సాక్షి, అమరావతి: ఆలయాల జీర్ణోద్ధరణతో పాటు అర్చకుల సంక్షేమ కార్యక్రమాల కోసం టీటీడీ ప్రతి ఏటా రూ.50 కోట్లు చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడంపై ఏపీ అర్చక సమాఖ్య హర్షం వ్యక్తం చేసింది. గత టీడీపీ ప్రభుత్వం అర్చకుల సంక్షేమాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదని తెలిపింది.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అర్చకుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వివిధ నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబులు శనివారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చదవండి:
వ్యవసాయ రంగానికి ఏపీ ప్రభుత్వం సేవలు.. దేశంలోనే నంబర్ వన్
టీడీపీ అప్పులతోనే తిప్పలన్నీ..
Comments
Please login to add a commentAdd a comment