paid service
-
గూగుల్ సరికొత్త ఆఫర్.. ఇకపై ఆ బెడద ఉండదు
న్యూఢిల్లీ: ప్రకటనల బెడద లేకుండా ప్లే స్టోర్‌లోని వివిధ యాప్స్, గేమ్స్‌లో ప్రీమియం ఫీచర్లను ఉపయోగించుకునే వీలు కల్పించే ప్లే పాస్‌ను టెక్ దిగ్గజం గూగుల్ సోమవారం భారత మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. నెలవారీ లేదా వార్షికంగా కొంత చార్జీ కట్టి 1,000 పైగా యాప్స్, గేమ్స్‌లో ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ప్లే పాస్ కలెక్షన్లో స్పోర్ట్స్, పజిల్స్‌తో పాటు జంగిల్ అడ్వెంచర్స్, వరల్డ్ క్రికెట్ బ్యాటిల్ 2, మాన్యుమెంట్ వేలీ వంటి యాక్షన్ గేమ్స్ మొదలైనవి ఉంటాయి. ‘ప్లే పాస్‌లో భారత్ సహా 49 దేశాలకు చెందిన డెవలపర్లు 41 కేటగిరీల్లో రూపొందించిన 1,000 పైగా టైటిల్స్ కలెక్షన్ ఉంటుంది. ఒక నెల ట్రయల్‌తో ప్రారంభించి, నెలవారీగా రూ. 99 లేదా ఏడాదికి రూ. 889 సబ్స్క్రిప్షన్ చార్జీలు చెల్లించి యూజర్లు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఒక నెల కోసం రూ. 109 ప్రీపెయిడ్ సబ్స్క్రిప్షన్ కూడా ఉంటుంది‘ అని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. గూగుల్ ఫ్యామిలీ యాప్‌లో గ్రూప్ మేనేజర్లుగా రిజిస్టర్ చేసుకున్న వారు తమ ప్లే పాస్ సబ్‌స్క్రిప్షన్‌ను మరో అయిదుగురితో కూడా షేర్ చేసుకోవచ్చు. ప్లే పాస్ ఫీచర్ ఈ వారంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని కంపెనీ వివరించింది. చదవండి: గూగుల్‌లో ఎక్కువ మంది వెతికిన ఎలక్ట్రిక్ కారు ఇదే! -
మల్లన్న ఆర్జిత సేవలు రద్దు
శ్రీశైలం : శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయ ప్రాంగణంలో జరిగే కొన్ని ఆర్జిత సేవలను ఆలయ ప్రధానార్చకుల సూచనలతో ఈఓ నారాయణభరత్‌గుప్తా రద్దు చేశారు. ఈ ఆర్జిత సేవ టికెట్లు అతి తక్కువ సంఖ్యలో కొనుగోలు అవుతున్నందున మిగిలిన ఆర్జిత సేవా టికెట్లను సమర్థవంతంగా, శాస్త్రోక్తంగా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూన్ 1 నుంచి ఈ కింది సేవా టికెట్లు రద్దయినట్లు ప్రకటించారు. రద్దయిన ఆర్జిత సేవా టికెట్లు... నవగ్రహ హోమం, చంద్రలింగాభిషేకం, బాలారిష్ట గ్రహపూజ, మహామృత్యుంజయ అభిషేకం, సహస్రలింగేశ్వర అభిషేకం, సూర్యలింగాభిషేకం, అన్నప్రాసన, నామకరణం, బాలారిష్ట దోష నివారణ పూజ, శివసహస్రనామం, పల్లకీసేవ, వెండి వాహనసేవ, అక్షరాభ్యాసం, లలితా సహస్రనామం, గౌరీవ్రతంను రద్దు చేస్తున్నట్లు ఈఓ ప్రకటించారు.