shivareddy
-
శివారెడ్డి హత్య కేసులో...
ఎస్కేయూ: కందుకూరు గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త డి. శివా రెడ్డి హత్యకేసులోని నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటుకలపల్లి పోలీసు స్టేషన్లో గురువారం కేసు పూర్వపరాలు, నిందితులకు సంబంధించిన వివరాలను అనంతపురం డీఎస్పీ వెంకట్రావు వెల్లడించారు. ఐదు రోజుల కిందట కందుకూరు గ్రామానికి చెందిన డి. శివారెడ్డిని హత్య చేసిన నిందితులను అదుపులోకి తీసుకున్నాం.. ఇందులో మొత్తం 11 మంది నిందితులు ఉన్నారు. వై. బాలకృష్ణ అలియాస్ బాల హత్యలో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. బాలకృష్ణ తమ్ముళ్లు ఒకే కుటుంబానికి చెందిన ఆరు మందితో పాటు మరో 5 మంది నిందితులుగా ఉన్నారు. వీరిలో ఏ–1 నిందితుడు వై. బాలకృష్ణ, ఏ–4 నిందితుడు వై. అశోక్, ఏ–9 నిందితుడు తలుపూరి మహేంద్ర, మరో మైనర్ నిందితుడిని అదుపులోకి తీసుకున్నాము. హత్య అనంతరం బాలకృష్ణ చిత్తూరు జిల్లా మొలకలచెరువులోని దేవల చెరువు తాండాలో వసతి కల్పించిన వ్యక్తిపైన కేసు నమోదు చేశాము. రేణిగుంటకు చెందిన సురేష్ అనే వ్యక్తికి రూ.5 వేలు డబ్బులు తీసుకుని హత్యలో పాల్గొన్నాడు. గత ఏడాది కందుకూరులో మొహరం పండుగ రోజు నీటి సరఫరా విషయంలో చిన్న గొడవ జరిగింది. తరువాత ఇరువర్గాల వారు కేసులు పెట్టుకుని కోర్టులో రాజీ అయ్యారు. రాజీ అయినప్పటికీ శివారెడ్డిపై బాలకృష్ణ కక్ష పెట్టుకున్నాడు. శివారెడ్డిపై బాలకృష్ణ , అతని తమ్ముళ్లు , బంధువులతో కుట్ర పన్ని పథకం ప్రకారం బోయ భీముడు పొలం వద్ద బైక్‌పై వెళ్తుండగా హతమార్చారు. బాలకృష్ణ, రమేష్‌లపై గతంలో రౌడీషీట్లు నమోదయ్యాయి. బీకేఎస్ మండలం పసలూరు గ్రామంలో తలారి పోతులయ్య పొలం వద్ద నిందితులను అరెస్ట్ చేశాము. నేరానికి ఉపయోగించిన వేట కొడవళ్లు, ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నాం. శివారెడ్డి హత్యకు కొందరి ప్రోద్బలం ఉందని, హతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. -
అకాడమీ సిగలో కొత్త కాంతి
సందర్భం తెలుగు భాషా కమిటీ కార్యవర్గ సభ్యులుగా, కమిటీ కన్వీనర్‌గా ప్రజా కవి, బహు పురస్కృత, బహు కావ్య రచయిత కె. శివారెడ్డి ఎన్నిక కావడం తెలుగు సాహిత్య వికాసానికి మంచి పరిణామం. సాహిత్య అకాడమీ కొత్త కార్యవర్గం ఏర్పడగా, అధ్యక్ష హోదా ఈసారి 1998 తరువాత తిరిగి, కన్నడ దేశానికి దక్కింది. 1998లో యు.ఆర్ అనంత మూర్తి తరువాత, ప్రస్తుతం ఫిబ్రవరి పన్నెండున సాహిత్య అకాడమీ అధ్యక్ష పదవికి ప్రముఖ సాహితీ వేత్త, ఎనభయ్యేళ్ళ చంద్రశేఖర కంబర్ ఎంపిక అయ్యారు. 1964 వరకూ జవహర్లాల్ నెహ్రూ దేశ ప్రధాని అయినందుకు కాకుండా, ఆయన స్వయానా రచయిత, సాహిత్య వేత్త కావడం మూలాన అకాడెమీ అధ్యక్ష పదవిలో కొనసాగారు. అటుపై సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, సునీతి కుమార్ చటర్జి, కె.ఆర్ శ్రీని వాస అయ్యంగార్, (రెండు సార్లు) ఉమాశంకర్ జోషి, బీరేంద్ర కుమార్ భట్టాచార్య, యు.ఆర్. అనంతమూర్తి, రమాకాంత్ రథ్, గోపిచంద్ నారంగ్, సునీల్ గంగోపాధ్యాయ్ (పదవిలో మరణం) విశ్వనాథ్ ప్రసాద్ తివారీ నిర్వహిం చగా, 2018 నుంచి 2022 వరకూ ఈ జాతీయ సంస్థ అధ్యక్ష పదవిలో చంద్రశేఖర్ కంబర్ బాధ్యతలు నిర్వహిస్తారు. కంబర్ ప్రఖ్యాత రచయిత, జానపద గేయ కర్త, సినిమా దర్శకులు కావడం, బహు కళా రంగాల్లో అనుభవం ఉన్న వ్యక్తి, సాహిత్య అకాడమీకి తగు దిశా దర్శనం చేయగలరు అన్న ఆశాభావం నలుదిశలా వ్యక్తం అవుతున్నది. హంపి లోని కన్నడ విశ్వ విద్యాలయం పూర్వ ఉప కులపతిగా, ఉత్తర కన్నడ మాండలికం తన కవితలు, నాటకాలు, ఇతర రచనల్లో సృజనాత్మకంగా ఉపయోగించిన సాహిత్యవేత్తగా మంచి గుర్తింపు ఉన్నవారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకి, కర్ణాటక నాటక అకాడమీకి కూడా వారు ఉన్నత పదవులని నిర్వహించారు. షికాగో విశ్వ విద్యాలయంలో కొంత కాలం బోధన తరువాత, తాను బెంగళూర్ విశ్వ విద్యాలయంలో రెండు దశాబ్దాలకు పైగా ఆచార్య వృత్తిలో ఉన్నారు. ఇరవై అయిదు నాటకాలు, పదకొండు సంపుటాల కవిత్వం, అయిదు నవలలు, పదహారు పరిశోధనలు వారి నిరంతర సాహిత్య కృషిలో భాగంగా వెలుగు చూశాయి. జానపద కళా రంగం, విద్యా, సాహిత్య అంశాల పైన పలు రచనలు వెలువరించారు. వీరి నాట కాలు భారతీయ భాషలు, అలాగే ఆంగ్లంలోకి కూడా అనువాదం జరిగాయి. కర్ణాటక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల కోసం వీరు కొన్ని డాక్యుమెంటరీలు కూడా నిర్మించారు. సాహిత్య అకాడమీ అవార్డులతో పాటు, జ్ఞాన్ పీఠ, కబీర్ సమ్మాన్, కాళిదాస్ సమ్మాన్, మొదలయిన పురస్కారాలు పొందినవారు. ఫుల్బ్రైట్ స్కాలర్‌గా, సాహిత్య పరిశోధకులు కూడా. దక్షిణ భారతీయ సాహిత్య రంగం, మరింత ప్రాధాన్యత సంతరించుకుని, తన ప్రతిష్టను పెంపొందించుకోగలదని ఆశి ద్దాము. అలాగే తెలుగు భాషా కమిటీ కార్యవర్గ సభ్యులుగా, కమిటీ కన్వీనర్‌గా ఆధునిక కవిత్వ చేతనతో ఎన్నో సంపుటాలు వెలువరించిన ప్రజల కవి, ప్రముఖ కవి, బహు పురస్కృత కె. శివారెడ్డి ఎన్నిక కావడం మంచి పరి ణామం. తెలుగు భాషకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు గల నిధులను రెండు రాష్ట్రాలలోనూ సముచి తంగా వినియోగించడంలో మేలైన పాత్ర పోషించాలని ఆశిద్దాం. తెలుగు ప్రాంతాల్లో జరగకుండా పోతున్న ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, అలాగే, దక్షిణ భారతీయ సాహిత్య సమ్మేళనం వంటి అనేక ప్రాతిపదికలు పరిశీలనలో ఉండి పోయాయి. ముఖ్యంగా అనువాద ప్రణాళిక విస్తరించి, నిర్ణీతంగా, తెలుగు సాహిత్య రచనలు భారతీయ భాషల్లోకి, ఆంగ్లంలోకి వెళ్ళేలా, కొత్త కమిటీ ఆలోచనలు చేయాలి. అందుకు తగు పరిణతి, అంతర్జాతీయ దృక్పథం, ప్రగతిశీల స్వభావం, బహుళ సాంస్కృతిక చైతన్యం కలిగిన శివారెడ్డి వంటి కన్వీనర్ వలన తెలుగు సాహిత్య సంఘం, తన ప్రతిష్ట, దేశ భాషల్లో పెంపొందేలా, వీరి నేతృత్వంలో పని చేస్తుందని ఆశించవచ్చును. సాహిత్య రంగంలో కొత్త కమిటీ జాతీయంగా, భాషీయంగా ఏర్పాటు అయిన ఈ సందర్భంలో జాతి తరఫున శుభాకాంక్షలు. వ్యాసకర్త ప్రముఖ కవి, రచయిత రామతీర్థ మొబైల్ : 98492 00385 -
రాధాకృష్ణలపై పుస్తకం పెద్ద సాహసం – తనికెళ్ల భరణి
‘రాధాకృష్ణలపై పుస్తకం రాసి, చిత్రలేఖ చాలా పెద్ద సాహసం చేశారు. పుస్తకంలో ఎక్కువ భాగం అంశాలు బాగున్నాయి. ఆమెలో మంచి రచయిత్రి ఉన్నారు’’ అని నటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. ‘శంభో శివ శంభో’, ‘పరుగు’, ‘దమ్ము’, ‘లయన్’ తదితర చిత్రాల ద్వారా నటిగా చిత్రలేఖ సుపరిచితు రాలే. యాంకర్‌గా, బుల్లితెర నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె రచించిన ‘వన్నెపూల విన్నపాలు’ పుస్తకాన్ని సీనియర్ రచయిత శివారెడ్డితో పాటు పలువురు రచయితలు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘నా ఎదుగుదలలో చిత్రలేఖ పాత్ర ఉంది. నేను, ఆమె కలిసి చేసిన ప్రోగ్రామ్స్ నా రాజకీయ రంగానికి పనికొచ్చాయి. మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్ వచ్చి, పోటీని తట్టుకుని చిత్రలేఖ సక్సెస్ అయ్యారు’’ అన్నారు. ‘‘నాలో కవయిత్రిని గుర్తించింది జనార్ధన్ మహర్షిగారు. తనికెళ్ల భరణిగారు నాకు స్ఫూర్తి. చంద్రబోస్‌గారు ఇంట్లో నాకు తొలిసారి సన్మానం చేశారు. ఈ పుస్తకం విషయంలో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సౌభాగ్య, గొల్లపూడి మారుతీరావుగార్ల సహకారం మరువలేనిది’’ అన్నారు రాణి చిత్రలేఖ. దర్శకుడు కల్యాణ్ కృష్ణ, పాటల రచయిత చంద్రబోస్, మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా, నిర్మాత లగడపాటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
మల్లన్నను దర్శించుకున్న హాస్యనటుడు శివారెడ్డి
చేర్యాల : ప్రముఖ సినీ హాస్య నటుడు శివారెడ్డి శనివారం కొమురవెల్లి మల్లికార్జునస్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం శివారెడ్డి మాట్లాడుతూ కొమురవెల్లి మల్లన్న తనకు ఇష్టదైవమని, ఏటా స్వామిని దర్శించుకునేందుకు వస్తున్నట్లు చెప్పారు. కాగా, శివారెడ్డితో కలిసి సెల్ఫీ దిగేందుకు భక్తులు పోటీపడ్డారు. ఆలయాన్ని దర్శించుకున్న వారిలో శివారెడ్డి స్నేహితులు కిశోర్, రాజిరెడ్డి, రాజు, నవీన్, రమేశ్, రవి, సత్యనారాయణ ఉన్నారు. -
స్నేహితుల ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి
సినీ, మిమిక్రీ నటుడు శివారెడ్డి మందమర్రి : స్నేహితులు తనలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంతోనే ఈస్థాయికి చేరుకున్నానని ప్రముఖ సినీ నటుడు, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ఇందు గార్డెన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని, కష్టాల్లో వెన్నంటే ఉన్న స్నేహితులను ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటానని తెలిపారు. రానున్న కాలంలో పేదలకు సేవ చేసేలా ట్రస్టును ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కొడుకుల నిరాధారణకు గురైన తల్లులకు అండగా ఉండాలనేది బలమైన సంకల్పమని పేర్కొన్నారు. కోల్‌బెల్ట్‌లోని కళాకారులకు తన వంతు సహయం తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు బండి సదానందం, నోముల ఎల్లాగౌడ్, బండి ప్రభాకర్, వాసు పాల్గొన్నారు. సినీ నటుడు శివారెడ్డి పూజలు మంచిర్యాల టౌన్ : మంచిర్యాల పట్టణంలోని హైటెక్‌సిటీ గణేష్ మండలి వద్ద సినీ నటుడు శివారెడ్డి బుధవారం సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంచిర్యాలతో తనకు ఎనలేని అనుబంధం ఉందన్నారు. నా ఎదుగుదలకు ప్రేక్షకులు, ఇక్కడి ప్రజలే కారణమని తెలిపారు. అనంతరం తన మిమిక్రీతో భక్తులను ఆనందపరిచారు. హైటెక్‌సిటీ గణేష్ మండలి సభ్యులు శివారెడ్డిని ఘనంగా సత్కరించారు.