కొమురవెల్లిలో అలరించిన అగ్ని గుండాలు
ప్రత్యేక ఆకర్షణగా పెద్ద పట్నం భారీగా తరలివచ్చిన భక్తులు
మల్లన్న నామస్మరణతో మార్మోగిన తోట బావి
చేర్యాల : ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి ఆలయ పరిసరా లు భక్తుల జయజయ ధ్వానాలతో దద్దరిల్లింది. ప ట్నం వారాన్ని పురస్కరించుకుని సోమవారం ఆల య తోటబావి ప్రాంగణంలోని మల్లన్న కల్యాణ మండపం వద్ద నిర్వహించిన అగ్ని గుండాలు, పెద్దపట్నం కనువిందు చేశాయి. హైదరాబాద్‌కు చెంది న మాణుక యాదవ కుటుంబసభ్యులు, యాదవ సంఘం ఆధ్వర్యంలో అగ్ని గుండాలు, పెద్దపట్నం వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహిం చిన కార్యక్రమాలతో కొమురవెల్లి కిటకిటలాడింది.
ఆకట్టుకున్న పెద్దపట్నం..
తోటబావి వద్ద మాణుక యాదగిరియాదవ్, మాణు క బండారు దుర్గారాజు, మాణుక విజయ్‌కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెంది న యాదవ భక్తులు సంప్రదాయం ప్రకారం పెద్ద పట్నం వేశారు. అనంతరం అగ్ని గుండాలను నిర్వహించారు. కాగా, అగ్నిగుండాలు నిర్వహించే సమయంలో అంబర్‌పేటకు చెందిన ఒగ్గు కళాకారుల బృందం (మాజీ రాష్ట్ర అధ్యక్షుడు) కోడూరి సత్యనారాయణ మల్లన్న కథను భక్తులకు వివరించారు. అనంతరం కల్యాణ మం డపం ఆవరణలో పెద్దపట్నం వేసి అగ్ని గుండాలు నిర్వహించారు.
బావి మొత్తం‘బండారు’ మయం..
అగ్ని గుండాల్లో పాల్గొనేందుకు వచ్చిన శివసత్తు లు, భక్తులు ఒంటిపై మొత్తం బండారి (పసుపు)ని చల్లుకోవడంతో తోటబావి పసుపుమయంగా మా రింది. కాగా, అగ్నిగుండాల కోసం సుమారు 5 క్విం టాళ్ల సమిదలను పేల్చి వాటిని భగభగమండే నిప్పురవ్వలుగా తయారు చేశారు. అనంతరం అ ర్చకులు పడిగన్నగారి అంజయ్య, పడిగన్నగారి మ ల్లేశం, పడిగన్నగారి మల్లికార్జున్‌తో పాటు అర్చకు లు ఉత్సవ విగ్రహాలను ఆలయ గర్భగుడి నుంచి తోటబావి వద్ద నిర్వహించే అగ్నిగుండాలు, పెద్దపట్నం వద్దకు తీసుకొచ్చి పూజలు నిర్వహించారు.
ఉత్సవ విగ్రహాలకు ఎమ్మెల్యే పూజలు
పెద్దపట్నం, అగ్ని గుండాలను పర్యవేక్షించేందుకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డీఎస్పీ పద్మనాభరెడ్డి, సీఐ వెం కటేశ్వర్‌రెడ్డి, ఎస్సై రవీందర్, వేణుగోపాల్‌తో పాటు ఇన్‌చార్జీ ఈఓ అంజయ్య తోట బావి వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అగ్నిగుండాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు పడిగన్నగారి అం జయ్య, పడిగన్నగారి మల్లయ్య, పడిగన్నగారి మల్లికార్జున్‌తో పాటు అర్చకులు ఉత్సవ విగ్ర హాలను పట్టుకుని మొదట పెద్దపట్నం, తర్వాత అగ్నిగుండాలను దాటారు. అనంతరం శివసత్తులు, యాదవులు అగ్నిగుండాలను దాటుతూ స్వామిని దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా, జానపదుల వీడియో ఆల్బమ్‌ల మల్లన్నగా నటించిన, సినీనటుడు లాలాజీ ఘన్‌శ్యాం కూడా అగ్నిగుండాలను దాటారు.
అగ్నిగుండాల్లో తోపులాట..
తోట బావి వద్ద మొదటిసారిగా నిర్వహించిన అగ్నిగుండాలు ఉద్రిక్తంగా మారింది. భక్తులు పోటీపడి అగ్ని గుండాలను దాటడంతో తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు తోపులాటను అరికట్టేందుకు గంటపాటు ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలే దు. అగ్ని గుండాల అనంతరం సూపరింటెం డెంట్ నీల చంద్రశేఖర్, వైరాగ్యం జగన్‌లు ఆనవాయితీ ప్రకారం హైదరాబా ద్‌కు చెందిన యాదవ భక్తులకు, శివసత్తులకు కొత్త బట్టలు అందించి సన్మానించారు. ఇదిలా ఉండగా, తోటబావి వద్ద అగ్నిమాపక సిబ్బంది హెచ్‌సీ దయాకర్, బుచ్చ ఎల్లయ్య, సదానందంలు ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నారు.
భక్తులతో కిటకిటలాడిన కొమురవెల్లి...
Published Tue, Jan 19 2016 1:47 AM | Last Updated on Mon, Oct 8 2018 9:10 PM
Advertisement
Advertisement