విచిత్రమైన వంటకం...అదే ఏం పకోడి రా బాబు! | A Video Of A Man Making Oreo Pakodas In Ahmedabad Has Gone Viral | Sakshi
Sakshi News home page

Oreo Pakodas: విచిత్రమైన వంటకం...అదే ఏం పకోడి రా బాబు!

Published Sun, Nov 7 2021 5:45 PM | Last Updated on Sun, Nov 7 2021 6:24 PM

A Video Of A Man Making Oreo Pakodas In Ahmedabad Has Gone Viral  - Sakshi

ఇంతవరకు చెఫ్‌లు చేసే సరికొత్త రకాల పకోడిలను మనం చూశాం. అంతేందుకు బ్రెడ్‌లతో కూడా రకరకాలగా పకోడిలు వేశారు. కానీ బిస్కెట్స్‌తో ఎప్పుడైన పకోడిలను చూశారా. అవును మీరు వింటుంది నిజమే. ఏంటి బిస్కెట్‌ పకోడి అని ఆలోచించించేస్తూ కూర్చోకండి. అదేంటో ఎలా చేస్తారో చూసేద్దాం రండి.

(చదవండి: ‘ప్రవేశం లేదు’ బోర్డు.. ఎలుగుబంటి ఏం చేసిందో చూడండి!)

అసలు విషయంలోకెళ్లితే...అహ్మదాబాద్‌లో ఒక స్ట్రీట్‌ ఫుడ్‌లో ఈ ఓరియో పకోడిలను తయారు చేస్తున్నారు. ఈ వంటకానిన సెనగపిండితో చేసే బజ్జీల మాదిరిగా ఓరియో బిస్కెట్‌ని సెనగపిండిలో ముంచి ఆయిల్‌లో బంగారు రంగు వచ్చేంత వరకు వేయించేస్తున్నాడు. పైగా దీన్ని వేయించిన పచ్చిమిర్చితోపాటు ఖర్జురం జట్నీతో సర్వ్‌ చేస్తున్నాడు.

అంతేకాదు ఒక ప్లేట్‌ ఓరియో పకోడి  ధర రూ.20  చొప్పున అమ్ముతున్నాడు. అయితే దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్‌, లైక్‌లు వచ్చాయి. మీరు ఓ లుక్‌ వేయండి.

(చదవండి: దుపట్టా మేరా సాంగ్‌కు దుమ్ములేపేశారు..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement