మల్లన్న భక్తులకు ఇబ్బందులు
మల్లన్న భక్తులకు ఇబ్బందులు
Published Wed, Nov 9 2016 10:25 PM | Last Updated on Mon, Oct 8 2018 9:10 PM
శ్రీశైలం: మల్లన్న భక్తులు బుధవారంనానా అవస్థలు పడాల్సి వచ్చింది. క్షేత్రవ్యాప్తంగా పెద్ద నోట్లు ఎవరూ తీసుకోకపోవడంతో చిల్లర సమస్య ఎదురైది. అభిషేకాలు నిర్వహించుకునే సేవాకర్తలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. రూ. 1500లు టికెట్ కావడంతో రూ. వెయ్యి, రూ.500ల నోట్లను దేవస్థానం వారు తీసుకుని టికెట్లను అందజేశారు. ప్రత్యేక దర్శనం రూ. 100ల టికెట్ తీసుకునే భక్తులకుమాత్రం చుక్కలు కనిపించాయి. దేవస్థానం ప్రత్యేక దర్శన క్యూ కౌంటర్‌లో రూ. 100ల నోట్లు లేకపోవడంతో రూ. 500ల నోటు తీసుకుని ఇచ్చి రెండు లేక మూడు టికెట్లు అడిగిన భక్తులకు మిగిలిన సొమ్మును దర్శనానంతరం వచ్చి తీసుకుని వెళ్లవల్సిందిగా స్లిప్‌పై రాసి ఇవ్వడం కనిపించింది. శ్రీశైలక్షేత్రాన్ని సందర్శించడానికి వచ్చి ఏదో ఒక వస్తువు ఇంటికి తీసుకెళ్దామనుకున్న భక్తులకు వ్యాపారస్తుల నుంచి చుక్కెదురైంది. ఏటీఎంలు, బ్యాంకులు పనిచేయకపోవడంతో హోటళ్లలో సైతం చిల్లర దొరకలేదు.
ఏటీఎంలు పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడ్డాం: కె శ్రీనివాస్, కాకినాడ
కార్తీకమాసం సందర్భంగా మల్లన్న దర్శనం కోసం కుటుంబ సమేతంగా శ్రీశైలం వచ్చాం. ఏటీఎం కార్డులు ఉన్నందున నగదు రూపంలో ఎక్కువ మొత్తాన్ని తీసుకురాలేదు. ఉదయం శ్రీశైలం వచ్చాక తెలిసింది. బుధ, గురువారాలు రెండు రోజుల పాటు ఏటీఎంçలు పనిచేయవని, బ్యాంకులు కూడా ఉండవని చెప్పడంతో ఏం చేయాలో తెలియక నానా ఇబ్బందులు పడ్డాం. సన్నిహిత మిత్రుల ద్వారా శ్రీశైలంలో స్థానికంగా నివాసమున్న వారి వద్ద నుంచి అప్పుగా నగదు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Advertisement