వాట్సాప్‌ ‘స్టేటస్‌’ ప్రకటనలొచ్చేస్తున్నాయ్‌ | WhatsApp confirms Status Ads Coming in 2020  | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ ‘స్టేటస్‌’ ప్రకటనలొచ్చేస్తున్నాయ్‌

Published Sat, May 25 2019 2:27 PM | Last Updated on Sat, May 25 2019 2:49 PM

WhatsApp confirms Status Ads Coming in 2020  - Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో : ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ ప్లాట్‌ఫాం వాట్సాప్‌ స్టేటస్‌లో ప్రకటనలకు అనుమతించేందుకు సర్వం  సిద్ధం చేసింది 2020 నాటికి    స్టేటస్‌ స్టోరీస్‌ యాడ్స్‌ను తీసుకు రానున్నామని ప్రకటించింది. ఈవారంలో నెదర్లాండ్స్‌లో జరిగిన మార్కెటింగ్‌ సదస్సుకు హాజరైన ఆలివర్‌ పొంటోవిల్లే ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.   ఆండ్రాయిడ్‌ 2.18.305 బీటా  వెర్షన్‌లో ప్రస్తుతం ఈ ఫీచర్‌ ప్రయోగదశలో ఉంది.  ఈ యాడ్స్‌ని ఫేస్‌బుక్‌కు చెందిన అడ్వర్టైజింగ్ వ్యవస్థే నడిపించనుంది. 

గత ఏడాది అక్టోబర్‌లోనే వాట్సాప్‌ ప్రకటనలపై వార్తలు మార్కెట్‌ వర్గాల్లో హల్‌ చల్‌ చేశాయి..అయితే వాట్సాప్‌ ఈ వార్తలను తాజాగా  ధృవీకరించింది. స్టేటస్‌లో యాడ్స్ చూపించ బోతున్నాం. వాట్సప్‌ ద్వారా  స్థానిక వ్యాపారాలు ప్రజలకు చేరువయ్యేందుకు ప్రైమరీ మానెటైజేషన్ మోడ్‌లో యాడ్స్ ఉండబోతున్నాయని వాట్సాప్‌ ప్రతినిధి వెల్లడించారు.  వాట్సాప్‌లోని "స్టేటస్" విభాగంలో ప్రకటనలు రాబోతున్నాయని తెలిపింది. ఇకపై వాట్సాప్ స్టేటస్‌లలో అడ్వర్టైజ్‌మెంట్ల ద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జించాలని మోచిస్తోంది. ఈ ప్రకటనలకు ఆదరణ బాగా లభిస్తుందనీ, తద్వారా వ్యాపార సంస్థలకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందని వాట్సాప్‌ భావిస్తోంది. కాగా ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్ల సంఖ్య 1.5 బిలియన్లకు చేరుకుంది.  భారత్‌లో వీరి  సంఖ్య 250 మిలియన్లు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement