Advertisements
-
నిబంధనల మేరకే పత్రికలకు ప్రకటనలు
సాక్షి, అమరావతి: వార్తా పత్రికలకు ప్రకటనల జారీ విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై కూటమి నేతలు చేస్తున్న అసత్య ప్రచారంలో వీసమెత్తు వాస్తవం లేదని, నిబంధనల మేరకే ప్రకటనలు ఇచ్చి నట్లు అసెంబ్లీ సాక్షిగా మరోసారి తేటతెల్లమైంది. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా సాక్షి పత్రికకు రూ.400 కోట్ల ప్రకటనలు ఇచ్చారని టీడీపీ నేతలు దు్రష్పచారం చేశారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఏడాది జూలైలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలే అడిగిన ప్రశ్నకు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఇచ్చిన సమాధానంతో రుజువైంది. ఆ ఐదేళ్లలో సాక్షికి రూ.371 కోట్లు, ఈనాడు పత్రికకు మూడున్నరేళ్లపాటు అదే స్థాయిలో ప్రభుత్వం ప్రకటనలు జారీ చేసినట్టు వెల్లడించారు. మంగళవారం శాసన మండలిలో టీడీపీ సభ్యులే దీనిపై ప్రశి్నంచగా.. గత ప్రభుత్వంలో జీవో 431 ప్రకారం నిబంధనలకు లోబడే వార్తా పత్రికలకు ప్రకటనలను జారీ చేశారని ఒప్పుకొన్నారు. ఈ జీవో ప్రకారం ప్రకటనలు ఇచ్చే విచక్షణాధికారం సమాచార, పౌర సంబంధాల (ఐ అండ్ పీఆర్) శాఖ డైరెక్టర్‌కు ఉంటుందన్నారు. ఈ మేరకే 2019 – 24 మధ్య సాక్షికి రూ.371 కోట్ల విలువైన ప్రకటనలు జారీ చేయగా, అందులో రూ. 196 కోట్లు చెల్లించారని తెలిపారు. ఈనాడు సహా ఇతర పత్రికలన్నింటికీ రూ.488 కోట్ల మేర ప్రకటనలు ఇవ్వగా.. అందులో రూ. 360 కోట్లు ప్రభుత్వం చెల్లించిందన్నారు. మంత్రి సమాధానం వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిష్పాక్షికతను మరోసారి వెల్లడించింది. 2019కు ముందు ప్రభుత్వం జారీ చేసిన జీవో 431 ప్రకారమే 2019 – 24 మధ్య ప్రకటనలు ఇచ్చినట్లు మరోసారి స్పష్టమైంది. మూడన్నరేళ్లలోనే ఈనాడుకు రూ.243 కోట్ల విలువైన ప్రకటనలు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తొలి మూడున్నరేళ్లలోనే ఈనాడు పత్రికకు సమాచార శాఖ ద్వారా రూ.190 కోట్లు, వివిధ శాఖల ద్వారా రూ.53 కోట్లు చొప్పున మొత్తం రూ.243 కోట్లు విలువైన ప్రకటనలను ఇచ్చారు. ఆ తర్వాత ఈనాడు యాజమాన్యం ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వొద్దని, తాము ప్రచురించబోమని అధికారికంగా సమాచార శాఖకు లేఖ రాసింది. దాంతో చివరి ఏడాదిన్నర ఈనాడు పత్రికకు ప్రకటనలు ఇవ్వలేదు. ఈ లెక్కన పరిశీలిస్తే సాక్షి పత్రికతో సమానంగా ఈనాడు పత్రికకు కూడా ప్రకటనలు ఇచ్చారనేది వాస్తవం. ఇక తాజాగా ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం సాక్షికి ఇచ్చిన ప్రకటనల మొత్తంలో రూ.175 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని స్పష్టమైంది. 2014–19 మధ్య చంద్రబాబు జమానాలో ప్రభుత్వ ప్రకటనల జారీలో ‘సాక్షి’ పత్రిక పట్ల వివక్షాపూరితంగా వ్యవహరించారు. ఆ ఐదేళ్లలో ఈనాడు పత్రికకు రూ.121.97 కోట్ల ప్రకటనలు ఇవ్వగా, సాక్షి పత్రికకు కేవలం రూ.30.97 కోట్ల మేరకే ప్రభుత్వ ప్రకటనలు జారీ చేశారు. -
యాడ్‌తో టైమ్ వేస్ట్ చేశారు
బెంగళూరు: పీవీఆర్ ఐనాక్స్, బుక్‌మై షోలపై ఓ యువకుడు కోర్టుకెక్కాడు. సుదీర్ఘమైన వాణి జ్య ప్రకటనలతో తన సమయాన్ని వృథా చేశారని, మానసిక క్షోభకు గురి చేశారని ఆరోపిస్తూ కేసు వేశాడు. అతనికి రూ.65 వేల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది! ఈ ఆసక్తికరమైన ఘటన బెంగళూరులో జరిగింది. నగరానికి చెందిన అభిషేక్ ‘సామ్ బహదూర్’సినిమా కోసం బుక్‌మై షోలో మూడు టికెట్లు కొన్నాడు. సాయంత్రం 4.05కు మొదలవాల్సిన సినిమా కాస్తా ఏకంగా 30 నిమిషాలు సినిమా ప్రకటనలు, ట్రైలర్ల ప్రసారంతో 4.30కు మొదలైంది. దాంతో సకాలంలో ఆఫీసుకు వెళ్లలేకపోయానని అభిషేక్ ఆరోపించాడు. ‘‘నా విలువైన సమయం వృథా అయింది. ప్రకటనలు ద్వారా ప్రయోజనం పొందడానికి థియేటర్ వారు షో టైమింగ్స్‌ను తప్పుగా పేర్కొన్నారు. ఇది అన్యాయం’’అంటూ వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. సమయాన్ని డబ్బుగా పరిగణిస్తామని వినియోగదారుల కోర్టు స్పష్టం చేసింది. ఫిర్యాదుదారుకు జరిగిన నష్టాన్ని పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ పూడ్చాలని పేర్కొంది. అనైతిక వ్యాపార చర్యలకు పాల్పడ్డందుకు, సమయాన్ని వృథా చేసినందుకు రూ.50 వేలు, మానసిక వేదనకు రూ.5 వేలు, ఫిర్యాదు, ఇతర ఉపశమనాలకు రూ.10 వేలు చెల్లించాలని ఆదేశించింది. పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ సంస్థలకు రూ.లక్ష జరిమానా కూడా విధించింది. బుక్‌మైషో కేవలం టికెట్ బుకింగ్ వేదిక కాబట్టి ఎలాంటి పరిహారమూ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రకటనల స్ట్రీమింగ్ సమయంపై నియంత్రణ లేకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. -
సాక్షి'పై ఇన్ని అబద్ధాలా?.. కూటమి కుట్ర బట్టబయలు
-
మోసపూరిత ప్రకటనలతో జాగ్రత్త: ఎల్ఐసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తమ సంస్థ పేరుతో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న మోసపూరిత ప్రకటనల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) హెచ్చ రించింది.‘కంపెనీ సమ్మతి లేకుండా మా సీనియర్ అధికారి, మాజీ అధికారుల ఫొటోలు, లోగో, బ్రాండ్ పేరును దురి్వనియోగం చేయడం ద్వారా నిర్దిష్ట వ్యక్తులు/సంస్థలు వివిధ సామాజిక మాధ్యమాల్లో మోసపూరిత ప్రకటనల్లో అనధికార పద్ధతిలో నిమగ్నమై ఉన్నాయని మా దృష్టికి వచి్చంది. పాలసీదారులు, ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలి. అటువంటి మోసపూరిత ప్రకటనల యూ ఆర్ఎల్ లింక్‌లను ఎల్ఐసీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో నివేదించండి’ అని ఎల్ఐసీ కోరింది. -
నాటి అడ్వర్టైజ్మెంట్ల సైజులోనే క్షమాపణల యాడ్స్ వేశారా?
న్యూఢిల్లీ: కరోనా విలయకాలంలో అల్లోపతి వంటి ఆధునిక వైద్యవిధానాలను తప్పుబడుతూ పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ ఇచ్చిన తప్పుడు అడ్వర్టైజ్మెంట్లు, ప్రకటనల కేసులో బాబా రాందేవ్, పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పినా సర్వోన్నత న్యాయస్థానం వారిని వదిలిపెట్టలేదు. ఈ కేసు విచారణ సందర్భంగా మంగళవారం రాందేవ్, బాలకృష్ణ తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు హాజరయ్యారు. రూ.10 లక్షలు ఖర్చుపెట్టి సోమవారం 67 వార్తాపత్రికల్లో క్షమాపణల యాడ్ ఇచ్చామని కోర్టుకు తెలిపారు. ‘‘ ఆనాడు అల్లోపతిని కించపరుస్తూ, పతంజలి ఉత్పత్తులు అద్భుతమంటూ ఇచ్చిన ఫుల్‌పేజీ యాడ్ల స్థాయిలోనే ఈ యాడ్లను ప్రముఖంగా ప్రచురించారా?. అదే ఫాంట్ సైజులో అంతే పరిమాణంలో ప్రకటన ఇచ్చారా?’ అని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు. ‘ మా క్లయింట్లు యాడ్స్ కోసం లక్షలు వెచ్చించారు’ అని రోహత్గీ చెప్పారు. ‘ ఖర్చు ఎంతయింది అనేది మాకు అనవసరం’ అని జడ్జి అసహనం వ్యక్తంచేశారు. ‘గతంలో క్షమాపణల యాడ్స్ ఇవ్వాలని ఆదేశిస్తే ఈరోజు కోర్టు విచారణ ఉందనగా నిన్న ఎందుకు యాడ్ ఇచ్చారు?. ఈ కేసులో పతంజలికి ప్రతివాదిగా ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌పై రూ.100 కోట్ల పరువునష్టం దావా ఒకటి దాఖలైంది. ఆ దావాతో మీకేమైనా సంబంధం ఉందా?’ అని జడ్జి అనుమానం వ్యక్తంచేశారు. ‘‘ తన క్లయింట్లకు దీనితో ఎలాంటి సంబంధం లేదు. ఈసారి పెద్ద సైజులో క్షమాపణ ప్రకటనలు ఇస్తాం’’ అని రోహత్గీ చెప్పారు. దీంతో సోమవారం నాటి ప్రకటనల వివరాలను రెండ్రోజుల్లోపు సమర్పించాలని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాహ్ల ధర్మాసనం ఆదేశించింది. ఇలాగే తప్పుడు ప్రకటనలు ఇస్తున్న ఫాస్ట్‌మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని సంబంధింత మూడు కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖలను కోర్టు ఆదేశించింది. ‘‘ ఈ కంపెనీల తప్పుడు ప్రకటనలు వల్లే ఆయా సంస్థల ఉత్పత్తులను చిన్నారులు, పాఠశాల స్థాయి విద్యార్థులు, వృద్ధులు విరివిగా వినియోగిస్తున్నారు’ అని కోర్టు ఆవేదన వ్యక్తంచేసింది. -
పొగాకు ఉత్పత్తుల ప్రకటనల్లో పాల్గొంటున్నందుకు..
లక్నో: పొగాకు కంపెనీల తరఫున ప్రకటనల్లో కన్పిస్తున్న బాలీవుడ్ నటులు షారూక్ ఖాన్, అక్షయ్‌కుమార్, అజయ్ దేవ్‌గణ్‌లకు కేంద్రం నోటీసులు పంపింది. ప్రజల ఆరోగ్యానికి చేటు తెస్తున్న పొగాకు ఉత్పత్తుల ప్రకటనల్లో సెలబ్రిటీలు, ముఖ్యంగా పద్మ అవార్డు గ్రహీతలు నటిస్తుండటంపై మోతీలాల్ యాదవ్ అనే న్యాయవాది గతంలో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. కేంద్రం స్పందించడం లేదని, ఇది ధిక్కరణేనని పిటిషనర్ మరోసారి కోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. షారూక్, అక్షయ్, అజయ్‌లకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అక్టోబర్ 20వ తేదీనే నోటీసులిచ్చిందని కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్బీ పాండే కోర్టుకు తెలిపారు. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. విచారణ 2024 మే 9కి వాయిదా పడింది. -
416 ప్రకటనల్లో 15 మాత్రమే నిలిపివేశాం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ప్రచారం కోసం సమర్పించిన ప్రకటనల్లో మూడు ప్రధాన పార్టీలకు సంబంధించి 15 ప్రకటనలు మాత్రమే నిలిపివేస్తూ ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ స్పష్టం చేశారు. ప్రచార ప్రకటనల నిలిపివేతపై వస్తున్న వార్తలపై స్పందించిన సీఈవో మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. ఎన్నికల సంఘం నియమించిన ప్రకటనల పరిశీలన, అనుమతి కమిటీ మొత్తం 416 ప్రకటనలకు అనుమతినిచ్చిందని తెలిపారు. అనుమతించిన వాటిలో కొన్నింటి రూపురేఖలు మార్చడం, వక్రీకరించి తప్పుగా అన్వయించడం వంటివి జరిగినట్లు పేర్కొన్నారు. అనుమతి నిబంధనలను ఉల్లంఘించి వాటిని ప్రసారం చేయడం అంటే ఆ స్ఫూర్తిని దెబ్బతీయడమేనని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రకటన తర్వాత అమలులోకి వచ్చిన నిబంధనల ప్రకారం ఆయా రాజకీయ పార్టీలు ప్రచారం చేసుకోవడానికి రాష్ట్ర స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అనుమతి మంజూరు చేస్తుందని, వాటిని యథాతథంగా ఉపయోగించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే రాజకీయ పార్టీలు ముందుగా తగిన అనుమతి పొందని ప్రకటనలను యూట్యూబ్‌తో పాటు ఇతర వేదికలలో కూడా ప్రచారం చేస్తున్నట్లు ఎన్నికల సంఘం దృష్టికి వచ్చిందని తెలిపారు. దీనిపై ఎన్నికల సంఘం ఈనెల 8, 9, 10 తేదీల్లో వివిధ రాజకీయ పార్టీలతో మూడు సమావేశాలు నిర్వహించిందని, ఈ సమావేశాల్లో ప్రచార, ప్రచార అనుమతి (ధ్రువీకరణ/ సర్టిఫికేషన్) పొందడానికి మార్గదర్శకాలను క్షుణ్ణంగా వివరించామన్నారు. అదే విధంగా అనుమతుల్లేని ప్రకటనల ద్వారా తలెత్తే సమస్యలను కూడా తెలిపామన్నారు. ఎన్నికల సంఘం సూచనలను, మార్గదర్శకాలను అనుసరిస్తామని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల సంఘం అనుమతి పొందాల్సిందే రాజకీయ పార్టీలు విడుదల చేసే ప్రకటనలను ప్రసారం చేయడానికి ముందు ధ్రువీకరణ పొందిన ప్రకటనలేనా కాదా అనేది మీడియా సరిచూసుకోవాలని కోరింది. ఎన్నికల నియమావళి ప్రకారం అనుమతి పొందని అంశాల ప్రసారాలను నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తామని వికాస్‌రాజ్ తెలిపారు. రాజకీయ పార్టీలు విడుదల చేసే ప్రకటనలకు అనుమతి ధ్రువీకరణ ఇవ్వడం అనేది నిరంతర ప్రక్రియని వివరించారు. ఏ రాజకీయ పార్టీ అయినా, అభ్యర్థి అయినా రాష్ట్ర, జిల్లా స్థాయిలో అనుమతి ధ్రువీకరణ కోసం మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీకి ప్రకటనలను పంపుకోవచ్చునని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఉపసంహరించిన ప్రకటనలు ఇలా.... బీజేపీ డబుల్ బెడ్రూం, దొంగ చేతికి తాళం, రైతు, నేతి బీరకాయ, పేనుకు పెత్తనం బీఆర్ఎస్ దేఖ్ లేంగే (తెలుగు పాట), మొదటి ఓటు ఎవరికి (వీడియో ప్రకటన), రైతుల అండదండ– కేసీఆర్ (వీడియో ప్రకటన), కల్యాణలక్ష్మి కాంగ్రెస్ కారు (30 సెకన్లు), జాబ్ (15 సెకన్లు), రైతు (40 సెకన్లు), రైతు (30 సెకన్లు), రైతు (15 సెకన్లు), రైతు (15 సెకన్లు) -
మాడిసన్ వరల్డ్ ఫౌండర్ సామ్ బల్సారాకు అరుదైన గౌరవం
అడ్వర్టైజింగ్ పరిశ్రమ అనుభవజ్ఞుడు, మాడిసన్ వరల్డ్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సామ్ బల్సారా అరుదైన ఘనతకు దక్కించుకున్నారు. మీడియా ,అడ్వర్టైజింగ్ రంగంలో చేసిన సేవలకుగానూ ఎక్స్ఛేంజ్4మీడియా గ్రూపు ఆయనకు 'లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డ్'ని ఇచ్చి సత్కరించింది. ఎక్స్ఛేంజ్4మీడియా గ్రూప్ మీడియా ఏస్ అవార్డ్స్ 2023 వేడుకలను ఈ నెల (నవంబరు 2) ముంబైలో నిర్వహించింది. దీంతో పలువురు ఇండస్ట్రీ పెద్దలు, ఇతర బిజినెస్ వర్గాలు ఆయనకు అభినందనలు తెలిపాయి. ఎవరీ సామ్ బల్సారా గుజరాత్‌లోని వల్సాద్ అని పిలిచే బల్సార్‌లో జన్మించారు. తండ్రి ఫారెస్ట్ కాంట్రాక్టర్ కావడంతో బల్సారా కుటుంబం బెంగళూరుకు మారింది. బెంగుళూరులోని సెయింట్ జోసెఫ్ కళాశాల నుండి డిగ్రీని, 1970లో ముంబైలోని జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఆ తరువాత క్యాడ్‌బరీకి, అడ్వర్టైజింగ్ ఎట్ కాంట్రాక్ట్ (WPP) ముద్రకు లాంటి సంస్థలకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. సారాభాయ్‌లో తన కరియర్‌ను ప్రారంభించిన బల్సారా మార్కెటింగ్ రంగంలో 50ఏళ్ల అనుభవజ్ఞుడు. మాడిసన్ ఆవిర్భావం 1988లో అడ్వర్టైజింగ్ కంపెనీగా మాడిసన్‌ను ప్రారంభించారు. అంచలంచెలుగా ఎదిగిన సంస్థ ఇపుడు 26 యూనిట్లతో విభిన్న కమ్యూనికేషన్ల సమూహంగా అవతరించింది. మాడిసన్ వరల్డ్ ... అడ్వర్టైజింగ్, మీడియా ప్లానింగ్ అండ్ బైయింగ్, బిజినెస్ అనలిటిక్స్, OOH, PR, రూరల్, రిటైల్, ఎంటర్టైన్మెంట్, మొబైల్, ఈవెంట్స్, యాక్టివేషన్స,స్పోర్ట్స్ లాంటి 11 విభాగాల్లో తన సేవల్ని అందిస్తోంది. -
డాక్టర్లుగా నటించే సెలబ్రిటీలకు కొత్త రూల్! మార్గదర్శకాలు విడుదల
వైద్య ఆరోగ్య సంబంధమైన ఉత్పత్తుల ప్రకటనల్లో హెల్త్ ఎక్స్‌పర్ట్‌లు, డాక్టర్లుగా నటించే సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయన్సర్లు, వర్చువల్ ఇన్ఫ్లుయన్సర్లు వీక్షకులను తప్పుదారి పట్టించకుండా డిస్ల్కైమర్లు వేయడం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఒకవేళ ప్రకటనల్లో అసలైన వైద్య నిపుణులు, హెల్త్, ఫిట్నెస్ ఎక్స్‌పర్ట్‌లు నటించినా కూడా వైద్య, ఆరోగ్య సంబంధ సమాచారాన్ని తెలియజేసేటప్పుడు, ఆయా ఉత్పత్తులు లేదా సేవలను ప్రచారం చేస్తున్నప్పుడు తాము ధ్రువీకరణ పొందిన హెల్త్/ఫిట్నెస్ ఎక్స్‌పర్ట్‌లు లేదా వైద్య నిపుణులమనే విషయాన్ని బహిర్గతం చేయాలని సూచించింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు అదనపు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆయుష్ శాఖ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI), అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) సహా వాటాదారులతో చర్చించిన అనంతరం ఈ మార్గదర్శకాలను రూపొందించింది. సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయన్సర్లు, వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు.. ఆరోగ్య నిపుణులుగా లేదా వైద్య నిపుణులుగా నటిస్తూ వైద్య, ఆరోగ్య సమాచారాన్ని తెలియజేస్తున్నప్పుడు, వైద్య ఉత్పత్తులు లేదా సేవలను ప్రచారం చేసేటప్పుడు తాము చెప్పే విషయాలు వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని స్పష్టమైన డిస్ల్కైమర్లు వేయడం తప్పనిసరి అని మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటికి మినహాయింపు అయితే వ్యక్తుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే నిర్దిష్ట ఉత్పత్తులు, సేవలతో సంబంధం లేని సాధారణ వెల్నెస్, ఆరోగ్య సలహాలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. అంటే నీరు ఎక్కువగా తాగండి.. వ్యాయామం చేయండి.. బాగా నిద్రపోండి.. వంటి సాధారణ సలహాలు ఇవ్వవచ్చు. వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ మార్గదర్శకాల అమలును చురుకుగా పర్యవేక్షిస్తుంది. ఉల్లంఘనలకు పాల్పడితే వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం జరిమానాలు విధించవచ్చు. -
స్వల్ప ప్రీమియం చెల్లించడం ద్వారా రూ.కోటి పొందండి... ‘ఇదేం బాలేదు’
న్యూఢిల్లీ: కొన్ని బీమా బ్రోకింగ్ సంస్థలు వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వడంపై పౌర సేవా సంస్థ ‘ప్రహర్’ కేంద్ర ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేసింది. ఆన్లైన్లో పాలసీలను విక్రయించే కొన్ని నూతన తరం బీమా బ్రోకింగ్ కంపెనీలు.. కేవలం కొన్నేళ్ల పాటు స్వల్ప ప్రీమియం చెల్లించడం ద్వారా రూ.కోటి మొత్తాన్ని పొందొచ్చంటూ కస్టమర్లను ఆకర్షిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖకు రాసిన లేఖలో వివరించింది. (రూ. 2 వేల నోట్లు: ఆర్బీఐ కీలక ప్రకటన) గత ఆర్థిక ఫలితాల ఆధారంగా భవిష్యత్తు పనితీరును పాలసీదారులకు వెల్లడించరాదని బీమా రంగ ప్రకటనల చట్టంలోని సెక్షన్లు స్పష్టం చేస్తున్నట్టు గుర్తు చేసింది. అలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వకుండా సంబంధిత బీమా బ్రోకింగ్ సంస్థలను ఆదేశించాలని కేంద్ర ఆర్థిక శాఖ, బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ)ను కోరింది. (జియో మరో సంచలనం: రూ. 999కే ఫోన్, సరికొత్త ప్లాన్ కూడా) లేదంటే అలాంటి ప్రకటనలు బీమా పాలసీలను వక్రమార్గంలో విక్రయించడానికి దారితీస్తాయని, పాలసీదారుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పాలసీబజార్, ఇన్సూర్‌దేఖో మార్గదర్శకాలను ఉల్లంఘంచినట్టు ప్రహర్ తన లేఖలో ప్రస్తావించింది. అయితే తాము ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని సదరు సంస్థలు స్పష్టం చేశాయి. నియంత్రణ సంస్థలు ఏవైనా లోపాలను గుర్తిస్తే, వాటి ఆదేశాల మేరకు నడుచుకుంటామని ప్రకటించాయి. -
గూగుల్ కీలక నిర్ణయం: మరోసారి ఉద్యోగులకు ఉద్వాసన!
సెర్చ్ జెయింట్ గూగుల్ మరోసారి ఉద్యోగాల కోతను ప్రకటించింది. మ్యాపింగ్ సర్వీస్ వేజ్లో ఉద్యోగులను తొలగించేందుకు యోచిస్తోంది. ఆదాయం క్షీణిస్తున్న నేపథ్యంలో సామర్థ్యం తగ్గించుకునేందుకు యోచిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. అలాగే వేజ్ను అడ్వర్టైజింగ్ సాఫ్ట్‌వేర్‌ను గూగుల్ యాడ్స్ టెక్నాలజీ కోసం వినియోగించనున్నట్లు తెలిపింది. అయితే తాజా నిర్ణయంలో ఎంత మందిని తొలగిస్తుందనేది స్పష్టత లేదు. పూర్తి స్పష్టత రావాలంటే గూగుల్ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే. రాయిటల్స్ నివేదిక ప్రకారం ఎక్కువగా సేల్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, అనలిటిక్స్ విభాగాల ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. వేజ్ను గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ (GBO)కి మార్చడంతోపాటు గూగుల్ మ్యాప్స్‌తో కలపాలని కంపెనీ యోచిస్తోంది. ప్రకటనదారులకు మరింత మెరుగైన దీర్ఘకాలిక అనుభవాన్ని అందించాలనే లక్ష్యంలో భాగంగా వేజ్ ప్రస్తుత అడ్వర్టైజింగ్ సిస్టంను గూగుల్ యాడ్స్ టెక్నాలజీకి మార్చనుంది. ఫలితంగా వేజ్ ప్రకటనల మానిటైజేషన్‌కు సంబంధించిన ఉద్యోగాల్లో తొలగింపులుంటాయని గూగుల్ జియో యూనిట్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ ఫిలిప్స్ ఉద్యోగులకు తెలిపారు. కాగా గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్, స్ట్రీట్ వ్యూ లాంటి సేవలందింస్తే గూగుల్ జియో డివిజన్లో వేజ్ను విలీనం చేయబోతున్నట్టు గత ఏడాది చివర్లోనే గూగుల్ ప్రకటించింది. అలాగే ఆదాయానికి కీలకమైన డిజిటల్ అడ్వర్టైజింగ్కు గత సంవత్సరం డిమాండ్ మందగించిన నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునే పనిలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఉద్యోగాలను తగ్గించుకుంటోంది. ఇందులో భాగంగానే జనవరిలో గ్లోబల్‌గా ఉద్యోగులను 6శాతానికి మించి దాదాపు 12వేల ఉద్యోగులను తీసివేసింది. కాగా ఏప్రిల్‌లో కంపెనీ మొదటి త్రైమాసిక ఫలితాల్లో యూట్యూబ్ ద్వారా ఊహించిన దానికంటే బలమైన ప్రకటనల అమ్మకాలపై అంచనాల కంటే ఎక్కువగా ఉన్నట్లు నివేదించింది. -
వారికి గుడ్‌న్యూస్ చెప్పిన ఎలాన్ మస్క్: ఇక డబ్బులే డబ్బులు!
సాక్షి,ముంబై: ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ గుడ్ న్యూస్ చెప్పారు. వెరిఫైడ్ కంటెంట్ క్రియేటర్స్‌కు డబ్బులు చెల్లించనున్నట్టు వెల్లడించారు. కంటెంట్‌లో డిస్ప్లే అయ్యే యాడ్స్ ఆధారంగా ఈ చెల్లింపులు చేయనున్నట్టు మస్క్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. రానున్న కొద్ది వారాల్లో ఈ చెల్లింపులను మొదలు పెడతామని మస్క్ తెలిపారు. అయితే ధృవీకరించబడిన వినియోగదారులను మాత్రమే పరిగణనలోకి తీసుకోనున్నామని మస్క్ స్పష్టం చేశారు. ఈ చెల్లింపుల నిమిత్తం సుమారు రూ. 41.2 కోట్లు (5 మిలియన్ డాలర్లు) కేటాయించినట్టు తెలిపారు. మస్క్ తాజా నిర్ణయం ప్రకారం యూట్యూబర్స్ మాదిరిగా ట్వీపుల్ కూడా తమ కంటెంట్‌లో రిప్లై సెక్షన్లో డిస్ప్లే అయ్యే యాడ్స్ ప్రకారం డబ్బులు సంపాదించవచ్చు. (1200 లోన్‌తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు) కాగా గత ఏడాది అక్టోబర్‌లో ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుండి, ప్రకటనదారులనుంచి పెనుసవాళ్లను ఎదుర్కొంటోంది ట్విటర్. మరోవైపు ట్విటర్ సీఈవోగా అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్ లిండా యాకారినో పదవి చేపట్టిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం ప్రకటనల పరిశ్రమలో ఆమెకున్న విస్తృతమైన నేపథ్యం , సరికొత్త వ్యూహాలతో భారీ ఆదాయ సమకూరనుందని అంచనా. (డిజిటల్ చెల్లింపుల్లో ఇండియా రికార్డ్: విశేషం ఏమిటంటే!) In a few weeks, X/Twitter will start paying creators for ads served in their replies. First block payment totals $5M. Note, the creator must be verified and only ads served to verified users count. — Elon Musk (@elonmusk) June 9, 2023 -
ఇకపై మరింత విసిగించనున్న యూట్యూబ్! అర నిమిషంపాటు నాన్ స్టాప్..
గూగుల్ (Google) యాజమాన్యంలోని యూట్యూబ్ (YouTube) ప్రేక్షకులను మరింత విసిగించనుంది. అంటే ఎక్కువ సేపు యాడ్స్‌ను ప్రసారం చేయనుంది. అది కూడా స్కిప్ చేయడానికి వీలు లేకుండా. కనెక్టెడ్ టీవీ (సీటీవీ)లలో 30 సెకన్ల నాన్-స్కిప్ యాడ్లను ప్రవేశపెట్టనున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. ఇంతకు ముందున్న రెండు 15 సెకన్ల వరుస యాడ్స్ స్థానంలో ఈ 30 సెకన్ల నాన్- స్కిప్ యాడ్స్‌ను తీసుకొస్తున్నట్లు ఇటీవల ఒక బ్లాగ్‌పోస్ట్‌లో తెలిపింది. ప్రకటనకర్తల లక్ష్యాలకు అనుగుణంగా బిగ్ స్క్రీన్‌పై ఎక్కువ నిడివి యాడ్స్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇవి ప్రేక్షకులకు కూడా మంచి అనుభూతిని ఇస్తాయని పేర్కొంది. టీవీ స్క్రీన్‌పై యూట్యూబ్ సెలెక్ట్ వీక్షకులు పెరుగుతున్న నేపథ్యంలో ఇందులో వివిధ కంటెంట్లు ప్రసారమయ్యే సమయంలో యాడ్స్ ప్రసారం చేసుకునేందుకు ప్రకటనకర్తలకు యూట్యూబ్ అవకాశం కల్పిస్తోంది. ఇదీ చదవండి: జీమెయిల్, యూట్యూబ్ యూజర్లకు అలర్ట్: త్వరలో అకౌంట్లు డిలీట్! -
‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా!
‘నాటు నాటు’ తెలుగు పాటకు ఇప్పుడు దిగ్గజ కంపెనీలు ఆడిపాడుతున్నాయి. భారత్ నుంచి ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటతోపాటు, ‘ది ఎలిఫెంట్ విష్ఫరర్స్’ చిత్రాల వెంట దిగ్గజ బ్రాండ్లు క్యూ కడుతున్నాయి. 95వ ఆస్కార్ అకాడమీ అవార్డుల్లో రెండు భారత్‌ను వరించడం తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో యూజర్లను చేరుకునేందుకు కంపెనీలు ఇప్పుడు అవార్డు పొందిన చిత్రాల ఆధారంగా ప్రచార ప్రకటనలు రూపొందించుకుంటున్నాయి. జొమాటో, స్విగ్గీ, డంజో, మీషో, కేఎఫ్‌సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, రెకిట్ బెంకిసర్‌కు చెందిన కండోమ్ బ్రాండ్ డ్యూరెక్స్, గ్లూకోజ్ డ్రింక్ గ్లూకాన్ డీ, మథర్ డెయిరీ, పీఅండ్‌జీకి చెందిన టైడ్ డిటర్జెంట్ ఇప్పటికే వీటి ఆధారంగా ప్రకటనలు, మీమ్స్‌ను రూపొందించాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు, ది ఎలిఫెంట్ విష్ఫరర్స్ సినిమాలను తమ బ్రాండ్ల సందేశాల్లో చూపిస్తున్నాయి. (‘నాటు నాటు’ ప్రభంజనం.. ఆస్కార్ ఫీట్‌తో గూగుల్ సెర్చ్‌లో జూమ్) వృద్ధికి ఎన్నో మార్గాలు.. స్విగ్గీ బైక్ ఐకాన్‌ను తీసివేసింది. దీని స్థానంలో ఏనుగును (ఎలిఫెంట్ విష్ఫరర్స్)ను ప్రవేశపెట్టింది. పేటీఎం అయితే.. ‘సే నా టో యూపీఐ ఫెయిల్యూర్స్ విత్ పేటీఎం’ అంటూ ప్రకటన రూపొందించింది. అంటే లావాదేవీల వైఫల్యానికి నో చెప్పండనే సందేశాన్ని నా టో అని గుర్తు చేసింది. ‘గెలుపొందిన అరుపుల గుసగుసలు. నిజంగా గొప్ప రాత్రి’ అని కండోమ్ బ్రాండ్ డ్యూరెక్స్ ప్రకటన విడుదల చేసింది. డంజో మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ మేనేజర్ తన్వీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఆస్కార్ కార్యక్రమం సందర్భానుసారం వచ్చే మార్కెట్ అవకాశాల కంటే ఎక్కువని వ్యాఖ్యానించారు. ఇటువంటి తరుణంలో దేశాన్ని గర్వపడేలా చేసిన వారి గురించి సంబరాలు చేసుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. Congratulations team RRR for delivering smiles to a billion people! You’ve made all of us proud!#NaatuNaatuSong #Oscars95 #RRR #Oscars2023Live #NaatuNaatuForOscars #Oscars pic.twitter.com/9xpW1HKseD — Dunzo (@DunzoIt) March 13, 2023 ఇన్స్టంట్ గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్ అయిన డంజో 3డీ వెర్షన్‌తో ప్రత్యేకమైన హూక్ సెŠట్ప్ వెర్షన్‌ను రూపొందించింది. ఆర్ఆర్ఆర్లోని నాటు నాటు పాటలో హూక్ స్టెప్స్ చూసే ఉంటారు. వీటిని తన మస్కట్ హర్రితో చేయించి విడుదల చేసింది. కేఎఫ్‌సీ సైతం చికెన్ డిన్నర్‌కు ఆర్ఆర్ఆర్ టైటిల్ జోడిస్తూ పోస్ట్ పెట్టింది. ఇది కేఎఫ్‌సీ ప్రియులతో పాటు, సినీ అభిమానులను చేరుకునే విధంగా ఉంది. A glass of Instant Energy to make you go NAATU NAATU. 🕺🕺#GluconD #InstantEnergy #RRR #NaatuNaatu #Oscars #TasteBhiEnergyBhi #Flavours #Orange #VitaminC pic.twitter.com/TPAIzvxsPM — Glucon-D India (@GluconDIndia) March 13, 2023 #NaatuNaatu and #TheElephantWhisperer just deliveRRRed a 'jumbo' order for 140 crore Indians. #Oscars2023 #Oscars pic.twitter.com/xcmPolutE1 — Meesho (@Meesho_Official) March 13, 2023 -
తప్పుదోవ పట్టించే ప్రకటనలు వద్దు
న్యూఢిల్లీ: వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా తమ ప్రకటనలు ఉండకుండా చూసుకోవాలని తయారీ సంస్థలు, సర్వీస్ ప్రొవైడర్లు, ప్రకటనకర్తలు, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలకు కేంద్రం సూచించింది. ఇటు వ్యాపార, అటు వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలని పేర్కొంది. ముంబైలో నిర్వహించిన అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఈ మేరకు సూచనలు చేశారు. వినియోగదారులకు వెల్లడించాల్సిన కీలక వివరాలను (డిస్క్లోజర్లు) హ్యాష్‌ట్యాగ్‌లు లేదా లింకుల రూపంలో కాకుండా ప్రకటనల్లోనే ప్రముఖంగా కనిపించేలా జాగ్రత్తలు తీసు కోవాలని పేర్కొన్నారు. వీడియోల్లోనైతే డిస్క్లోజర్లను ఆడియో, వీడియో ఫార్మాట్లలో చూపాలని, లైవ్ స్ట్రీమ్‌లలోనైతే ప్రముఖంగా కనిపించేలా, నిరంతరాయంగా చూపాలని సింగ్ చెప్పారు. 50 కోట్ల మంది పైగా సోషల్ మీడియా యూజర్లు ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియా ప్రకటనల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. తమ విశ్వసనీయతపై ప్రభా వం చూపేలా ప్రకటనకర్తలతో తమకు ఏవైనా లావాదేవీలు ఉంటే ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు వాటిని వెల్లడించాలని సింగ్ తెలిపారు. -
ఆప్‌కు భారీ షాక్.. ఆఫీస్ సీజ్‌కు నోటీసులు
ఢిల్లీ: అధికారిక పార్టీ ఆమ్ ఆద్మీకి ఎల్జీ వీకే సక్సేనా భారీ ఝలక్ ఇచ్చారు. పదిరోజుల్లో రూ. 164 కోట్లు చెల్లించాలంటూ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి నోటీసులు ఇప్పించారాయన. అలా చేయని పక్షంలో.. చట్ట ప్రకారం తదుపరి చర్యలుంటాయని ఆ రికవరీ నోటీసుల్లో పేర్కొని ఉంది. రూ. 164 కోట్ల చెల్లింపునకు ఇదే చివరి అవకాశం. నోటీసులకు స్పందించింది పదిరోజుల్లోగా ఆప్ కన్వీనర్ ఈ డిపాజిట్ చేయాలి. లేకుంటే చట్టం ప్రకారం ముందుకెళ్తాం. పార్టీకి సంబంధించి ఆస్తులను సైతం జప్తు చేయడానికి వెనకాడం. ఆప్ కార్యాలయానికి సీజ్ చేస్తాం అంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలను సైతం అందులో ప్రస్తావించింది డీఐపీ. ప్రభుత్వ ప్రకటనల ముసుగులో ఆప్ ప్రకటనలు ఇచ్చుకుందని, అందుకోసం వందల కోట్ల ప్రజాధనాన్ని ఆప్ వృధా ఖర్చు చేసిందని పేర్కొంటూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. ఆప్ మీద చర్యలకు ఆదేశించారు. డిసెంబర్ 20వ తేదీన 97 కోట్ల రూపాయల్ని ఆప్ నుంచి రికవరీ చేయాలంటూ ఎల్జీ ఆదేశించారు కూడా. అయితే.. పొలిటికల్ యాడ్ల మీద 2017, మార్చి 31 దాకా రూ.99 కోట్లు ఖర్చు చేశారని, మిగిలిన రూ.64 కోట్లను ఖర్చు చేసినదానికి వడ్డీగా తాజా నోటీసుల్లో పేర్కొంది డీఐపీ. ఎల్జీ ఆదేశాలను ఆప్ మొదటి నుంచి బేఖాతరు చేస్తూ వస్తోంది. బీజేపీతో కలిసి ఆప్ ఉనికి లేకుండా చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఎల్జీ మండిపడుతోంది కూడా. ఇక ఇప్పుడు రూ. 163 కోట్లకుపైగా రికవరీకి.. అదీ పది రోజుల గడువు విధించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
క్యూ కడుతున్న టాప్ కంపెనీలు: అయ్యయ్యో ఎలాన్ మస్క్!
న్యూఢిల్లీ: ట్విటర్ టేకోవర్ తరువాత ఎలాన్ మస్క్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మైక్రో బ్లాకింగ్ సైట్లో ప్రకటనలు నిలిపివేస్తున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఫోక్స్‌వ్యాగన్ ట్విటర్లో చెల్లింపు ప్రకటనలను నిలిపివేయగా, తాజాగా మరిన్ని కంపెనీలు ఈ రేస్‌లో దూసు కొస్తున్నాయి. ఆదాయాన్ని పెంచుకునే వ్యూహంలో భాగంగా బ్లూటిక్ ఫీజు, ఖర్చులను తగ్గించుకునే పనిలో సగంమంది ఉద్యోగులను ఇంటికి పంపిన ట్విటర్‌కు తాజా పరిణామాలు భారీ షాకిస్తున్నాయి. ఇదీ చదవండి: ElonMusk సంచలన ప్రకటన: ఎడ్వర్టైజర్లకు బూస్ట్? ట్విటర్ టేకోవర్ తరువాత యూజర్ల సంఖ్య భారీగా పెరిగిందని మస్క్ బూస్ట్ ఇస్తున్నప్పటికీ ఓరియోస్, ఆడి కూడా ప్రకటనలను ఆపివేస్తున్నట్టు ప్రకటించాయి. సీఈఓ డిర్క్ వాన్ డి పుట్ మంగళవారం రాయిటర్స్ న్యూస్‌మేకర్ ఇంటర్వ్యూలో ఓరియోస్ తయారీదారు మోండెలెజ్ ట్విటర్లో తన ప్రకటనలను ఆపివేసినట్లు తెలిపారు. మస్క్ సొంతమైన తరువాత ట్విటర్లో ఇటీవల ద్వేషపూరిత ప్రసంగాల పరిమాణం గణనీయంగా పెరిగిందని పుట్ వ్యాఖ్యానించారు. ఈ ప్రభావం తమ ప్రకటనలపై చూపనుందనీ, ఈ ప్రమాదం తగ్గేంతవరకూ బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. (రూ.2 వేల నోట్లు: షాకింగ్ ఆర్టీఐ రిప్లై) గత వారం, కంటెంట్ ఫిల్టరింగ్‌పై ఆందోళనల కారణంగా ప్రకటనదారులు ట్విటర్ యాడ్స్నుంచి వెనక్కి తగ్గుతున్నారు. ముఖ్యంగా యునైటెడ్ ఎయిర్‌లైన్స్, జనరల్ మిల్స్, లగ్జరీ ఆటోమేకర్ ఆడి ఆఫ్ అమెరికా, జనరల్ మోటార్స్ లాంటి అనేక ముఖ్యమైన కంపెనీలు ప్రకటనలను నిలిపి వేశాయి. గిలియడ్ సైన్సెస్, దాని విభాగం కైట్ కూడా ఇదే ప్రాసెస్‌లో ఉన్నట్ట ప్రకటించింది. -
ఎలాన్ మస్క్‌కు షాక్.. ట్విట్టర్లో యాడ్స్ బంద్!
అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ట్విట్టర్లో ప్రకటనలు ఇవ్వబోమని శుక్రవారం వెల్లడించింది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన కొద్ది గంటలకే ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. అయితే ట్విట్టర్లో తమ కస్టమర్లతో మాత్ర యథావిధిగా ఇంటరాక్ట్ అవుతామని జనరల్ మోటార్స్ స్పష్టం చేసింది. కొత్త యాజమాన్యంలో ట్విట్టర్ ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూసి ప్రకటనలు ఇచ్చే విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని వివరించింది. ప్రత్యర్థి సంస్థ.. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో నెం.1గా ఉన్న టెస్లాకు జనరల్ మోటార్స్ ప్రధాన ప్రత్యర్థి సంస్థ. ఎలాన్ మస్క్ తర్వాత విద్యుత్ వాహన రంగంలో వేల కోట్లు పెట్టుబడి పెట్టింది కూడా జనరల్ మోటార్సే కావడం గమనార్హం. టెస్లాకు మరో ప్రత్యర్థి అయిన ఫోర్డ్ మోటార్స్ కూడా ట్విట్టర్లో ప్రకటనలపై స్పందించింది. ఎలాన్ మస్క్-ట్విట్టర్ మధ్య డీల్‌కు ముందు కూడా తాము ఈ సామాజిక మాధ్యమంలో ప్రకటనలు ఇవ్వలేదని చెప్పింది. కొత్త యాజమాన్యం తీరును బట్టి ప్రకటనలపై నిర్ణయం ఉంటుందని చెప్పింది. అయితే కస్టమర్లతో మాత్రం ట్విట్టర్లో సంబంధాలు కొనసాగిస్తామని పేర్కొంది. రివియాన్, స్టెలాంటిస్, ఆల్ఫబెట్‌కు చెందిన వేమో సంస్థలు మాత్రం ట్విట్టర్లో ప్రకటనల నిలిపివేతపై ఇంకా స్పందించలేదు. మరో సంస్థ నికోలా మాత్రం ట్విట్టర్లో యథావిధిగా ప్రకటనలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. 44 బిలయన్ డాలర్లు వెచ్చింది ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియను శుక్రవారం అధికారికంగా పూర్తి చేశారు ఎలాన్ మస్క్. అనంతరం పక్షికి స్వేచ్ఛ వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను కూడా పునరుద్ధరించే విషయంపై ఆలోచిస్తామని చెప్పారు. చదవండి: ట్విటర్ డీల్ డన్: మస్క్ తొలి రియాక్షన్ -
పండుగల సీజన్ కావడంతో కంపెనీలు ప్రకటనల జోరు
-
‘సహనానికి పరీక్ష’, యూట్యూబ్ యూజర్లకు భారీ షాక్!
ప్రముఖ వీడియో షేరింగ్ దిగ్గజం యూజర్లకు యూట్యూబ్ భారీ షాక్ ఇచ్చింది. యూజర్ల సహనానికి పరీక్ష పెడుతూ సెప్టెంబర్ నెల ప్రారంభం నుంచి సైలెంట్‌గా కొత్త యాడ్ ఫార్మాట్‌ను ప్రారంభించింది. ఈ కొత్త యాడ్ ఫార్మాట్ ప్రకారం.. యూట్యూబ్ ప్రీమియం తీసుకోని యూట్యూబ్ ఫ్రీ వెర్షన్ యూజర్లకు అదనంగా యాడ్స్ జోడించింది. యూట్యూబ్ ఫ్రీ వెర్షన్ వాడే వారికి వీడియో ఆరంభంలో 2యాడ్స్ మాత్రమే కనిపించేవి. కానీ ఇకపై యూజర్ల సహనానికి మరింత పరీక్ష పెట్టేలా 5యాడ్స్‌ను తీసుకొని రానుంది. ఇప్పటికే ఈ కొత్త యాడ్ మోడల్ ఎంపిక చేసిన యూజర్లకు ప్లే అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ యూజర్ తాను వీడియో చూస్తున్నప్పుడు 5యాడ్స్ ప్లే అవుతున్నాయి. ఆ యాడ్స్ పట్ల అసౌకర్యానికి గురవుతున్నామని, వివరణ ఇవ్వాలని కోరుతూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌పై యూట్యూబ్ యాజమాన్యం స్పందించింది. ఇలా 5 యాడ్స్ ప్లే అయితే వాటిని బంపర్ యాడ్స్ అంటారు. ఒక్కోటి 6 సెకన్లు ఉంటుందని వివరణిచ్చింది. ప్రస్తుతం ఈ నిర్ణయంపై యూట్యూబ్ యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
ఐదేళ్లలో కేంద్రం ప్రకటనల ఖర్చు రూ.3,339 కోట్లు
న్యూఢిల్లీ: 2017–18 నుంచి ఈ ఏడాది జూలై 12వ తేదీ దాకా.. ఐదేళ్లలో మీడియాలో ప్రకటనల కోసం రూ.3,339.49 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన గురువారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనల కోసం ఈ సొమ్ము వ్యయం చేసినట్లు పేర్కొన్నారు. ప్రింట్ మీడియాలో ప్రకటనలకు, రూ. 1,756.48, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలకు రూ.1,583.01 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. -
దేశీ ‘యాడ్స్’ మార్కెట్ 16 శాతం అప్
న్యూఢిల్లీ: డిజిటల్, టీవీ మాధ్యమాల ఊతంతో దేశీ అడ్వర్టైజింగ్ మార్కెట్ ఈ ఏడాది 16 శాతం మేర వృద్ధి చెందనుంది. 11.1 బిలియన్ డాలర్లకు (రూ. 88,639 కోట్లు) చేరనుంది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న మార్కెట్‌గా నిలవనుంది. గ్లోబల్ యాడ్ స్పెండ్ ఫోర్కాస్ట్స్ జులై 2022 నివేదికలో మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీ డెంట్సూ ఈ మేరకు అంచనాలు పొందుపర్చింది. లాక్‌డౌన్‌పరమైన ఆంక్షల సడలింపుతో ట్రావెల్, హాస్పిటాలిటీ(ఆతిథ్య) రంగాలు తిరిగి క్రమంగా కోలుకుంటున్నా యని, వాటి ప్రకటనలు కూడా పెరుగుతున్నాయని వివరించింది. అలాగే ఎడ్టెక్, ఫిన్‌టెక్, గేమింగ్, క్రిప్టోకరెన్సీ వంటి వ్యాపారాల ప్రకటనలు కూడా ఓవర్-ది-టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫాంలలో పెరుగుతున్నాయని పేర్కొంది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ♦ 2021లో భారతీయ అడ్వరై్టజింగ్ మార్కెట్ 9.6 బిలియన్ డాలర్లుగా ఉంది. 2022లో ఇది 11.1 బిలియన్ డాలర్లు, 2023లో 12.8 బిలియన్ డాలర్లు, 2024లో 14.8 బిలియన్ డాలర్లకు చేరనుంది. ♦ ప్రకటనల్లో డిజిటల్ వాటా 33.4 శాతం వాటా ఉండనుంది. టీవీ అడ్వరై్టజింగ్ వాటా 41.8 శాతం స్థాయిలో కొనసాగనుంది. కొత్త కంటెంట్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ వంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ ఇందుకు ఊతమివ్వ నున్నాయి. టీవీ మాధ్యమంతో పోలిస్తే డిజిటల్ ప్రకటనల విభాగం రెండు రెట్లు పెరగనుంది. డిజిటల్ విభాగం 31.6 శాతం, టీవీ విభాగం 14.5 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. ♦ అంతర్జాతీయంగా అడ్వరై్టజింగ్ వ్యయాలు 8.7 శాతం పెరిగి 738.5 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. ఆసియా పసిఫిక్‌లో ఇవి 250 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా. ఇందులో చైనా మార్కెట్ 5.6 శాతం వృద్ధితో 130.2 బిలియన్ డాలర్లకు చేరనుంది. ♦ 329.6 బిలియన్ డాలర్లతో ప్రకటనలపై అత్యధికంగా వ్యయం చేసే దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండనుంది. అమెరికాలో యాడ్ల మార్కెట్ 13.1 శాతం పెరగనుంది. బ్రెజిల్ 9 శాతం వృద్ధి చెందనుంది. ♦ ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ ప్రకటనల రంగంలో రికవరీ కొనసాగుతోంది. అయితే, కీలక మార్కెట్లలో లాక్డౌన్లు, భౌగోళికరాజకీయపరమైన ఉద్రిక్తతలు, సరఫరాపరమైన సమస్యలు మొదలైనవి వ్యాపారాలపైన, తత్ఫలితంగా మార్కెటింగ్ వ్యయాలపైనా ప్రతికూల ప్రభావం చూపవచ్చు. దేశీ ‘యాడ్స్’ మార్కెట్ 16 శాతం అప్ -
ఇండియన్ మీడియా ఎంటర్టైన్మెంట్కి ఇంతటి సత్తా ఉందా?
రాబోయే నాలుగేళ్లలో ఇండియన్ మీడియా, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ గణనీయమైన పురోగతి సాధించబోతుందంటూ ఇంటర్నేషనల్ కన్సల్టింగ్ ఫర్మ్ పీడబ్ల్యూసీ సంస్థ తెలిపింది. రాబోయే నాలుగేళ్లలో ఇండియన్ మీడియా, ఎంటర్టైన్ విభాగం 8.8 శాతం సమ్మిళిత అభివృద్ధి (సీఏజీఆర్) సాధిస్తుందని అంచనా వేసింది. దీంతో మీడియా, ఎంటర్టైన్ పరిశ్రమర విలువ ఏకంగా రూ. 4.30 లక్షల కోట్లకు చేరుకుంటుందని పీడబ్ల్యూసీ తన నివేదికలో పేర్కొంది. పీడబ్ల్యూసీ నివేదికలో ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి. - దేశీయంగా టీవీ, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో రెవెన్యూ ప్రస్తుత విలువ రూ.3.14 లక్షల కోట్లుగా ఉంది. - 2026 నాటికి టీవీ అడ్వెర్టైజింగ్ విభాగం విలువ రూ.43,000 కోట్లకు చేరుకోవచ్చని అంచనా. దీంతో టీవీ అడ్వెర్టైజ్మెంట్లో ప్రపంచంలో ఐదో స్థానానికి ఇండియా చేరుకుంటుంది. ఇండియా కంటే ముందు వరుసలో అమెరికా, జపాన్, చైనా, యూకేలు ఉండనున్నాయి. - రాబోయే నాలుగేళ్లలో ఓటీటీ వీడియో స్ట్రీమింగ్ మార్కెట్ విలువ రూ.21,031 కోట్లుగా ఉండబోతుంది. ఇందులో చందాల ద్వారా రూ.19,973 కోట్ల రెవెన్యూ రానుండగా వీడియో ఆన్ డిమాండ్ ద్వారా రూ.1058 కోట్లు రానుంది. - రాబోయే రోజుల్లో కూడా ఓటీటీలకు ప్రధాన ఆదాయం చందాల ద్వారానే తప్పితే వీడియో ఆన్ డిమాండ్ ద్వారా అంతగా పెరగకపోవచ్చని పీడబ్ల్యూసీ అంచనా వేస్తోంది. 5జీ సర్వీసులు అందుబాటులోకి వస్తే ఓటీటీ సేవలు మరింత వేగంగా విస్తరించవచ్చు. - ప్రస్తుతం రూ.35,270 కోట్లు ఉన్న టీవీ అడ్వెర్‌టైజ్ విభాగం మార్కెట్ విలువ 2026 నాటికి రూ.43,568 కోట్లు కానుంది. - ఇంటర్నెట్ యాడ్ మార్కెట్ 12 శాతం వృద్ధితో 2026 నాటికి రూ.28,234 కోట్లకు చేరుకునే అవకాశం. ఇంటర్నెట్ అడ్వెర్టైజింగ్ మార్కెట్లో 69 శాతం మొబైల్ ఫోన్ల ద్వారానే జరగనుంది. ప్రస్తుతం మొబైల్ ఫోన్ల వాటా 60 శాతంగా ఉంది. - మ్యూజిక్, రేడియో, పోడ్కాస్ట్ విభాగం మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.7,216 కోట్లు ఉండగా నాలుగేళ్ల తర్వాత ఇది రూ.11,356 కోట్లకు చేరుకోవచ్చు. - వీడియో గేమ్ మార్కెట్ త్వరలో పైకి దూసుకుపోనుందని సీడబ్ల్యూసీ నివేదిక స్పష్టం చేస్తోంది. రాబోయే నాలుగేళ్లలో ఈ విభాగంలో రూ. 37,535 కోట్లుగా ఉండవచ్చని అంచనా. టర్కీ, పాకిస్తాన్ తర్వాత వీడియోగేమ్ మార్కెట్ ఇండియాలో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. - ఇక ఇండియన్ సినిమా మార్కెట్ ప్రస్తుత రెవెన్యూ 2026 నాటికి రూ. 16,198 కోట్లు కానుంది. ఇందులో బాక్సాఫీసు ద్వారా రూ. 15,849 కోట్ల రాబడి ఉండగా మిగిలిన రూ.349 కోట్లు యాడ్స్ ద్వారా రానుంది. - న్యూస్‌పేపర్ రెవెన్యూ రాబోయే నాలుగేళ్లలో 2.7 శాతం వృద్ధితో రూ.26,278 కోట్ల నుంచి రూ.29,945 కోట్లను టచ్ చేయనుంది. న్యూస్‌పేపర్ రెవెన్యూలో ఇండియా వరల్డ్‌లో ఐదో ర్యాంకులో ఉంది. చదవండి: ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో మజాక్ చేస్తే ఇట్లనే ఉంటది -
లక్ష కోట్లు దాటుతోంది.. ఇంకా లైట్ తీసుకుంటే ఎలా ?
న్యూఢిల్లీ: టీవీ, న్యూస్‌పేపర్, వెబ్సైట్, వీడియో కంటెంట్ సైట్ ఏదైనా సరే అడ్వెర్టైజ్మెంట్ కనిపించిందంటే చాలు వెంటనే ఛానల్ మార్చడంతో, పేపర్ తిప్పడంలో స్కిప్ బటన్ నొక్కడమో చేస్తాం. జనాలు పెద్దగా యాడ్స్‌పై దృష్టి పెట్టకున్నా ప్రకటనల విభాగం మాత్రం ఊహించని స్థాయి వృద్ధి కనబరుస్తోంది. మరో రెండేళ్లలో లక్ష కోట్ల మార్క్‌ను దాటేయనుంది. లక్ష కోట్లు ప్రకటనల రంగం దేశంలో 2024 నాటికి రూ.1 లక్ష కోట్లకు చేరుతుందని ఈవై–ఫిక్కీ నివేదిక వెల్లడించింది. వార్షిక వృద్ధి 12 శాతం నమోదవుతుందని తెలిపింది. ‘ప్రకటనల రంగ ఆదాయం 2019లో రూ.79,500 కోట్లు. పరిశ్రమ 2020లో 29 శాతం తిరోగమనం చెందింది. కోవిడ్–19 ఆటంకాలు ఉన్నప్పటికీ ఈ రంగం తిరిగి పుంజుకుని 2021లో ఆదాయం 25 శాతం అధికమై రూ.74,600 కోట్లను దక్కించుకుంది. ఈ ఏడాది 16 శాతం వృద్ధితో రూ.86,500 కోట్లకు చేరనుంది. ఆ రెండు కలిపితే భారత మీడియా, వినోద పరిశ్రమ ఆదాయం గతేడాది 16.4 శాతం పెరిగి రూ.1.61 లక్షల కోట్లు నమోదు చేసింది. ఈ ఏడాది 17 శాతం వృద్ధితో రూ.1.89 లక్షల కోట్లను తాకి మహమ్మారి ముందు స్థాయికి చేరుకుంటుంది. 2024 నాటికి ఏటా 11 శాతం పెరిగి రూ.2.32 లక్షల కోట్లు నమోదు చేస్తుంది. నంబర్ వన్ టీవీనే టెలివిజన్ అతిపెద్ద సెగ్మెంట్‌గా మిగిలిపోయినప్పటికీ డిజిటల్ మీడియా బలమైన నంబర్–2గా దాని స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ముద్రణ విభాగం పుంజుకుని మూడవ స్థానంలో నిలిచింది. డిజిటల్ మీడియా వాటా 2019లో 16 శాతం కాగా, గతేడాది 19 శాతానికి ఎగబాకింది. మీడియా, వినోద రంగంలో టీవీ, ప్రింట్, చిత్రీకరించిన వినోదం, ఔట్‌డోర్ ప్రకటనలు, సంగీతం, రేడియో వాటా 68 శాతముంది. 2019లో ఇది 75 శాతం నమోదైంది. సినిమా థియేటర్లలో ప్రకటనలు, టీవీ చందాలు మినహా మీడియా, వినోద పరిశ్రమలో 2021లో అన్ని విభాగాల ఆదాయాలు పెరిగాయి. -
గూగుల్ సరికొత్త ఆఫర్.. ఇకపై ఆ బెడద ఉండదు
న్యూఢిల్లీ: ప్రకటనల బెడద లేకుండా ప్లే స్టోర్‌లోని వివిధ యాప్స్, గేమ్స్‌లో ప్రీమియం ఫీచర్లను ఉపయోగించుకునే వీలు కల్పించే ప్లే పాస్‌ను టెక్ దిగ్గజం గూగుల్ సోమవారం భారత మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. నెలవారీ లేదా వార్షికంగా కొంత చార్జీ కట్టి 1,000 పైగా యాప్స్, గేమ్స్‌లో ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ప్లే పాస్ కలెక్షన్లో స్పోర్ట్స్, పజిల్స్‌తో పాటు జంగిల్ అడ్వెంచర్స్, వరల్డ్ క్రికెట్ బ్యాటిల్ 2, మాన్యుమెంట్ వేలీ వంటి యాక్షన్ గేమ్స్ మొదలైనవి ఉంటాయి. ‘ప్లే పాస్‌లో భారత్ సహా 49 దేశాలకు చెందిన డెవలపర్లు 41 కేటగిరీల్లో రూపొందించిన 1,000 పైగా టైటిల్స్ కలెక్షన్ ఉంటుంది. ఒక నెల ట్రయల్‌తో ప్రారంభించి, నెలవారీగా రూ. 99 లేదా ఏడాదికి రూ. 889 సబ్స్క్రిప్షన్ చార్జీలు చెల్లించి యూజర్లు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఒక నెల కోసం రూ. 109 ప్రీపెయిడ్ సబ్స్క్రిప్షన్ కూడా ఉంటుంది‘ అని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. గూగుల్ ఫ్యామిలీ యాప్‌లో గ్రూప్ మేనేజర్లుగా రిజిస్టర్ చేసుకున్న వారు తమ ప్లే పాస్ సబ్‌స్క్రిప్షన్‌ను మరో అయిదుగురితో కూడా షేర్ చేసుకోవచ్చు. ప్లే పాస్ ఫీచర్ ఈ వారంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని కంపెనీ వివరించింది. చదవండి: గూగుల్‌లో ఎక్కువ మంది వెతికిన ఎలక్ట్రిక్ కారు ఇదే! -
Google: టీనేజర్ల బ్రౌజింగ్.. గూగుల్ కీలక నిర్ణయం
Google Blocks 18 Below Target Ads: ఫ్లస్ విషయంలో బ్రౌజింగ్‌కు గూగుల్ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయదు. కానీ, 13 ఏళ్లలోపు వాళ్లు మాత్రం ఉపయోగించడానికి వీల్లేదని చెబుతోంది. అయినప్పటికీ అండర్‌ఏజ్‌ను గుర్తించే ఆల్గారిథమ్ లేకపోవడంతో చాలామంది తమ ఏజ్‌ను తప్పుగా చూపించి గూగుల్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న మోసాలను కట్టడి చేసేందుకు గూగుల్ కీలక నిర్ణయం ఒకటి తీసుకుంది. టీనేజర్ల విషయంలో యాడ్ టార్గెటింగ్ స్కామ్‌ను నిలువరించే ప్రయత్నం చేయనున్నట్లు ప్రకటించింది గూగుల్. ఈ మేరకు పద్దెనిమిది ఏళ్లలోపు యూజర్లపై టెక్ దిగ్గజం నిఘా వేయనుంది. సాధారణంగా వయసు, లింగ నిర్ధారణ, యూజర్ల ఆసక్తుల ఆధారంగా యాడ్ కంపెనీలు యాడ్లను డిస్ప్లే చేస్తుంటాయి. ఈ క్రమంలో మోసాలు జరుగుతుంటాయి కూడా. అయితే 18 బిలో ఏజ్ గ్రూప్ వాళ్ల విషయంలో ఈ స్కామ్‌లు జరుగుతుండడంపై గూగుల్ ఇప్పుడు ఫోకస్ చేసింది. ఈ తరహా యాడ్లను నిలువరించేందుకు బ్లాక్ యాడ్ ఫీచర్‌ను తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది గూగుల్. ఈ మేరకు యూజర్ యాడ్ ఎక్స్‌పీరియెన్స్‌ను నియంత్రించేందుకు ఈ ఏడాదిలో పలు చర్యలు చేపట్టబోతున్నాం అంటూ గూగుల్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే పిల్లలకు, టీనేజర్లకు సురక్షితమైన బ్రౌజింగ్ అనుభూతి కోసం, ఏజ్ సెన్సిటివిటీ యాడ్ కేటగిరీలను నిరోధించేందుకు చర్యలు చేపట్టాం. ఇక మీద 18 ఫ్లస్ లోపు వాళ్ల విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటిస్తాం అని సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎబౌట్ దిస్ యాడ్ లాంటి మెనూలతో పాటు ఆ యాడ్లు ఎందుకు డిస్ప్లే అవుతున్నాయో, ఎవరు దానిని ప్రదర్శిస్తున్నారో తెలియజేస్తూ ఫీచర్స్‌ను ఇప్పటికే తీసుకొచ్చింది గూగుల్. చదవండి: ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్! -
డిస్క్లెయిమర్లో హడావుడి వద్దు ! ప్రకటనలపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
ముంబై: టీవీ చానళ్లలో మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చే ప్రకటనల్లో కీలకమైన సున్నిత సమాచారానికీ అంతే ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రకటన ముందు భాగంలో ఉన్న మాదిరే, చివర్లో కీలక సమాచార వెల్లడికీ ఒకటే వేగం ఉండాలని అభిప్రాయపడ్డారు. అవసరమైతే రూ.37 లక్షల కోట్ల మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ దీన్ని పాటించేలా నిబంధనల్లో సవరణలు తీసుకొస్తామన్నారు. వినియోగదారుల వ్యవహారాల శాఖ గోయల్ పర్యవేక్షణలోనే ఉంది. మ్యూచువల్ ఫండ్ ప్రకటన చివర్లో కచ్చితంగా వెల్లడించాల్సిన డిస్‌క్లెయిమర్‌ను చాలా వేగంగా చదవడం గమనించొచ్చు. దీనిపైనే మంత్రి స్పందించారు. ‘‘డిస్ క్లెయిమర్ (తమకు బాధ్యతలేదన్న విషయాన్ని వెల్లడించడం)ను చాలా చాలా వేగంగా చదువుతున్నారు. అలా అయితే దాన్ని అర్థం చేసుకోవడం కష్టం. ప్రకటనలో ముందు భాగం ఎంత వేగంతో నడిచిందో డిస్‌క్లెయిమర్ కూడా అలాగే నడవాలి. వేగంగా చదివి దాని ఉద్దేశ్యాన్ని నీరుగార్చకూడదు’’ అని ఎన్ఎస్ఈ కార్యక్రమంలో మంత్రి వివరించారు. చదవండి: Fund Review: మిరే అస్సెట్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ -
యూజర్లకు ఎల్ఐసీ హెచ్చరిక!
న్యూఢిల్లీ: ఎల్ఐసీ Life Insurance Corporation పేరుతో వచ్చే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ బీమా దిగ్గజం హెచ్చరించింది. ఎల్ఐసీ లోగోను చూపిస్తూ, ఆకర్షణీయమైన రాబడుల ప్రతిపాదనలతో వల వేసే విశ్వసనీయం కాని సంస్థల పట్ల జాగ్రత్తగా ఉండాలని యూజర్లను ఎల్ఐసీ కోరింది. విశ్వసనీయం కాని సంస్థలు ఎల్ఐసీ లోగోను సోషల్ మీడియాలో దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు ఒక నోటీసును జారీ చేసింది. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఎల్ఐసీ లోగోను చూపిస్తూ విశ్వసనీయం కాని సంస్థలు ఇచ్చే ప్రకటనలు, ప్రతిపాదనలకు ఆకర్షితులు కావద్దని కోరింది. ‘‘కొన్ని గుర్తు తెలియని సేవల సంస్థలు, ఏజెంట్లు.. వెబ్సైట్లు, యాప్‌లు సృష్టించి, బీమా, బీమా సలహా సేవలను ఎల్ఐసీ ట్రేడ్‌మార్క్ పేరుతో ఆఫర్ చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది’’ అని నోటీసులో పేర్కొంది. డేటాను చోరీ చేసే ఉద్దేశ్యంతో సాఫ్ట్వేర్, యాప్‌ల సాయంతో అనధికారికంగా ఎల్ఐసీ పోర్టల్‌కు అనుసంధానాన్ని కల్పిస్తున్నట్టు గుర్తించామని తెలిపింది. ఎల్ఐసీ ఉద్యోగులకు, పెన్షన్ పాలసీదారులకు గుడ్‌న్యూస్..! అలర్ట్: ఫేస్బుక్లో వీడియో లింక్‌తో గాలం, ఆపై.. -
లవ్ ఫెయిల్యూరా?.. సంతానం లేదా? బాబాను కలవండి
దాదర్: ప్రేమ విఫలమయిందా? వ్యాపారంలో నష్టపోతున్నారా? సంతానం లేదా? అయితే మీ సమస్యకు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తాం, అందుకు ఈ బాబాను సంప్రదించండి అంటూ లోకల్ రైళ్లలో ప్రకటనల స్టిక్కర్లు వందలాదిగా దర్శనమిస్తున్నాయి. అనుమతి లేకున్నా పలువురు ఇలాంటి మోసపూరిత ప్రకటనలతో కూడిన స్టిక్కర్లు రైళ్లలో అంటించి పోతున్నారు. ఇలాంటి ప్రకటనల స్టిక్కర్లు, పోస్టర్ల వల్ల అమాయక ప్రయాణికులు సంప్రదించడం, ఆపై మోసపోవడం షరా మామూలుగా జరుగుతోంది. రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) బలగాలు లోకల్ రైళ్లలో అక్రమంగా రాకపోకలు సాగించే వారిపై దృష్టి సారిస్తున్నారు. దీంతో పట్టించుకునే నాథుడే లేకపోవడంతో మాంత్రిక బాబాల పోçస్టర్లు, స్టిక్కర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొత్త బోగీలపైనా.. నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా రైల్వే బోగీలలో, రైల్వే స్టేషన్ పరిసరాల్లో, ప్లాట్‌ఫారాలపై ఎలాంటి ప్రకటన బ్యానర్లు, పోస్టర్లు, స్టిక్కర్లు అంటించరాదు. కానీ, రైల్వే నిర్లక్ష్యం వల్ల పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పాత ఐసీఎఫ్ బోగీలతోపాటు కొత్తగా వచ్చిన బాంబార్డియర్ కంపెనీ రైల్వే బోగీలలో మాంత్రిక బాబాల ప్రకటనల స్టిక్కర్లు అంటించిన దృశ్యాలు దాదాపు అన్ని రైళ్లలో కనిపిస్తున్నాయి. ప్రేమ విఫలం కావడం, వ్యాపారంలో నష్టాలు, ఇంటిలో గొడవలు, భార్య, భర్తల మధ్య ఘర్షణలు, సంతానం లేకపోవడం తదితర సమస్యలకు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తామంటూ, అందుకు ఫలాన బాబాను సంప్రదించాలని ప్రకటనల స్టిక్కర్లు, పోస్టర్లు అంటిస్తున్నారు. స్టిక్కర్లపై బాబా పేరు, ఫోన్ నంబరు, చిరునామా, సంప్రదించు వేళలు తదితర వివరాలుంటున్నాయి. తమ మంత్రశక్తులతో మీ సమస్యలు మటుమాయం చేస్తామని ధైర్యంగా రాస్తున్నారు. వీటికి ఆకర్షితులైన అమాయక ప్రయాణికులు ఇలాంటి నకిలీ బాబాలను సంప్రదించి మోసపోతున్నారు. తొలుత వందల్లో, ఆ తరువాత వేలల్లో, అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే లక్షల్లో డబ్బులు గుంజుతారు. బాధితులు చివరకు మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులను ఆశ్రయిస్తారు. అప్పటికే ఈ నకిలీ బాబాలు అక్కడి నుంచి జారుకుంటారు. లాక్డౌన్ అనంతరం.. గతంలో ప్రజలను మోసం చేస్తున్న నకిలీ మాంత్రిక బాబాలపై చర్యలు తీసుకోవడంతో స్టిక్కర్లు, పోస్టర్లు అంటించే బెడద తగ్గిపోయింది. కాని కరోనా కారణంగా అమలుచేసిన లాక్‌డౌన్‌తో లోకల్ రైళ్లలో అత్యవసర విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో లోకల్ రైళ్లలో రద్దీ అంతంగా ఉండటం లేదు. దీంతో ధైర్యంగా స్టిక్కర్లు, పొస్టర్లు అంటించి జారుకుంటున్నారు. ఇలాంటి స్టిక్కర్లను అర్ధరాత్రి దాటిన తరువాత అంటిస్తున్నారు. దీంతో రైల్వే పోలీసులకు చిక్కడం లేదు. అనుమతి లేకున్నా అక్రమంగా రాకపోకలు సాగిస్తున్న సామాన్యులపై రైల్వే పోలీసులు చర్యలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారు. స్టిక్కర్లు అంటిస్తున్న వారిపై చర్యలు తీసుకోలేకపోతున్నారు. వీరి నిర్వాకంవల్ల బోగీలన్నీ వికృతంగా కనిపిస్తున్నాయి. పోస్టర్లకు, స్టిక్కర్లకు జిగురు (గమ్) చాలా పట్టించడం వల్ల తొలగించడానికి వీలులేకుండా పోతున్నాయి. -
కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డ మనీశ్ సిసోడియా! జరిగింది ఇది..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై.. సొంత పార్టీ నేతనే తీవ్ర విమర్శలు గుప్పించాడు. వ్యాక్సినేషన్లో విఫలమవుతూనే.. మరోపక్క యాడ్ల పేరుతో ప్రజా ధనాన్ని వృథాగా ఖర్చు చేస్తున్నాడంటూ సీఎం కేజ్రీవాల్‌పై డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మండిపడ్డాడు. ఈ మేరకు ఓ వీడియో రెండు రోజులుగా సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతోంది. న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై, ఆప్ కీలక నేత.. డిప్యూటీసీఎం మనీశ్ సిసోడియా మండిపడ్డట్లు 30 సెకండ్ల నిడివి ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఓవైపు సిసోడియా మాట్లాడుతుండగా.. మరోవైపు ఆప్ యాడ్లతో ఉన్న పేపర్ క్లిప్పులు, యాడ్ కట్టింగ్లు కనిపిస్తున్నాయి ఆ వీడియోలో. యాడ్ల పేరుతో ఎంత వృథా చేస్తారు. వ్యాక్సిన్లు దొరక్క ప్రజలు ఇబ్బందిపడుతుంటే.. అని అందులో డైలాగులు ఉన్నాయి. దీంతో వీడియో విపరీతంగా షేర్ అయ్యింది. ఆప్‌లో ముసలం మొదలైందని, కీలక నేతల మధ్య వైరం షురూ అయ్యిందని రకరకాల కథలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే.. Mr. Handsome Sisodia Slams Kejriwal For "No Vaccination, Only Ads". pic.twitter.com/rNMs1fuQro — अमित शर्मा (@AmitsharmaGRENO) June 24, 2021 ఫ్యాక్ట్ చెక్.. ఆ రెండు వేర్వేరు వీడియోలు. ఎవరో ఎడిట్చేసి వైరల్ చేశారు. మనీశ్ సిసోడియా జూన్ 21న నిర్వహించిన ట్విటర్ లైవ్ మీడియా సమావేశంలో ఢిల్లీ వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి మాట్లాడాడు. అదేరోజు ఉదయం ‘‘ ప్రపంచం మొత్తం మీద అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించిన ఘనత’ పేరుతో బీజేపీ పాలిత రాష్రా్టల్లో ఫుల్ పేజ్ యాడ్లు పబ్లిష్ అయ్యాయి. అయితే వాస్తవ పరిస్థితి మరోలా ఉందని, గప్పాలు మానుకోవాలని, ప్రచారానికి ఖర్చు పెట్టే డబ్బును వ్యాక్సిన్ల కోసం ఉపయోగించాలని బీజేపీకి సూచిస్తూ సిసోడియా ప్రెస్ మీడియాలో మాట్లాడాడు. అందులోని పోర్షన్లను కట్ చేసి.. ఎవరో ఎడిట్ చేశారు. సో.. మనీష్ సిసోడియా విమర్శించింది సొంత ప్రభుత్వాన్ని కాదు.. కేంద్ర ప్రభుత్వాన్ని. Addressing an important Press Conference | LIVE https://t.co/CCdbez8UeJ — Manish Sisodia (@msisodia) June 21, 2021 చదవండి: రాష్ట్రపతి జీతం, కట్టింగ్‌లపై గోల -
Policybazaar: నిబంధనల ఉల్లంఘన.. 25 లక్షలు ఫైన్
న్యూఢిల్లీ: ఆన్లైన్లో బీమా పాలసీ సేవలను అందించే (పాలసీ అగ్రిగేటర్) పాలసీ జజార్‌కు బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) రూ.24 లక్షల జరిమానా విధించింది. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం పెరుగుతుందంటూ కస్టమర్లకు గతేడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 7 మధ్య ఎస్ఎంఎస్లు పంపడం ద్వారా ప్రకటనల నిబంధనలను పాలసీబజార్ ఉల్లంఘించినట్టు ఐఆర్డీఏఐ గుర్తించింది. 2020 ఏప్రిల్ 1 నుంచి టర్మ్ పాలసీల ప్రీమియం పెరుగుతోందని, ఆ లోపే పాలసీ తీసుకోవడం ద్వారా ప్రీమియంను ఆదా చేసుకోవచ్చంటూ సుమారు 10 లక్షల మంది కస్టమర్లకు పాలసీబజార్ నుంచి సందేశాలు వెళ్లినట్టు ఐఆర్డీఏఐ తెలిపింది. ప్రీమియం ధరలు పెరుగుతున్నాయంటూ తప్పుదోవ పట్టించడంతోపాటు, నిబం ధన 11, 9లను ఉల్లంఘించినందుకు జరిమానా విధిస్తున్నట్టు పేర్కొంది. అయితే, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా ఏఐఏ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల నుంచి ప్రీమియం పెరుగుదలపై తమకు సమాచారం అందిందని ఐఆర్డీఏఐ ఇచ్చిన నోటీసులకు స్పందనగా పాలసీ బజార్ తెలియజేయడం గమనార్హం. కస్టమర్లకు తాజా సమాచారం తెలియజేయడమే కానీ, తప్పుదోవ పట్టించడం తమ ఉద్దేశ్యం కాదని వివరణ ఇచ్చింది. చదవండి: వ్యక్తిగత హామీదార్లూ బాధ్యులే..! -
అంతరిక్షంలో యాడ్స్: పొరపాటున ఏలియన్స్ చూస్తే!
అప్పట్లో అంతరిక్ష ప్రయాణమంటే కల్లోనే సాధ్యం, కానీ పెరిగిన టెక్నాలజీతో బాగా డబ్బున్న ఆసాములు ప్రైవేట్‌గా అంతరిక్షంలోకి ట్రిప్ వేసే వీలు కలిగింది. ఇప్పటివరకు ప్రభుత్వాల ఆధీనంలోనే ఉన్న అంతరిక్ష ప్రయాణం ప్రైవేట్ కంపెనీల ప్రవేశంతో రూపుమారుతోంది. దీంతో ఇకపై అంతరిక్షంలో వాణిజ్య ప్రకటనల పోటీ పెరగనుంది. ప్రస్తుతం భూమిపై కాదేదీ ప్రకటనలకనర్హం అనే రీతిలో వాణిజ్య ప్రకటనల జోరు కొనసాగుతోంది. ఏ కాస్త ఖాళీ స్థలం కనిపించినా, దానిపై తక్షణమే ఏదో ఒక కమర్షియల్ ప్రకటన ప్రత్యక్షమవుతోంది. వ్యాపారాల్లో పోటీ పెరిగే కొద్దీ కస్టమర్లను ఆకట్టుకునేందుకు కంపెనీలు అడ్వర్టైజింగ్పై భారీగా వెచ్చిస్తున్నాయి. ఈ జోరు క్రమంగా భూగోళం దాటి అంతరిక్షం వైపు పయనిస్తోందట. రెండేళ్ల క్రితం స్పేస్ రంగంలో యాడ్స్ రెవెన్యూ 36,600 కోట్ల డాలర్లు దాటిందంటే, వీటి జోరు ఎలాగుందో అర్ధం చేసుకోవచ్చు. అయినా స్పేస్‌లో ప్రకటనలేంటండీ, ఎవరు చూస్తారని ప్రశ్నిస్తే పైన చెప్పిందే సమాధానం. ఈ యాడ్స్ అన్నీ భారీగా డబ్బులున్న కుబేరులను ఉద్దేశించినవి. అంటే అంతరిక్ష యాత్రలకు వెళ్లే అతి ధనవంతులకోసమే ఈ ప్రకటనలు. స్పేస్యాత్రల జోరు మరింత పెరిగితే, ఈ ప్రకటనలు మరింతగా పెరుగుతాయి. మనలో మన మాట.. ‘‘మా సబ్బు వాడితే మిలమిల మెరుస్తారు’’ లాంటి ప్రకటనలు పొరపాటున ఏలియన్స్ చూస్తే ఏమనుకుంటారో కదా! చదవండి: పాతికవేలతో హరిద్వార్‌కు స్పెషల్ టూర్! -
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రకటనలకు కొత్త విధానం
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో అన్ని రకాలైన అడ్వర్టయిమెంట్లకు సంబంధించి కొత్త విధానం అమలులోకి వచ్చింది. నగరంలో ఏర్పాటు చేసే హోర్డింగ్స్‌పై గరిష్ట ఎత్తును జీహెచ్ఎంసీ నిర్ధేశించింది. హోర్డింగ్స్ 15 అడుగుల ఎత్తును మించి ఉండరాదన్న నిబంధన విధించింది. వాహనాలపై ఏర్పాటు చేసే ప్రకటనలకు కచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాలని జీహెచ్ఎంసీ స్పష్టంగా పేర్కొంది. అలాగే, నాలలు, నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రకటనలను పూర్తిగా నిషేధించింది. అడ్వర్టయిజ్మెంట్స్కు సంబంధించి హోర్డింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు కచ్చితంగా రోడ్డు, ప్రజాభద్రత విధివిధానాలను పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగ్స్ ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ శనివారం హెచ్చరించింది. (‘ఒకరి బాధకు కారణమవ్వకండి’) -
గత ప్రభుత్వ హయంలోనే ప్రకటనలు: ఆర్టీసీ ఈడీ
సాక్షి, విజయవాడ : తిరుపతి ఆర్టీసీ బస్ టిక్కెట్ల వెనుక అన్యమతాలకు చెందిన ప్రకటనలు ఉండడం పట్ల విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ఈడీ కోటేశ్వర్ రావు శుక్రవారం వివరణనిచ్చారు. ఆ ప్రకటనలు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చినవని ఆయన వెల్లడించారు. గత మార్చిలో మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 18 ప్రకటనలను రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో టిక్కెట్ల వెనుక ముద్రించారని, అందులో కొన్ని రోల్స్ తిరుపతి డిపోకు వచ్చాయని తెలిపారు. గత మూడేళ్లుగా ఆర్టీసీలో ప్రకటనల బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకిచ్చారని తెలిపారు. తిరుమలలో అన్యమత ప్రచారం నిషిద్ధం కనుక మళ్లీ ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. -
వాట్సాప్ ‘స్టేటస్’ ప్రకటనలొచ్చేస్తున్నాయ్
శాన్ఫ్రాన్సిస్కో : ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ స్టేటస్‌లో ప్రకటనలకు అనుమతించేందుకు సర్వం సిద్ధం చేసింది 2020 నాటికి స్టేటస్ స్టోరీస్ యాడ్స్‌ను తీసుకు రానున్నామని ప్రకటించింది. ఈవారంలో నెదర్లాండ్స్‌లో జరిగిన మార్కెటింగ్ సదస్సుకు హాజరైన ఆలివర్ పొంటోవిల్లే ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఆండ్రాయిడ్ 2.18.305 బీటా వెర్షన్లో ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగదశలో ఉంది. ఈ యాడ్స్‌ని ఫేస్‌బుక్‌కు చెందిన అడ్వర్టైజింగ్ వ్యవస్థే నడిపించనుంది. గత ఏడాది అక్టోబర్‌లోనే వాట్సాప్ ప్రకటనలపై వార్తలు మార్కెట్ వర్గాల్లో హల్ చల్ చేశాయి..అయితే వాట్సాప్ ఈ వార్తలను తాజాగా ధృవీకరించింది. స్టేటస్‌లో యాడ్స్ చూపించ బోతున్నాం. వాట్సప్ ద్వారా స్థానిక వ్యాపారాలు ప్రజలకు చేరువయ్యేందుకు ప్రైమరీ మానెటైజేషన్ మోడ్‌లో యాడ్స్ ఉండబోతున్నాయని వాట్సాప్ ప్రతినిధి వెల్లడించారు. వాట్సాప్‌లోని "స్టేటస్" విభాగంలో ప్రకటనలు రాబోతున్నాయని తెలిపింది. ఇకపై వాట్సాప్ స్టేటస్‌లలో అడ్వర్టైజ్మెంట్ల ద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జించాలని మోచిస్తోంది. ఈ ప్రకటనలకు ఆదరణ బాగా లభిస్తుందనీ, తద్వారా వ్యాపార సంస్థలకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందని వాట్సాప్ భావిస్తోంది. కాగా ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్ల సంఖ్య 1.5 బిలియన్లకు చేరుకుంది. భారత్‌లో వీరి సంఖ్య 250 మిలియన్లు. -
ఎఫ్బీలో రూ 10 కోట్లు దాటిన ప్రచార వ్యయం
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్ సమీపిస్తున్న క్రమంలో రాజకీయ పార్టీలు ప్రచార హోరును పెంచాయి. సోషల్ మీడియాలోనూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీలు భారీగా వెచ్చిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల మద్దతుదారులు ఫేస్బుక్లో రూ 10 కోట్లకు పైగా ప్రకటనలపై ఖర్చు చేశారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి 30 వరకూ ఫేస్బుక్లో 51,810 రాజకీయ ప్రకటనలు కనిపించాయని, వీటి వ్యయం రూ 10.32 కోట్లని ఎఫ్బీ యాడ్ లైబ్రరీ నివేదిక పేర్కొంది. అంతకుముందు వారం (మార్చి 23 వరకూ)లో ఈ తరహా రాజకీయ ప్రకటనల సంఖ్య 41,974 కాగా 8.58 కోట్లు వాటిపై వెచ్చించారు. బీజేపీ నుంచి అధికంగా ఈ ప్రకటనలు వచ్చాయని వెల్లడైంది. ఇక భారత్ కే మన్ కీ బాత్ పేరిట పాలక బీజేపీ, ఆ పార్టీ కార్యకర్తలు మార్చి 30 వరకూ 3700కు పైగా ప్రకటనల కోసం రూ 2.23 కోట్లు వెచ్చించడం గమనార్హం. ఇక కాంగ్రెస్ తన ఎఫ్బీ పేజీలో 410 ప్రకటనలకు గాను కేవలం రూ 5.91 లక్షలు ఖర్చు చేసింది. ఇక టీడీపీ ఎఫ్బీ ప్రకటనలపై రూ 1.58 లక్షలు, ఎన్సీపీ రూ 58,355 వెచ్చించాయి. -
గూగుల్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రముఖ సామాజిక మాధ్యమం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో వచ్చే రాజకీయ ప్రకటనలపై పూర్తి పారదర్శకత పాటించనున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇకపై ప్రకటనలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందివ్వాలని నిర్ణయించినట్లు పేర్కొంది. అలాగే ఆ ప్రకటనలను ఎవరు ఇచ్చారు? దీనికి వారు వెచ్చించిన ఖర్చు ఎంత? వంటి వివరాలను సైతం వెల్లడించనున్నట్లు తెలిపింది. ‘ఇండియా పొలిటికల్ యాడ్స్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్’ పేరిట నూతన పాలసీని తీసుకువచ్చినట్లు వెల్లడించింది. దీని ప్రకారం ప్రకటనదారులు ఇకపై తమ ప్రకటనలకు సంబంధించి భారతీయ ఎలక్షన్ కమిషన్ (ఈసీఐ) లేదా ఈసీఐ అధికారులు అనుమతినిస్తూ జారీ చేసిన సర్టిఫికెట్లు తీసుకురావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే ప్రకటనదారుల గుర్తింపును ధ్రువీకరించిన తర్వాతనే రాజకీయ ప్రకటనలు ఇస్తామని పేర్కొంది. దీనికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియను ఫిబ్రవరి 14 నుంచి మొదలుపెడతామని తెలిపింది. ఈ ప్రకటనలు మార్చి నుంచి అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ప్రజలను ప్రభావితం చేసేలా ప్రకటనలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఐటీ చట్టంలో పలు సవరణలు సైతం చేసింది. దీంతో అప్రమత్తమైన సామాజిక మాధ్యమాలు.. ప్రకటనల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ట్విటర్, ఫేస్బుక్ ప్రకటనల విషయంలో నిబంధనలు విధించగా.. తాజాగా గూగుల్ కూడా ప్రకటనదారులకు నిబంధనలు విధించింది. -
మనోడేగా...కట్టబెట్టేద్దాం..!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకటనల యావ అధికారులకు పంటపండిస్తోంది. ప్రకటనలకోసం ప్రభుత్వం తపనపడుతుంటే కొందరు అధికారులు ఈ ముసుగులో తమకు నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టి దోస్తు మేరా దోస్తంటూ కథ నడిపించేస్తున్నారు. టెండర్లు పిలవకుండానే వలపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఏపీ సమాచార పౌర సంబంధాలశాఖ (ఐఅండ్‌పీఆర్) ఓ యాడ్ ఏజెన్సీకి ఏకపక్షంగా లబ్ధి చేకూర్చేందుకు రంగం సిద్ధం చేసింది. మౌలిక సదుపాయాలు లేకుం డా 30 రోజులు ప్రచారానికి సదరు యాడ్ ఏజెన్సీకి రూ.4.57 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. వాస్తవానికి సదరు ఏజెన్సీకి కాంట్రాక్టు ఇచ్చేముందు టెండర్లు పిలవక పోవడం గమనార్హం. ఏం జరిగింది?: ప్రస్తుతం జన్మభూమి కార్యక్రమాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించేందుకు ఏపీ ఆన్లైన్ సెంటర్లలో ఏపీ ప్రభుత్వం ప్రచారం నిర్వహించాలనుకుంది. ఈ నేపథ్యంలో అధికారులు వారికి అత్యంత సన్నిహితంగా ఉండే హైదరాబాద్‌కు చెందిన డీడీ కమ్యూనికేషన్ అధినేతను విజయవాడకు పిలిపించారు. టెండ ర్లు లేకుండా.. ఏకపక్షంగా కాంట్రాక్టు ఇచ్చేశారు. ఒప్పందం ప్రకారం.. 400 సెంటర్లలో ఉన్న ఎల్ఈడీ టీవీల్లో 30 సెకండ్ల నిడివిగల ప్రచార ప్రకటనలను 300 సార్లు ప్రచారం చేయాలి. వీటిని జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీలు, గ్రేటర్ నగరాలు అని మూడు గ్రేడులుగా విభజించారు. ఈ సంస్థకు వచ్చేనెల 3న అందు కు చెల్లింపులను సైతం చేసేందుకు ప్రభుత్వ అధికారులు సిద్ధం చేశారు. ఈ ప్రశ్నలకు బదులేది? 30 రోజుల ప్రచారంలో సెలవుదినాలు కూడా కలిపి డబ్బులు ఎందుకు ఇస్తున్నారో సమాధానం లేదు. సంక్రాంతికి ఇప్పటికే 3 రోజులు ఏపీ ఆన్లైన్ కేంద్రాలు మూసివేశారు. ఆదివారాలు కూడా కేంద్రాలు పనిచేయడం లేదు. ఇక జనవరి 26 తదితర సెలవుదినమే ఈ రోజులకు కూడా బిల్లులు ఎలా ఇస్తారు? ఇదే ప్రచారానికి శాటిలైట్ చానళ్లకు నెల మొత్తం ప్యాకేజీకి రూ.45 లక్షల నుంచి రూ. 50 లక్షలే ఖర్చవుతోంది. కోట్లాదిమంది ప్రేక్షకులు ఉన్న చానళ్లకు అంతతక్కువగా ఇస్తుంటే.. స్మార్ట్ యుగంలో ఎంతమంది ఏపీ ఆన్లైన్ కేంద్రాలకు వెళ్తున్నారు. వారిలో ఎందరు ఈ ప్రకటనలను చూస్తారన్నది సందేహమే! ఈ టెండరు విషయం మిగతా ఏజెన్సీలకు ఎందుకు చెప్పలేదు. హడావుడిగా ఎలా ఇచ్చారు? ప్రకటనలకు చెల్లింపు తీరు ఇలా... నగరం రేటు ఒక కేంద్రానికి 30 రోజులకు గ్రేటర్సిటీల్లో : రూ.20–రూ.1,80,000 జిల్లా కేంద్రాల్లో : రూ.15–రూ. 1,35,000 మున్సిపాలిటీల్లో : రూ.10–రూ. 90,000 మొత్తం కేంద్రాలు: 400 చెల్లించే మొత్తం: రూ.4.57 కోట్లు ప్రచారం చేయకపోతే బిల్లులు ఇవ్వం సదరు కంపెనీకి అన్ని అర్హతలు ఉన్నాయి. అందుకే, టెండర్లు పిలవకుండా ఇచ్చాం. వారు ఎన్ని రోజులు ప్రచారం చేశారో.. మాకు రిపోర్టు వస్తుంది. ఎన్నిరోజులు చేశారని తెలిస్తే.. అన్ని రోజులకే చెల్లిస్తాం. – వెంకటేశ్వర్లు, కమిషనర్, ఏపీ, ఐఅండ్ పీఆర్ మాకు టెండరు వచ్చిన మాట వాస్తవం. ఈ విషయంలో మేమేం చెప్పలేము. ఏమైనా ఉంటే కమిషనర్‌గారిని అడగండి. – దేవదాస్, డీడీ కమ్యూనికేషన్స్ -
పోలింగ్ రోజు ప్రకటనలపై నిషేధం!
న్యూఢిల్లీ: ఎన్నికకు 48 గంటల ముందే పత్రికల్లో రాజకీయ ప్రకటనల నిషేధంపై అభిప్రాయం తెలపాలంటూ పార్టీలను ఎన్నికల సంఘం కోరనుంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియాపై అనుసరిస్తున్న విధానాన్నే ప్రింట్ మీడియాకు వర్తింపజేసే అంశంపై సూచనలివ్వనుంది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై చర్చించేందుకు సోమవారం ఎన్నికల సంఘం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసింది. ‘ప్రింట్ మీడియాను ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని 126 (1)(బీ) పరిధిలోకి తీసుకురావడం, పోలింగ్ ముగిసేందుకు 48 గంటల ముందు అభ్యర్థి విజయావకాశాలపై సోషల్ మీడియాలో సర్వే నిర్వహించడం తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నాం’ అని ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. 2016లోనే ఎన్నికల సంఘం ‘పోలింగ్‌కు 48 గంటల ముందు పత్రికల్లో ప్రకటనలపై నిషేధం విధించే’లా ఎన్నికల చట్టంలో మార్పులు తీసుకురావలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఏడు జాతీయ పార్టీలు, 51 ప్రాంతీయ పార్టీలను ఈ సమావేశానికి ఆహ్వానించింది. ఎన్నికల ఖర్చు నియంత్రణ, శాసన మండలి ఎన్నికల ఖర్చు సీలింగ్ పెంపు, పార్టీ ఖర్చులపై పరిమితి తదితర అంశాలను చర్చించనున్నారు. -
కర్ణాటక ఎన్నికలు.. బీజేపీకి షాక్
సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీకి ఊహించని పరిణామం ఎదురైంది. బీజేపీ రూపొందించిన మూడు యాడ్లను నిషేధిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి బీజేపీ వీటిని రూపకల్పన చేసిందని ఈసీ తెలిపింది. ‘జన విరోధి సర్కార, విఫల సర్కార్, మూరు భాగ్య’ పేరుతో బీజేపీ యాడ్లను రూపొందించింది. ఏప్రిల్ 22న వాటిని ప్రసారం చేసుకునేందుకు అనుమతిస్తూ బీజేపీ కార్యదర్శి గణేశ్ యాజీకి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) క్లియరెన్స్ ఇచ్చింది. అయితే ఆ యాడ్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ వీఎస్ ఉగ్రప్ప ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అసత్యప్రచారాలతో బీజేపీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిందని ఆయన ఫిర్యాదులో తెలిపారు. వాటిని పరిశీలించిన ఈసీ.. ఉగ్రప్ప వాదనతో ఏకీభవించింది. ప్రజాప్రతినిధుల చట్టం, ఐపీసీ సెక్షన్లను అనుసరించి ఆ యాడ్లపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. దీంతో తక్షణమే ఆ యాడ్లను నిలుపుదల చేయాలని ఎంసీఎంసీకి ప్రసార శాఖ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం వినూత్న రీతిలో యాడ్లను రూపొందిస్తూ దూసుకెళ్తోంది. త్రీ సినిమాలో వై దిస్ కొలవెరి సాంగ్‌ను.. వై దిస్ యడ్యూరప్ప... అంటూ కాంగ్రెస్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. -
యాడ్లపై మహిళా క్రికెటర్ ఆగ్రహం
ఇస్లామాబాద్ : తెల్లగా ఉంటేనే అమ్మాయిలను చూస్తారని, అందంగా ఉండి... మంచి శరీరాకృతి ఉంటేనే అవకాశాలు వస్తాయంటూ... నిత్యం టీవీల్లో వచ్చే ప్రకటనలను చూస్తూంటాం. వాటి మాయలో పడి ఎత్తు పెరగడానికి, తెల్లగా మారడానికి శస్త్ర చికిత్సలు చేయించుకుని.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు లేకపోలేదు. అయితే మహిళలకు కావాల్సింది ఆత్మవిశ్వాసమే తప్ప.. తక్కువ చేసి చూపించే బ్యూటీ ఉత్పత్తుల కాదంటున్నారు పాక్ క్రికెటర్ సనా మిర్. బ్యూటీ ఉత్పత్తుల యాడ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫేస్బుక్లో ఆమె ఓ పోస్టును ఉంచారు. తాజాగా నటి మహీరా ఖాన్ ఓ హెయిర్ రిమూవల్ క్రీమ్ యాడ్‌లో నటించింది. అయితే ఆ యాడ్ అవమానకరంగా ఉందంటూ మిర్ తన ఫేస్బుక్లో ఓ సందేశం ఉంచారు. ‘మేము ఎప్పుడు వివిధ రంగాల్లో మహిళలకు ఎదురయ్యే ఆటంకాల గురించే మాట్లాడుకుంటాము. ఇలాంటి వ్యవహారాలు(యాడ్) మాకు చాలా ఆగ్రహం తెప్పించే అంశం. ఆడపిల్లలు ఆటలు ఆడాలంటే వారికి క్రీడల పట్ల అభిమానం, ప్రతిభ, నైపుణ్యం ఉంటే సరిపోదా? శరీరాకృతి, రంగే ప్రధానమా? నేను ఆడపిల్లలకు చెప్తున్నది ఒకటే మీరు క్రీడల్లో రాణించాలంటే మీకు ఉండాల్సింది సున్నితమైన చేతులు కాదు.. బలమైన చేతులు. ఒకసారి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడండి. చాలామంది మహిళా క్రీడాకారులు వారి నైపుణ్య, కఠోర శ్రమ, ప్రతిభ వల్ల ఉన్నతంగా ఎదిగారు. అంతేతప్ప వారి శరీరాకృతి, రంగు వల్ల కాదు.. ..నా ఈ 12 ఏళ్ల క్రీడా ప్రయాణంలో చాలా సౌందర్య ఉత్పత్తుల కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రచారం చేయమని నన్ను సంప్రదించాయి. కానీ నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే క్రీడల్లో రాణించాలనుకునే వారికి సౌందర్య సాధనాలతో పనిలేదన్నది నా అభిప్రాయం. నేను సెలబ్రిటీలను, స్పాన్సర్లను కోరుకునేది ఒక్కటే.. యువతులు వారి కలలను పూర్తి చేసుకోవడానికి కావల్సిన నమ్మకం, ఆత్మవిశ్వాసాన్ని అందించి వారి కాళ్ల మీద వారు నిలిచేలా సహకరించండి. అంతే తప్ప రంగు, శరీరాకృతి గురించి ప్రచారం చేసి వారిని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకండి’ అంటూ ఓ సుదీర్ఘమైన పోస్ట్ ఉంచారు. సనా పాకిస్తాన్ జాతీయ మహిళ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడమే కాక అంతర్జాతీయ మ్యాచ్‌లలో 190 వీకెట్లు తీశారు. -
ఈ సప్త అంశాలూ అత్యంత కీలకం
అవలోకనం మన దేశంలో సొంత ప్రచారం కోసం ప్రభుత్వాలు వాణిజ్య ప్రకటనల రూపంలో చేసే ఖర్చు అంతా ఇంతా కాదు. అన్నిటికన్నా భారీయెత్తున ప్రచారానికి వ్యయం చేసేది కేంద్ర ప్రభుత్వమే. గత ఏడాది కేంద్రం ఇందుకోసం చేసిన వ్యయం రూ. 1,280 కోట్లు. డియోడరెంట్లు మొదలుకొని లక్స్ సబ్బు, తాజ్‌మహల్ టీ వరకూ అన్నిటినీ ఉత్పత్తి చేసే హిందూస్తాన్ యూనీలీవర్ సంస్థ వార్షిక ప్రకటనల వ్యయం రూ. 900 కోట్లు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం స్వీయ ప్రచారానికి బాగానే నిధులు కేటాయిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలపై ఈ వారంలో కనబడినంత ఆసక్తి దేశంలో మును పెన్నడూ లేదు. అలవాటు ప్రకారం నేను శనివారం వేకువజామునే లేచి 7 గంట లకు న్యూస్‌చానెళ్లను గమనించేసరికి ఆశ్చర్యం కలిగింది. అందరూ వారి వారి నిపు ణులతో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం సిద్ధంగా ఉన్నారు! ఇదొక మంచి పరిణామం. కొన్నేళ్లక్రితం ‘ఇండియా టుడే’ మాగజిన్ రాసిన సంపాదకీయ వ్యాఖ్య నాకు గుర్తుంది. మన దేశం ఈశాన్య భారతాన్ని ఏవిధంగా నిర్లక్ష్యం చేస్తున్నదో చెప్పడం ఆ వ్యాఖ్య సారాంశం. చిత్రమే మంటే ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్నికల గురించిన కథనాలున్న ఆ సంచిక ముఖపత్రంపై కేవలం అయిదు పెద్ద ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికలకు సంబం ధించిన వివరాలున్నాయితప్ప అదే సమయంలో జరుగుతున్న ఈశాన్య రాష్ట్రాల ప్రస్తావనే లేదు. ఇప్పుడు ఈ వైఖరి మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్లే దీన్ని మంచి పరిణామమని అన్నాను. ఈ ఫలితాలు... ముఖ్యంగా త్రిపుర ఫలితాలు ఆసక్తిదాయకమైనవి. ప్రపం చంలోని ప్రధాన ప్రజాస్వామ్య వ్యవస్థల్లో క్రియాశీల కమ్యూనిస్టు పార్టీలు పనిచే స్తున్న దేశాల్లో మనది ఆఖరుదని చెప్పుకోవాలి. ఇంతక్రితంతో పోలిస్తే ఒక శక్తిగా కమ్యూనిస్టుల ప్రాధాన్యం తగ్గి ఉండొచ్చుగానీ వారి వల్ల రాజకీయాలకు విలువ పెరుగుతోంది. అయితే నేనివాళ కాంగ్రెస్‌పై కేంద్రీకరిస్తాను. గత నెలలో రాజస్థా న్లో వెలువడిన కొన్ని ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ మాట్లాడుతూ ‘రాష్ట్రాలు గెలుచుకోవాలంటే మీరు మున్సిపల్ ఎన్నికల్లో, వార్డు ఎన్నికల్లో నెగ్గాలి. ఆ ఎన్నికలు ఒక సంస్థకు పునాదిలాంటివి. మనం రాష్ట్రాలు నెగ్గాలి. రాష్ట్రాల్లో మంచి సంఖ్యలో సీట్లు గెల్చుకోకుండా ఏ పార్టీ కూడా జాతీయ స్థాయిలో న్యూఢిల్లీని గెల్చుకోవాలన్న ఆలోచన చేయలేదు’ అన్నారు. జాతీయ పార్టీలకు రాష్ట్రాల్లో గెలుపు ఎందుకంత ముఖ్యం? ప్రాంతీయంగా ఉండే అధికారానికి ఉండే ప్రాముఖ్యతేమిటి? చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు అధికారం లేకుండా పోయింది గనుక వీటి గురించి పరిశీలించక తప్పదు. అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల తర్వాత ఇందులో కొంత మార్పు ఉండొచ్చు. ఈ ఎన్నికలు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఎందుకు కీలకమైనవి? మొదటి ప్రయోజనం స్పష్టమైనదే. అధికారంలో ఉండటమే రాజకీయాల పర మార్ధం. అధికారంలో ఉండే పార్టీ తన సిద్ధాంతంలోని నిర్దిష్టతలను అమల్లోకి తెచ్చి ఎజెండాను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు బీజేపీ హర్యానా, మహారాష్ట్రల్లో పశు మాంసాన్ని, పశువధను నిషేధించడం ద్వారా దాన్ని జాతీయ స్థాయి అంశంగా మార్చింది. కార్పొరేషన్లు, రాష్ట్ర అసెంబ్లీల్లో అధికారం ఉంటే రాజకీయ నాయ కులకు తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం రెండో ప్రయోజనం. పొద్దస్తమానం ప్రజలు విద్యుత్ కనెక్షన్లు మొదలుకొని తమ పిల్లల అడ్మిషన్ల వరకూ ఎన్నో అంశాల కోసం రాజకీయ నాయకులపై ఒత్తిళ్తు తెస్తుంటారు. అధికారంలో ఉన్న పార్టీ ఇవన్నీ చేయగలదు తప్ప ప్రతిపక్షం చేయ లేదు. మూడోది–నిధుల సేకరణ. ఇది రెండు మార్గాల్లో పనిచేస్తుంది. వాస్తవం ఏమంటే రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా అవినీతిపరులు కాకపోయినా తమ పార్టీ కోసం విరాళాలు తీసుకుంటారు. ప్రముఖ జర్నలిస్టు స్వర్గీయ ధీరేన్ భగత్ మాజీ ప్రధాని వీపీ సింగ్‌పై తాను రాసిన ‘కాంటెంపరరీ కన్సర్వేటివ్’ పుస్తకంలో దీన్ని గురించి చక్కగా చెప్పారు. అధికారంలో ఉన్న పార్టీకి కార్పొరేట్ల నుంచి అధి కారికంగానే నిధులు ప్రవహిస్తాయి. అలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియ నిది కాదు. నాలుగో అంశం– ఆ వచ్చిన నిధుల్ని అభ్యర్థులు ఖర్చు పెట్టడానికి సంబంధించిన విషయం. ప్రతిపక్షంలో ఉన్న పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీచేసే వారు ఇతోధికంగా నిధులు ఖర్చు పెట్టలేరు. ఇది వారిని రంగంలో తగిన పోటీ దారుగా నిలపలేదు. అయిదో అంశం– అధికారంలో ఉన్నవారికి సమాచారాన్ని చేరేసే ప్రక్రియను నియంత్రించే శక్తి ఉండటం. ఉదాహరణకు ప్రభుత్వాలు వాణిజ్య ప్రకటనలకు చేసే వ్యయం. దేశంలో భారీగా ఖర్చు చేసే ప్రకటనకర్త కేంద్ర ప్రభుత్వం. గత ఏడాది అది ప్రధాని, ఆయన పథకాల ప్రచారం కోసం రూ. 1,280 కోట్లు వ్యయం చేసింది. దీన్ని మరింత స్పష్టంగా చెప్పాలంటే... డియోడరెంట్లు మొదలుకొని లక్స్ సబ్బు, తాజ్‌మహల్ టీ వగైరాల వరకూ అన్నిటినీ ఉత్పత్తి చేసే హిందూస్తాన్ యూనిలీవర్ సంస్థ వార్షిక వాణిజ్య ప్రకటనల వ్యయం రూ. 900 కోట్లు. దేశంలోని టెలికాం సంస్థలు అన్నీ కలిసి వాణిజ్యప్రకటన కోసం చేసే ఖర్చు కేంద్ర వ్యయం కన్నా చాలా తక్కువ. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ సొంత ప్రచారం కోసం తగిన నిధుల్ని కేటాయిస్తుంటాయి. ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం 2015లో ప్రచారం కోసం రూ. 526 కోట్లు ఖర్చు చేసింది. ఇక ఆరోది–ఇలా ప్రచారం కోసం భారీ యెత్తున చేసే వ్యయమంతా మీడియాను పాలకపక్షం వైపు నిలుపుతోంది. ముఖ్యంగా ప్రాంతీయ పత్రికల విషయంలో ఇది వాస్తవం. ఉదాహరణకు దేశంలో కోటిన్నరమంది పాఠకులుండి ఏడో స్థానంలో నిలిచిన ‘రాజస్థాన్ పత్రిక’ వసుం ధర రాజే ప్రభుత్వం తమకు వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం లేదంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బహుశా ఆ ప్రభుత్వానికి ‘రాజస్థాన్ పత్రిక’ అనుకూలంగా లేకపోవడమే ప్రకటనలు ఆపడానికి కారణం కావొచ్చు. ఏడోది, ఆఖరుది–ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడం. ఎన్నికల సంఘం దీనిపై కొంతవరకూ కన్నేసి ఉంచుతోంది. కానీ ఎన్నికల తేదీలు ప్రకటించాకే అది మొదలవుతుంది. మిగిలిన అయిదేళ్లూ అధికారంలో ఉన్న పార్టీ పోలీసుల్ని ఉపయోగించుకోవచ్చు. అస్మదీయులకు పదవులు పంచిపెట్టొచ్చు. ప్రభుత్వ విభాగాల న్నిటినీ వినియోగించుకోవచ్చు. దుర్వినియోగం కూడా చేయొచ్చు. అడిగేవారుం డరు. రాజకీయ పార్టీలను పోషించే, నిలబెట్టే అంశాలు మన దేశంలో ఇంకా చాలా ఉన్నాయి. స్థానిక అధికారం ద్వారా కాంగ్రెస్ పార్టీ నిలకడగా, క్రమబద్ధంగా శక్తి పుంజుకుని కొనసాగనట్టయితే 2019లో రాహుల్‌గాంధీ జాతీయ స్థాయిలో స్వత స్సిద్ధమైన పోటీదారుగా మారడం కష్టం. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ఆకార్ పటేల్ aakar.patel@icloud.com -
హెచ్‌యూఎల్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద అడ్వర్టైజర్, ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందూస్తాన్ యూనిలివర్ కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్, ఫేస్బుక్ లాంటి ఆన్లైన్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు తన ప్రకటన ఖర్చులు తగ్గించాలని నిర్ణయించింది. విషపూరితమైన కంటెంట్‌ను వీరు తొలగించకపోతే, తాము ప్రకటనలకు కోత పెడతామని తెలిపింది. డచ్‌కు చెందిన యునిలివర్ దీనిపై ఓ కొత్త గ్లోబల్ పాలసీని తీసుకొచ్చింది. గతేడాది యూనిలివర్ ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్‌కు కోసం 9.4 బిలియన్ డాలర్లను వెచ్చిచింది. దీనిలో మూడోవంతు డిజిటల్ అడ్వర్టైజింగ్లో పెట్టింది. మతపరమైన భావాలను దెబ్బతీసే విధంగా, పిల్లలకు హానికరంగా, లింక వివక్ష చూపించే కంటెంట్‌ను కలిగి ఉండే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు తమ బ్రాండుల ప్రకటనలను ఇక నుంచి ఇవ్వబోమని తేల్చిచెప్పింది. గ్లోబల్ కమిట్మెంట్ను హెచ్‌యూఎల్‌కు అమలు చేస్తామని తెలిపింది. హెచ్‌యూఎల్ దేశంలో అతిపెద్ద అడ్వర్టైజర్లలో ఒకటని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. వార్షికంగా ప్రకటనల కోసం రూ.3వేల కోట్లకు పైగా ఖర్చుచేస్తున్నట్టు అంచనావేస్తోంది. దీనిలో డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పైనే 15 నుంచి 20 శాతం వెచ్చించింది. విభేదాలను సృష్టించే ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లపై తాము పెట్టుబడులను కోత పెడుతున్నామని కంపెనీ ప్రకటించింది. ''థర్డ్ పార్టీ వెరిఫికేషన్‌ను వినియోగదారులు పట్టించుకోరు. మోసపూరిత విధానాలను, నకిలీ వార్తలను లెక్కచేయరు. అడ్వర్టైజర్ల మంచి విలువలను వారు గుర్తించారు. కానీ ఉగ్రవాదానికి, పిల్లలను పాడుచేసే యాడ్స్‌కు పక్కన తమ బ్రాండ్లు కనిపిస్తే మాత్రం అసలు ఊరుకోరు'' అని యూనిలివర్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కేత్ వీడ్ తెలిపారు. సమాజానికి సానుకూలమైన సహకారాన్ని అందించలేని ప్లాట్‌ఫామ్స్‌పై తాము ప్రకటన చేయలేమని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు కూడా కంపెనీ చెప్పింది. యూనిలివర్ కమిట్మెంట్స్ను తాము గౌరవిస్తున్నామని ఫేస్బుక్ ఇండియా తెలిపింది. ప్రతి రోజూ తమ యూజర్ల, కస్టమర్ల, పార్టనర్ల భద్రత, నమ్మకాన్ని పొందడానికి ఎల్లవేళలా కృషిచేస్తూ ఉంటామని గూగుల్ పేర్కొంది. యూనిలివర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మిగతా నిపుణులు కూడా స్వాగతిస్తున్నారు. -
ఆ ప్రకటనలకు ఫేస్బుక్ దూరం
శాన్ఫ్రాన్సిస్కో : బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీ యాడ్స్‌ను ఫేస్బుక్ తన ఫ్లాట్‌ఫాంలపై నిషేదించింది. ఇన్స్టాగ్రామ్, ఆడియన్స్ నెట్వర్క్, మెసెంజర్లలోనూ వీటిని ప్రోత్సహించరాదని నిర్ణయించింది. తప్పుదారిపట్టించే ఫైనాన్షియల్ ప్రోడక్టులను ప్రోత్సహించే ప్రకటనలను నిషేధించినట్టు ఫేస్బుక్ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే నూతన ప్రోడక్టుల గురించి ప్రజలు ఫేస్బుక్ యాడ్స్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు కొనసాగుతుందని స్పష్టం చేసింది. క్రిప్టోకరెన్సీలు, ఐసీఓలపై పలు కంపెనీలు జారీ చేస్తున్న ప్రకటనలు విశ్వసనీయంగా లేవని ఫేస్బుక్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ రాబ్ లెథెరెన్ చెప్పారు. ఈ తరహా ప్రకటనలు ఫేస్బుక్ ఫ్లాట్‌ఫాంలపై నుంచి నిషేధిస్తున్నామన్నారు. ఫేస్బుక్ యాడ్స్‌పై ప్రజలు ఎలాంటి అభ్యంతరాలున్నా తమకు నివేదించవచ్చని కోరారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలకు ఫేస్బుక్లో తావులేదని కంపెనీ స్పష్టం చేసింది. -
ఫేస్బుక్లో కొత్తగా ఉద్యోగాలు: వాటికోసమే..
వ్యాపార ప్రకటనల విషయంతో తీవ్ర విమర్శలు పాలవుతున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తన అడ్వర్టైజింగ్ సిస్టమ్‌ను, ప్లాన్లను మార్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు తమ సోషల్ మీడియా ప్లాట్ఫామలో వచ్చే వ్యాపార ప్రకటనలను సమీక్షించడానికి కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటోంది. 1000 మందికి పైగా ఉద్యోగులను ఫేస్బుక్ తన వ్యాపార ప్రకటనలను సమీక్షించడానికి తీసుకుంటున్నట్టు తెలిసింది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయం ఉందనే దానిపై కాంగ్రెస్ విచారణ చేపట్టిన నేపథ్యంలో ఫేస్బుక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ ఎన్నికల సందర్భంగా ఫేస్బుక్లో రష్యన్ యాడ్స్ ఎక్కువగా ఉండటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అవి ట్రంప్‌కు అనుకూలంగా వచ్చాయని లిబరల్స్ ఆరోపిస్తుండగా... ట్రంప్ మాత్రం ఫేస్‌బుక్‌ను యాంటీ ట్రంప్‌గా అభివర్ణిస్తున్నారు. ఈ ప్రకటనల కోసం ఫేస్బుక్ లక్షకు పైగా డాలర్లను తీసుకుంది. తమపై వస్తున్న ఈ ఆరోపణలకు గాను, ఎవరినైనా బాధించి ఉంటే మన్నించడంటూ ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ నిన్ననే(సోమవారమే) క్షమాపణ కూడా చెప్పారు. రాజకీయ ప్రకటన ఖర్చు నిబంధనలను సమగ్రంగా సమీక్షించనున్నామని జుకర్ బర్గ్ తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడానికి తమ టూల్స్‌ను ఎవరూ వాడుకోవడానికి వీలులేదంటూ పేర్కొన్నారు. ప్రకటన కొనుగోలు ప్రక్రియలో కూడా ఫేస్బుక్ పలు అప్డేట్లను ప్రవేశపెట్టింది. కంటెంట్‌పై కఠినతరమైన నిబంధనలు తీసుకురావడం, అడ్వర్టైజర్లు తమ ప్రామాణికతను ప్రదర్శించడానికి నిబంధనలను మెరుగుపరచడం వంటి వాటిని తీసుకొచ్చింది. -
మోదీ ప్రచారానికి రూ. 1100 కోట్లు
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తీసిన అడ్వర్టైజ్మెంట్లకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రెండున్నర ఏళ్ల కాలంలో ఏకంగా 1100 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది. అది కూడా కేవలం టీవీ యాడ్స్, ఇంటర్నెట్, ఇతర ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం కోసం మాత్రమే. ఇక పత్రికల యాడ్స్‌కు, హోర్డింగ్‌లకు, బుక్లెట్స్కు, క్యాలెండర్లకు ఖర్చు పెట్టిన మొత్తాలను కూడా పరిగణిలోకి తీసుకుంటే ఇంతకు పదింతలు ఎక్కువే అవుతుంది. రఘువీర్ సింగ్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు కింద దాఖలు చేసిన దరఖాస్తుకు సమాధానాంగా కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ ఈ వివరాలను అందజేసింది. 2014, జూన్ 1వ తేదీ నుంచి 2016, ఆగస్టు 31వ తేదీ వరకు మోదీతో తీసిన ఎలక్ట్రానిక్, ఇంటర్నెట్ ప్రచారానికి 1100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మొత్తాన్ని రోజువారి ఖర్చు కింద విడగొడితే రోజుకు 1.4 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్లు. అంగారక గ్రహంపై పరిశోధనల కోసం ‘మంగళయాన్’ ప్రయోగానికి ఖర్చయిన 450 కోట్ల రూపాయలకన్నా మోదీ ప్రచారానికైన ఖర్చు ఎంత ఎక్కువో లెక్కించవచ్చు. దేశంలో మూలుగుతున్న నల్లడబ్బును వెలుగులోకి తీసుకొచ్చి పేద ప్రజలకు మంచి చేస్తానని ప్రధాని మోదీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మోదీ యాడ్స్ కోసం పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఇంత మొత్తంలో ఖర్చు పెట్టడం ఎంతమేరకు సమంజసమో ప్రభుత్వ వర్గాలే చెప్పాలి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ తన ప్రభుత్వం ప్రచారం కోసం రోజుకు 16 లక్షల రూపాయల చొప్పున ఖర్చు పెడుతున్నారని ఇదే సమాచార హక్కు దరఖాస్తు ద్వారా వెలుగులోకి వచ్చినప్పుడు....ప్రజల సొమ్మును దుబారా చేస్తున్నారంటూ ఆయనపై దుమ్మెత్తి పోసిన బీజేపీ వర్గాలు ఇప్పుడు ఏమంటాయో చూడాలి. -
‘ఉచితం! ఉచితం!’
ఈ మధ్య మన దినపత్రికలు రంగు రంగుల ‘జాకెట్ల’తో కళకళలాడుతూ పాఠకులకు కనువిందునూ, పత్రికాధిపతులకు కోశ పుష్టినీ కలిగిస్తు న్నాయి. కారణం వ్యాపార ప్రకటనల పండుగ హడా వుడి. ఈ హడావుడీ, కళ కళా ఆర్థిక వ్యవస్థ చురుకు దనాన్ని సూచిస్తాయి కనుక ఇది ఒక రకంగా క్షేమక రమే. ప్రకటన కర్తలు ఎంత ప్రతిభ చూపినా, ఎన్ని కలల లోకాలను కళ్లకు కట్టినా, పాఠకులను అన్నిటి కంటే ఎక్కువ ఆకర్షించేది మాత్రం ‘ఉచితం!’ మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కొనుగోలుదారు లను ఆకర్షించే అయస్కాంతం ‘ఉచితం!’ అనే తారక మంత్రం. ‘అది కొంటే, ఇది ఉచితం!’ ‘రెండు కొంటే ఒకటి ఉచితం!’ లాంటి ఆకర్షణలు లేకపోతే ఎంత గొప్ప ప్రకటనలైనా సీదా సాదాగా కనిపిస్తాయి. కన్ను ఆగదు. ఈ ప్రకటనలలో ‘ఉచితం’ అంటే ప్రకటన కర్తలు చెప్పేదీ, పాఠకులకు అర్థమయ్యేదీ డబ్బు ఇవ్వనక్కర లేకుండా లభించేది, ఊరికే దొరికేదనే. చిత్రమేమిటంటే, ‘ఉచితం’ అంటే ఈ అర్థం మొన్న మొన్నటి దాకా, అంటే వ్యాపార ప్రక టనలు వ్యాప్తిలోకి వచ్చేదాకా ఉన్నట్టు కనిపించదు. ప్రముఖ నిఘంటువులలో, ‘ఉచితం’ అనే మాటకు ‘ఫ్రీ’ అనే అర్థం కనపడదు. ‘ఉచితం’ అనే సంస్కృత పదా నికి తగినది, సరైనది, సంప్రదాయ సిద్ధమైనది, హేతుబద్ధమైనది అనే అర్థాలే కనిపిస్తాయి. ‘ఉచితజ్ఞు’ డయిన మహాకవి కాళిదాసు, ‘ఉచిత’ పదాన్ని తర చుగా ఉపయోగిస్తాడు. కానీ ‘రెండు కొంటే ఒకటి ఉచితం’ లాంటి అర్థంలో కాదు. ‘శుభ సమయంలో ఇలా రోదించటం నీకు ఉచితం కాదు’ అని శకుంత లను ఊరడించటం శాకుంతలం నాటకంలో కనిపి స్తుంది. రఘు వంశ కావ్యంలో, వశిష్ఠాశ్రమంలో లేడి పిల్లలు ‘నీవార భాగదేయ ఉచితాలు’– ఋషుల ఇళ్ల లోని నివ్వరి ధాన్యంలో తమదైన భాగం పొందేందుకు అర్హత కలిగినవి. ‘రక్త చందనోచితు’డైన ఈ వృకోద రుడు ఇలా అడవిలో దుమ్ము కొట్టుకొని ఉంటే చూస్తున్న నీకు బాధ కలగటం లేదా?’ అంటుంది భారవి కావ్యంలో ద్రౌపది, ధర్మరాజుతో. తెలుగు నిఘంటువులలో కూడా ‘ఉచితం’ అనే మాటకు, తగినది, అలవాటుపడినది, పరిచితం, మితం లాంటి అర్థాలు మాత్రమే కనిపిస్తాయి. ‘ఉచితా హారము వల్లనె,/ఉచితంబుగ బుద్ధి స్థిరత ఒప్పుట వలనే,/ఉచిత గురు బోధ వల్లనె,/సుచరితుడై పరము గాంచు సుమ్ముర వేమా!’ అనే వేమన పద్యంలో, ఉచితం అనే మాటకు, ‘డబ్బివ్వకుండా లభించేది’ అని అర్థం చెప్పటం అనుచితం. శ్రీ కృష్ణ పరమాత్మ శిరస్సును, సత్యభామ తన ఎడమకాలితో తొలగదోస్తే, ‘అట్లయగు! పేరలుకన్ చెందినయట్టి కాంతలు ఉచిత వ్యాపారముల్ నేర్తురే!’ అని ప్రశ్నించి. సమర్థిస్తాడు ముక్కు తిమ్మన. పట్టరానంత కోపం వచ్చిన మానినీ మణుల మాటేమో కానీ, మామూలు మహిళలకు మాత్రం ‘ఉచిత’ వ్యాపా రాల గురించిన అవగాహన మగవారితో సమానం గానే ఉంటుందంటారు అనుభవజ్ఞులైన వ్యాపారులు. (వ్యాసకర్త : ఎం. మారుతి శాస్త్రి ) -
మోదీ ప్రభుత్వంపై కేజ్రీ ఫైర్..
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేస్తున్న ప్రచార హడావిడిపై ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. కేవలం ఈ ప్రచారం కోసం 1,000 కోట్లకు పైగా మోదీ ప్రభుత్వం ఖర్చు చేసినట్లు సమాచారం అందిందని ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలు కలిసి కూడా ఒక సంవత్సర కాలంలో 150 కోట్లకు మించి ప్రచారానికి ఖర్చు చేయలేదని కేజ్రీవాల్ వెల్లడించారు. భారతీయ జనతాపార్టీ చేస్తున్న అధిక ప్రచార వ్యయంతో విభేదిస్తున్నట్లు ఆయన తెలిపారు. సరి-భేసి విధానం అమలు సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం చేసినటువంటి ప్రచార ఆర్భాటానికి ప్రతిపక్షాల నుంచి కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. Modi govt spend on ads for jst ONE event 2 yr bash? Sources- more than Rs 1000cr All Del govt depts total spend less than 150cr for full yr — Arvind Kejriwal (@ArvindKejriwal) May 26, 2016 -
ఇక టీవీల్లో ఎవరికి నచ్చే యాడ్స్ వారికి మాత్రమే!
లండన్: మొన్నటి తరానికి బ్లాక్ అండ్ వైట్ టీవీలు, వాటిలో చూసిన ఒకటి, రెండు ఛానెళ్లే గుర్తు. నిన్నటి తరానికి కలర్ టీవీలు, వాటిలో చూసిన 30, 40 ఛానళ్లు గుర్తు. మరి అదే నేటి తరానికి వస్తే వందల ఛానళ్లే కాదు, యూట్యూబ్, నెట్ఫిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ, బీటీ విజన్, స్కై....ఇలా ఎన్నో చూస్తున్నారు. తరాల సంగతి పక్కనపెట్టి ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయబద్ధంగా టీవీల్లో కొన్ని నచ్చిన ఛానళ్ల వీక్షణకు పరిమితమవుతున్న వారి సంఖ్య సరాసరిగా యాభై శాతానికి మించిలేదు. ఇలాంటి పోటీ ప్రపంచంలో టీవీ ఛానళ్లు తమ మనుగడను కొనసాగించాలంటే వాణిజ్య ప్రకటనల్లో విప్లవాత్మక మార్పులు తీసుకరావాల్సిందే. ప్రస్తుతం భారత్ సహా పలు దేశాల్లో టీఆర్పీ రేటింగ్‌ల ప్రకారం వాణిజ్య ప్రకటనలు ఛానళ్లలో ప్రసారం అవుతున్నాయి. ఇప్పుడు ‘సెట్ టాప్’ బాక్సుల పుణ్యమా అని రేటింగ్స్‌లో కచ్చితత్వం రావడమే కాకుండా ఛానళ్లలో వచ్చే మనకిష్టమైన కార్యక్రమాన్ని ముందుగానే రికార్డు చేసుకొని కోరుకున్నప్పుడు చూసుకునే అవకాశం వచ్చింది. కానీ చూస్తున్న కార్యక్రమం మధ్యలో వచ్చే యాడ్స్ చీకాకు కలిగిస్తున్నాయి. ఛానళ్లు మనుగడ సాగించాలి కనుక యాడ్స్ ఎలాగు తప్పవు. అదే మనకు నచ్చే యాడ్స్ మాత్రమే వస్తే బాగుంటుంది కదా! మన ఇంట్లో పిల్లీ లేదు, కుక్కా లేదనుకోండీ! మరి పిల్లి, కుక్కల ఫుడ్‌కు సంబంధించిన యాడ్ మనకెందుకు? మన అభిరుచులకు తగ్గ దుస్తుల డిజైన్స్ గురించో, నగల గురించో యాడ్స్ ఇస్తే బాగుంటుందికదా! లోకోభిన్నరుచులు ఉన్నప్పుడు ఇది ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్న సహజంగా వస్తుంది. నిజంగా అభిరుచులకు తగ్గ యాడ్స్‌ను వీక్షించే అవకాశం త్వరలోనే సాకారం కాబోతోన్నది. అప్పుడు మన ఇంట్లో వచ్చే యాడ్ పక్కింట్లో రాదు, అలాగే పక్కింట్లో వచ్చే యాడ్ మనకు రాదు. ఇప్పటికే దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దానికి ‘డైనమిక్ యాడ్ ఇన్సర్షన్’ అని పేరు కూడా పెట్టారు. మన పేరు, వయస్సు, అభిరుచులు తెలుసుకోవడానికి సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి కూడా. మనం ఏ టీవీ ఛానళ్లు చూస్తున్నామో, వాటిలో ఏ కార్యక్రమాన్ని ఎంతసేపు చూస్తున్నామో సెట్‌టాప్ బాక్సులు ఇప్పటికే రికార్డు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ డేటా నేరుగా యాడ్ ఏజెన్సీలకు వెళుతుంది. వారు వారి పద్ధతిలో వీక్షకుల అభిరుచులను అంచనా వేస్తారు. ఇదో పద్ధతి. ప్రజల వయస్సు తదితర వివరాలతోపాటు అభిరుచులను నేరుగా తెలుసుకునేందుకు ఆన్లైన్ ప్లేయర్లు, సర్వీసులు ఉన్నాయి. దీనికోసమే ఆన్లైన్ ‘ఐటీవీ’ ప్లేయర్ గత నవంబర్ నెలలో ‘ఐటీవీ హబ్’గా మారింది. ఇప్పుడు ఈ హబ్ వద్ద కోటీ పాతిక లక్షల మంది రిజిస్టర్ చేసుకున్న యూజర్లు ఉన్నారు. ఇదే మాదిరిగా లండన్‌కు చెందిన ఛానెల్ 4 తన ‘40 డీ’ ఫ్లాట్ ఫామ్‌ను ‘ఆల్ 4’గా మార్చుకుంది. దీని ద్వారా అది యూజర్ల అభిరుచులను సేకరిస్తోంది. ఇలా సేకరించిన సమస్త సమాచారాన్ని యాడ్ ఏజెన్సీలు పంచుకుంటాయి. వాటిని విశ్లేషించి వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా యాడ్స్‌ను రూపొందిస్తాయి. వివిధ రకాల యాడ్స్‌ను వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో ప్రసారం చేయడానికి ‘డైనమిక్ యాడ్ ఇన్సర్షన్’ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. ప్రజల అభిరుచులకు తగిన విధంగా ఒక్క ‘డోవ్’ సబ్బు యాడ్‌ను 25 రకాలుగా తీయగలమని యూనిలివర్ యాడ్ ఎగ్జిక్యూటివ్ ఇటీవల ఇక్కడ జరిగిన ప్రపంచ సదస్సులో వెల్లడించారు. ఈ సదస్సులో ప్రపంచ నలుమూలల నుంచి యాడ్ ఏజెన్సీల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్నారు. వారిలో ఫేస్బుక్, గూగుల్, ట్విట్టర్ ప్రతినిధులు కూడా ఉన్నారు. -
వాణిజ్య ప్రకటనతోనే నా ప్రయాణం: అఖిల్
హైదరాబాద్: వాణిజ్య ప్రకటన (యాడ్)తోనే తన సినీ జీవితం మొదలైందని యువహీరో అక్కినేని అఖిల్ అన్నారు. హైదరాబాద్‌లో ఓ ప్రముఖ షాపింగ్ మాల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా లోగోను శుక్రవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం సంతోషంగా ఉందన్నారు. -
ఖజానా నింపేద్దాం..
బస్సులు..ఆటోలు..క్యాబ్స్..సినిమాహాళ్లలో ప్రకటనలు ఇచ్చారో పన్ను పడుద్ది. అదనపు ఆదాయ వనరులు సమీకరించుకునేందుకు జీహెచ్ఎంసీ మార్గాలను అన్వేషిస్తోంది. చిన్నపాటి ప్రకటనలపైనా పన్ను వేసేందుకు యోచిస్తోంది. సినిమా హాళ్లలో స్లైడ్స్, షార్ట్ ఫిల్మ్స్.. గోడలపై రాతలకూ పన్ను వేసేందుకు సిద్ధమవుతోంది. అంతేకాదు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, ఓఆర్ఆర్, మెట్రోరైల్ కారిడార్లల్లో ఆదాయం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నట్టు గుర్తించింది. వీటి ద్వారా దాదాపు రూ. 50 కోట్లు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు సిద్ధమవుతోంది. దేశంలోని పధాన నగరాలు అనుసరిస్తున్న విధానాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రతిపాదనలు రూపొందిస్తోంది. ⇒ చిన్న ప్రకటనలకూ పన్నులు! ⇒ ఆటోలు, బస్సులనూ వదలరు.. ⇒ మెట్రో, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే మార్గాలపైనా ప్రత్యేక దృష్టి ⇒ ఏటా రూ. 50 కోట్ల ఆదాయం ⇒ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న జీహెచ్ఎంసీ సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటి వరకూ హోర్డింగులు, గ్లోసైన్ బోర్డులు, ఫ్లెక్సీబోర్డులపై మాత్రమే ప్రకటనల పన్ను వసూలు చేస్తోంది. జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం ఏ రూపేణా (కరపత్రం, క్యారీ బ్యాగులు, సినిమా స్లైలడ్, బస్సులు, ఇతరత్రా వాహనాలపై )ప్రచారం నిర్వహించినప్పటికీ ప్రకటనల పన్ను వసూలు చేయవచ్చు. ఈ అంశాన్ని ఇంతవరకు పెద్దగా పట్టించుకోని అధికారులు ఇప్పుడు వీటి నుంచీ గణనీయంగా ఆదాయం రాబట్టుకోవచ్చునని అంచనా వేశారు. ప్రకటనలు ప్రదర్శిస్తున్న వారందరి నుంచీ ప్రకటనల పన్ను వసూలు చేసే ఏర్పాట్లలో మునిగారు. ఇందుకుగాను ప్రకటనల పన్నుగా నిర్ణీత రుసుములను ప్రతిపాదించారు. వీటి ద్వారా ఏటా దాదాపు రూ. 50 కోట్ల మేర ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వచ్చే నెల నుంచి దీన్ని అమలుచేసే యోచనలో ఉన్నారు. గత సంవత్సరం కూడా వాహనాలపై ప్రదర్శించే ప్రకటనలకు పన్ను వసూలు చేయాలని భావించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ ఆలోచనను తిరిగి తెరపైకి తేవడంతోపాటు ఈసారి అదనంగా సినిమాస్లైలడ్స్ ప్రదర్శించినందుకు కూడా ప్రకటనపన్ను వసూలు చేయాలని నిర్ణయించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రతిపాదిత పన్నులు దిగువ పేర్కొన్న విధంగా ఉన్నాయి. సంవత్సరానికి ఏ కేటగిరీకి ఎంత ఫీజు.. కేటగిరీల వారీగా హోర్డింగులు, యూని పోల్స్, ఎఫ్‌ఓబీలు, ఆర్చీలపై ప్రకటనలకు దిగువ ఫీజులు వసూలు చేస్తారు. గోడ పెయింటింగ్లకూ పన్ను గోడలపై వేసే ప్రచార పెయింటింగ్‌లకు, దుకాణాల షట్టర్ల మీది ప్రచారాలకు సైతం ప్రకటనల పన్ను విధించనున్నారు. వీటితో పాటు గ్లాస్పెయింటింగ్స్, పిల్లర్ బోర్డులు, స్టిక్కర్లు, జెండాలపై ప్రచారాలు చేసినా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నియాన్ / గ్లోసైన్ బోర్డులకు కూడా దిగువ పేర్కొన్న విధంగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ⇒ బెలూన్లు, అంబ్రెల్లాలకు ఒక్కోదానికి ఎస్ కేటగిరీలో రూ. 5 వేలు, ఎ కేటగిరీలో రూ. 4 వేలు, బి కేటగిరీలో రూ. 3 వేలు, సి కేటగిరీలో రూ. 2లు వంతున చెల్లించాల్సి ఉంటుంది. ⇒ సినిమాహాళ్లలో ప్రదర్శించే సై ్లడ్స్కు ఒక్కో స్లైలడ్కు నెలకు దాదాపు రూ. 150 నుంచి రూ. 250 వసూలు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ⇒ ఇంకా సీసీ టీవీల ద్వారా ప్రదర్శనలు, సినిమా హాళ్లలో ప్రైవేట్ షార్ట్‌ఫిల్మ్‌లు తదితరమైన వాటిపై సైతం నెలప్రాతిపదికన ఫీజులు వసూలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ⇒ దేశంలోని వివిధ నగరాల్లో వసూలు చేస్తున్న ప్రకటనల పన్నును పరిగణనలోకి తీసుకొని జీహెచ్ఎంసీ అధికారులు ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. స్పెషల్ కేటగిరీగా మెట్రోమార్గం పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, ఓఆర్ఆర్, మెట్రోరైలు కారిడార్లలో ప్రకటనల ఏర్పాటుకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని అంచనా వేసి ఆయా మార్గాలను ప్రకటనల పన్ను వసూళ్లకు ‘స్పెషల్’(ఎస్) కేటగిరీ మార్గాలుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లోని డిమాండ్‌ను బట్టి మిగతా గ్రేడ్ల ప్రాంతాలను గుర్తించనున్నారు. -
జోరుగా డిజిటల్ ప్రచారం
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లు, డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌ల వంటి ఇంటర్నెట్ ఎనేబుల్డ్ డివైస్‌ల్లో ప్రకటనలు జోరుగా పెరుగుతున్నాయి. ఈ డిజిటల్ ప్రచార వ్యయం ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది 15 శాతం వృద్ధితో 13,753 కోట్ల డాలర్లకు పెరగవచ్చని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ, ఈమార్కెటీర్ అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు.. 2012లో మొత్తం ప్రచార వ్యయంలో ఐదవ వంతుగా ఉన్న డిజిటల్ ప్రచార వ్యయం 2018 నాటికి మూడో వంతుకు పెరుగుతుంది. 2018 కల్లా డిజిటల్ ప్రచార వ్యయం 20,401 కోట్ల డాలర్లకు, మొత్తం మీడియా ప్రచార వ్యయం 65,630 కోట్ల డాలర్లకు చేరతాయి. రానున్న సంవత్సరాల్లో మీడియా ప్రచార వ్యయం 5% స్వల్ప వృద్ధినే సాధిస్తుంది. డిజిటల్ ప్రచార వ్యయంలో దేశాల వారీగా చూస్తే అమెరికా, ప్రాంతాల వారీగా చూస్తే దక్షిణ అమెరికాలు అధికంగా ఖర్చు చేస్తున్నాయి. మొత్తం ప్రపంచవ్యాప్త డిజిటల్ వ్యయంలో 40 శాతం దక్షిణ అమెరికా ప్రాంతానిదే కావడం విశేషం. ఈ విషయంలో ఆసియా-పసిఫిక్ ప్రాంతం వాటా 29%గా, పశ్చిమ యూరప్ దేశాల వాటా గణనీయంగా ఉండగా, ఇతర ప్రాంతాల వాటా స్వల్పంగా ఉంది. ఇక మొత్తం మీడియా ప్రచార వ్యయంలో డిజిటల్ ప్రచార వ్యయం వాటా ఇంగ్లాండ్‌లో అధికంగా ఉంది. ఈ విషయంలో 48 శాతం మార్కెట్ వాటాతో ఇంగ్లాండ్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో డెన్మార్క్(40 శాతం), ఆస్ట్రేలియా(38%), అమెరికా(28 శాతం) ఉన్నాయి. -
పెయిడ్ ఆర్టికల్స్‌పై నిఘా పెట్టాలి
ఎన్నికల కమిషన్ కమ్యూనికేషన్ డివిజన్ అధికారి వీరేంద్ర కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ప్రతికల్లో ప్రచురితమయ్యే, టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే అడ్వర్టైజ్మెంట్లు, పెయిడ్ ఆర్టికల్స్‌పై నిఘా పెట్టాలని ఎన్నికల కమిషన్ కమ్యూనికేషన్ డివిజన్ అధికారి వీరేంద్ర కోరారు. శుక్రవారం న్యూఢిల్లీ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రతి జిల్లాలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి వివిధ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే పెయిడ్ న్యూస్, ఆర్టికల్స్, అడ్వర్టైజ్మెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి జిల్లా ఎన్నికల అధికారికి నివేదిక సమర్పించాలన్నారు. రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులుగాని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు జారీ చేయాలనుకుంటే ఎం.సీ.ఎం.సీ టీముకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. లోక్‌సభ, శాసనసభ అభ్యర్థులకు నిర్ణయించిన ఎన్నికల వ్యయ పరిమితి లోపలే ప్రకటనలు జారీ చేసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రకటనలు జారీ చేయడానికి ఎం.సీ.ఎం.సీ టీముకు దరఖాస్తు చేసుకున్న ప్రకటన ప్రచురణకుగాని, ప్రసారానికి అనుకూలంగా లుకుంటే తిరస్కరించవచ్చునని సూచించారు. కలెక్టర్ టి.చిరంజీవులు మాట్లాడుతూ జిల్లాలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ డాక్టర్ హరిజవహర్‌లాల్, ఎం.సీ.ఎం.సీ టీమ్ సభ్యులు డీఆర్ఓ వెంకట్రావు, జిల్లా పౌర సంబంధాల అధికారి డి.నాగార్జున, రేడియో ఇంజినీర్ రాజరత్నం పాల్గొన్నారు. -
హాలీవుడ్ అందగాడు దుబారాకు నో చెప్పాడు
సంపాదించడం కన్నా దాన్ని కాపాడుకోవడమే కష్టం. మరి కోట్ల కొద్దీ ఆస్తులున్న సెలబ్రిటీలు, కార్పొరేట్లు.. సరదాల కోసం విచ్చల విడిగా ఖర్చు చేసేస్తుంటారా? పొదుపు మంత్రం పఠిస్తుంటారా? అందరూ విజయ్ మాల్యాల్లా ఉంటారా... లేక అజీమ్ ప్రేమ్‌జీని అనుసరిస్తారా?వారి మనీ మేనేజిమెంట్ ఎలా ఉంటుంది? హాలీవుడ్ స్టార్, టైటానిక్ సినిమా ఫేం.. లియొనార్డో డి కాప్రియో తన మనీని ఎలా మేనేజ్ చేస్తారు? ఆయన ఖర్చులెలా ఉంటాయి? దేన్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటారు? రంగ స్థలం నుంచి సినిమాల్లోకి వచ్చిన డికాప్రియో ఆస్తి ప్రస్తుతం దాదాపు రూ.1200 కోట్లు. ఇక తన మనీ మేనేజ్మెంట్ గురించి ఆయనేమంటారంటే... ‘చిన్నతనంలో అడ్వర్టైజ్మెంట్లు, టీవీ సీరియల్స్ చేశా. కాస్త పెద్దయ్యాక కొన్ని చిన్నా, చితకా సినిమాలు చేసినా, టైటానిక్తోనే నాకు స్టార్డమ్, ఆఫర్లు, సంపద అన్నీ వచ్చాయి. డబ్బొస్తోంది కదాని మనీ మేనేజ్మెంట్ విషయంలో ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదు. చేయను కూడా. నేను భారీ ఖర్చుల జోలికెళ్లను. ప్రైవేట్ జెట్లలో తిరగను. నా దగ్గర ఇప్పటికీ ఒకే ఒక్క కారు(టయోటా ప్రియస్) ఉంది. డబ్బు నాకు చాలా ముఖ్యం. ఎందుకంటే.. డబ్బుంటే నచ్చిన పాత్రల్ని మాత్రమే ఎంచుకునే స్థైర్యం ఉంటుంది. అంతేకాదు... మరింత డబ్బు సంపాదిస్తే.. ఏదో రోజు మరింత మంది ప్రజలకు, పిల్లలకు మరింత మేలు చేసే అవకాశం వస్తుంది. అందుకే నేను పెద్దగా ఖర్చు చేయను. పెట్టుబడుల విషయానికొస్తే... షేర్ మార్కెట్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటాను. రియల్ ఎస్టేట్‌లో బాగానే ఇన్వెస్ట్ చేశా. అలాగే మొబిల్ అనే ఇంటర్నెట్ స్టార్టప్ కంపెనీలోను, హైబ్రిడ్ కార్లు తయారు చేసే ఫిస్కర్ ఆటోమోటివ్ కంపెనీలోనూ ఇన్వెస్ట్ చేశాను. ఆర్థిక భద్రత ఉంది కాబట్టి ధైర్యంగా సినిమాలనూ ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఈ మధ్యే విడుదలైన ‘ది వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్’కు సహనిర్మాతగా ఉన్నా. నా వరకు నేను పర్యావరణానికీ మేలు చేయాలనే ఉద్దేశంతో ఇంటికి సౌర విద్యుత్ అమర్చాను. ఇలాంటి పొదుపు చర్యలు పాటిస్తూనే.. సాధ్యమైనంత వరకూ వన్యప్రాణుల సంరక్షణ వంటి సేవా కార్యక్రమాల కోసం విరాళాలు ఇస్తుంటాను.’