మల్లన్నను దర్శించుకున్న హాస్యనటుడు శివారెడ్డి | mallannanu darshinchukunna shivareddy | Sakshi
Sakshi News home page

మల్లన్నను దర్శించుకున్న హాస్యనటుడు శివారెడ్డి

Published Sun, Oct 2 2016 12:34 AM | Last Updated on Mon, Oct 8 2018 9:10 PM

మల్లన్నను దర్శించుకున్న హాస్యనటుడు శివారెడ్డి - Sakshi

మల్లన్నను దర్శించుకున్న హాస్యనటుడు శివారెడ్డి

చేర్యాల : ప్రముఖ సినీ హాస్య నటుడు శివారెడ్డి శనివారం కొమురవెల్లి మల్లికార్జునస్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం శివారెడ్డి మాట్లాడుతూ కొమురవెల్లి మల్లన్న తనకు ఇష్టదైవమని, ఏటా స్వామిని దర్శించుకునేందుకు వస్తున్నట్లు చెప్పారు. కాగా, శివారెడ్డితో కలిసి సెల్ఫీ దిగేందుకు భక్తులు పోటీపడ్డారు. ఆలయాన్ని దర్శించుకున్న వారిలో శివారెడ్డి స్నేహితులు కిశోర్, రాజిరెడ్డి, రాజు, నవీన్, రమేశ్, రవి, సత్యనారాయణ ఉన్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement