నేడు మల్లన్న అలంకార దర్శనం
నేడు మల్లన్న అలంకార దర్శనం
Published Sat, Dec 31 2016 9:35 PM | Last Updated on Mon, Oct 8 2018 9:10 PM
- ఆర్జిత సేవలు నిలుపుదల
- సుప్రభాత, మహామంగళహారతిసేవలు రద్దు
శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో కొలువైన శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల దర్శనభాగ్యం నూతన సంవత్సరాది సందర్భంగా భక్తులందరికీ మల్లన్న అలంకార దర్శనాన్ని ఏర్పాటు చేసినట్లు ఈఓ నారాయణభరత్ గుప్త శనివారం తెలిపారు. ఆదివారం వేకువజామున స్వామిఅమ్మవార్లకు జరిగే సుప్రభాత, మహామంగళహారతి సేవా టికెట్లను కూడా రద్దు చేశామన్నారు. అలాగే స్వామివార్ల గర్భాలయంలో జరిగే అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, అమ్మవారి ఆలయంలో శ్రీచక్రం ముందు జరిగే కుంకుమార్చన తదితర ఆర్జితసేవలన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసి అలంకార దర్శనాన్ని కొనసాగిస్తామని అన్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయపూజావేళల్లో మార్పులు చేశారు. ఇందులో భాగంగా వేకువజామున 3.30గంటలకు మంగళవాయిద్యాలు, 4గంటలకు సుప్రభాతం, 5గంటలకు మహామంగళహారతి సేవలు ఏకాంతంగా జరిపి 5.30గంటల నుంచి స్వామివార్ల అలంకార దర్శనాన్ని భక్తులకు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
Advertisement