మోడీకి శ్రీవారి ఆశీస్సులు | ove and blessings Modi ' by tirumala srivarulu | Sakshi
Sakshi News home page

మోడీకి శ్రీవారి ఆశీస్సులు

Published Tue, May 27 2014 2:58 AM | Last Updated on Wed, Apr 3 2019 4:08 PM

మోడీకి శ్రీవారి ఆశీస్సులు - Sakshi

మోడీకి శ్రీవారి ఆశీస్సులు

న్యూఢిల్లీ/తిరుమల: నరేంద్ర మోడీకి ఢిల్లీలో సోమవారం టీటీడీ అర్చకులు, వేద పండితులు శ్రీవారి ఆశీస్సులు అందజేశారు. జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు నేతృత్వంలో ఆలయ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి, అర్చకులు, వేదపండితుల బృందం గుజరాత్ భవన్‌లో ఉదయం 10 గంటలకు మోడీ, రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కారీ, అరుణ్ జైట్లీలకు ఆశీర్వాదాలు అందించారు. మోడీ, ఆయన మంత్రిమండలి విజయవంతంగా పదవిలో కొనసాగాలని వేదపండితులు ఆశీర్వదించారు.

శ్రీవేంకటేశ్వరుడి పాదాల వద్ద ఉంచిన శేషవస్త్రాన్ని మోడీకి బహూకరించి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. స్వామివారి దర్శనానికి రావాలని మోడీని జేఈవో ఆహ్వానించగా.. స్వామి ఆశీస్సుల కోసం త్వరలోనే తిరుమల వస్తానని ఆయన చెప్పారు. ‘ప్రమాణ స్వీకారానికి ముందు తిరుపతి బాలాజీ ఆశీస్సులు అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఆనందంగా ఉంది.  టీటీడీకి కృతజ్ఞతలు’ అని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement