పెద్దపట్నం... అగ్నిగుండం | Seriously exposition Jatara | Sakshi
Sakshi News home page

పెద్దపట్నం... అగ్నిగుండం

Published Tue, Jan 20 2015 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 7:55 PM

Seriously exposition Jatara

వైభవంగా మల్లన్న జాతర
శివసత్తులు, భక్తులతో కిక్కిరిసిన ఆలయం
మార్మోగిన మల్లికార్జునుడి నామస్మరణ
భక్తి భావాన్ని నింపిన మల్లన్న ఒగ్గు కథ
బండారి మయమైన రహదారులు
 

చేర్యాల : కొమురవెల్లి మల్లికార్జునుడి జాతర బ్రహ్మోత్సవాలు సోమవారం పతాకస్థారుుకి చేరుకున్నారుు. పట్నం వారం సందర్భంగా మల్లన్న ఆలయంలో సోమవారం పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమం వైభవంగా కొనసాగింది. ఉద యం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆలయ రాజగోపురం, గంగిరేగు చెట్టు మధ్య భాగంలో మాణిక్య యాదయ్య యాదవ్, బండారు దుర్గారాజు ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన యాదవ భక్తులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఒగ్గు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడూరి సత్యనారాయణ చెప్పి మల్లన్న కథ భక్తుల్లో భక్తిభావాన్ని నింపింది. అగ్నిగుండాల కోసం సుమారు ఐదు క్వింటాళ్ల సమిధలను పేర్చి... వాటిని భగభగమండే నిప్పురవ్వలుగా తయారు చేశారు.

ఆ తర్వాత అర్చకులు మల్లికార్జున్, సాంబయ్య ఆలయ గర్భగుడిలోని ఉత్సవ విగ్రహాలను అగ్నిగుండాలు, పెద్దపట్నం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఉత్సవ విగ్రహా లకు వీరితోపాటు ఆలయ అధికారులు, డీఏస్పీ సురేందర్, సీఐ వెంకటేశ్వర్‌రెడ్డి, ఏఈఓ అంజయ్య తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ యాదవ భక్తులు పెద్దపట్నం, అగ్నిగుండాల చుట్టూ పసుపు నీళ్లు చల్లి అష్టదిగ్బం దనం చేశారు. అనంతరం ఆలయ అర్చకుడు మల్లికార్జున్‌తోపాటు పలువురు ఉత్సవ విగ్రహాలను పట్టుకుని ముందుగా పెద్దపట్నం, ఆ తర్వాత అగ్నిగుండాలను దాటారు. వారిని శివసత్తులు, యాదవ భక్తులు మల్లన్న నామస్మరణ చేస్తూ అనుసరించారు. జానపదుల వీడియో ఆల్బమ్‌లో మల్లన్నగా నటించిన, సినీనటుడు లాలాజీ ఘన్‌శ్యాం అగ్ని గుండాలను దాటారు.
 
అంతా బండారు మయం

అగ్నిగుండాలను కనులా వీక్షించేందుకు వచ్చిన మల్లన్న శివసత్తులతో గంగిరేగు చెట్టు వద్ద ఉన్న మూడు గ్యాలరీలు నిం డిపోయూరుు. పలువురు శివసత్తులు, భక్తులను రాజగోపు రం వద్దనే నిలపివేయడంతో తోటబావి, పోలీస్ బొమ్మ, పెద్దమ్మ ఆలయూనికి వెళ్లే రహదారులు కిక్కిరిసిపోయూరుు. శివసత్తులు నుదుట, తలపై పసుపు చల్లుకోవడంతో ఆల య ప్రాంగణంతోపాటు ఆ రోడ్లన్నీ బండారి మయమయ్యూయి. రాజగోపురం బయట ఉన్న భక్తులు అగ్నిగుండం దాటేందుకు రెండు గంటల సమయం పట్టడడంతో తీవ్ర ఇబ్బం దులు పడ్డారు. రాజగోపురం వద్ద స్వల్ప తోపులాట చోటుచేసుకోగా.. పందిరి కట్టెలు విరిగిపోయూరుు. పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఏస్పీ సురేందర్ ఆధ్వర్యంలో సీఐ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐ రవీందర్ పర్యవేక్షించారు. అగ్నిగుండాలు దాటుతూ హైదరాబాద్‌కు చెందిన యాదమ్మ పడిపోరుుంది. సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం నుంచి తప్పించుకుంది. కార్యక్రమం అనంతరం ఆనవాయితీ ప్రకారం హైదరాబాద్ యాదవ భక్తులు, శివసత్తులకు ఆలయ  ఏఈఓ అంజయ్య, సూపరింటెండెంట్ నీల చంద్రశేకర్, వైరాగ్యం జగన్ తదితరులు కొత్త బట్టలు అందజేసి సన్మానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement