కొంతమంది వ్యక్తుల కదులుతున్న కారుపైకి ఎక్కి కూర్చొని బహిరంగంగా టపాసులు కాలుస్తున్నారు. అదికూడా రద్దీగా ఉండే నడిరోడ్డుపై ఈ ప్రమాదకరమైన స్టంట్‌కి పాల్పడ్డారు సదరు వ్యక్తులు. ఈ ఘటన అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. దీపావళి తరువాత రోజు రాత్రే జరిగింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో అహ‍్మదాబాద్ పోలీసులు సీరియస్ అవ్వడమే గాక సదరు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
అంతేగాదు ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్‌లతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా ట్రాఫిక్ భద్రత నియమాలను ఉల్లంఘించినిందుకు గాను వారిని బహిరంగంగా శిక్షించారు. ఈ మేరకు సదరు వ్యక్తుల చేత రోడ్డుపై బహిరంగా గుంజీలు తీయిస్తూ నడిపించారు. ఇలా మరోకరు చేయకూడదనే ఉద్దేశ్యంతో అందుకు సంబంధించన వీడియోతోపాటు సదరు వ్యక్తుల ఫోటోలను కూడా ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీంతో నెటిజన్లు అహ్మదాబాద్ పోలీసుల అభినందించడమే గాక త్వరితగతిన చర్యలు తీసుకున్నారంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.
(చదవండి: కళ్లు చెదిరే ఆవిష్కరణ: కన్నే ఫ్లాష్ లైట్‌లా వెలుగుతుంది...)
Comments
Please login to add a commentAdd a comment