
మల్లేశ్వరునికి కార్తీక పూజలు
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయంలో శుక్రవారం స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. శివ పంచాక్షరీ జపం, లక్ష్మీగణపతి మంత్రజపం, కాఠక పారాయణం, త్రికాలాభిషేకాలు, రుద్రహోమం, లక్ష బిల్వార్చన, సహస్ర లింగార్చన జరిగాయి. పలువురు ఉభయదాతలు రుద్రహోమం, సహస్ర లింగార్చనలో పాల్గొని తరించారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఓంకారం స్టాండ్‌లో దీపాలను వెలిగించారు.