న్యూఢిల్లీ: ట్విటర్ టేకోవర్ తరువాత ఎలాన్ మస్క్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మైక్రో బ్లాకింగ్ సైట్‌లో ప్రకటనలు నిలిపివేస్తున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఫోక్స్‌వ్యాగన్ ట్విటర్‌లో చెల్లింపు ప్రకటనలను నిలిపివేయగా, తాజాగా మరిన్ని కంపెనీలు ఈ రేస్‌లో దూసు కొస్తున్నాయి. ఆదాయాన్ని పెంచుకునే వ్యూహంలో భాగంగా బ్లూటిక్ ఫీజు, ఖర్చులను తగ్గించుకునే పనిలో సగంమంది ఉద్యోగులను ఇంటికి పంపిన ట్విటర్‌కు తాజా పరిణామాలు భారీ షాకిస్తున్నాయి.
ఇదీ చదవండి: ElonMusk సంచలన ప్రకటన: ఎడ్వర్టైజర్లకు బూస్ట్?
ట్విటర్ టేకోవర్ తరువాత యూజర్ల సంఖ్య భారీగా పెరిగిందని మస్క్ బూస్ట్ ఇస్తున్నప్పటికీ ఓరియోస్, ఆడి కూడా ప్రకటనలను ఆపివేస్తున్నట్టు ప్రకటించాయి. సీఈఓ డిర్క్ వాన్ డి పుట్ మంగళవారం రాయిటర్స్ న్యూస్‌మేకర్ ఇంటర్వ్యూలో ఓరియోస్ తయారీదారు మోండెలెజ్ ట్విటర్‌లో తన ప్రకటనలను ఆపివేసినట్లు తెలిపారు. మస్క్ సొంతమైన తరువాత ట్విటర్‌లో ఇటీవల ద్వేషపూరిత ప్రసంగాల పరిమాణం గణనీయంగా పెరిగిందని పుట్ వ్యాఖ్యానించారు. ఈ ప్రభావం తమ ప్రకటనలపై చూపనుందనీ, ఈ ప్రమాదం తగ్గేంతవరకూ బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. (రూ.2 వేల నోట్లు: షాకింగ్ ఆర్టీఐ రిప్లై)
గత వారం, కంటెంట్ ఫిల్టరింగ్‌పై ఆందోళనల కారణంగా ప్రకటనదారులు ట్విటర్ యాడ్స్‌నుంచి వెనక్కి తగ్గుతున్నారు. ముఖ్యంగా యునైటెడ్ ఎయిర్‌లైన్స్, జనరల్ మిల్స్, లగ్జరీ ఆటోమేకర్ ఆడి ఆఫ్ అమెరికా, జనరల్ మోటార్స్ లాంటి అనేక ముఖ్యమైన కంపెనీలు ప్రకటనలను నిలిపి వేశాయి. గిలియడ్ సైన్సెస్, దాని విభాగం కైట్ కూడా ఇదే ప్రాసెస్‌లో ఉన్నట్ట ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment