Oreo
-
క్యూ కడుతున్న టాప్ కంపెనీలు: అయ్యయ్యో ఎలాన్ మస్క్!
న్యూఢిల్లీ: ట్విటర్ టేకోవర్ తరువాత ఎలాన్ మస్క్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మైక్రో బ్లాకింగ్ సైట్లో ప్రకటనలు నిలిపివేస్తున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఫోక్స్‌వ్యాగన్ ట్విటర్లో చెల్లింపు ప్రకటనలను నిలిపివేయగా, తాజాగా మరిన్ని కంపెనీలు ఈ రేస్‌లో దూసు కొస్తున్నాయి. ఆదాయాన్ని పెంచుకునే వ్యూహంలో భాగంగా బ్లూటిక్ ఫీజు, ఖర్చులను తగ్గించుకునే పనిలో సగంమంది ఉద్యోగులను ఇంటికి పంపిన ట్విటర్‌కు తాజా పరిణామాలు భారీ షాకిస్తున్నాయి. ఇదీ చదవండి: ElonMusk సంచలన ప్రకటన: ఎడ్వర్టైజర్లకు బూస్ట్? ట్విటర్ టేకోవర్ తరువాత యూజర్ల సంఖ్య భారీగా పెరిగిందని మస్క్ బూస్ట్ ఇస్తున్నప్పటికీ ఓరియోస్, ఆడి కూడా ప్రకటనలను ఆపివేస్తున్నట్టు ప్రకటించాయి. సీఈఓ డిర్క్ వాన్ డి పుట్ మంగళవారం రాయిటర్స్ న్యూస్‌మేకర్ ఇంటర్వ్యూలో ఓరియోస్ తయారీదారు మోండెలెజ్ ట్విటర్లో తన ప్రకటనలను ఆపివేసినట్లు తెలిపారు. మస్క్ సొంతమైన తరువాత ట్విటర్లో ఇటీవల ద్వేషపూరిత ప్రసంగాల పరిమాణం గణనీయంగా పెరిగిందని పుట్ వ్యాఖ్యానించారు. ఈ ప్రభావం తమ ప్రకటనలపై చూపనుందనీ, ఈ ప్రమాదం తగ్గేంతవరకూ బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. (రూ.2 వేల నోట్లు: షాకింగ్ ఆర్టీఐ రిప్లై) గత వారం, కంటెంట్ ఫిల్టరింగ్‌పై ఆందోళనల కారణంగా ప్రకటనదారులు ట్విటర్ యాడ్స్నుంచి వెనక్కి తగ్గుతున్నారు. ముఖ్యంగా యునైటెడ్ ఎయిర్‌లైన్స్, జనరల్ మిల్స్, లగ్జరీ ఆటోమేకర్ ఆడి ఆఫ్ అమెరికా, జనరల్ మోటార్స్ లాంటి అనేక ముఖ్యమైన కంపెనీలు ప్రకటనలను నిలిపి వేశాయి. గిలియడ్ సైన్సెస్, దాని విభాగం కైట్ కూడా ఇదే ప్రాసెస్‌లో ఉన్నట్ట ప్రకటించింది. -
విచిత్రమైన వంటకం...అదే ఏం పకోడి రా బాబు!
ఇంతవరకు చెఫ్‌లు చేసే సరికొత్త రకాల పకోడిలను మనం చూశాం. అంతేందుకు బ్రెడ్లతో కూడా రకరకాలగా పకోడిలు వేశారు. కానీ బిస్కెట్స్‌తో ఎప్పుడైన పకోడిలను చూశారా. అవును మీరు వింటుంది నిజమే. ఏంటి బిస్కెట్ పకోడి అని ఆలోచించించేస్తూ కూర్చోకండి. అదేంటో ఎలా చేస్తారో చూసేద్దాం రండి. (చదవండి: ‘ప్రవేశం లేదు’ బోర్డు.. ఎలుగుబంటి ఏం చేసిందో చూడండి!) అసలు విషయంలోకెళ్లితే...అహ్మదాబాద్‌లో ఒక స్ట్రీట్ ఫుడ్‌లో ఈ ఓరియో పకోడిలను తయారు చేస్తున్నారు. ఈ వంటకానిన సెనగపిండితో చేసే బజ్జీల మాదిరిగా ఓరియో బిస్కెట్‌ని సెనగపిండిలో ముంచి ఆయిల్లో బంగారు రంగు వచ్చేంత వరకు వేయించేస్తున్నాడు. పైగా దీన్ని వేయించిన పచ్చిమిర్చితోపాటు ఖర్జురం జట్నీతో సర్వ్ చేస్తున్నాడు. అంతేకాదు ఒక ప్లేట్ ఓరియో పకోడి ధర రూ.20 చొప్పున అమ్ముతున్నాడు. అయితే దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు ఓ లుక్ వేయండి. (చదవండి: దుపట్టా మేరా సాంగ్‌కు దుమ్ములేపేశారు..) -
అమ్మా దొంగా ఇక్కడున్నావా? ఇది చూస్తే మీ స్ట్రెస్ హుష్‌కాకి
బిస్కెట్ల డబ్బా తీసుకుని దాక్కుని తింటూ కూర్చున్న చిన్నారి వీడియో మురిపిస్తోంది. తనను గమనించిన తండ్రి వచ్చి చూడగా ఆ చిన్నారి ముసిముసిగా నవ్వుతూ బిస్కెట్ తింటుండడం నవ్వులు తెప్పిస్తోంది. ఆ చిన్నారి బిస్కెట్ల డబ్బా దొంగతనం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఎక్కడి వీడియో తెలియదు కానీ పాప పేరు మాత్రం డైలీన్. కూతురిని పిలుస్తూ తండ్రి ‘డైలీన్ ఎక్కడ’ అంటూ వీడియో తీసుకుంటూ వెతుకు డైనింగ్ టేబుల్ పక్కన ఉన్న టేబుల్ వద్దకు వచ్చాడు. చదవండి: ‘నా కోడిది హత్య.. న్యాయం చేయండి’ మాజీ ఎమ్మెల్యే తనయుడు ఆ టేబుల్ పక్కన చిన్నారి ఒరియో బిస్కెట్ జాడీతో కనిపించింది. పాపను చూసి ఆ తండ్రికి నవ్వాగలేదు. తండ్రిని చూసిన డైలీన్ చిన్న నవ్వు నవ్వింది. అది అందరినీ ఆకట్టుకుంటోంది. ముసిముసి నవ్వు హృదయాలను పిండేస్తోంది. ‘ఏం చేస్తున్నావ్ డైలీన్? ఏం చేస్తున్నవ్’ అని రెండు మూడుసార్లు అడిగాడు. ఆ పాప నవ్వుతూ బిస్కెట్ నోట్లో పెట్టేసుకుంది. ‘ఇక చాలు. నీకు అన్నేసి బిస్కెట్లు అవసరం లేదు’ అని తండ్రి చెబుతున్నా పాప పట్టించుకోలేదు. ఈ సందర్భంగా తండ్రికి చేయి చాపి ఏదో చెప్పబోయింది. రెండేళ్ల పాప బిస్కెట్ల దొంగతనం వీడియోను అప్వర్తీ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించింది. చదవండి: నీట్ బలిపీఠంపై మరో మరణం: సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి ఈ వీడియో నెటిజన్లను మురిసిపోయేలా చేసింది. చిన్నారి బోసినవ్వు హృదయానికి హాయి కల్పించేలా ఉంది. పాప అందంగా.. ఫన్నీ ఉందని ఒకరు కామెంట్ చేయగా.. ‘పాప నవ్వుకు నేను ఫిదా అయిపోయా’ అంటూ మరొకరు తెలిపాడు. మీరు కూడా ఆ పాప నవ్వు చూసేయండి. ఉన్న స్ట్రెస్సంతా మాయమైపోతుంది. View this post on Instagram A post shared by Upworthy (@upworthy) -
భారత్‌కు గూగుల్ బొనాంజా!
న్యూఢిల్లీ: భారత్ తదితర మార్కెట్లలో ఇంటర్నెట్ వినియోగాన్ని మరింత పెంచే దిశగా టెక్ దిగ్గజం గూగుల్ పలు ఆవిష్కరణలు చేసింది. చౌక స్మార్ట్ఫోన్ల కోసం ఆండ్రాయిడ్ ‘ఓరియో గో’ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. అలాగే ద్విచక్ర వాహనదారులకూ మరింతగా ఉపయోగపడేలా మ్యాప్స్‌కి సంబంధించి బైక్ మోడ్ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది. అటు రిలయన్స్ జియో స్మార్ట్ ఫీచర్ ఫోన్లలో గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ (వర్చువల్ అసిస్టెంట్) కస్టమైజ్డ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. దైనందిన కార్యకలాపాల్లో ఇంటర్నెట్ ఉపయోగంపై మరింతగా అవగాహన కల్పించే దిశగా ప్రత్యేకంగా భారత మార్కెట్‌కి అనువైన ఉత్పత్తులు, ఫీచర్స్‌ని అందుబాటులోకి తెచ్చినట్లు గూగుల్‌లో భాగమైన నెక్ట్స్ బిలియన్ యూజర్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ సీజర్ సేన్‌గుప్తా తెలిపారు. గూగుల్ మ్యాప్స్‌లో బైక్ మోడ్, తేజ్ చెల్లింపుల విధానం మొదలైనవన్నీ పెద్ద సంఖ్యలో భారతీయుల జీవనవిధానాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించినవేనని తెలియజేశారు. ‘ఈ ఉత్పత్తులు, ఫీచర్స్ అన్నీ కూడా ముందుగానే భారత్‌లోనే ప్రవేశపెడుతున్నాం. కాకపోతే, ఇవి ఇక్కడికి మాత్రమే పరిమితం కావు. ఇక్కడి వారికి ఉపయోగపడేంత మెరుగైన ఉత్పత్తులంటే... అవి మిగతా దేశాల్లోని వారికీ అనువైనవనే భావించవచ్చు‘ అని గూగుల్ ఫర్ ఇండియా–2017 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. ఫైల్స్ గో లాంటి యాప్స్ స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చగలవని, డేటా వినియోగం తగ్గించగలవని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది ఓరియో గో హ్యాండ్సెట్స్.. ఆండ్రాయిడ్ ఓరియో (గో) ఓఎస్ ఆధారిత స్మార్ట్ఫోన్లను హ్యాండ్సెట్ తయారీ సంస్థలు వచ్చే ఏడాది తొలినాళ్లలో ప్రవేశపెట్టే అవకాశాలున్నట్లు సేన్‌గుప్తా చెప్పారు. రామ్ సామర్ధ్యం 1జీబీ లేదా అంతకన్నా తక్కువున్న హ్యాండ్‌సెట్స్‌కి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. ఎంట్రీ స్థాయి ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ఫోన్ల కోసం గూగుల్ గతంలో మైక్రోమ్యాక్స్, స్పైస్ వంటి దేశీ హ్యాండ్సెట్ తయారీ సంస్థలతో చేతులు కలిపినప్పటికీ.. ఆ ప్రాజెక్టు పెద్దగా ఫలితాలు సాధించలేదు. మరోవైపు తొలిసారి స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగించే వారిని దృష్టిలో ఉంచుకుని మరింత తేలికపాటి యాప్స్‌ని కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు సేన్‌గుప్తా తెలిపారు. గూగుల్ గో సెర్చి ఇంజిన్, యూట్యూబ్ గో మొదలైనవి ఆ కోవకి చెందినవేనని చెప్పారు. ఇక ఇంగ్లిష్తో పాటు హిందీ భాషలోనూ గూగుల్ అసిస్టెంట్‌ను రిలయన్స్ జియో ఫోన్స్ కోసం రూపొందించినట్లు చెప్పారు. ‘‘ఫీచర్ ఫోన్లో గూగుల్ వర్చువల్ అసిస్టెంట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా 20 నగరాల్లో వాయు కాలుష్య సంబంధ సమాచారాన్ని సైతం త్వరలో మా యాప్స్ ద్వారా అందిస్తాం. ద్విచక్ర వాహనాలకూ ఉపయోగపడే మ్యాప్స్ ఫీచర్ మంగళవారం నుంచి భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. రాబోయే నెలల్లో మిగతా దేశాల్లోనూ ప్రవేశపెడతాం. రైల్‌టెల్ భాగస్వామ్యంతో ప్రస్తుతం రైల్వేస్టేషన్లలో అందిస్తున్న వైఫై సదుపాయాన్ని వచ్చే ఏడాది 400 స్టేషన్లకి విస్తరిస్తాం’’ అని వివరించారు. వివిధ నగరాల్లో వైఫై హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేసే ప్రాజెక్టుపై పనిచేస్తున్నామని, త్వరలో దీన్ని ఇండొనేషియా తదితర మార్కెట్లకు కూడా విస్తరిస్తామని సేన్‌గుప్తా చెప్పారు. నెలకు 11 జీబీ డేటా వినియోగం.. వచ్చే నాలుగేళ్లలో భారత్‌లో డేటా వినియోగం దాదాపు మూడు రెట్లు ఎగిసి నెలకు సగటున 11 జీబీ స్థాయికి పెరగవచ్చని గూగుల్ ఇండియా విభాగం హెడ్ రాజన్ ఆనందన్ చెప్పారు. మరిన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సాథీ... మహిళల్లో డిజిటల్ అక్షరాస్యత పెంచే క్రమంలో టాటా ట్రస్ట్స్ భాగస్వామ్యంతో ప్రవేశపెట్టిన ఇంటర్నెట్ సాథీ ప్రాజెక్టును మరింతగా విస్తరించనున్నట్లు గూగుల్ మార్కెటింగ్ విభాగం హెడ్ (ఆగ్నేయాసియా, ఇండియా) సప్నా చడ్ఢా తెలిపారు. 2015 జూలైలో ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద ఇప్పటిదాకా 30,000 మంది పైచిలుకు మహిళలకు శిక్షణనిచ్చినట్లు వివరించారు. ఇప్పటిదాకా 1.1 లక్షల గ్రామాల్లో అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మరికొన్నేళ్లలో 3 లక్షల గ్రామాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. -
మీ ఫోన్‌కు ఓరియో అప్డేట్ వస్తుందా.. లేదా..?
సాక్షి, హైదరాబాద్: గూగుల్ తన నూతన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఓ 8.0 ను ఇటీవల విడుదల చేసింది. అందరూ ఊహించినట్టుగా ఈ కొత్త ఓఎస్‌కు ఓరియో (Oreo) అని నామకరణం చేసింది. ఈసందర్భంగా ఆండ్రాయిడ్ ఓరియో సరికొత్త అనుభవాన్ని వినియోగారులకు ఇస్తుందని, ఫోటోలు, స్మార్ట్ టెక్స్ సెలక్షన్, మనకు ఇష్టం వచ్చినట్లు మార్చుకోనే విధంగా నోటిఫికేషన్ సెంటర్ వంటి వాటిని పొందుపరిచినట్లు గూగుల్ ప్రకటించింది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ ఓ 8.0 ముందుగా నెక్సస్, పిక్సెల్ డివైస్‌లలో అందుబాటులో ఉండనుంది. అనంతరం ఇతర ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ప్రముఖ మొబైల్ కంపెనీలైన షావోమి, హువాయ్, హెచ్‌టీసీ, క్యోసెరా, మోటరోలా, నోకియా, శాంసంగ్, షార్ప్, సోనీలకు ఆండ్రాయిడ్ ఒరియో అప్‌గ్రేడ్ ఉంటుందని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ (ఇంజనీరింగ్) డేవ్ బుర్కే లాంచింగ్ సందర్భంగా ప్రకటించారు. ఆండ్రాయిడ్ ఓ అప్డేట్ ఇవ్వబడే ఫోన్లు గూగుల్: గూగుల్ పిక్సెల్, గూగుల్ పిక్సెల్ 2, గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్, నెక్సస్ 5ఎక్స్, నెక్సస్ 6పీ డివైస్లలకు ఓటీఏ (ఓవర్ ది ఎయిర్) రూపంలో అందుబాటులో ఉంటుందని గూగుల్ వెల్లడించింది. శాంసంగ్: ►శాంసంగ్ గెలాక్సీ ఏ3, ►శాంసంగ్ గెలాక్సీ ఏ5, ►శాంసంగ్ గెలాక్సీ ఏ7, ►శాంసంగ్ గెలాక్సీ ఏ8, ►శాంసంగ్ గెలాక్సీ ఏ9, ►శాంసంగ్ గెలాక్సీ సీ9ప్రొ, ► శాంసంగ్ గెలాక్సీ నోట్ ఎఫ్ఈ, ► శాంసంగ్ గెలాక్సీ జే7వీ, ► శాంసంగ్ గెలాక్సీ జే7 మ్యాక్స్(2017), ►శాంసంగ్ గెలాక్సీ జే7ప్రో(2017), ►శాంసంగ్ గెలాక్సీ జే7 ప్రైమ్, ►గెలాక్సీ ఎస్7, ►శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, ►శాంసంగ్ గెలాక్సీ ఎస్8, ►శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ప్లస్, ►శాంసంగ్ గెలాక్సీ నోట్8 షావోమి: ►షావోమి రెడ్మీ నోట్ 3, ►షావోమి రెడ్మీ నోట్4 , ►షావోమి రెడ్ మీ 4ఏ, ►షావోమి ఎమ్ఐ 5, ►షావోమి ఎమ్ఐ 5ఎస్, ►షావోమి 5ఎస్ ప్లస్, ►షావోమి రెడ్మీ 3ఎస్, ►షావోమి రెడ్మీ 3ఎస్ ప్రైమ్, ►షావోమి రెడ్మీ 4ఎక్స్, ►షావోమి నోట్4ఎక్స్, ►షావోమి రెడ్మీ 4, ►షావోమి ఎమ్ఐ మ్యాక్స్, ►షావోమి ఎమ్ఐ 5సీ సోని: ►సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్, ►సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ పెర్ఫామెన్స్, ►సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ కంపాక్ట్, ►సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ జెడ్, ►సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్జెడ్ఎస్, ►సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్జెడ్ ప్రీమియం, ►సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ఏ1, ►సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ఏ1 ఆల్ట్రా, ►సోనీ ఎక్స్‌పీరియా ఎల్1 వన్‌ప్లస్: ►వన్‌ప్లస్3, ►వన్‌ప్లస్ 3టీ, ►వన్‌ప్లస్5, నోకియా: ►నోకియా 8, ►నోకియా6, ►నోకియా5, ►నోకియా3 మోటొరోలా: ►మోటో జెడ్, ►మోటో జెడ్ డ్రాయిడ్, ►మోటో జెడ్ ప్లే, ►మోటో జెడ్ ప్లే డ్రాయిడ్, ►మోటో జెడ్2 ప్లే, ►మోటో జెడ్ 2 ఫోర్స్, ►మోటో జీ4, ►మోటో జీ4 ప్లస్, ►మోటో జీ5, ►మోటో జీ5ఫ్లస్‌లకు త్వరలోనే ఓరియో అప్డేట్ రానుంది.