న్యూఢిల్లీ: 2017–18 నుంచి ఈ ఏడాది జూలై 12వ తేదీ దాకా.. ఐదేళ్లలో మీడియాలో ప్రకటనల కోసం రూ.3,339.49 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన గురువారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనల కోసం ఈ సొమ్ము వ్యయం చేసినట్లు పేర్కొన్నారు. ప్రింట్ మీడియాలో ప్రకటనలకు, రూ. 1,756.48, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలకు రూ.1,583.01 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment