
న్యూఢిల్లీ: ప్రకటనల బెడద లేకుండా ప్లే స్టోర్‌లోని వివిధ యాప్స్, గేమ్స్‌లో ప్రీమియం ఫీచర్లను ఉపయోగించుకునే వీలు కల్పించే ప్లే పాస్‌ను టెక్ దిగ్గజం గూగుల్ సోమవారం భారత మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. నెలవారీ లేదా వార్షికంగా కొంత చార్జీ కట్టి 1,000 పైగా యాప్స్, గేమ్స్‌లో ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ప్లే పాస్ కలెక్షన్‌లో స్పోర్ట్స్, పజిల్స్‌తో పాటు జంగిల్ అడ్వెంచర్స్, వరల్డ్ క్రికెట్ బ్యాటిల్ 2, మాన్యుమెంట్ వేలీ వంటి యాక్షన్ గేమ్స్ మొదలైనవి ఉంటాయి.
‘ప్లే పాస్‌లో భారత్ సహా 49 దేశాలకు చెందిన డెవలపర్లు 41 కేటగిరీల్లో రూపొందించిన 1,000 పైగా టైటిల్స్ కలెక్షన్ ఉంటుంది. ఒక నెల ట్రయల్‌తో ప్రారంభించి, నెలవారీగా రూ. 99 లేదా ఏడాదికి రూ. 889 సబ్‌స్క్రిప్షన్ చార్జీలు చెల్లించి యూజర్లు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఒక నెల కోసం రూ. 109 ప్రీపెయిడ్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంటుంది‘ అని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది.
గూగుల్ ఫ్యామిలీ యాప్‌లో గ్రూప్ మేనేజర్లుగా రిజిస్టర్ చేసుకున్న వారు తమ ప్లే పాస్ సబ్‌స్క్రిప్షన్‌ను మరో అయిదుగురితో కూడా షేర్ చేసుకోవచ్చు. ప్లే పాస్ ఫీచర్ ఈ వారంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని కంపెనీ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment