15,715 ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. పాఠశాలలు ప్రారంభించిన రోజే జగనన్న విద్యాకానుక కిట్ల ద్వారా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, స్కూల్ బ్యాగ్, షూస్, బెల్ట్ అదనంగా ఆంగ్ల నిఘంటువు పంపిణీ చేయడం విద్యార్థులకు జగనన్న అందించిన వరం. – సామల సింహాచలం, ఏపీ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు కలలో కూడా ఊహించలేదు మారుమూల ఎక్కడో ఉన్న మా గ్రామంలోని స్కూలు ఇంత అద్భుతంగా మారుతుందని కలలో కూడా ఊహించలేదు. పాఠశాల అభివృద్ధి పనులు మా కమిటీ చేతనే దగ్గరుండి చేయించారు. మా పిల్లలకు మంచి విద్య అందుతుందన్న భరోసా మాకు కలిగింది. పిల్లలు కూడా ఆనందంగా స్కూలుకు వస్తున్నారు. – ఎం.భాస్కరరావు, పేరెంట్స్ కమిటీ చైర్మన్, మూలిగూడ, గుమ్మలక్ష్మీపురం మండలం, విజయనగరం జిల్లా. విద్యార్థులకెంతో అదృష్టం మునుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలనే మార్చివేసిన అద్భుత పథకం నాడు–నేడు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన అనే ఆలోచన మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి రావడం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అదృష్టంగా భావిస్తున్నాను. పూర్వం ఇటువంటి సదుపాయాలు లేక విద్యార్థులు చాలా బాధలు అనుభవించారు. – ఆర్.నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయుడు, కొయ్యూరు, విశాఖపట్నం జిల్లా. స్కూలుకు వచ్చి బాగా చదువుకోవాలని ఉంది ఇంతకు ముందు మా స్కూలు అసలు బాగుండేది కాదు. స్కూలుకు రావాలని పించేది కాదు. ఇప్పుడు స్కూలును చూస్తే ఆనందంగా ఉంది. మేము కూర్చొని పాఠాలు వినేందుకు సౌకర్యమైన బెంచీలు, మంచినీరు, మరుగుదొడ్లు అన్నీ ఇప్పుడు బాగున్నాయి. ఇప్పుడు స్కూలు మానకుండా చదువుకోవాలని ఉంది. – పి.స్వప్న, 5వ తరగతి, మూలిగూడ, విజయనగరం జిల్లా -
స్కూళ్లల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నాం
-
నాడు-నేడు ద్వారా ప్రతి సర్కారు బడిలో 10 మార్పులు: సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి: కార్పొరేటు పాఠశాలలకు ధీటుగా.. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి విడత కింద రూ.3,669 కోట్లతో సర్వాంగ సుందరంగా 15,715 ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరించారు. నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా సీఎం జగన్ సోమవారం వీటిని విద్యార్థులకు అంకితం చేశారు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టాం. నేడు మూడు కార్యక్రమాలు జరగనున్నాయి. మొదటిది ఈ రోజు నుంచి బడులు తెరుస్తుండగా.. మరో రెండు కార్యక్రమాలు జగనన్న విద్యా కానుక, నాడు నేడు రెండోదశ పాఠశాల పనులకు శ్రీకారం చుట్టడం. పిల్లల భవిష్యత్ దృష్ట్యా స్కూళ్లు తెరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రెండేళ్ల నుంచి విద్యార్థులు పాఠశాలకు దూరం అయ్యారు. డబ్ల్యూహెచ్ఓ, ఐసీఎంఆర్ సూచనల మేరకు బడులు తెరిచాం. కోవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువగా ఉన్న.. గ్రామ సచివాలయాలు యూనిట్‌గా తీసుకుని స్కూళ్లను ప్రారంభించాం. కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ పాఠశాలలను ప్రారంభించాం. టీచర్లు అందరికి టీకాలిచ్చాం’’ అని తెలిపారు. విద్యా కానుక.. ‘‘పేద, మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్ధులకు 'జగనన్న విద్యాకానుక' ఇస్తున్నాం. దీనిలో భాగంగా 47.32 లక్షల మంది విద్యార్ధులకు 731.30 కోట్లతో 'జగనన్న విద్యాకానుక' ఇస్తున్నాం. విద్యాకానుకలో ఒకవైపు తెలుగు, మరో వైపు ఇంగ్లీష్ భాషల్లో ఉన్న బై లింగువల్ టెక్ట్స్‌బుక్స్, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, డిక్షనరీ ఇస్తున్నాం. ఐదో తరగతి వరకు విద్యార్థులకు అర్థమయ్యేలా బొమ్మలతో ఇంగ్లీష్ డిక్షనరీ ఇస్తున్నాం’’ అని తెలిపారు. నాడు-నేడుతో మార్పులివే.. ‘‘నాడు-నేడుతో తొలి దశలో 3,669 కోట్లతో 15,715 పాఠశాలల అభివృద్ధి చేశాం. నేడు రెండో విడత నాడు నేడు పనులకు శ్రీకారం చుట్టాం. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నాం. నాడు-నేడు ద్వారా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 10 మార్పులు చేస్తున్నాం. వాటిలో భాగంగా స్కూళ్లలో ఫర్నిచర్, నీటివసతి, రక్షిత తాగునీరు, పెయింటింగ్స్.. గ్రీన్ చాక్ బోర్డ్, ఇంగ్లీష్ ల్యాబ్, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, ప్రహరీ గోడ, వంటగది వంటి వసతులు కల్పించాం. నాడు-నేడుతో ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ ల్యాబ్ కూడా తీసుకొచ్చాం’’ అని సీఎం జగన్ తెలిపారు. విద్యా వ్యవస్థ 6 విభాగాలు.. ‘‘నాడు-నేడుతో అంగన్వాడీలను కూడా అభివృద్ధి చేశాం. నాడు-నేడుతో 57వేల స్కూళ్ల రూపురేఖలు మారబోతున్నాయి. విద్యా వ్యవస్థ ఆరు విభాగాలుగా మారబోతుంది. శాటిలైట్ ఫౌండేషన్ బడులుగా మారనున్న పూర్వ ప్రాథమిక విద్య 1, 2 పి.పి(ప్రీప్రైమరీ)... 1, 2 పీపీతో పాటు ఒకటి, రెండు తరగతులుంటే ఫౌండేషన్.. ఒకటి నుంచి 5 తరగతులు ఉంటే ఫౌండేషన్ ప్లస్.. 3 నుంచి 8వ తరగతి వరకు ఉంటే ప్రీ హైస్కూళ్లు.. 3 నుంచి 10వ తరగతి వరకు ఉంటే ఉన్నత పాఠశాలలు.. 3 నుంచి 12 వరకు ఉంటే హైస్కూల్ ప్లస్‌గా మార్పు చేశాం’’ అని సీఎం జగన్ తెలిపారు. ‘‘ఒక్కో సబ్జెక్ట్‌కు ఒక టీచర్ ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం. గత రెండేళ్లతో పోల్చితే స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రెండేళ్లలోనే రూ.32,714 కోట్లు ఖర్చు చేశాం. పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి చదువే’’ అన్నారు సీఎం జగన్. -
‘జగనన్న విద్యా కానుక’ ప్రారంభించిన సీఎం జగన్
అప్ డేట్స్: మనబడి నాడు-నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించి.. అభివృద్ధి పనులను పరిశీలించారు. తరగతి గదిలోని గ్రీన్ బోర్డుపై ‘ఆల్ ద వెరీ బెస్ట్’ అని రాసి సీఎం జగన్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం హైస్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్ దృష్ట్యా స్కూళ్లు తెరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్ కూడా స్కూళ్లు తెరవాలని సూచించారని, కోవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువగా ఉన్న.. గ్రామ సచివాలయాలు యూనిట్‌గా తీసుకుని స్కూళ్లను ప్రారంభించామని పేర్కొన్నారు. కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ పాఠశాలలను ప్రారంభించామని, పేద, మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్ధులకు 'జగనన్న విద్యాకానుక' కింద బై లింగువల్ టెక్ట్స్‌బుక్స్, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, డిక్షనరీ ఇస్తున్నామని పేర్కొన్నారు. ► పి. గన్నవరం హైస్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ.. స్కూళ్లల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని తెలిపారు. నాడు-నేడుతో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను రూపొందించామని పేర్కొన్నారు. ► మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. సీఎం జగన్ స్కూళ్ల రూపురేఖలు మార్చారని, పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేసి చూపించారని తెలిపారు. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు కొనసాగించామని చెప్పారు. తొలి దశలో 3,669 కోట్లతో 15,715 పాఠశాల అభివృద్ధి చేశామని, రెండో విడత నాడు నేడు పనులకు శ్రీకారం చుట్టామని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించి.. అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం తరగతి గదిలోని గ్రీన్ బోర్డుపై ‘ఆల్ ద వెరీ బెస్ట్’ అని రాసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి తరగతి గదిలోకి వెళ్లి సీఎం జగన్ విద్యార్థులతో మాట్లాడుతూ పాఠ్య పుస్తకాలను పరిశీలించారు. పాఠశాల సిబ్బంది విద్యార్థులకు అందిస్తున్న పలు సౌకర్యాలను సీఎం జగన్‌కు వివరించారు. ప్రస్తుతం స్కూల్లో ఉన్న సౌకర్యాలు ఎలా ఉన్నాయో స్వయంగా విద్యార్థులను అడిగి తెలసుకొని.. ప్రభుత్వం అందిస్తున్న స్కూల్ బ్యాగ్‌ను భుజనా వేసుకొని మరీ సీఎం జగన్ పరిశీలించారు. విద్యార్థులకు అందించే ఆహారానికి సంబంధించిన ‘మెనూ’ను సీఎం జగన్ పరిశీలిచారు. అనంతరం ‘మనబడి నాడు-నేడు’ ద్వారా తొలి విడత పనులు పూర్తైన పాఠశాలలను పైలన్ ఆవిష్కరించి సీఎం జగన్ ప్రారంభించారు. ‘మనబడి నాడు-నేడు’ ద్వారా తొలి విడత కింద రూ.3,669 కోట్లతో సర్వాంగ సుందరంగా 15,715 ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరించారు. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న సందర్భంగా వైఎస్ జగన్ వాటిని విద్యార్థులకు అంకితం చేశారు. అనంతరం రెండో విడత చేపట్టబోయే పాఠశాలల పనులకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్న విద్యా కానుక’ రెండో విడత పంపిణీని రూ.731.30 కోట్లతో సీఎం జగన్ ప్రారంభించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మనబడి...నాడు నేడు
-
Nadu Nedu: సర్కారీ బడి.. సరికొత్త సవ్వడి
నాడు.. వెలిసిపోయిన బ్లాక్‌బోర్డులు, విరిగిపోయిన బల్లలు, నేలవాలిన ప్రహరీలు, కూలడానికి సిద్ధంగా ఉన్న పైకప్పులు, శిథిల స్థితిలో భవనాలు, వినియోగానికి వీలులేని మరుగుదొడ్లు, పనిచేయని కుళాయిలు, ముంపునకు గురయ్యే ప్రాంగణాలు నేడు.. అధునాతన హంగులతో భవనాలు, పక్కాగా నిర్మించిన ప్రహరీలు, కార్పొరేట్‌కు ధీటుగా ఫర్నిచర్, గ్రీన్ చాక్‌బోర్డులు, తరగతి గదిలో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, విజ్ఞానపు బొమ్మలతో ఆసక్తి కలిగించే క్లాస్ రూమ్‌లు, డిజిటల్ తరగతులు, ఇంగ్లిష్ క్లబ్‌లు, ఆధునికీకరించిన మరుగుదొడ్లు, ఆహ్లాదం కలిగించే ప్రాంగణాలు, స్వచ్ఛమైన తాగునీటి వసతులు.. ఇది రెండేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో స్పష్టంగా కనిపించిన మార్పు విద్యపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని నమ్మిన సీఎం జగన్ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. మనబడి నాడు–నేడులో భాగంగా పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో కాన్వెంట్లను తలదన్నేలా తీర్చిదిద్దుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో నాడు–నేడులో భాగంగా 1,117 బడుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.230 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకూ రూ.226.23 కోట్లను వెచ్చించి 98 శాతం పనులు పూర్తిచేశారు. ఏడాదిలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య 25 వేలకు పైగా పెరగడం ప్రభుత్వ కృషికి నిదర్శనం. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏపీలో విద్యారంగానికి ప్రాధాన్యమిస్తూ సీఎం జగన్ పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అమ్మఒడి, విద్యాకానుక, వసతిదీవెన, విద్యాదీవెన, గోరుముద్ద వంటి పథకాలతో ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్నారు. ముఖ్యంగా మనబడి నాడు–నేడులో భాగంగా పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. కార్పొరేట్ స్థాయిలో సదుపాయాలు కల్పిస్తూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకున్నారు. పాదయాత్ర సందర్భంగా శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను స్వయంగా చూసిన జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే వీటి ప్రక్షాళనకు ఆదేశాలు జారీ చేశారు. నాడు–నేడులో భాగంగా మూడు విడతలతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను అభివృద్ధి చేయాలని సంకల్పించారు. దీనిలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో మొదటి విడతలో చేపట్టిన పనులు 98 శాతం పూర్తయ్యాయి. కార్పొరేట్ సవ్వడులు నాడు–నేడులో భాగంగా పాఠశాలల భవనాలను ఆధునికీకరించారు. ప్రాంగణాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేలా మొక్కలు నాటారు. తరగతి గదుల్లో ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్, గ్రీన్ చాక్‌బోర్డులు ఏర్పాటుచేయడంతో పాటు గోడలను విజ్ఞానాన్ని అందించే బొమ్మలతో తీర్చిదిద్దారు. వీటితో పాటు డిజిటల్ తరగతి గదులు, ఇంగ్లిష్ ల్యాబ్‌లు ఏర్పాటుచేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో అధ్వానంగా ఉన్న మరుగుదొడ్లను ఆధునికీకరించి అందుబాటులోకి తీసుకువచ్చారు. తాగునీటి కోసం కుళాయిలు ఏర్పాటుచేశారు. మొత్తంగా పాఠశాలలను నందవనంలా తీర్చిదిద్దారు. మొదటి విడతలో రూ.230 కోట్లు జిల్లాలో మొదటి విడత నాడు–నేడు పనులకు 1,117 పాఠశాలలను ఎంపిక చేసి రూ.230 కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు సుమారు 98 శాతం పనులను రూ.226.23 కోట్లతో పూర్తిచేశారు. సమగ్ర శిక్ష అభియాన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఆంధ్రప్రదేశ్ విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులు చేయిస్తున్నారు. పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య నాడు–నేడు పనులతో పాఠశాలలు ఆహ్లాదంగా మారడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో మార్పు కనిపిస్తోంది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 3,280 ఉండగా 2019–20 విద్యాసంవత్సరంలో 2,85,315 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ సంఖ్య 2020–21 విద్యా సంవత్సరంలో 3,11,178కి చేరుకుంది. ఈ లెక్కన ఏడాదిలో 25,863 మంది విద్యార్థుల సంఖ్య పెరిగింది. గతేడాది కరోనా తొలిదశ సమయంలోనూ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపైనే తమ విశ్వాసాన్ని ప్రదర్శించారు. నూతన జవసత్వాలు మనబడి నాడు–నేడులో భాగంగా ప్రభుత్వ విద్యాలయాలను సమూలంగా మార్చి పేద పిల్లలకు కార్పొరేట్ విద్యావకాశాలు కల్పిస్తున్న సీఎం జగన్ చరిత్రకెక్కారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా అరకొర వసతుల మధ్య ఆదరణ కోల్పోయిన సర్కారీ బడులకు ముఖ్యమంత్రి ఆలోచనలతో నూతన జవసత్వాలు వచ్చాయి. విద్యార్థులు ఇష్టపూర్వకంగా పాఠశాలలకు వచ్చే పరిస్థితులు నాడు–నేడు పనులతో సాధ్యమయ్యాయి. –పువ్వుల ఆంజనేయులు, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కార్పొరేట్‌ను తలదన్నేలా.. నాడు–నేడులో భాగంగా అభివృద్ధి చేసిన పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలు కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా ఉన్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. విద్యారంగ అభివృద్ధిపై సీఎం జగన్‌కు ఉన్న చిత్తశుద్ధి నాడు–నేడు పనుల్లో కనిపిస్తోంది. ప్రతి పాఠశాల ఒక ఆలయంగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వం సఫలమైంది. ఇకపై పేదల విద్యార్థులు విద్యాకానుకలో భాగంగా అందించే యూనిఫాం, బూట్లు, టై, బెల్టు బ్యాగులతో దొరబాబుల్లా పాఠశాలలకు వస్తారు. –ప్రసాద్ బైరీసెట్టి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి రెండో విడతకు ప్రతిపాదనలు జిల్లాలో మొదటి విడతలో 1,117 పాఠశాలల్లో నాడు–నేడులో భాగంగా చేపట్టిన పనుల్లో 98 శాతం పూర్తయ్యాయి. రెండో విడతలో మరో 1,101 పాఠశాలల అభివృద్ధి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. తొలివిడతలో అభివృద్ధి చేసిన పాఠశాలలను వచ్చేనెల 15న సీఎం జగన్ విద్యార్థులకు అంకితం చేయనున్నారు. వచ్చేనెల 16వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. సరికొత్త హంగులతో విద్యార్థులకు స్వాగతం పలుకనున్నాయి. –సీవీ రేణుక, జిల్లా విద్యాశాఖాధికారి -
2 Years Of YS Jagan Rule In AP: కొత్త చరిత్ర
ప్రభుత్వ పాఠశాలలపై చేస్తున్న వ్యయాన్ని సామాజిక పెట్టుబడిగా భావిస్తున్నాం. అందుకే వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించాం. మానవ వనరుల అభివృద్ధితోనే మెరుగైన సమాజం సాధ్యమన్నది మా విశ్వాసం. ఈ కారణంగానే 45,329 స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు మూడు దశల్లో మన బడి నాడు–నేడు కార్యక్రమానికి రూప కల్పన చేశాం. – మనబడి నాడు–నేడు ప్రారంభ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యతతో శ్రీకారం చుట్టిన ‘మనబడి నాడు–నేడు, వైద్య రంగం నాడు–నేడు’ కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల్లో సకల సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. విద్యా రంగాన్నే తీసుకుంటే.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ స్కూళ్లు దశాబ్దాలుగా కునారిల్లి శిథిలావస్థకు చేరుకున్నాయి. స్కూళ్లలో కనీస సదుపాయాలు లేక పిల్లలు బడులకు వెళ్లాలంటేనే ఆసక్తి కనబరిచేవారు కాదు. మరుగు దొడ్లు, మంచి నీరు వంటివి లేకపోవడంతో ఆడపిల్లలు ఎంతో మంది చదువుకు స్వస్తి చెప్పారు. ఈ అవస్థలను తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రత్యక్షంగా చూసిన వైఎస్ జగన్.. అధికారంలోకి రాగానే ‘మన బడి నాడు–నేడు’ కార్యక్రమాన్ని చేపట్టారు. 45,329 స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు మూడు దశల్లో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. నాణ్యతలో ఎక్కడా రాజీ లేకుండా పది రకాల సౌకర్యాలను కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. తొలిదశలో 15,715 స్కూళ్లలో అభివృద్ధి పనులకు 2019 నవంబర్ 14వ తేదీన శ్రీకారం చుట్టారు. ఈ పనులు దాదాపు పూర్తికావ చ్చాయి. ఈ పనుల కోసం ప్రభుత్వం రూ.3,669 కోట్లు మంజూ రు చేయగా, ఇప్పటి వరకు రూ.3,158 కోట్లు వ్యయమైంది. రెండో దశలో 12,240 స్కూళ్లలో అభివృద్ధి పనులు పనులు చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ► గతంలో 104 వాహనాలంటే పల్లెలకు చుట్టపు చూపుగా వెళ్లేవి. ఇప్పుడలా కాదు. వైద్యులుంటారు, వైద్య పరీక్షలు చేస్తారు, మందులుంటాయి. పల్లెల్లో మంచానికే పరిమితమైన ప్రత్యేక కేసులను ఇంటివద్దకే వెళ్లి చూస్తున్నారు. దీర్ఘకాలిక జబ్బులకు ప్రతిరోగికీ, ప్రతి నెలా ఆ ఊరికే వెళ్లి మందులిస్తున్నారు. అవసరమైతే వీళ్లే ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు నమోదు చేసి, ఎలక్ట్రానిక్ డేటా బేస్‌లో పొందు పరుస్తారు. భవిష్యత్‌లో వైద్యం అవసరమైనప్పుడు ఇది ఉపయోగపడుతుంది. తద్వారా ఫ్యామిలీ డాక్టర్ భావన ఏర్పడుతుంది. 2020 జూలై 1 నుంచి 2021 మే 25 వరకూ 656 వాహనాల ద్వారా 49.26 లక్షల మంది లబ్ధి పొందారు. ► చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 16 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ప్రాథమిక వైద్యానికి పెద్దపీట వేస్తూ వైఎస్సార్ హెల్త్‌క్లినిక్‌లు, కొత్త పీహెచ్‌సీల నిర్మాణం, సామాజిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికే 12 వేలకు పైగా రెగ్యులర్ నియామకాలు చేపట్టారు. మొత్తం 10,011 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల ఏర్పాటులో భాగంగా 8,545 కొత్తవి నిర్మిస్తున్నారు. వీటి వ్యయం రూ.1,692 కోట్లు. మారుమూల గ్రామంలోనూ వైద్య సేవలు అందించాలన్నది ఈ క్లినిక్‌ల ఉద్దేశం. రూ.246 కోట్లతో 5 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నారు. మండలానికి రెండు పీహెచ్‌సీలు, ఇద్దరు డాక్టర్లు ► రాష్ట్రంలో 1,133 పీహెచ్‌సీలున్నాయి. ఇకపై అన్ని మండలాల్లో రెండు పీహెచ్‌సీలతో పాటు ఒక్కో పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ► శిథిలావస్థకు చేరిన 982 పీహెచ్‌సీలకు రూ.413.54 కోట్లతో మరమ్మతులు చేసి, రూ.256.99 కోట్లతో 151 పీహెచ్‌సీలు కొత్తవి నిర్మిస్తున్నారు. ► పట్టణాల్లో పేదల కోసం 560 యూపీహె æచ్‌సీలు (పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లు) ఏర్పాటు చేసింది. 355 కొత్త భవనాలకు రూ.355 కోట్లు, 205 పీహెచ్‌సీల మరమ్మతు లకు రూ.61.5 కోట్లు వ్యయం చేస్తోంది. బోధనాస్పత్రుల పునరుద్ధరణ ► ప్రస్తుతం 11 మెడికల్ కాలేజీలు వాటికి అనుబంధంగా ఆస్ప త్రులు ఉన్నాయి. వీటికి మరమ్మతులు, వైద్య పరికరాల కోసం రూ.3,820 కోట్లు వ్యయం చేయనున్నారు. కొత్తవి ఒకవైపు, ఉన్న వాటి పునరుద్ధరణ ఇంకో వైపు సాగుతోంది. ► ఇవి కాకుండా ట్రైబల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, కడపలో స్పెషాలిటీ ఆస్పత్రి, పలాసలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం జరుగుతోంది. పార్లమెంటుకొక మెడికల్ కాలేజీ ఇదొక విప్లవాత్మక నిర్ణయం. రాజశేఖరరెడ్డి హయాంలో ఒకేసారి 4 మెడికల్ కాలేజీలు పెట్టారు. ఆ తర్వాత ఒకేసారి 16 కొత్త వైద్య కాలేజీలు (పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి) ఏర్పాటు చేస్తుండటం చరిత్రలో ఇదే మొదటిసారి. ఇందుకోసం రమారమి రూ.7,880 కోట్లు వ్యయం అంచనా. ఇప్పటికే టెండర్ల దశ పూర్తి చేసుకున్నాయి. కాలేజీలు రావడం వల్ల 2 వేల వరకు ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రానుండటమే కాకుండా స్పెషాలిటీ వైద్యం రాష్ట్రం నలుమూలలకూ చేరువవుతుంది. సెకండరీ కేర్‌కు భరోసా ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, సామాజిక ఆస్పత్రులకు వైఎస్ జగన్ సర్కారు భరోసా ఇస్తోంది. 42 ఏరియా ఆస్పత్రుల నిర్మాణానికి రూ.682 కోట్లు, 121 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు రూ.528 కోట్లు, రెండు మాతా శిశు సంరక్షణా కేంద్రాలకు రూ.13 కోట్లు కేటాయించారు. మొత్తం సెకండరీ కేర్ కు రూ.1,223 కోట్లు వ్యయం చేస్తున్నారు. కోవిడ్ నియంత్రణలో ముందంజ రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణలో దేశంలోనే మెరుగైన ఫలితాలను సాధించిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ల్యాబొరేటరీల విషయంలో రాష్ట్రంలో 2020 ఫిబ్రవరి నాటికి ఒక్క వైరాలజీ ల్యాబ్ లేదు. నమూనాలు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి పంపించాల్సిన దుస్థితి. అలాంటిది ఇప్పుడు రోజుకు లక్షకు పైగా టెస్టులు చేసే స్థాయికి చేరుకుంది. ► రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదిలో 13 జిల్లాల్లో 14 వైరాలజీ ల్యాబొరేటరీల ఏర్పాటు.. కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన తొలి రాష్ట్రంగా నమోదు ► బ్లాక్ ఫంగస్ (మ్యుకర్ మైకోసిస్)ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు.. 26వేల పడకలకు పైగా ఆక్సిజన్ పైప్లైన్లు వేయగలిగారు ► జర్మన్ హ్యాంగర్ టెక్నాలజీతో తాత్కాలిక పడకల ఏర్పాటుకు చర్యలు ► రమారమి 18,500 మంది సిబ్బంది కోవిడ్ సేవల కోసం నియామకం.. ఆక్సిజన్ రవాణా కోసం 25 ప్రత్యేక ట్యాంకర్ల కొనుగోలుకు చర్యలు ► 57 ఆస్పత్రుల్లో పీఎస్ఏ (ప్రెజర్ స్వింగ్ అబ్జార్బ్డ్) ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు ► కోవిడ్ కోసం ఇప్పటి వరకు దాదాపు రూ.2,500 కోట్లు వ్యయం జగన్ మామ వల్లే మళ్లీ బడికి.. 8వ తరగతి చదువుతున్నప్పుడు.. మా నాన్న చనిపోయారు. అమ్మ కష్టం చూడలేక నేను చదువు మానేశాను. నాన్న లేని.. నన్ను, మా కుటుంబాన్ని సీఎం జగన్ మామే ఆదుకున్నారు. జగనన్న అమ్మ ఒడి పథకం వల్ల నేను మళ్లీ చదువుకుంటున్నాను. అమ్మ ఒడి ద్వారా ఇప్పటివరకు రూ.29 వేలు వచ్చాయి. ఇప్పుడు స్కూల్లో నేను టాపర్‌ని. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాను. అందులో కూడా మంచి గ్రేడ్ సాధించి.. పెద్ద చదువులు చదివి ఇంజనీర్ కావాలనుకుంటున్నా. – రాజేశ్వరి, పి.నాగిరెడ్డిపల్లి, అనంతపురం జగనన్న అమ్మ ఒడి పేదరికం వల్ల ఏ ఒక్కరూ చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారు. దీని ద్వారా తమ పిల్లలను బడులకు పంపే అర్హురాలైన ప్రతి తల్లికీ ఏటా రూ.15 వేలు అందిస్తున్నారు. 1–12వ తరగతి వరకు చదివే పిల్లల కోసం దీన్ని అమలు చేస్తున్నారు. ఈ రెండేళ్లలో రూ.13,022.93 కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేశారు. అన్నగా ఆదుకున్నాడు.. మా ఊరు కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం ఎరుకలచెర్వు. అక్కడ పనుల్లేక కర్నూలుకు వచ్చాం. కూలి పనులు చేస్తూ నన్ను, నా చెల్లిని కష్టపడి చదివించే మా నాన్న గుండెపోటుతో చనిపోయాడు. అమ్మ టైలరింగ్ పని చేసేది. అయినా కాస్త డబ్బులే వచ్చేవి. మా చదువులు మధ్యలోనే ఆగిపోతాయేమోనని భయపడ్డా. కానీ సీఎం జగన్ మమ్మల్ని ఒక అన్నగా ఆదుకున్నారు. ‘జగనన్న వసతి దీవెన’ కింద డబ్బులు వచ్చాయి. నా మెస్ బిల్లులకు ఈ డబ్బులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అలాగే నాకు జగనన్న విద్యా దీవెన, చెల్లికి జగనన్న అమ్మ ఒడి డబ్బులూ వచ్చాయి. – ఎం.భార్గవి, బీటెక్, కర్నూలు జగనన్న వసతి దీవెన ‘ఉన్నత చదువులే పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి’ అని విశ్వసించిన ముఖ్యమంత్రి.. జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, అంతకుమించి ఉన్నత విద్య అభ్యసించే పేద విద్యార్థులకు భోజన, వసతి వ్యయాన్ని అందిస్తున్నారు. ఏడాదికి రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఆపై చదువులకు రూ.20 వేలు చొప్పున ప్రభుత్వమే చెల్లిస్తోంది. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే.. అంతమందికీ వారి తల్లుల ఖాతాల్లోనే ఈ మొత్తాన్ని జమ చేస్తోంది. అమ్మాయిని ఆనందంగా చదివిస్తున్నా మాకు ఇద్దరు పిల్లలు. నా భర్తకు వచ్చే డబ్బులు ఇంటి కిరాయి, కుటుంబపోషణకే సరిపోతాయి. దీంతో మా పెద్దబ్బాయి చదువు ఆపేశాడు. నేను ఇంటి దగ్గరే అంగడి పెట్టుకున్నా. జగనన్న పథకాల వల్ల కూతురు పార్వతిని మాత్రం చదివించుకుంటున్నాం. మా బిడ్డకు విద్యా దీవెన కింద ఇప్పటివరకు రూ.20 వేలు వచ్చాయి. మా పై భారం తగ్గింది. ఆయన సీఎంగా ఉన్నంత వరకు బిడ్డల చదువులకు ఇబ్బంది ఉండదు. – పి.గీత, తిరుపతి జగనన్న విద్యా దీవెన పేద విద్యార్థులూ పెద్ద చదువులు చదవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన.. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకమే జగనన్న విద్యా దీవెన. డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే పేద విద్యార్థులకు దీని ద్వారా పూర్తి ఫీజును చెల్లిస్తున్నారు. కాలేజీలకు కాకుండా తల్లుల ఖాతాల్లో ఈ మొత్తం జమ చేయడం ద్వారా.. తమ పిల్లల చదువుల గురించి యాజమాన్యాలను ప్రశి్నంచే అధికారాన్ని వారికి ప్రభుత్వమిచ్చింది. టిప్‌టాప్‌గా బడికి వెళ్తున్నారు నా కూతురు చనిపోయింది. మనవరాలు షేక్ కతేజ బేగాన్ని అల్లుడు నా దగ్గరే వదిలేసి వెళ్లిపోయాడు. నేను బతకడమే కష్టమనుకుంటున్న తరుణంలో.. మనవరాలు తోడైంది. రెండేళ్ల కిందటి వరకు చాలా ఇబ్బందైపోయింది. జగన్ బాబు ఎప్పుడైతే సీఎం అయ్యి.. విద్యా కానుక, అమ్మఒడి పథకాలు పెట్టారో అప్పుడే నా మీదున్న భారం తగ్గింది. బిడ్డ ఇప్పుడు ఎనిమిదో తరగతి చదువుతోంది. మామూలు చదువే కష్టమనుకుంటే.. పెద్ద పెద్ద బడుల్లోలాగా మంచి దుస్తులు, పుస్తకాలు, బ్యాగు, షూలు, బెల్టు పెట్టుకొని టిప్‌టాప్‌గా తయారై.. నా మనవరాలు బడికి వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంది. – పాపాయమ్మ, బొండపల్లి, విజయనగరం జగనన్న విద్యా కానుక ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ముందుకు నడిచేలా.. కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులకు దీటుగా నిలబడేలా జగనన్న విద్యా కానుక పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద 1 నుంచి 10వ తరగతి వరకు చదివే ప్రతి విద్యార్థికీ 3 జతల యూనిఫారం, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగ్‌ను అందిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతి విద్యార్థికీ డిక్షనరీని కూడా అందించబోతున్నారు. నాణ్యమైన వ్రస్తాన్ని తల్లిదండ్రులకే అందిస్తూ.. వాటి కుట్టుకూలిని కూడా తల్లుల ఖాతాల్లోనే జమ చేస్తోంది. మమ్మల్ని గుర్తించిన ముఖ్యమంత్రి వంశపారంపర్యంగా వస్తున్న క్షురక వృత్తిని నమ్ముకొని బతుకుతున్నాం. ఆస్తులు, భూములేమీ లేవు. గతంలో ఎవ్వరూ మా గోడు పట్టించుకోలేదు. జగన్ అధికారంలోకి రాగానే ‘జగనన్న చేదోడు’ ద్వారా ఆదుకున్నారు. పెద్ద పెద్ద సెలూన్ల వల్ల వ్యాపారాలు దెబ్బ తిన్న మాకు.. సీఎం జగన్ ఇస్తున్న డబ్బులే అండగా ఉంటున్నాయి. మమ్మల్ని గుర్తించిన ముఖ్యమంత్రి.. జగన్ ఒక్కరే. – కె.శ్రీనివాసరావు, ఎస్.కోట జగనన్న ‘చేదోడు’ సమాజంలో ఎన్నో ఏళ్లుగా నిరాదరణకు గురవుతున్న వర్గాలను ఆదుకునేందుకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. టైలరింగ్ షాపులున్న దర్జీలు, లాండ్రీలు నడిపే రజకులు, షాపులున్న నాయి బ్రాహ్మణులకు ఏడాదికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇప్పటివరకు 2,98,428 మందికి రూ.298.43 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. జగనన్న తప్ప ఎవరూ పట్టించుకోలేదు.. నా భర్తకు ఆరోగ్యం బాగుండదు. దీంతో నేను ఇంటి వద్దే చిల్లర దుకాణం నడుపుకుంటున్నా. దాని వల్ల వచ్చే ఆదాయం అరకొరే. కష్టాల్లో నన్ను ఎవరూ పట్టించుకోలేదు. జగనన్న తోడు కింద సీఎం జగన్ రూ.10 వేలు ఇచ్చారు. కష్టాల్లో ఉన్న నాకు ధైర్యమిచ్చారు. – ముద్దా సునీత, పుల్లలచెరువు, ప్రకాశం జిల్లా జగనన్న తోడు చిరు వ్యాపారులు రోడ్డెక్కి వ్యాపారం చేస్తే గానీ పూట గడవదు. పెట్టుబడికి కూడా చేతిలో డబ్బులు ఉండవు. విధి లేని పరిస్థితుల్లో అధిక వడ్డీకి ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేయాల్సిందే. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా వీరి గురించి పట్టించుకోలేదు. కానీ సీఎం జగన్ వీరి కోసం ‘జగనన్న తోడు’ పథకాన్ని ప్రవేశపెట్టారు. సున్నా వడ్డీ రుణ సదుపాయాన్ని కల్పించారు. ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటూ బ్యాంకుల నుంచి సున్నా వడ్డీకి ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రుణం ఇప్పిస్తోంది. వడ్డీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. 5,55,160 మందికి రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీకి రూ.555.16 కోట్ల రుణాలిప్పించింది. రోడ్డున పడకుండా ఆదుకున్నారు.. చేపల వేటపై నిషేధం విధించినప్పుడు ఇబ్బంది పడేవాడిని. పస్తులున్న రోజులూ ఉన్నాయి. ఇలాంటి కష్ట కాలంలో మమ్మల్ని ఆదుకోవడానికే వైఎస్ జగన్‌ను దేవుడే పంపించాడనుకుంటా. మత్స్యకార భరోసా ద్వారా రూ.10 వేలు మా బ్యాంక్ ఖాతాల్లో వేస్తున్నారు. రోడ్డున పడకుండా ఆదుకుంటున్నారు. – బర్రి అప్పన్న, తిప్పలవలస, విజయనగరం మత్స్యకార భరోసా సముద్రంలో వేట నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు గత ప్రభుత్వ హయాంలో అరకొరగా కొద్ది మందికి రూ.4 వేలే ఇచ్చేవారు. జగన్ సీఎం అయిన తర్వాత రూ.10 వేలకు పెంచారు. చేపల వేట జీవనాధారంగా బతుకుతున్న ఇతర సామాజిక వర్గాలకూ ప్రభుత్వం మత్స్యకార భరోసా అందించింది. ఇందులో బీసీలు 1,18,119 మంది, ఓసీలు 747 మంది, ఎస్సీలు 678 మంది, ఎస్టీలు 331 మంది ఉన్నారు. ఇంట్లో కూడా ఇలాంటి భోజనం పెట్టలేదు.. నేను, నా భర్త కూలి పనులకు వెళ్తేనే కుటుంబం గడిచేది. మా అమ్మాయి అలేఖ్య 9వ తరగతి చదువుతోంది. గత ప్రభుత్వమున్నప్పుడు మధ్యాహ్న భోజనంలో రోజూ ఉడికీ ఉడకని సాంబారన్నమే పెట్టేవాళ్లు. అది తినలేక మా అమ్మాయి ఇంటికి వచ్చేది. కానీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ‘జగనన్న గోరుముద్ద’ పెట్టడంతో.. పాప రోజూ స్కూల్లోనే తింటోంది. ఆరు రోజులు ఆరు రకాల కూరలు, కిచిడీ, పులిహోరతో మంచిగా భోజనం పెడుతున్నారని.. గుడ్లు, చిక్కీలు, పొంగలి కూడా పెడుతున్నారని పాప చెబుతుంటే చాలా ఆనందంగా ఉంటోంది. ఇంట్లో కూడా అంత మంచి భోజనం పెట్టి ఉండం. – పి.విజయ, కొడవలూరు, నెల్లూరు జిల్లా జగనన్న గోరుముద్ద ఉడికీ ఉడకని అన్నం.. అందులోనూ పురుగులు, చిన్నచిన్నరాళ్లు, నీళ్లలాంటి పప్పు చారు.. పాడైపోయిన గుడ్లు.. ఇది ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో పెట్టిన మధ్యాహ్న భోజనం. సగానికి పైగా పిల్లలు ఈ ఆహారం తినలేక ఇళ్లకు వెళ్లిపోయేవారు. మరికొందరు పస్తులుండేవారు. ఈ పరిస్థితిని జగనన్న గోరు ముద్ద ద్వారా సీఎం జగన్ పూర్తిగా మార్చేశారు. శుచికరంగా, రుచికరంగా.. విద్యార్థులకు కడుపు నిండుగా భోజనం పెడుతున్నారు. 45 వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్లలో 36,88,610 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. అలాగే రూ.వెయ్యిగా ఉన్న వంటపని వారి భృతిని రూ.3 వేలకు పెంచారు. కొత్త మెనూ వచ్చాక మధ్యాహ్న భోజనం చేస్తున్న వారి సంఖ్య 9 శాతం పెరిగింది. గతంలో 87 శాతంలోపే ఉన్న హాజరు 94 శాతానికిపైగా పెరిగింది. కొత్త మెనూ వల్ల సర్కార్ అదనంగా రూ.1,048.57 కోట్లు ఖర్చు చేస్తోంది. -
ఏపీ: రెండేళ్లలో విద్యారంగంపై రూ.25,714 కోట్లు ఖర్చు
సాక్షి, అమరావతి: ‘‘ఉన్నత చదువులే పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి అని, చదువులకు చేసే ఖర్చంతా రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడే” అని బలంగా విశ్వసించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తే లక్ష్యంగా అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తోంది. మన విద్యార్ధులు మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని, వారి కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడాలని, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రపంచంతో పోటీపడి గెలవాలనే సమున్నత లక్ష్యంతో జగనన్న అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, మనబడి నాడు-నేడులో భాగంగా పాఠశాలల ఆధునికీకరణ, జగనన్న గోరుముద్ద తదితర పథకాల ద్వారా ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు అన్ని స్థాయిల్లో ఆర్థిక చేయూతనిస్తూ ప్రోత్సహిస్తోంది. జగనన్న అమ్మఒడి.. దేశ చరిత్రలోనే తొలిసారిగా తల్లుల గురించి, వారి పిల్లల చదువుల గురించి ఆలోచించిన ఏకైక ప్రభుత్వం ఏపీనే. పేదరికం కారణంగా ఏ తల్లీ తన బిడ్డలను బడికి పంపలేని పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో “జగనన్న అమ్మఒడి” పథకం ద్వారా పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా రూ.15 వేలు ఆర్థిక సహాయం... ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులందరికీ ఈ సాయం వర్తింపు... ఈ పథకం క్రింద రెండేళ్లలో 44,48,865 మంది విద్యార్థులకు రూ.13,022.90 కోట్ల సాయం నేరుగా తల్లుల ఖాతాల్లో జమ. 9వ తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు చదువుతున్న విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుండి వారి ఆప్షన్ మేరకు నగదు లేదా ల్యాప్ టాప్ అందించనుంది ప్రభుత్వం. జగనన్న విద్యా దీవెన పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశ చరిత్రలోనే తొలిసారిగా “జగనన్న విద్యాదీవెన” పథకం ద్వారా డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివే ఎస్.సి, ఎస్. టి, బి.సి, ఈబిసి, మైనార్టీ, కాపు, దివ్యాంగులు మరియు పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్... కాలేజీల్లో జవాబుదారీతనం పెంచడం, కాలేజీల్లో పరిస్థితులు, సమస్యలు, సదుపాయాలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ పెంపొందించడం కోసం అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సకాలంలో, ఏ బకాయిలు లేకుండా నాలుగు దఫాల్లో పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికంలోనే నేరుగా ఆ పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఈ పథకం క్రింద రెండేళ్లలో 18,80,934 మందికి రూ.4,879.30 కోట్ల లబ్ది చేకూర్చింది ప్రభుత్వం. జగనన్న వసతి దీవెన.. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులు అభ్యసించే పేద విద్యార్థులకు భోజన, వసతి ఖర్చుల నిమిత్తం “జగనన్న వసతి దీవెన” పథకం ద్వారా ఏటా రెండు విడతల్లో 20వేల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ, ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ.20వేల చొప్పున కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ వారి తల్లుల ఖాతాల్లో ఆర్థిక సాయం నేరుగా జమ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకం క్రింద రెండేళ్లలో 15,56,956 మందికి రూ.2,269.93 కోట్లు జమ చేసింది. జగనన్న విద్యా కానుక.. ప్రభుత్వ యాజమాన్యంలోని అన్ని పాఠశాలల్లో 1 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు “జగనన్న విద్యా కానుక” పథకం ద్వారా బడులు తెరవకముందే కుట్టుకూలితో సహా 3 జతల యూనిఫారాలు, స్కూల్ బ్యాగ్, టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, బెల్ట్, సాక్స్,షూస్ తో పాటు ఇంగ్లీష్-తెలుగు డిక్షనరీ అందిస్తుంది ప్రభుత్వం. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా బడి పిల్లలకు ఇన్ని వస్తువులతో కూడిన స్టూడెంట్ కిట్లు ఇస్తున్న మొట్టమొదటి, ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే. ఈ పథకం క్రింద రెండేళ్లలో దాదాపు 45 లక్షల మంది విద్యార్థులకు రూ.781 కోట్లతో లబ్ది చేకూర్చింది.. మనబడి ‘నాడు-నేడు.. ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను సమూలంగా మార్చివేసి మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమం మనబడి ‘నాడు-నేడు’. ఈ కార్యక్రమం క్రింద మూడు దశల్లో రూ.16,700 కోట్ల వ్యయంతో 45 వేల ప్రభుత్వ పాఠశాలలు, 471 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 151 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 3,287 ప్రభుత్వ హాస్టళ్లతో పాటు 28,169 అంగన్ వాడీ కేంద్రాల రూపు రేఖలు సమూలంగా మారనున్నాయి. మరో 27,438 అంగన్ వాడీలకు కొత్త భవనాలు ఏర్పాటు కానున్నాయి. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు రక్షిత త్రాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నీచర్, ప్రహారీ గోడలు, తరగతి గదులకు పెయింటింగ్, మరమ్మతులు, ఫినిషింగ్, గ్రీన్ బోర్డులు, ఫ్యాన్ లు, ట్యూబ్ లైట్లు, కిచెన్, ఆంగ్ల భాష నైపుణ్యాలు పెంపొందించేలా ఇంగ్లీష్ ల్యాబ్ వంటి మంచి వసతులు కల్పిస్తుంది. జగనన్న గోరుముద్ద.. రాష్ట్రవ్యాప్తంగా 45,854 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 36,88,618 మంది విద్యార్థులకు రూ.1,600 కోట్ల వ్యయంతో “జగనన్న గోరుముద్ద” పథకం ద్వారా నాణ్యమైన పౌష్టికాహారం, ప్రతి రోజూ మెనూ మార్చి రుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తుంది. విద్యారంగంలో చేపట్టిన మరిన్ని విప్లవాత్మక కార్యక్రమాలు : పేద విద్యార్థులు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు పాఠశాలల్లో ప్రాథమికస్థాయి నుండి ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధనను ప్రవేశపెట్టింది. విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు 2021-22 విద్యా సంవత్సరం నుండి సీబీఎస్ఈ సిలబస్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2021-22 విద్యా సంవత్సరం నుండి అన్ని డిగ్రీ కోర్సులలో ఇకపై ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన ప్రారంభించనుంది. అంగన్ వాడీలను “వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లు”గా అప్ గ్రేడ్ చేసి పీపీ1, పీపీ2, ప్రీ ఫస్ట్ క్లాసుల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన .... ఆట పాటలతో బోధన ద్వారా పిల్లల శారీరక, మానసిక వికాసానికి గట్టి పునాదులు వేస్తోంది ప్రభుత్వం. జూన్ 2019 నుండి ఇప్పటివరకు రెండేళ్లలో విద్యా రంగంపై మొత్తం రూ.25,714 కోట్లు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడు పథకం క్రింద ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారబోతున్న అంగన్ వాడీలలో పిల్లలు, తల్లుల పోషకాహారం కోసం మరో రూ.1,800 కోట్లు ఖర్చు చేస్తోంది. -
సర్కారు స్కూళ్లకు 2,93,388 సీలింగ్ ఫ్యాన్లు
సాక్షి, అమరావతి: విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పడుతోంది. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలూ ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన గురించి పట్టించుకోలేదు. తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘మన బడి నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా సర్కారు బడులను బాగు చేయడమే కాకుండా విద్యార్థులు, ఉపాధ్యాయులు కూర్చునేందుకు అవసరమైన ఫర్నిచర్‌ను పెద్దఎత్తున సమకూర్చుతున్నారు. ఒక పక్క స్కూలు భవనాల మరమ్మతులు నిర్వహిస్తూనే మరోపక్క బల్లలు, కుర్చీలు, టేబుళ్లతో పాటు సీలింగ్ ఫ్యాన్లు సమకూర్చుతున్నారు. అల్మారాలు, స్మార్ట్ టీవీలు, రక్షిత మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు లాంటి సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో దశాబ్దాల తరువాత రాష్ట్రంలో సర్కారు బడుల రూపురేఖలు మారుతున్నాయి. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా.. 2019 నవంబర్ 14వ తేదీన తొలిదశలో 15,715 స్కూళ్లలో మన బడి నాడు–నేడు పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు నాడు–నేడు తొలి దశ పనులకు రూ.2,580 కోట్లను వ్యయం చేశారు. పనులన్నీ శరవేగంగా సాగుతుండగా ఇప్పటికే çపనులు పూర్తయిన బడులు కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా కనిపిస్తున్నాయి. తొలి దశ నాడు నేడు పనులకు రూ.3,437 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అయితే ఎక్కడా రాజీలేకుండా పనులు చేస్తుండటంతో అంచనాలు పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెలాఖరుకు తొలిదశ పనులు పూర్తి ప్రభుత్వ పాఠశాలల దుస్థితి, విద్యార్థుల వెతలను పాదయాత్రలో స్వయంగా చూసిన ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాగానే మన బడి నాడు–నేడు ద్వారా చేపట్టాల్సిన పనులను నిర్దేశించారు. రూ.826.70 కోట్ల అంచనా వ్యయంతో రన్నింగ్ వాటర్‌తో కూడిన మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. తొలిదశలో 14,293 మరుగుదొడ్ల పనులు మంజూరయ్యాయి. తొలి దశ నాడు–నేడులో రూ.325.19 కోట్ల వ్యయంతో 14,474 రక్షిత మంచినీటి పనులను చేపట్టారు. ఈ నెలాఖరుకు తొలి దశ నాడు–నేడు పనులు పూర్తి చేయాలని ఇటీవల స్పందన కార్యక్రమం సమీక్షలో కలెక్టర్లు, జేసీలను ముఖ్యమంత్రి ఆదేశించారు. -
త్వరలో రెండో విడత నాడు-నేడు పనులు ప్రారంభం
-
స్కూళ్లలో పిల్లల హాజరుపై దృష్టి
సాక్షి, అమరావతి: స్కూళ్లలో పిల్లల హాజరు వివరాలను ప్రత్యేక యాప్ ద్వారా సేకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. స్కూళ్లకు పిల్లలు గైర్హాజరైతే వెంటనే ఎస్ఎంఎస్ ద్వారా తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్లాలని స్పష్టం చేశారు. రెండో రోజు కూడా పాఠశాలకు రాకపోతే నేరుగా సంబంధిత వలంటీర్‌ను ఆ పిల్లల ఇంటికి పంపి, ఎందుకు రాలేదో వివరాలను కనుక్కోవాలని చెప్పారు. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. మన బడి నాడు–నేడు, విద్యార్థుల హాజరు, గోరుముద్ద, మధ్యాహ్న భోజన పథకం, పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. స్కూళ్లు పునఃప్రారంభం, విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. విద్యార్థుల హాజరుపై యాప్‌ను రూపొందించారా? లేదా? అని ప్రశ్నించారు. ఫిబ్రవరి 15 నుంచి యాప్ ద్వారా పిల్లల హాజరు సేకరిస్తామని అధికారులు వెల్లడించారు. మన బడి నాడు–నేడు, మధ్యాహ్న భోజన పథకంపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్ నాడు–నేడు పనుల నాణ్యతలో రాజీపడొద్దు ► మన బడి నాడు–నేడు పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని, రెండో విడత నాడు–నేడు పనులకు సిద్ధం కావాలని సీఎం చెప్పారు. మొదటి విడతలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత సమర్థవంతంగా పనులు ప్రారంభించాలని సూచించారు. ► రెండో విడత నాడు–నేడు పనులను ఏప్రిల్ 15 నుంచి ప్రారంభిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ పనులను డిసెంబర్ 31లోగా పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. రెండో విడత నాడు – నేడు పనుల కోసం సుమారు రూ.4,446 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని తెలిపారు. ► మొదట విడత నాడు–నేడు కోసం సుమారు రూ.3,700 కోట్లు ఖర్చు చేస్తున్నామని, స్కూళ్లను బాగు చేయడానికి ఒక్క ఏడాదిలో ఇంత డబ్బు ఖర్చు చేయడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. గోరుముద్ద నాణ్యత బావుండాలి ► గోరుముద్ద (మధ్యాహ్న భోజన పథకం) కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ► భోజనం నాణ్యతలో రాజీ పడరాదని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణ సక్రమంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. టాయిలెట్ల నిర్వహణపై ఎస్వోపీ ► ‘టాయిలెట్ల నిర్వహణకు సులభ్ ఇంటర్నేషనల్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. తద్వారా వారు దాదాపు 49 వేల మంది సిబ్బందిని ఏర్పాటు చేస్తారు. టాయిలెట్ల నిర్వహణపై ఎస్వోపీ రూపొందించి దాని ప్రకారం నిర్వహణ సిబ్బందికి సులభ్ ఇంటర్నేషనల్ వారు శిక్షణ ఇస్తారు. నిర్వహణ సిబ్బంది కోసం ఏటా రూ.324 కోట్లు, పరికరాల కోసం రూ.54 కోట్లు, క్లీనింగ్ మెటీరియల్ కోసం రూ.35 కోట్లు ఖర్చు అవుతుంది. ఇందుకు సంబంధించి 15 రోజుల్లో టెండర్లు పిలుస్తాం’ అని అధికారులు తెలిపారు. ► ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వి.చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రిసెల్వి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇక ఉదయం 9 గంటల నుంచే పాఠశాలలు రాష్ట్రంలోని పాఠశాలలన్నీ ఉదయం 9 గంటల నుంచే ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఉదయం వేళ సాధ్యమైనంత త్వరగా స్కూళ్లలో బోధన ప్రారంభించడం మంచిదని సూచించారు. ఉదయం పూట పిల్లల్లో చురుకుదనం బాగా ఉంటుందని, వారి మెదడు కూడా విషయాలను శీఘ్రంగా గ్రహించగలుగుతుందని, ఆ సమయంలో పాఠ్యబోధన సాగిస్తే పిల్లలు ఆయా అంశాలను త్వరితంగా, లోతుగా అవగాహన చేసుకోగలుగుతారన్నారు. ప్రపంచంలో పాఠశాలలన్నీ ఉదయం 8 లేదా 8.30 గంటలకల్లా ప్రారంభమవుతున్నాయని, అందుకు భిన్నంగా రాష్ట్రంలో ఆలస్యంగా 9.30కు ప్రారంభం కావడం వల్ల అనుకున్న ఫలితాలను సాధించడానికి వీలుండదన్న చర్చ జరిగింది. ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే వాటిని పరిష్కరించుకొని రాష్ట్రంలో కనీసం 9 గంటలకల్లా స్కూళ్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉదయం త్వరగా ప్రారంభించి, ఆ మేరకు సాయంత్రం త్వరగా తరగతులు ముగించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కాగా, పాఠశాలల వేళలపై గురువారం ఉత్తర్వులు జారీ చేస్తామని విద్యాశాఖ అధికారులు వివరించారు. -
ఏప్రిల్ 1 నుంచి రెండో విడత మనబడి నాడు–నేడు
సాక్షి, అమరావతి: మనబడి నాడు–నేడు కింద రెండో విడత పనులు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. 9,476 ప్రైమరీ పాఠశాలలు, 822 అప్పర్ ప్రైమరీ స్కూళ్లు, 2,771 రెసిడెన్షియల్ స్కూళ్లు, హైస్కూళ్లు, 473 జూనియర్ కాలేజీలు, 1,668 హాస్టళ్లు, 17 డైట్ కాలేజీలు, 672 ఎంఆర్‌సీఎస్, 446 భవిత కేంద్రాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. మనబడి నాడు–నేడు కార్యక్రమాలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. వీటి నిర్వహణకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి, కేర్ టేకర్‌కు సగటున రూ.6 వేలు చెల్లిస్తామని చెప్పారు. టాయిలెట్లను శుభ్రపరిచే సామగ్రితో కలుపుకుని ఒక్కో స్కూలుకు రూ.6,250 నుంచి రూ.8 వేల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. వెయ్యికి పైగా విద్యార్థులున్న పాఠశాలల్లో టాయిలెట్ కేర్ టేకర్లు నలుగురు ఉంటారని తెలిపారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. పాఠ్యపుస్తకాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి తానేటి వనిత అంగన్వాడీల్లో మార్చిలో తొలి దశ పనులు ► అంగన్వాడీ కేంద్రాల్లో నాడు– నేడు కింద 2021 మార్చిలో మొదటి దశ పనులు మొదలు పెట్టి, రెండున్నరేళ్లలో మొత్తం పనులు పూర్తి చేసేలా నిర్ణయించాం. తొలి విడతలో 6,407 కొత్త అంగన్వాడీల నిర్మాణం, 4,171 అంగన్వాడీల్లో అభివృద్ధి పనులు చేపడతాం. ► మొత్తం 27,438 కొత్త అంగన్వాడీ భవనాలు నిర్మించడంతో పాటు 16,681 చోట్ల అభివృద్ధి పనులను చేపడుతున్నాం. ఇందుకోసం మొత్తంగా సుమారు రూ.5 వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనా. వైఎస్సార్ ప్రీ ప్రైమరీలు ► అంగన్వాడీ కేంద్రాలను వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారుస్తున్న నేపథ్యంలో చిన్నారుల కోసం రూపొందించిన పుస్తకాలను మంత్రి ఆదిమూలం సురేష్, అధికారులు సీఎంకు చూపించారు. ► పుస్తకాల నాణ్యత బాగుండాలని అధికారులను సీఎం ఆదేశించారు. పిల్లలకు జిజ్ఞాస పెంచేలా, బోధన కోసం ప్రత్యేక వీడియోలు రూపొందించామని అధికారులు తెలిపారు. జగనన్న విద్యాకానుక ► వచ్చే ఏడాది ఇవ్వాల్సిన విద్యాకానుకపైనా సీఎం సమీక్షించారు. స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే రోజునే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ► స్కూలు యూనిఫామ్స్ సహా దేంట్లోనూ నాణ్యత తగ్గకుండా చూడాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ఏడో తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం ప్రారంభమవుతుందన్నారు. ► ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్ నీలం సాహ్ని, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.