Komuravelli
-
కొమురవెల్లి మల్లికార్జునస్వామి మూలవిరాట్ దర్శనాలు నిలిపివేత
-
నా బిడ్డలు నాకు కావాలి.. పీఎస్ ఎదుట ఎస్ భార్య నిరసన
కొమురవెల్లి(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా కొమురవెల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్ఐ నాగరాజు భార్య మానస మంగళవారం ఆందోళనకు దిగింది. తన భర్త రెండో పెళ్లి చేసుకొని, ఇద్దరు కుమారులను తీసుకెళ్లాడని, న్యాయం చేయాలని కోరింది. బాధితురాలి కథనం ప్రకారం.. ఎస్ఐ నాగరాజు తనను పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారని మానస తెలిపింది. రెండేళ్ల నుంచి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడని, అనంతరం రెండో పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. తన ఇద్దరు పిల్లను దూరం చేసి మరో సంసారం చేస్తూ తనకు అన్యాయం చేస్తున్నాడని వాపోయింది. రెండేళ్ల క్రితం కరీంనగర్లో పెట్టి తన ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి విడాకులు ఇవ్వాలని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అన్నారు. దీంతో తాను ఆత్మహత్యకు యత్నించగా.. పిల్లలను తనకు ఇప్పించి న్యాయం చేస్తామని బంధువులు చెప్పడంతో విరమించినట్లు తెలిపింది. ఈ విషయమై సిద్దిపేట సీపీ, చేర్యాల సీఐ, కరీంనగర్ మహిళ స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తకు ఫోన్ చేస్తే నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాడని పేర్కొంది. బంధువులతో కలిసి కొమురవెల్లి పోలీస్‌స్టేషన్‌కు రాగా ఎస్ఐ ఆరు రోజులుగా సెలవులో ఉన్నాడని చెప్పారని తెలిపింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని చెప్పింది. సీఐ శ్రీనివాస్ వివరణ కోరగా.. ఇటీవల మానస ఈ విషయం తన దృష్టికి తీసుకువచి్చందని, కౌన్సెలింగ్ ఇచ్చామని, ఉన్నత అధికారుల ఆదేశాసుసారంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
Komuravelli : వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం (ఫొటోలు)
-
తెలంగాణ గుళ్లకు ఐటీ శాఖ నోటీసులు
సాక్షి, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట: తెలంగాణలోని పలు ప్రముఖ దేవాలయాలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఆదాయపు పన్ను కట్టాలంటూ కొమురవెల్లి, రాజన్న, బాసర ఆలయాలకు నోటీసులు పంపించింది. ఈ జాబితాలో కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయం తొలి స్థానంలో ఉంది. రూ. 8 కోట్ల ట్యాక్స్ కట్టాలని, సకాలంలో పన్ను కట్టనందువల్ల మరో రూ. 3 కోట్ల జరిమానా కూడా చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఐటీ రిటర్న్‌లు, 12ఏ రిజిస్ట్రేషన్ గడువు గత నెల 30వ తేదీతో ముగిసింది. రిటర్న్స్, 12ఏ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడంతో ఈ నోటీసులను జారీ చేశారు. అదే విధంగా వేములలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాలనికి కూడా ఐటీశాఖ నోటీసులు జారీచేసింది. లెక్క ప్రకారం ఆదాయ పన్నును చెల్లించాలంటూ నోటీసులు పంపించింది. ఇక బాసరలోని సరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు ఇంకా పలు దేవాలయాలకు కూడా నోటీసులు అందాయి. మరోవైపు ఆలయాలకు ఐటీ నోటీసులు ఇవ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార సంస్థలు, వ్యక్తుల విషయంలో వ్యవహరించినట్టు ఆలయాలపై కఠిన వైఖరిని అవలంబించడం సరైన విధానం కాదని అంటున్నారు. పన్నులు ఎగ్గొట్టే వ్యాపారులను వదిలిపెట్టి ఆధ్యాత్మిక కేంద్రమైన దేవాలయాకు పన్ను కట్టాలని నోటీసులు ఇవ్వడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. చదవండి: ఈనెల రెండో వారంలో తెలంగాణకు రాహుల్ గాంధీ -
బండ సొరికలలో గుండుకు వెలిసిన కొమురెల్లి మల్లన్న!
మాదిరాజు- మాదమ్మ దంపతుల సంతానంగా చెప్పబడే మల్లికార్జునుడిని పరమశివుడి అవతారంగా భావించి కొలవడం వీర శైవ సంప్రదాయం. సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే మార్గంలో సిద్ధిపేట సమీపంలో నున్న కొమురవెల్లిలో మల్లికార్జునుడు 'బండ సొరికలలో గుండుకు వెలిసిన మల్లన్నదేవుడి' గా ఇరుపక్కల గొల్ల కేతమ్మ, లింగబలిజ మేడలమ్మ దేవేరులతో పూజలందుకుంటున్నాడు. ఈ క్షేత్రానికి ప్రధానంగా వచ్చే భక్తులు యాదవ, గొల్ల, కురుమ, లింగబలిజలని చెప్పవచ్చు. కొమురవెల్లికి దాదాపు 20 కి మీ దూరంలోనున్న' కొండ పోచమ్మ'ను మల్లన్న స్వామి అక్కగా భావించి భక్తులు అక్కడికీ వెళ్తుంటారు. ప్రతియేటా సంక్రాతి నుండి ఉగాది వరకు జరిగే ఈ జాతరలో మొదటి ఆదివారం 'లష్కర్ బోనాల'కు హైదరాబాద్ నుంచి యాదవులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. గంగరేణి చెట్టు కింద పట్నాలు మల్లన్న ఆలయం ముందున్న గంగరేణి చెట్టు కింద జరిగే పట్నాలు అనబడే ముగ్గు పూజలు విశేషమైనవి. పసుపు రంగు బట్టలు వేసుకొని, జగ్గువాద్యం పట్టుకున్న ఒగ్గు పూజారులు విశాలమైన ముగ్గులు వేసి మధ్యలో స్వామిని పెట్టి, ఆవాహనం చేసి పూజలు చేస్తుంటారు. బహు పాత్రాభినయం చేస్తూ, గ్రామీణుల భాషలో, పిట్ట కథలు జోడించి, ఆడుతూ పాడుతూ ఒగ్గులు చెప్పే కథలు విన సొంపుగా ఉంటాయి. జాతర చివరలో కామదహనం ఈ కళలో ప్రసిద్దులైన వారు, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అసలు సిసలు తెలంగాణ కళాకారులు వరంగల్‌కు చెందిన చుక్క సత్తయ్య ( 1935-2017), కరీంనగర్ మిద్దె రాములు( 1941-2010) లాంటివారు. కొమురెల్లి జాతర చివరలో కామదహనం ఉంటుంది. అగ్ని ప్రతిష్ఠ చేసి, కణకణ మండే నిప్పులు తొక్కుతూ అగ్ని గుండాలు దాటడం వీరశైవ ఆచారం. 'శివసత్తుల' ఆచారం మల్లన్న ఆలయ ప్రాంగణంలోనే వున్న చిన్న ఉపాలయం రేణుకా చార్యుడిది. వీర శైవ సంప్రదాయం లోని పంచాచార్యులలో రేణుకాచార్య ప్రధముడు. వీర శైవులు పవిత్ర గ్రంధంగా భావించే 'శ్రీ సిద్ధాంత శిఖామణి'ని బోధించింది వీరే నంటారు. తెలుగు రాష్ట్రాల్లోని వృత్తి కులాలవారు చాలా మంది శైవ సంప్రదాయికులే కావడం, ముఖ్యంగా తెలంగాణలో యాదవ కులాలవారు ఆ రోజుల్లనే వీరశైవం వైపు ఆకర్శించబడడం, 'శివసత్తుల' ఆచారం వంటి అంశాలు ఆసక్తికరం, పరిశోధకులు దృష్టి పెట్టాల్సిన విషయాలు. 'మల్లన్నసాగర్ ' పేరిట కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన జలాశయానికి 'మల్లన్నసాగర్ 'అని పేరు పెట్టడమే కాకుండా,గత సంవత్సరం ఫిబ్రవరిలో ఆ నీటితోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వామి పాదాలు కడిగితే, అదేయేడు డిసెంబర్లో రాష్ట్ర మంత్రి హరీష్ రావు ప్రభుత్వం తరపున కోటి రూపాయలు విలువైన బంగారు కిరీటాన్ని మల్లన్న కల్యాణ వేడుకల్లో సమర్పించారు. -వేముల ప్రభాకర్, అమెరికా నుంచి -
వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం జరిగిన స్వామివారి కల్యాణ వేడుకలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా నుంచి 30 వేలమంది భక్తు లు తరలివచ్చారు. వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం మల్లికార్జునస్వామి, బలిజె మేడలమ్మ, గొల్ల కేతమ్మకు మధ్యాహ్నం 12.11 గంటలకు వివాహం జరిగింది. స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలు సమర్పించారు. కల్యాణం కాగానే మంత్రులు గర్భగుడిలోని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిధుల నుంచి రూ.90 లక్షలతో చేయించిన బంగారు కిరీటాన్ని స్వామి వారికి అలంకరించారు. రూ.రెండుకోట్లతో విస్తరించిన ముఖ మండపాన్ని కూడా ప్రారంభించారు. అంతకుముందు కల్యాణ వేదిక వద్ద భక్తులనుద్దేశించి మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కొమురవెల్లి మల్లన్న దయతోనే పూర్తయిందన్నారు. వచ్చే ఏడాది జరిగే కల్యాణం నాటికి మేడలమ్మ, కేతమ్మ అమ్మవార్లకు కూడా బంగారు కిరీటాలు చేయిస్తామని హామీ ఇచ్చారు. స్వామివారి కల్యాణంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నాగపూరి రాజలింగం తదితరులు హాజరయ్యారు. -
ఘనంగా మల్లన్న పెద్ద పట్నం ఫొటోలు
-
ఘనంగా కొమురవెల్లి మల్లన్న జాతర ఫొటోలు
-
రెండు బైకులు ఢీ.. ఇద్దరు మృతి
సాక్షి, సిద్దిపేట: కొమురవెల్లి మండలం దానంపల్లి గ్రామ శివారులో ఎదురెదురుగా వెళ్తున్న రెండు బైకులు పరస్పరం ఢీ కొనడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిపాలయ్యారు. ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతులను దానంపల్లి గ్రామానికి చెందిన బండి శేఖర్, చిట్యాల గ్రామానికి చెందిన గొర్లకాడి స్వామిగా గుర్తించారు. స్వామితోపాటు బైక్ ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
మల్లన్నను కేసీఆర్ మోసం చేశారు : కోమటిరెడ్డి
సాక్షి, సిద్దిపేట : కొమురవెల్లిలో డబుల్ రోడ్లు వేస్తానని, రింగ్ రోడ్డు నిర్మాణం చేపడతానని ప్రగల్బాలు పలికిన సీఎం కేసీఆర్ ప్రజలతో పాటు కొమురవెల్లి మల్లన్నను మోసం చేశారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. ఆదివారం కొమురవెల్లి మల్లన్నను దర్శించుకొన్న వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మల్లన్న ఆశీస్సులతో రైతులు, ఇక్కడికి వచ్చే భక్తులు సుఖసంతోషాలతో ఉండాలని తాను మల్లన్న స్వామిని కోరినట్లు కోమటిరెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ పాలన చేపట్టి 6 సంవత్సరాలు గడుస్తున్నా కొమురవెల్లిలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని వెల్లడించారు. కమీషన్ల ప్రాజెక్టులకు రూ.200 కోట్లు కేటాయించే కేసీఆర్ దేవాలయానికి కేటాయించడా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చైనా సరే కొమురవెల్లిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కొందరు రాజకీయాలు చేసి మల్లన్న శైవక్షేత్రం పక్కనే శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని, దేవాలయం పక్కన శ్మశానవాటికను నిర్మించొద్దని తాను కలెక్టర్‌ను కలిసి కోరినట్లు తెలిపారు. అందుకు కలెక్టర్ వెంటనే స్పందిస్తూ అక్కడ శ్మశాన వాటికను ఏర్పాటు చేయమని తనకు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అడిషనల్ డిసిపి నర్సింహారెడ్డి అక్రమ అరెస్టును తాను తీవ్రంగా ఖండిసున్నట్లు కోమటిరెడ్డి వెల్లడించారు. హరీశ్‌రావు వెంటనే డిసిపి అరెస్టుపై స్పందించాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. -
తల్లిదండ్రులు మందలించారని...
సాక్షి, కొమురవెల్లి: నేడు తల్లిదండ్రులు పిల్లలని ఏమాత్రం అనలేని పరిస్థితి. చిన్న మాట అన్నాకూడా ఆత్మహత్యలకు పాల్పడి నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. తాజాగా తల్లిదండ్రులు మందలించారని ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో జరిగింది. జనాదికుంట కుమార్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రెండో కుమారుడు ప్రవీణ్(19) డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. గత నాలుగైదు రోజులుగా కాలేజీకి వెళ్లకుండా ఇంటి దగ్గర చిల్లర తిరుగుళ్లు తిరుగుతుండడంతో వ్యవసాయ బావి వద్దకు పోయి పనిచేయొచ్చు కదా అంటూ తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన ప్రవీణ్ బావి వద్దకు వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రలు మందలించడమే తమ తప్పయిందంటూ రోదించారు. -
కొమురెల్లి కోరమీసాల మల్లన్న
పుణ్య తీర్థం కొండ చెరికలో ఉన్న కోరమీసాల కొంరెల్లి మల్లన్నను కొలిచిన వారికి కొంగు బంగారమే.. మల్లన్న దర్శనం పుర్వజన్మ సుకృతం అంటారు. తెలంగాణలో ప్రతి జిల్లా నుండి భక్తులు తండోపతండాలుగా వచ్చి సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో ఉన్న మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. స్థల పురాణం కొమురవెల్లి మల్లన్న ఈ పర్వతంపై 11వ శతాబ్దంలో వెలసినట్లు ప్రతీతి. యాదవ కులస్తుడైన ఓ గొర్రెల కాపరి కలలో స్వామి కన్పించి నేను ఇంద్రకీలాద్రిపై వెలసి ఉన్నాను. దర్శించుకొమ్మని, కొలిచిన వారి కొర్కెలు తీరుస్తానని చెప్పినట్లు ప్రచారం. అనాటి నుండి ఆ ప్రాంతం ప్రజలు పూజలు చేయడం మొదలు పెట్టారు. అప్పటికే వీరశైవ సాంప్రదాయం విరాజిల్లుతున్న కాకతీయుల సామ్రాజ్యంలో అంతర్భాగమైన కొముర వెల్లిలో వెలసిన మల్లికార్జున స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేశారని ఇక్కడి పూజారులు చెబుతుంటారు. చెక్కు చెదరని పుట్టమట్టి విగ్రహం ఇంద్రకీలాద్రిపై కొండ చెరికలో వెలసిన మల్లన్న దేవునికి పూజలు మొదలై ఐదు వందల యేళ్లయింది. విచిత్రం ఏమిటంటే... 500 సంవత్సరాల క్రితం పుట్టమట్టితో విగ్రహాన్ని తయారు చేశారు. దేవుడికి కోరమీసాలు కూడా పెట్టారు. అది ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఈ విగ్రహం నాభిలో శివలింగం ఉండటం ప్రత్యేకత. యాదవుల ఆడబిడ్డ గొల్ల కేతమ్మ, లింగ బలిజల ఆడబిడ్డ బలిజ మేడలమ్మను పాణిగ్రహణం చేసుకొని స్వామి ఇక్కడ వెలిసినట్లు నానుడి. అందుకోసమే స్వామి వారికి ఇరుపక్కల గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మల విగ్రహాలు ఏర్పాటు చేశారు. పట్నాల మల్లన్న దేవస్థానంలో వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం లింగ బలిజలు అర్చన చేయగా, స్వామి వారికి యాదవ కుల ఆచారం ప్రకారం ఒగ్గు పూజారులు వివిధ రంగుల, రంగాలంకార పట్నాలతో స్వామి వారిని కొలుస్తారు. అనంతరం బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలతో స్వామివారికి అంగరంగ వైభవంగా కల్యాణం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులు స్వయంగా నివేదన తయారు చేసి ఒగ్గు పూజారుల ద్వారా పట్నం వేయించడం విశేషం. స్వామి వారికి బోనం చేసే కుండను భద్రంగా ఇంటికి తీసుకెళ్లి దాంట్లో పాలు పితకడం, పాలు కాచడం చేస్తే ఆ కుటుంబంలో ఆయురారోగ్యాలతోపాటు, అష్ట ఐశ్వర్యాలు చేకూరతాయని, పశుసంపద, పాడిపంటలతో ఆ ఇల్లు తులతూగుతుందని విశ్వాసం. అదేవిధంగా గంగరేగు చెట్టు, ఒళ్లు బండ ఇక్కడ ప్రత్యేకత. గంగరేగు చెట్టుకు ప్రదక్షిణ చేసి ఒళ్లు బండ వద్ద ప్రణమిల్లి చెట్టు వద్ద పట్నం వేసిన వారి కోరికలు తీరుతాయని నమ్మకం. కోర్కెలు తీరాలని కొబ్బరి కాయల ముడుపులు కట్టడం అనవాయితీ. తడి బట్టలతో దేవాలయం ముందుండే ఒళ్లు బండ వద్ద ఒళ్లుపట్టుకుని, కోడెలు కట్టేస్తామని మొక్కిన వారికి సంతానం కల్గుతుందని నమ్మకం. స్వామివారి బండారి, గంగిరేగు చెట్టు ఆకు ఎంతో మహిమ గలవని, బండారి నుదుట పెట్టుకొని గంగిరేగు ఆకును ఔషధంగా తీసుకుంటే సర్వరోగాలు తొలగిపోతాయని విశ్వాసం. కన్నుల పండుగగా.. మల్లన్న కల్యాణం తెలంగాణ ప్రజల ఇలవేల్పుగా మొక్కే కొంరెల్లి మల్లన్న కల్యాణం ప్రతి సంవత్సరం కన్నుల పండుగగా జరుగుతుంది. మార్గశిర బహుళ ద్వాదశి స్వామివారి దృష్టికుంభం (బలిహరణము) నుండి మొదలయ్యే ఉత్సవాలు మార్గశిర బహుళ ద్వాదశిరోజు కల్యాణం, ఏటా మహాశివరాత్రి రోజు పెద్దపట్నం, ఫాల్గుణ మాసం బహుళ త్రయోదశి రోజు అగ్నిగుండాల ప్రజ్వలన మొదలైన ప్రత్యేక కార్యక్రమాలు, ప్రతి రోజు స్వామివారికి అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇలా చేరుకోవచ్చు ప్రసిద్ధ కొమురెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో ఉంది. హైదరాబాద్ నుండి రాజీవ్ రహదారి మీదుగా 80 కిలోమీటర్లు, వరంగల్ నుండి జనగామ మీదుగా 110 కిలోమీటర్లు, కరీంనగర్ నుండి సిద్దిపేట మీదుగా వస్తే 80 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఈ క్షేత్రానికి ఇలా వెళ్లాలి వైఎస్ఆర్ జిల్లాలో వేంపల్లె సమీపంలో ఉన్న గండి వీరాంజనేయస్వామి క్షేత్రానికి పలు మార్గాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక నుండి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారు. కడప నుండి వేంపల్లె మీదుగా గండికి (53కి.మీ) చేరుకోవచ్చు. అలాగే తిరుపతి నుంచి రాయచోటి, లక్కిరెడ్డిపల్లె మీదుగా గండి క్షేత్రానికి చేరుకోవచ్చు. మదనపల్లె, పీలేరు ప్రాంత వాసులు రాయచోటి మీదుగా గండికి చేరుకోవచ్చు. అలాగే కదిరి, పులివెందుల, వేంపల్లె మీదుగా గండికి చేరుకొనే మార్గాలు ఉన్నాయి. – ఈరగాని భిక్షం సాక్షి, సిద్దిపేట -
కొమురవెల్లిలో భక్తుల రద్దీ
సిద్దిపేట: ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాలు ముగిసినా స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. సిద్దిపేట, జనగామ, వరంగల్, హైద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాల నుంచి భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయంలోని గంగిరేగు చెట్టు ప్రాంగణం, ఆలయ ముఖమండపం, రాతిగీరలు, రాజగోపురం, కోడెల స్తంభం వద్ద భక్తుల రద్దీ నెలకొంది. కొందరు భక్తులు స్వామి, బలిజమేడలాదేవి, గొల్లకేతమ్మలకు ఒడి బియ్యం పోయగా మరికొందరు భక్తులు స్వామివారికి అభిషేకాలు, కల్యాణం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలోని గంగిరేగు చెట్టు వద్ద పట్నాలు వేయించుకున్నారు. స్వామి ధర్మదర్శనానికి రెండు నుంచి మూడు గంటల సమయం పట్టింది. ప్రత్యేక దర్శనం గంటలోపు జరిగింది. మల్లన్నకు మొక్కులు అప్పగించిన తర్వాత భక్తులు మల్లన్న గుట్టపై శ్రీ రేణుక ఎల్లమ్మ, నల్ల పోచమ్మలకు బోనాలు అప్పగించి ఒడి బియ్యాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. -
కొమురవెల్లిలో ఘనంగా ‘పెద్దపట్నం’
కొమురవెల్లి: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మల్లికార్జునస్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా పెద్దపట్నం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో ఆలయ గర్భగుడిలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. కల్యాణ మండపం ఎదుట లింగోద్భవ కాలం అర్ధరాత్రి 1.27 నిమిషాలకు పెద్దపట్నాన్ని మైలపోలుతో ఒగ్గు పూజారులు ప్రారంభించారు. సుమారు ఐదు గంటల పాటు మల్లన్న నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ముగిసిన వెంటనే స్వామివారి ఉత్సవ విగ్రహాలను పల్లకి సేవలో ఊరేగించారు. పెద్దపట్నం వద్ద విగ్రహాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు, శివసత్తులు పెద్దపట్నం దాటుతూ మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దపట్నం దాటే సమయంలో భక్తులు ఒక్కసారిగా భారీ గేట్లపై నుంచి పెద్దపట్నం వరకు రావడంతో తోపులాట జరిగింది. దీంతో పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. -
కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో దోపిడి
-
కొమురవెల్లిలో భక్తుల సందడి
చేర్యాల : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొం ది. ఆదివారం తెలంగాణలోని వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మల్లన్నను దర్శించుకుని పూజలు చేశారు. అలా గే ఆలయంలోని గంగిరేగు చెట్టు కింద పట్నాలు వేసి, స్వామివారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, కొంత మంది భక్తులు శ్రీమల్లికార్జునస్వామి, బలిజమేడలాదేవికి, గొల్లకేతమ్మకు ఓడిబియ్యం పోశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో స్వామివారిని దర్శిం చుకునేందుకు సుమారు గంట సమయం పట్టింది. ఇదిలా ఉండగా, ఆలయ అధికారులు భక్తుల సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. -
కొమురవెల్లిలో విలీనం చేయొద్దు
జగదేవ్‌పూర్: మండలంలోని కొండపోచమ్మ దేవాలయన్ని నూతనంగా ఏర్పాటు చేస్తున్న కోమురవెల్లి మండలంలో కలుపవద్దని పీఆర్టీయు మండలాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, ప్రధాన కారద్యర్శి శశిధర్‌శర్మ గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు అన్నారు. రెండు పుణ్యక్షేత్రాలు ఉన్నందునే జగదేవ్‌పూర్ మండలానికి గుర్తింపు వచ్చందని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పడుతున్న మర్కూక్ మండలంలోకి జగదేవ్పూర్నకు చెందిన ఐదు గ్రామాలు విలీనమవుతున్నాయని తెలిపారు. విలీనమయ్యేవాటిలో రెండో కంచిగా పేరున్న వరదరాజ్‌పూర్ గ్రామం కూడా ఉందన్నారు. మరోపుణ్యక్షేత్రం కొండపోచమ్మను కూడా కొమురవెల్లిలో కలిపేందుకు యత్నాలు జరుగుతున్నాయని, అటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. -
మల్లన్నను దర్శించుకున్న హాస్యనటుడు శివారెడ్డి
చేర్యాల : ప్రముఖ సినీ హాస్య నటుడు శివారెడ్డి శనివారం కొమురవెల్లి మల్లికార్జునస్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం శివారెడ్డి మాట్లాడుతూ కొమురవెల్లి మల్లన్న తనకు ఇష్టదైవమని, ఏటా స్వామిని దర్శించుకునేందుకు వస్తున్నట్లు చెప్పారు. కాగా, శివారెడ్డితో కలిసి సెల్ఫీ దిగేందుకు భక్తులు పోటీపడ్డారు. ఆలయాన్ని దర్శించుకున్న వారిలో శివారెడ్డి స్నేహితులు కిశోర్, రాజిరెడ్డి, రాజు, నవీన్, రమేశ్, రవి, సత్యనారాయణ ఉన్నారు. -
చోరీకి పాల్పడిన వ్యక్తికి దేహశుద్ధి
పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు చేర్యాల : ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన వ్యక్తికి గ్రామస్తులు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించిన ఘటన మండలంలోని కొమురవెల్లిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ... మహారాష్ట్రలోని భువనపటాకు చెందిన పరమానంద్ అనే వ్యక్తి కొమురవెల్లిలోని బత్తిని నర్సింహులు అనే చిరు వ్యాపారి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు. నర్సింహులు కుటుంబసభ్యులు తాళం వేసి పొలానికి వెళ్లగా పరమానంద్ ఇంట్లోకి చొరబడి కిరాణా షాపులోని చిల్లర సరుకులు, గల్లాపెట్టెలోని నగదు తీసుకున్నాడు. ఈ విషయం గమనించిన పొరుగువారు నర్సింహులుకు సమాచారం అందించారు. నర్సింహులు ఇంటికి రాగానే అతడితో పాటు స్థానికులు పరమానంద్‌ను స్తంభానికి కట్టేసి దేహశుద్ది చేశారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి వద్ద ఎలాంటి ఐడీ అడ్రసులు లేవు, అతడు కూడా గంటకో పేరు చెపుతూ, హిందీలో మాట్లాడుతూ పిచ్చిగా ప్రవర్తించాడు. దీంతో పోలీసులకు సైతం అర్థం కాలేదు. నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కొమురవెల్లిలో ఆధ్యాత్మిక కోలాహలం
కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఈ సందర్భంగా మల్లన్నకు భక్తులు బోనాలు తీసి గంగిరేగు చెట్టు వద్ద పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం క్యూలైన్లో మల్లన్నను దర్శించుకొని ఉపవాసాలు విరమించుకున్నారు. స్వామివారికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. – చేర్యాల -
భక్తులతో కిటకిటలాడిన కొమురవెల్లి...
కొమురవెల్లిలో అలరించిన అగ్ని గుండాలు ప్రత్యేక ఆకర్షణగా పెద్ద పట్నం భారీగా తరలివచ్చిన భక్తులు మల్లన్న నామస్మరణతో మార్మోగిన తోట బావి చేర్యాల : ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి ఆలయ పరిసరా లు భక్తుల జయజయ ధ్వానాలతో దద్దరిల్లింది. ప ట్నం వారాన్ని పురస్కరించుకుని సోమవారం ఆల య తోటబావి ప్రాంగణంలోని మల్లన్న కల్యాణ మండపం వద్ద నిర్వహించిన అగ్ని గుండాలు, పెద్దపట్నం కనువిందు చేశాయి. హైదరాబాద్‌కు చెంది న మాణుక యాదవ కుటుంబసభ్యులు, యాదవ సంఘం ఆధ్వర్యంలో అగ్ని గుండాలు, పెద్దపట్నం వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహిం చిన కార్యక్రమాలతో కొమురవెల్లి కిటకిటలాడింది. ఆకట్టుకున్న పెద్దపట్నం.. తోటబావి వద్ద మాణుక యాదగిరియాదవ్, మాణు క బండారు దుర్గారాజు, మాణుక విజయ్‌కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెంది న యాదవ భక్తులు సంప్రదాయం ప్రకారం పెద్ద పట్నం వేశారు. అనంతరం అగ్ని గుండాలను నిర్వహించారు. కాగా, అగ్నిగుండాలు నిర్వహించే సమయంలో అంబర్‌పేటకు చెందిన ఒగ్గు కళాకారుల బృందం (మాజీ రాష్ట్ర అధ్యక్షుడు) కోడూరి సత్యనారాయణ మల్లన్న కథను భక్తులకు వివరించారు. అనంతరం కల్యాణ మం డపం ఆవరణలో పెద్దపట్నం వేసి అగ్ని గుండాలు నిర్వహించారు. బావి మొత్తం‘బండారు’ మయం.. అగ్ని గుండాల్లో పాల్గొనేందుకు వచ్చిన శివసత్తు లు, భక్తులు ఒంటిపై మొత్తం బండారి (పసుపు)ని చల్లుకోవడంతో తోటబావి పసుపుమయంగా మా రింది. కాగా, అగ్నిగుండాల కోసం సుమారు 5 క్విం టాళ్ల సమిదలను పేల్చి వాటిని భగభగమండే నిప్పురవ్వలుగా తయారు చేశారు. అనంతరం అ ర్చకులు పడిగన్నగారి అంజయ్య, పడిగన్నగారి మ ల్లేశం, పడిగన్నగారి మల్లికార్జున్‌తో పాటు అర్చకు లు ఉత్సవ విగ్రహాలను ఆలయ గర్భగుడి నుంచి తోటబావి వద్ద నిర్వహించే అగ్నిగుండాలు, పెద్దపట్నం వద్దకు తీసుకొచ్చి పూజలు నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలకు ఎమ్మెల్యే పూజలు పెద్దపట్నం, అగ్ని గుండాలను పర్యవేక్షించేందుకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డీఎస్పీ పద్మనాభరెడ్డి, సీఐ వెం కటేశ్వర్‌రెడ్డి, ఎస్సై రవీందర్, వేణుగోపాల్‌తో పాటు ఇన్చార్జీ ఈఓ అంజయ్య తోట బావి వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అగ్నిగుండాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు పడిగన్నగారి అం జయ్య, పడిగన్నగారి మల్లయ్య, పడిగన్నగారి మల్లికార్జున్‌తో పాటు అర్చకులు ఉత్సవ విగ్ర హాలను పట్టుకుని మొదట పెద్దపట్నం, తర్వాత అగ్నిగుండాలను దాటారు. అనంతరం శివసత్తులు, యాదవులు అగ్నిగుండాలను దాటుతూ స్వామిని దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా, జానపదుల వీడియో ఆల్బమ్‌ల మల్లన్నగా నటించిన, సినీనటుడు లాలాజీ ఘన్‌శ్యాం కూడా అగ్నిగుండాలను దాటారు. అగ్నిగుండాల్లో తోపులాట.. తోట బావి వద్ద మొదటిసారిగా నిర్వహించిన అగ్నిగుండాలు ఉద్రిక్తంగా మారింది. భక్తులు పోటీపడి అగ్ని గుండాలను దాటడంతో తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు తోపులాటను అరికట్టేందుకు గంటపాటు ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలే దు. అగ్ని గుండాల అనంతరం సూపరింటెం డెంట్ నీల చంద్రశేఖర్, వైరాగ్యం జగన్‌లు ఆనవాయితీ ప్రకారం హైదరాబా ద్‌కు చెందిన యాదవ భక్తులకు, శివసత్తులకు కొత్త బట్టలు అందించి సన్మానించారు. ఇదిలా ఉండగా, తోటబావి వద్ద అగ్నిమాపక సిబ్బంది హెచ్‌సీ దయాకర్, బుచ్చ ఎల్లయ్య, సదానందంలు ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నారు. -
పెద్దపట్నం... అగ్నిగుండం
వైభవంగా మల్లన్న జాతర శివసత్తులు, భక్తులతో కిక్కిరిసిన ఆలయం మార్మోగిన మల్లికార్జునుడి నామస్మరణ భక్తి భావాన్ని నింపిన మల్లన్న ఒగ్గు కథ బండారి మయమైన రహదారులు చేర్యాల : కొమురవెల్లి మల్లికార్జునుడి జాతర బ్రహ్మోత్సవాలు సోమవారం పతాకస్థారుుకి చేరుకున్నారుు. పట్నం వారం సందర్భంగా మల్లన్న ఆలయంలో సోమవారం పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమం వైభవంగా కొనసాగింది. ఉద యం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆలయ రాజగోపురం, గంగిరేగు చెట్టు మధ్య భాగంలో మాణిక్య యాదయ్య యాదవ్, బండారు దుర్గారాజు ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన యాదవ భక్తులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఒగ్గు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడూరి సత్యనారాయణ చెప్పి మల్లన్న కథ భక్తుల్లో భక్తిభావాన్ని నింపింది. అగ్నిగుండాల కోసం సుమారు ఐదు క్వింటాళ్ల సమిధలను పేర్చి... వాటిని భగభగమండే నిప్పురవ్వలుగా తయారు చేశారు. ఆ తర్వాత అర్చకులు మల్లికార్జున్, సాంబయ్య ఆలయ గర్భగుడిలోని ఉత్సవ విగ్రహాలను అగ్నిగుండాలు, పెద్దపట్నం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఉత్సవ విగ్రహా లకు వీరితోపాటు ఆలయ అధికారులు, డీఏస్పీ సురేందర్, సీఐ వెంకటేశ్వర్‌రెడ్డి, ఏఈఓ అంజయ్య తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ యాదవ భక్తులు పెద్దపట్నం, అగ్నిగుండాల చుట్టూ పసుపు నీళ్లు చల్లి అష్టదిగ్బం దనం చేశారు. అనంతరం ఆలయ అర్చకుడు మల్లికార్జున్‌తోపాటు పలువురు ఉత్సవ విగ్రహాలను పట్టుకుని ముందుగా పెద్దపట్నం, ఆ తర్వాత అగ్నిగుండాలను దాటారు. వారిని శివసత్తులు, యాదవ భక్తులు మల్లన్న నామస్మరణ చేస్తూ అనుసరించారు. జానపదుల వీడియో ఆల్బమ్‌లో మల్లన్నగా నటించిన, సినీనటుడు లాలాజీ ఘన్‌శ్యాం అగ్ని గుండాలను దాటారు. అంతా బండారు మయం అగ్నిగుండాలను కనులా వీక్షించేందుకు వచ్చిన మల్లన్న శివసత్తులతో గంగిరేగు చెట్టు వద్ద ఉన్న మూడు గ్యాలరీలు నిం డిపోయూరుు. పలువురు శివసత్తులు, భక్తులను రాజగోపు రం వద్దనే నిలపివేయడంతో తోటబావి, పోలీస్ బొమ్మ, పెద్దమ్మ ఆలయూనికి వెళ్లే రహదారులు కిక్కిరిసిపోయూరుు. శివసత్తులు నుదుట, తలపై పసుపు చల్లుకోవడంతో ఆల య ప్రాంగణంతోపాటు ఆ రోడ్లన్నీ బండారి మయమయ్యూయి. రాజగోపురం బయట ఉన్న భక్తులు అగ్నిగుండం దాటేందుకు రెండు గంటల సమయం పట్టడడంతో తీవ్ర ఇబ్బం దులు పడ్డారు. రాజగోపురం వద్ద స్వల్ప తోపులాట చోటుచేసుకోగా.. పందిరి కట్టెలు విరిగిపోయూరుు. పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఏస్పీ సురేందర్ ఆధ్వర్యంలో సీఐ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్ఐ రవీందర్ పర్యవేక్షించారు. అగ్నిగుండాలు దాటుతూ హైదరాబాద్‌కు చెందిన యాదమ్మ పడిపోరుుంది. సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం నుంచి తప్పించుకుంది. కార్యక్రమం అనంతరం ఆనవాయితీ ప్రకారం హైదరాబాద్ యాదవ భక్తులు, శివసత్తులకు ఆలయ ఏఈఓ అంజయ్య, సూపరింటెండెంట్ నీల చంద్రశేకర్, వైరాగ్యం జగన్ తదితరులు కొత్త బట్టలు అందజేసి సన్మానించారు. -
కురుమలకు దొడ్డి కొమురయ్య భవన్
* రూ. 5 కోట్లతో హైదరాబాద్‌లో నిర్మిస్తాం: కేసీఆర్ * తెలంగాణ సాయుధ పోరాటంలో కొమురయ్యది గొప్ప పాత్ర * కురుమలకు రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తాం * కొమురవెల్లి మల్లన్న ఆలయానికి భూములిప్పిస్తాం * ఆ స్థలంలో విల్లాలు, కాటేజీలు నిర్మించవచ్చు * మల్లన్న కల్యాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి హాజరు * ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన సీఎం సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య పేరిట హైదరాబాద్‌లో కురుమ సంఘం భవనం నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. ఎకరం లేదా ఎకరన్నర స్థలంలో రూ.5 కోట్లతో ఈ భవనం నిర్మిస్తామని తెలిపారు. ఆదివారం వరంగల్ జిల్లా కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి కల్యాణం సందర్భంగా... ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మల్లన్న కల్యాణంలో పాల్గొన్నారు. అనంతరం కొమురవెల్లిలో కొత్తగా నిర్మించిన కురుమ సంఘం వసతి గృహాన్ని ప్రారంభించారు. అనంతరం కురుమ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. కొమురవెల్లి మల్లన్న కల్యాణానికి రావడం సంతోషంగా ఉందన్నారు. ‘‘తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య గొప్ప పాత్ర పోషించారు. ఆయన పేరు మీద భవనం లేకపోడమే వెలితి. ఉంటేనే మనకు గొప్ప. దొడ్డి కొమురయ్య పేరిట హైదరాబాద్‌లో మంచి భవనం కట్టుకుందాం. ఎకరం లేదా ఎకరంన్నర స్థలంలో రూ.5 కోట్లతో నిర్మిద్దాం. కురుమ సంఘం ముఖ్యులు రేపే (సోమవారం) ఉదయం 11 గంటలకు సచివాలయానికి రండి. నిధులు, భూమికి సంబంధించి రేపే ఉత్తర్వులు ఇస్తాను. దొడ్డి కొమురయ్య భవనం శంకుస్థాపన చేస్తా. ఒగ్గు కళాకారుల డోలు చప్పుళ్లతో ఆరోజు హైదరాబాద్ దద్దరిల్లేలా కార్యక్రమం చేసుకుందాం. కురుమలకు రాజకీయ ప్రాధాన్యం విషయం అడిగారు. మా దేవరమల్లప్ప గద భుజం మీద పెట్టుకుని తయారు మీద ఉన్నరు. యెగ్గె మల్లేశం కూడా ఉన్నరు. వీరిద్దరికీ రాజకీయ అవకాశాలు రావాలి. వచ్చేలా చేస్తా. కొమురవెల్లి మల్లన్నకు ప్రస్తుతం భూములు లేవు. దేవాదాయ శాఖ, జిల్లా కలెక్టర్‌తో చర్చించి కొంత భూమిని మల్లికార్జునస్వామి ఆలయ పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తా. ఆ స్థలంలో కాటేజీలు, విల్లాలు నిర్మించవచ్చు’’ అని సీఎం అన్నారు. కురుమలది గొప్ప మేధాశక్తి.. కురుమ కులస్తులకు గొప్ప మేధాశక్తి ఉంటుందని కేసీఆర్ కొనియాడారు. పిల్లలను బాగా చదివించి గొప్పవాళ్లుగా తీర్చిదిద్దాలని సూచించారు. ‘‘గొర్రెల మందలో వంద ఉంటే ప్రతి జీవిని గుర్తు పెట్టుకుంటారు. గతంలో ఉన్న భూములు ఇప్పుడు లేవు. ఆధునిక పద్ధతుల్లో గొర్రెల పెంపకం ఫారంలలో నిర్వహించాలి. అటవీ భూములు ఉన్నాయి. మేకలు, గొర్రెల ఫారమ్స్ వస్తే బాగుంటుంది. చదువుకుంటే అన్నీ చేయవచ్చు. సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చిన్న ఉండెపల్లె గ్రామం ఉండేది. బ్యాంకు మేనేజరు కురుమలకు అప్పు ఇవ్వడం లేదని ఆ ఊరి వాళ్లు వచ్చి చెప్పారు. మేనేజరును అడిగిన. వాళ్లు అప్పు కడతరా సార్.. అని మేనేజరు అన్నడు. నేను ఒక్కటే చెప్పిన. ‘ఎవలన్న ఎగబెడతరు గని వీళ్లు ఎగబెట్టరు. వీళ్లు పంచాయితీకి పోరు, కల్లు దుకాణంకాడికి పోరు. అసలు ఎక్కువగా ఊల్లెనే ఉండరు. వాళ్ల పని వాళ్లు చేసుకుంటరూ. పొదుపుగా జీవిస్తరు. నేను గ్యారెంటీ’ అని చెప్పిన. రూ.5 లక్షలు అప్పు ఇచ్చిండు. గడువులోపే కట్టిన్రు. అదే మేనేజరు వచ్చి ‘ఇంకా ఏ ఊర్లో అయినా ఉన్నారా.. సార్’ అని అడిగిండు. కురుమొల్ల దగ్గర గొప్పదనం ఉంది. మందలో నూరు గొర్లు ఉంటే.. ఫలానాది అని అంటే దాన్నే తీసుకువస్తరు. ఈ మేధాశక్తి వాళ్లకే ఉంటది. కురుమల డిమాండ్లపై సానుకూలంగా ఉంటా. అందరం కూర్చుని చర్చించుకుందాం’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేసీఆర్‌కు కృతజ్ఞతలు: దత్తాత్రేయ కొమురవెల్లి కల్యాణానికి అధికారిక హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కురుమల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కేసీఆర్ ఒక్కరే సీఎం హోదాలో ఇక్కడికి వచ్చారని చెప్పారు. చదువుతోనే ఎదుగుదల ఉంటుందని, తాను కేంద్రమంత్రి అయ్యేందుకు చదువే ఉపయోగపడిందని చెప్పారు. ఒగ్గు కళాకారులకు ప్రభుత్వం తరఫున చేయూత ఇవ్వాలని కోరారు. గొర్రెలు, గొర్రెల నుంచి వచ్చే ఉత్పత్తుల కోసం పరిశ్రమ ఏర్పాటు చేయాలని, అందుకు కేంద్రమంత్రిగా తన సహకారం అందిస్తానని చెప్పారు. కురుమ సంఘం అధ్యక్షుడు యెగ్గె మల్లేశం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, మంత్రులు ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, ఎ.చందూలాల్, జెడ్పీ చైర్పర్సన్ జి.పద్మ, ఎంపీలు బి.నర్సయ్యగౌడ్, ఎ.సీతారాంనాయక్, కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు ఎం.యాదగిరిరెడ్డి, ఆర్.కృష్ణయ్య, ఎ.రమేశ్, కె.సురేఖ, డి.ఎస్.రెడ్యానాయక్, బి.శంకర్‌నాయక్, ఎమ్మెల్సీలు బి.వెంకటేశ్వర్లు, రాజలింగం తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం
హాజరైన సీఎం కేసీఆర్ కొమురవెల్లి భక్తజన సంద్రమైంది.. వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య మల్లన్న కల్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది.. ఈ వేడుకలను తిలకించడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.. స్వామి వారికి ప్రభుత్వం తరఫున సీఎం కె.చంద్రశేఖరరావు హాజరై పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.. అనంతరం కురుమ సంఘ సభలో కొమురవెల్లిని అభివృద్ధి చేస్తానని, రాజీవ్ రహదారి వద్ద వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.. వరంగల్ : కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆలయానికి భూమి లేదని.. దేవాదాయ శాఖ, కలెక్టర్‌తో చర్చించి ఆలయానికి స్థలాన్ని సమకూర్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదివారం చేర్యాల మండలం కొమురవెళ్లికి వచ్చారు. మల్లికార్జునస్వామి కల్యాణంలో పాల్గొన్నారు. కురుమ సంఘం కొత్తగా నిర్మించిన వసతి గృహాన్ని ప్రారంభించారు. కురుమ సంఘం అక్కడ నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించారు. ‘మల్లన్న ఆలయానికి ప్రస్తుతం ఎకరం స్థలం లేదు. అవసరాలకు తగినట్లుగా భూమిని సమకూర్చే విషయంపై కలెక్టరుతో, దేవాదాయ శాఖ వారితో చర్చిస్తా. కొంత భూమిని ఆలయ పరిధిలోకి తెచ్చి భక్తులకు అవసరమైన నిర్మాణాలు జరిగేలా చర్యలు తీసుకుంటా. రాజీవ్ రహదారి మార్గంలో ఉండే స్వాగత తోరణం దగ్గర నాలుగైదు ఎకరాల్లో భక్తులకు వసతులు కలిగించేలా అంశాన్ని పరిశీలిస్తాం. మల్లికార్జునస్వామి కల్యాణంలో పాల్గొనడం సంతోషంగా ఉంది’ అని అన్నారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. చదువుతోనే ఏ కులానికైనా గౌరవం వస్తుంది.. కురుమలందరూ తమ పిల్లలను బాగా చదవించాలని సూచించారు. రాజకీయంగా కురుమలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ కులం నుంచి ఇద్దరికి ఎమ్మెల్సీ పదువులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. కల్యాణంలో.. కొమురవెల్లి శ్రీ భ్రమరాంభ మల్లికార్జునస్వామి కల్యాణానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స్వామివారి ఆలయానికి సమర్పించారు. వేద పండితులు సంప్రదాయబద్ధంగా 12.40 గంటలకు మంగళసూత్ర ధారణ నిర్వహించారు. కార్యక్రమం జరుగుతున్నంతసేపు ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడే ఉన్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ మంత్రి ఎ.చందూలాల్, జెడ్పీ చైర్పర్సన్ జి.పద్మ, ఎంపీలు బి.నర్సయ్యగౌడ్, ఎ.సీతారాంనాయక్, కె.శ్రీహరి, ఎమ్మెల్యేలు ఎం.యాదగిరిరెడ్డి, డిఎస్ రెడ్యానాయక్, అరూరి రమేశ్, కొండా సురేఖ, బి.శంకర్‌నాయక్, ఎమ్మెల్సీలు బి.వెంకటేశ్వర్లు, రాజలింగం, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, కురుమ సంఘం ప్రతినిధి యెగ్గె మల్లేషం, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు, కర్ణాటక మాజీ మంత్రి రేవన్న, జిల్లా కలెక్టర్ జి.కిషన్ వేదికపై ఉండి కల్యాణాన్ని వీక్షించారు. కల్యాణం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆలయంలోని మల్లికార్జునస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఐనవోలుకు ఆహ్వానం వర్ధన్నపేట మండలం ఐనవోలులో జనవరిలో వైభవంగా జరిగే మల్లికార్జునస్వామి దేవస్థానం కల్యాణోత్సవానికి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ కోరారు. వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి కూడా ఐనవోలు స్వామివారి కల్యాణానికి సీఎంను ఆహ్వానించారు. వీరి విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని వీరిద్దరు వేర్వేరు ప్రకటనలో తెలిపారు. -
నేడు కొమురవెల్లికి సీఎం కేసీఆర్ రాక
హెలీపాడ్‌ను పరిశీలించిన కలెక్టర్, సీఎం సెక్యూరిటీ ఐజీ చేర్యాల: వరంగల్ జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణానికి సీఎం కె.చంద్రశేఖరరావు ఆదివారం రానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను కలెక్టర్ కిషన్, సీఎం ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఐజీ ఎంఎం.మహేశ్ భగవత్, ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా, క్రైం ఏఎస్పీ జాన్‌వెస్లీ, జనగామ డీఏస్పీ సురేందర్ శనివారం పరిశీలించారు. అనంరతం ఐజీ మహేశ్ భగవత్ హెలిక్యాప్టర్‌లో హైదరాబాద్ వెళ్లిపోయారు.