మల్లన్న ఆర్జిత సేవలు రద్దు
Published Sun, May 28 2017 11:42 PM | Last Updated on Mon, Oct 8 2018 9:10 PM
శ్రీశైలం : శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయ ప్రాంగణంలో జరిగే కొన్ని ఆర్జిత సేవలను ఆలయ ప్రధానార్చకుల సూచనలతో ఈఓ నారాయణభరత్‌గుప్తా రద్దు చేశారు. ఈ ఆర్జిత సేవ టికెట్లు అతి తక్కువ సంఖ్యలో కొనుగోలు అవుతున్నందున మిగిలిన ఆర్జిత సేవా టికెట్లను సమర్థవంతంగా, శాస్త్రోక్తంగా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూన్ 1 నుంచి ఈ కింది సేవా టికెట్లు రద్దయినట్లు ప్రకటించారు.
రద్దయిన ఆర్జిత సేవా టికెట్లు...
నవగ్రహ హోమం, చంద్రలింగాభిషేకం, బాలారిష్ట గ్రహపూజ, మహామృత్యుంజయ అభిషేకం, సహస్రలింగేశ్వర అభిషేకం, సూర్యలింగాభిషేకం, అన్నప్రాసన, నామకరణం, బాలారిష్ట దోష నివారణ పూజ, శివసహస్రనామం, పల్లకీసేవ, వెండి వాహనసేవ, అక్షరాభ్యాసం, లలితా సహస్రనామం, గౌరీవ్రతంను రద్దు చేస్తున్నట్లు ఈఓ ప్రకటించారు.
Advertisement