Roof Top
-
వైరల్ వీడియో: తోపుల్లా కదులుతున్న కారుపైకి ఎక్కి టపాసుల కాల్పులు
-
తోపుల్లా కదులుతున్న కారుపైకి ఎక్కి టపాసుల కాల్పులు...సీన్ కట్ చేస్తే...
కొంతమంది వ్యక్తుల కదులుతున్న కారుపైకి ఎక్కి కూర్చొని బహిరంగంగా టపాసులు కాలుస్తున్నారు. అదికూడా రద్దీగా ఉండే నడిరోడ్డుపై ఈ ప్రమాదకరమైన స్టంట్‌కి పాల్పడ్డారు సదరు వ్యక్తులు. ఈ ఘటన అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. దీపావళి తరువాత రోజు రాత్రే జరిగింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో అహ్మదాబాద్ పోలీసులు సీరియస్ అవ్వడమే గాక సదరు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అంతేగాదు ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్లతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా ట్రాఫిక్ భద్రత నియమాలను ఉల్లంఘించినిందుకు గాను వారిని బహిరంగంగా శిక్షించారు. ఈ మేరకు సదరు వ్యక్తుల చేత రోడ్డుపై బహిరంగా గుంజీలు తీయిస్తూ నడిపించారు. ఇలా మరోకరు చేయకూడదనే ఉద్దేశ్యంతో అందుకు సంబంధించన వీడియోతోపాటు సదరు వ్యక్తుల ఫోటోలను కూడా ట్విట్టర్లో షేర్ చేశారు. దీంతో నెటిజన్లు అహ్మదాబాద్ పోలీసుల అభినందించడమే గాక త్వరితగతిన చర్యలు తీసుకున్నారంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. (చదవండి: కళ్లు చెదిరే ఆవిష్కరణ: కన్నే ఫ్లాష్ లైట్లా వెలుగుతుంది...) -
రైలు పైకి ఎక్కేందుకు శతవిధాల యత్నం...పోలీస్ ఎంట్రీతో..: వీడియో వైరల్
ఒక మహిళ రైలు పైకి ఎక్కి కూర్చునేందుకు తెగ ప్రయత్నిస్తోంది. ఇంతలో రైల్వే పోలీస్ రాగానే పాపం ఇక చేసేదేమిలేక ప్రయత్నం విరమించుకుని వెళ్లిపోయింది. ఈ ఘటన బంగ్లాదేశ్ రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. ఆ రైల్వేస్టేష్న్లో ఒక ఇంటర్ ఎక్స్రెస్ రైలు ఆగి ఉంది. ఆ రైలు ప్రయాణికులతో చాలా రద్దీగా ఉంది. మొత్తం బోగీలన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. దీంతో కొంతమంది రైలు పైకి ఎక్కి కూర్చున్నారు. పాపం మరీ ఆ మహిళకు రైలులో సీటు దొరకలేదు కాబోలు, ఎలాగైనా వెళ్లాలనుకుని ఆమె కూడా రైలు ఎక్కేందుకు యత్నించింది. ఈ మేరకు సదరు మహిళ రైలు విండో పై నుంచి ఎక్కేందుకు శతవిధాల ప్రయత్నం చేసింది. రైలు పైన ఉన్న కొందరు ఆమెకు సాయం చేశారు కూడా. కానీ ఆమె రైలు పైకి ఎక్కలేకపోతోంది. ఇంతలో రైల్వే పోలీస్ లాఠీతో రావడంతో ఒక్కసారిగా ఆమె దిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు అధిక జనాభా ప్రభావం వల్ల ఇలా జరిగిందని ఒకరు, ఐనా అలాఎలా రైలు పైకి ఎక్కేందుకు అనుమతించారు, చాలా ప్రమాదం, నేరం అని మరోకరు కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. View this post on Instagram A post shared by Vidyadhar Jena (@fresh_outta_stockz) (చదవండి: ఉన్నట్టుండి చేతిపంపు నుంచి మంటలు, ఆ వెంటనే నీరు.. ఆందోళనలో స్థానికులు!) -
కూతురు హోం వర్క్ చేయలేదని కాళ్లుచేతులు కట్టేసి.. ఎర్రటి ఎండలో విలవిలలాడిన బిడ్డ
-
ఎండలో విలవిలలాడిన బిడ్డ.. తల్లి పనే!!
కాళ్లు చేతులు కట్టేసి.. ఎర్రటి ఎండలో చిన్నారిని పడుకోబెట్టారు. భరించలేక ఆ బిడ్డ విలవిలలాడిపోయింది. చివరికి బాధతో రోదించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఈమధ్య ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అయ్యింది. అయితే ఈ వీడియో ఎక్కడ? ఎందుకు? జరిగిందనే విషయాన్ని ఎట్టకేలకు పోలీసులు చేధించారు. ఢిల్లీ ఖాజూరీ ఖాస్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కూతురు హోం వర్క్ చేయకపోవడంతోనే అలాంటి శిక్ష విధించానని ఆ చిన్నారి కన్నతల్లి చెబుతోంది. అయితే ఐదు పదినిమిషాలు మాత్రమే అలా ఉంచి.. తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చానని ఆమె ఘటనపై వివరణ ఇచ్చింది. జూన్ 2వ తేదీన ఈ ఘటనకు సంబంధించిన వీడియో కరావాల్ నగర్ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది. ఈ ఘటనను పోలీసులు తీవ్రంగానే పరిగణించారు. ఆపై స్థానికంగా ఆ ఘటన ఎక్కడా జరగలేదని పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు. ట్విటర్లో పోస్ట్ చేసిన ఓ వ్యక్తి.. ఘటన సమయంలో పక్కనే ఉన్న బిల్డింగ్‌లో నుంచి వీడియో తీసినట్లు తేలింది. అతని ద్వారా మొత్తానికి ఇప్పుడు ఈ వీడియోను చేధించారు. After a video of a girl child tied up on the roof of a house surfaced on social media, all possible efforts were made by Delhi Police to ascertain her identity and circumstances. The family of the child has been identified and appropriate action initiated.#DelhiPoliceCares — Delhi Police (@DelhiPolice) June 8, 2022 ఇక ఈ ఘటనపై సోషల్ మీడియాలో పలువురు మండిపడుతున్నారు. ఆ తల్లికి కూడా అలాంటి శిక్షే విధించాలని కొందరు.. కఠినంగా శిక్షించాలని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీ పోలీసులు ఈ ఘటనలో అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. -
తాగేసి కారు పైకి ఎక్కి హంగామా... ఊహించని ట్విస్ట్!
Ghaziabad Traffic Police has fined a car owner: ఇటీవలకాలంలో సోషల్ మాధ్యమాల్లో స్టార్డమ్ కోసమో లేక ప్రత్యేక ఆకర్షణగా ఉండేందుకో కొన్ని విచిత్రమైన ఫీట్లు చేస్తుంటారు. అవి ఒకోసారి ప్రాణాంతకంగా మారడమో లేక పోలీసులు ఆగ్రహానికి గురై కటకటాల పాలవడమో జరుగుతుంటుంది. అచ్చం అలాంటి సంఘటనే ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఘజియాబాద్‌లోని రద్దీగా ఉండే ఢిల్లీ మీరట్ ఎక్క్‌ప్రెస్ హైవేలో ఇద్దరు యువకులు మద్యం సేవించి కారు పై డ్యాన్స్ చేశారు. అయితే ఆ కారుని ఒక వ్యక్తి నడుపుతుండగా ..మరో వ్యక్తి ప్యాసింజర్ సీట్లో కూర్చున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. దీంతో మోహిత్ గుర్జార్ అనే ఒక సోషల్ మీడియా వినియోగ దారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అంతేకాదు ఆ వాహనాన్ని మారుతి సుజికి ఎర్టిగా గుర్తించారు. వీడియోలో కనిపిస్తున్న నెంబర్ ప్లేట్ ఆధారంగా ఆ వాహన యజమాని పై ట్రాఫిక్ పోలీసులు సుమారు రూ. 20 వేలు జరిమానా విధించారు. ఈ ఘటన ఘజియాబాద్‌లో బులంద్‌షహర్ రోడ్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో రాత్రి 8 గం.ల సమయంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినందుకుగానూ అతని వాహన రిజిస్ట్రేషన్‌ని రద్దు చేశారు. ఈ మేరకు ఆ ఘటనకు సంబంధించిన వీడియోతోపాటు, ఫైన్ వేసిన ఈ చలానా కాపీని కూడా ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. Meanwhile in Ghaziabad, a group of boys, visibly drunk, dancing on the roof of their car on the Delhi-Meerut expressway. Hope @ghaziabadpolice makes them dance to their tunes in the lockup sooner. pic.twitter.com/mJck8JQ4Kh — Prashant Kumar (@scribe_prashant) April 2, 2022 (చదవండి: కోతుల బెడద.. ఆ కటౌట్ చూసి పరిగెత్తాలి డ్యూడ్) -
పిలవడానికి వస్తే ప్రాణం పోయింది
తుమకూరు: ఇంటి పైకప్పు కూలడంతో ఓ మహిళ మృతి చెందిన ఘటన తుమకూరు జిల్లా శిరా తాలూకా గౌడగెరె సమీపంలో ఉన్న యరువరహళ్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రత్నమ్మ (55) తన ఇంటి పక్కనే ఉన్న లక్ష్మమ్మ ఇంటికి వచ్చింది. పనికి రావాలని చెబుతుండగా ఒక్కసారిగా పైకప్పు కూలిపోయి రత్నమ్మపై పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇదే సమయంలో ఇంటిలో ఉన్న లక్ష్మమ్మ, వెంకటేశ్‌లు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. శిరా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: మైసూరులో పట్టపగలే నగల దుకాణంలో దోపిడీ -
‘ఈ ఫోటోలకు అరెస్ట్ కాదు.. అవార్డు ఇవ్వాలి’
టెహ్రాన్: అభ్యంతకర ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారన్న ఆరోపణలతో ఇద్దరు పార్కుర్ అథ్లెట్లను ఇరాన్లో అరెస్టు చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. వాళ్లు చేసిన నేరమేంటి? అని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. అలిరెజా అద్భుతమైన ఫొటోలకు అవార్డు ఇవ్వాలి కానీ అరెస్ట్ చేయకూడదు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎత్తైన భవనంపై తన స్టంట్ భాగస్వామిని ముద్దు పెట్టుకున్న ఫొటోలను ప్రముఖ పార్కుర్ అథ్లెట్ అలిరెజా జపాలాఘీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వివాదం రేగింది. వీరిద్దరినీ టెహ్రాన్ సైబర్ పోలీసులు అరెస్ట్ బీబీసీ వెల్లడించింది. షరియా చట్టం నిబంధనలు ఉల్లఘించి బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో వీరిని అరెస్ట్ చేసినట్టు టెహ్రాన్ పోలీసు చీఫ్ హుస్సేన్ రహీమి ధ్రువీకరించారు. అయితే అలిరెజా జపాలాఘీ గతంలో ఇలాంటి ఫోటోలను బహిర్గతం చేసినా ఇప్పుడే అరెస్ట్ చేయడంపై నెటిజనులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రి అదృశ్యం గురించి ప్రశ్నించినందుకే అతడిని అరెస్ట్ చేశారని అంటున్నారు. మాదక ద్రవ్యాల నిరోధక విభాగంలో పోలీసు అధికారి అయిన తన తండ్రి అదృశ్యం వెనుకున్న మిస్టరీని ఛేదించడంలో పోలీసులు విఫమలయ్యారని అలిరెజా ఆరోపించిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు నెటిజనులు గుర్తుచేశారు. (ముద్దు పెట్టుకున్నారు.. అరెస్టు చేశారు) అసలేంటి ఈ ఆట? పార్కుర్ను ఫ్రీరన్నింగ్ అని కూడా పిలుస్తారు. ఫ్రాన్స్‌లో పుట్టిన ఈ క్రీడ సైనికులకు ఇచ్చే శిక్షణ నుంచి ఆవిర్భవించింది. పరుగెడుతూ, దూకుతూ, పిల్లిమొగ్గలు వేస్తూ, వివిధ రకాల విన్యాసాలతో అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగిపోవడమే ఈ ఆటలోని ప్రాధానాంశం. ఆటలో భాగంగా ట్రేసర్లు లేదా ట్రేసర్స్ అని పిలువబడే ప్రాక్టీషనర్లు, సహాయక పరికరాలు లేకుండా సాధ్యమైనంత వేగంగా, సమర్థవంతమైన మార్గంలో సంక్లిష్ట వాతావరణంలో ఒక పాయింట్ నుండి మరొకదానికి చేరుకుంటారు. -
ముద్దు పెట్టుకున్నారు.. అరెస్టు చేశారు
ఎత్తైన భవనంపై బహిరంగంగా ముద్దు పెట్టుకున్న ఓ పార్కుర్ అథ్లెట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. గత వారం ఇరాన్‌కు చెందిన పార్కుర్ అథ్లెట్ అలిరేజా జపాలాఘీ, తన స్టంట్ భాగస్వామిని ఇంటి పైన ముద్దు పెట్టుకున్నారు. ఈ ఫోటోలను తన ఫేస్బుక్లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఇరాన్ సంప్రదాయాలు, ఆచారాలకు విరుద్ధంగా వ్యవహరించిన అతడిని టెహ్రాన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. (ఆ ఆరోపణలు అర్థం లేనివి : చైనా ) గత వారం తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వచ్చాయని, స్వతహాగా లొంగకపోతే పబ్లిక్‌గా అరెస్టు చేస్తామని బెదిరించినట్లు జపాలాఘీ ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడుతూ తెలిపారు. కాగా జపాలాఘీని పోలీసులు అరెస్టు చేసినప్పటికీ ఫోటోలో మహిళ ముఖం సరిగా తెలియకపోవడంతో ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే వీరి నిర్బంధాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పార్కుర్ అథ్లెట్‌కు మద్దతుగా పలువురు అక్రోబాటిక్ విన్యాసాలను ప్రదర్శిస్తున్నారు. (తొందరెందుకు.. కాస్త ఆగి చూడండి: మిస్బా ) Iranian parkour Alireza Japalaghy posted this picture. He was arrested today. Security agents hunting down the woman. pic.twitter.com/rrNznf7Tv9 — Farnaz Fassihi (@farnazfassihi) May 18, 2020 ఇస్లామిక్ వస్త్రధారణ నియమాల ప్రకారం ఇంటి నుంచి బయటకు వచ్చిన మహిళలు తమ ముఖం, చేతులు, కాళ్లను మాత్రమే కనబడేలా దుస్తులు వేసుకోవాలి. అలాగే ఎలాంటి ఆర్భాటాలు లేని రంగులను మాత్రమే ధరించాలి. అయితే ఇలాంటి మంచి పని చేసిన వారికి బహుమతి ఇవ్వాలి కానీ అరెస్టు చేయకూడదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎలాంటి సహాయం లేకుండా వేగంగా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి జంప్ చేసేవారిని పార్కుర్ అథ్లెట్ అంటారు. పార్కుర్లో రన్నింగ్, క్లైంబింగ్, స్వింగింగ్, జంపింగ్ రోలింగ్ వంటివి ఉంటాయి. (రెడ్ అలర్ట్: ఆ సమయంలో బయటకు రావొద్దు ) -
రూఫ్‌టాప్ అదరాలి
సాక్షి, హైదరాబాద్: దేశంలో 2020 నాటికి 40 గిగావాట్ల రూఫ్‌టాప్ సౌరవిద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి 9.4 గిగావాట్ గంటల విద్యుత్ నిల్వ వ్యవస్థను అభివృద్ధిపరుచుకోవాలని నీతి ఆయోగ్ స్ప ష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రం 2 వేల మెగావాట్ల రూఫ్‌టాప్ సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కోసం 370 మెగావాట్ల విద్యుత్ నిల్వ వ్యవస్థను 2020లోగా అభివృద్ధి చేసుకోవాలని సూచించింది. దేశంలో విద్యుత్ నిల్వ వ్యవస్థ అభివృద్ధికి దిశానిర్దేశం చేసేందుకు ‘ఎనర్జీ స్టోరేజీ సిస్టం–రోడ్‌మ్యాప్ ఫర్ ఇండియా 2019–32’ పేరుతో నీతి ఆయోగ్ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. పర్యావరణ మార్పుల సవాళ్లను అధిగమించడంలో భాగంగా కర్బన ఉద్గారాలను నియంత్రించేందుకు పునరు త్పాదక విద్యుదుత్పత్తిని కేంద్రం ప్రోత్సహిస్తోంది. పునరుత్పాదక విద్యుత్ ను నిల్వ చేసుకొని అవసరమైనట్లుగా వినియోగించుకునే పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే బొగ్గు, గ్యాస్, పెట్రోలియం వంటి కాలుష్యకారక శిలాజ ఇంధనాలను మండించి విద్యుదుత్పత్తి చేసే అవసరం తగ్గనుంది. ఈ మేరకు పునరుత్పాదక విద్యుత్ నిల్వ సదుపాయాన్ని దేశం అందుకోవాలనే లక్ష్యంతో నీతి ఆయోగ్ ఈ నివేదికను రూపొందించింది. నివేదిక ప్రకారం జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో సాధించాల్సిన పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, నిల్వ సామర్థ్యాలు ఇలా.. ►2020: దేశం 40 గిగావాట్లు, రాష్ట్రం 2,000 మెగావాట్ల రూఫ్‌టాప్ సౌరవిద్యు త్ ఉత్పత్తిని సాధించాలి. ప్రస్తుతం తెలంగాణ 68 మెగావాట్లు, దేశం 1,350 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ►2022: దేశం 175 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అందిపుచ్చుకోవాలి. ఆలోగా తెలంగాణ 5,490 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి, 2,000 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి. తెలంగాణ ఇప్పటికే 3979.18 మెగావాట్ల సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంది. ►2027: దేశం 100 గిగావాట్ల రూఫ్‌టాప్ సౌరవిద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి 23.01 గిగావాట్ గంటల విద్యుత్ నిల్వ వ్యవస్థను అభివృద్ధిపరుచుకోవాలి. అందులో తెలంగాణ లక్ష్యాలు 6,800 మెగావాట్ల రూఫ్‌టాప్ సౌర విద్యుతుత్పత్తితోపాటు 1,258 మెగావాట్ల విద్యుత్ నిల్వ సామర్థ్యం ఉండాలి. ►2032: దేశం 150 గిగావాట్ల రూఫ్టా ప్ సౌరవిద్యుత్ ఉత్పత్తి లక్ష్యం చేరుకోవడానికి 32.675 గిగావాట్ గంటల విద్యు త్ నిల్వ వ్యవస్థను కలిగి ఉండాలి. తెలంగాణ 8,000 మెగావాట్ల రూఫ్‌టాప్ సౌరవిద్యుత్, 1,480 మెగావాట్ల విద్యుత్ నిల్వ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలి. గృహాలకు 100 శాతం రూఫ్‌టాప్.. రూఫ్‌టాప్ సౌర విద్యుత్ ఉత్పత్తి అనుమతుల జారీకి సంబంధించి అనుసరించా ల్సిన పరిమితులను నీతి ఆయోగ్ రాష్ట్రాలకు వేర్వేరుగా నిర్దేశించింది. తెలంగాణ లో గృహాలు, ప్రభుత్వ వినియోగదారుల కు అనుమతించిన లోడ్ (కాంట్రాక్టు లో డ్)లో 100 శాతం వరకు, పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులకు వారి కాం ట్రాక్టు లోడ్‌లో 80 శాతం వరకు, లోటెన్ష న్ (ఎల్టీ) వినియోగదారులకు సంబంధిత డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం లో 50 శాతం, హైటెన్షన్ (హెచ్‌టీ) వినియోగదారులకు సంబంధిత ఫీడర్ లోడ్ సామర్థ్యంలో 50 వరకు వ్యక్తిగత రూఫ్‌టాప్ సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడానికి అనుమతించాలని రాష్ట్రాన్ని కోరింది. -
కరెంటు బిల్లుపై సోలార్ అస్త్రం!
కరెంటు బిల్లు వందల్లో ఉండటం ఒకప్పటి మాట. ఎండలు పెరిగి... ఇంట్లో రెండు మూడు ఏసీల వాడకం మొదలయ్యాక కనీస బిల్లు నెలకు ఏడెనిమిది వేలకు తగ్గటం లేదు. ఒక ఏసీ ఉన్నవారికి సైతం మూడు నాలుగువేల రూపాయలకన్నా తగ్గటం లేదు. మరి ఇలాంటి వాళ్లు బిల్లు తగ్గించుకోవటం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానంగానే వస్తున్నాయిపుడు రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లు. ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మీ ఇంటి విద్యుత్ అవసరాలను స్వయంగా తీర్చుకోవటమే కాదు!! మిగిలితే గ్రిడ్‌కు సరఫరా చేసి... పర్యావరణ అనుకూల ఇంధన సరఫరాలో మనమూ భాగం కావచ్చు. దీర్ఘకాలంలో కాస్త డబ్బులు ఆదా చేయాలనుకున్న వారికి... తరచూ విద్యుత్ కోతలను అనుభవించేవారికి రూఫ్‌టాప్ సోలార్ మంచి ఆప్షనే. విద్యుత్ ఉత్పత్తి అయిన చోటే వినియోగం కూడా ఉంటుంది కనక సరఫరా నష్టాలూ ఉండవు. మొత్తం మీద సోలార్ రూఫ్‌టాప్ విద్యుత్ ప్లాంట్ గృహ వినియోగదారులకు మంచి ఎంపికే. కాకపోతే దీన్ని ఎంచుకునే ముందు దీన్లో ఉన్న ఇతర అంశాలనూ తెలుసుకోవాలి. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ ప్లాంట్లకు సంబంధించి ప్రస్తుతం మూడు విధానాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది... ఓనర్షిప్ మోడల్. ఈ విధానంలో ఇంటి యజమాని స్వయంగా తన ఖర్చులతో ఎక్విప్మెంట్ను కొనుగోలు చేసి ప్లాంటు ఏర్పాటు చేసుకోవడంతో పాటు, దీనిద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను తనే వినియోగించుకుంటారు. ఇలా చేయటం వల్ల కిలోవాట్ సామర్థ్యానికి 18వేల రూపాయలు సబ్సిడీగా లభిస్తాయి. కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల విభాగం ఈ సబ్సిడీని ఆఫర్ చేస్తోంది. అలాగే, తమిళనాడు తదితర రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా కూడా సబ్సిడీ పథకాలు నిర్వహిస్తున్నాయి. రెండో విధానంలో... ఇంటి యజమాని తన పైకప్పు స్థలాన్ని ప్రభుత్వం లేదా ప్రైవేటు కంపెనీకి లీజుకు ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో వారు సోలార్ విద్యుదుత్పత్తి ఎక్విప్మెంట్ను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల వారికి కొంత ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. ఉదాహరణకు కేరళలో అయితే ఈ విధానంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో 10 శాతాన్ని ఉచితంగా యజమానికి ఇస్తున్నారు. మిగిలిన విద్యుత్‌ను కావాలనుకుంటే ఆ యజమానే ఫిక్స్డ్ రేటుకు కొనుగోలు చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. మూడో విధానం కమ్యూనిటీ యాజమాన్యం కిందకు వస్తుంది. అంటే ఓ సొసైటీ లేదా కాలనీ వాసులు కలసి సామూహికంగా తమ ప్రాంతంలో ఇళ్లపై ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుని... ఉమ్మడిగా విద్యుత్తును వినియోగించుకోవడం. మరి ఖర్చెంతవుతుంది? ఈ ప్యానెళ్లు, ప్లాంట్లకు అయ్యే ఖర్చు ఎంతనేది సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది. మీకు ఎంత స్థలం అందుబాటులో ఉంది? అందులో ఎంత సామర్థ్యానికి సరిపడా ఎక్విప్మెంట్ను ఏర్పాటు చేసుకోవచ్చు? అనే అంశాలే పెట్టుబడిని నిర్ణయిస్తాయి. సాధారణంగా అయితే కిలోవాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కనీసం 220 చదరపు అడుగుల విస్తీర్ణం కావాలి. దీనివల్ల ఒక రోజులో 5 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తవుతుంది. అది కూడా కనీసం ఐదారు గంటల పాటు సూర్యరశ్మి ఉంటేనే!!. ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? సూర్యరశ్మి తీవ్రత కూడా ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. ఇక కాంపోనెంట్, ఇన్స్టలేషన్ చార్జీలనూ పరిగణనలోకి తీసుకోవాలి. మొత్తం సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చులో సగ భాగం ఫొటో వోల్టాయిక్ మాడ్యూల్స్కే అవుతుంది. కాకపోతే గత కొన్ని సంవత్సరాల్లో ఈ ఖర్చు గణనీయంగా తగ్గుతూ వచ్చింది. ఉదాహరణకు ఐదేళ్ల క్రితం కిలోవాట్ విద్యుత్ తయారీ ఎక్విప్మెంట్కు రూ.లక్ష పెట్టుబడి అవసరమయ్యేది. ఇది ప్రస్తుతం రూ.40,000– 60,000కు దిగొచ్చింది. సోలార్ ప్యానెల్స్ జీవిత కాలం 25– 35 సంవత్సరాల వరకూ ఉంటుంది. పెద్దగా మెయింటెనెన్స్ అవసరం ఉండదు. ఇలా ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెల్స్ సాయంతో తయారైన విద్యుత్‌ను గృహ వినియోగానికి అనుకూలంగా మార్చాలంటే ఇన్వర్టర్లు అవసరం. మొత్తం ఖర్చులో పావు వంతుకు వీటికి వెచ్చించాల్సి ఉంటుంది. వైరింగ్, ఇతర పరికరాలు, ఇన్స్టలేషన్ తదితరాలకు మిగిలిన పావు శాతం వ్యయం అవుతుంది. అన్ని రకాల ఐటమ్స్‌తో కూడిన కిట్స్ కూడా లభిస్తాయి. సాధారణంగా కిలోవాట్ సామర్థ్యం నుంచి ఇవి లభిస్తాయి. విద్యుత్ ఉత్పత్తిని పర్యవేక్షించేందుకు మొబైల్ యాప్స్‌తో వచ్చేవీ ఉన్నాయి. అదనపు కాలానికి పొడిగించిన వారంటీ, సర్వీస్ గ్యారంటీ ఆఫర్లూ ఉన్నాయి. ఈ వ్యయాలన్నీ గ్రిడ్ అనుసంధానిత విద్యుత్ తయారీ సిస్టమ్‌లకు సంబంధించినవి. వాడుకోగా మిగిలే అదనపు విద్యుత్‌ను నెట్ మీటరింగ్ ద్వారా విద్యుత్ గ్రిడ్‌కు సరఫరా చేయవచ్చు. బ్యాటరీ బ్యాకప్ కోరుకుంటే, ఇందుకోసం ఆఫ్ గ్రిడ్ సొల్యూషన్స్ అవసరం అవుతాయి. దీంతో వ్యయాలు పెరుగుతాయి. బెంచ్ మార్క్ ధరలను గమనిస్తే.. గ్రిడ్ అనుసంధానిత ప్లాంటుకు ఒక వాట్ సామర్థ్యానికి రూ.60 ఖర్చు అయితే, ఆఫ్ గ్రిడ్ వ్యవస్థకు రూ.100 వరకు అవుతుంది. ఈ అదనపు ఖర్చల్లా 6 గంటల బ్యాటరీ స్టోరేజీకే. పెట్టుబడి ఎన్నాళ్లలో తిరిగి వస్తుందన్నది.. ప్లాంట్ ఎక్విప్మెంట్కు మీ ప్రాంతంలో లభించే సబ్సిడీ, స్థానికంగా ఉండే విద్యుత్ చార్జీలపై ఆధారపడి ఉంటుంది. యూనిట్‌కు రూ.8 చెల్లిస్తున్న వారికి కిలోవాట్ యూనిట్‌పై ఏడాదికి రూ.9,600 ఆదా అవుతుంది. కనీసం ఏడాదిలో 8 నెలలైనా రోజూ 5 వాట్ల యూనిట్ల చొప్పున ఉత్పత్తి జరుగుతుందనే అంచనా ఆధారంగా వేసిన లెక్కలివి. సబ్సిడీపోను కిలోవాట్ యూనిట్‌కు రూ.50,000 వరకు పెట్టు బడి అవుతుంది. అంటే ఐదేళ్లలో పెట్టుబడి తిరిగివస్తుంది. ఆ తర్వాత మరో 20–30 ఏళ్లు నామమాత్రపు నిర్వహణ వ్యయాలతో విద్యుత్‌ను ఉచితంగా పొందొచ్చు. గమనించాల్సిన కీలక అంశాలివే... ► రూఫ్ టాప్ సోలార్ యూనిట్ ఏర్పాటు చేసుకునే ముందు గమనించాల్సిన ముఖ్యమైన అంశాలు చాలానే ఉన్నాయి. కేవలం సూర్యరశ్మి సమృద్ధిగా ఉండే ప్రాంతాల్లోనే ఇది అనుకూలం. తమ ప్రాంతంలో సూర్యరశ్మి తీవ్రతను ఒక్కసారి తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ► బ్యాటరీ సిస్టమ్స్‌లో వచ్చే సమస్యల పట్ల అవగాహన ఉండడం కూడా అవసరమే. వీటికి సంబంధించి క్రమానుగత నిర్వహణ, నిర్ణీత కాలం తర్వాత బ్యాటరీలను మార్చడం వంటి చార్జీలు భరించాల్సి ఉంటుంది. అలాగే, చార్జింగ్ సమయంలో విద్యుత్ నష్టం, డిశ్చార్జ్ అవడం కూడా విద్యుత్ తయారీ వ్యయంపై ప్రభావం చూపుతాయి. ► కేవలం సబ్సిడీనే నమ్ముకుని దిగితే కష్టం. రాష్ట్రాల వారీగా నిబంధనల్లో మార్పులున్నాయి. అలాగే, గ్రిడ్ కనెక్టెడ్ యూనిట్‌కు సంబంధించి నియంత్రణలు, విధి, విధానాలు కూడా తెలుసుకోవాలి. యూనిట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత దాని తనిఖీ, నెట్ మీటర్లను అధికారులు తనిఖీ చేసేందుకు సమయం పడుతుంది. ► నెట్ మీటరింగ్‌కు సంబంధించి ప్రభుత్వ విధానాలు ఇప్పటికీ ఆకర్షణీయంగా లేవు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా నిబంధనలు ఉన్నాయి. కనుక వాటి విషయమై స్పష్టత తీసుకోవాలి. ► ఇన్స్టలేషన్ , సర్వీస్ అంశాలు కూడా ఉన్నాయి. నైపుణ్యం లేని వారు ఇన్స్టాల్ చేసినా, అందులో తేడాలొచ్చినా ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. ఇక దిగుమతి చేసుకున్న ప్యానెల్స్, కాంపోనెంట్స్ దెబ్బతింటే, వాటి స్థానంలో తిరిగి కొత్తవి ఏర్పాటు చేసుకోవాలంటే అవి వెంటనే దొరకటమన్నది ఇప్పటికీ సమస్యగానే ఉంది. ► ఉన్న వాటిల్లో ప్రస్తుతానికి గ్రిడ్ అనుసంధానం కాని, సొంత అవసరాలకు, బ్యాటరీ ఆధారిత యూనిట్ ఏర్పాటు చేసుకోవడం నయం. కాకపోతే పెట్టుబడి వ్యయం ఎక్కువ అవుతుంది. ఈ విషయంలో ఓసారి కన్సల్టెంట్‌ను సంప్రదించి అంచనాల తర్వాత తుది నిర్ణయం తీసుకుంటే మంచిది. -
పుట్టినరోజున ప్రాణాలు కోల్పోయింది
-
బర్త్‌డే పార్టీలోనే ప్రాణాలు కోల్పోయింది
సాక్షి, ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో గురువారం అర్థరాత్రి సంభవించిన ఘోర అగ్నిప్రమాదం పెను విషాదం నింపింది. కమలా మిల్స్ కాంపౌండ్‌లోని లండన్ టాక్సీ గాస్ట్రోబార్లో జరిగిన ఈ దుర్ఘటనలో 11 మంది మహిళలతో సహా 14 మంది సజీవ దహనమయ్యారు. పుట్టినరోజు వేడుకలు జరుగుతుండగా రాత్రి 12.30 గంటల ప్రాంతంలో మంటలు వ్యాపించినట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. నాలుగు అంతస్థుల్లో ఉన్న ఈ వాణిజ్య సముదాయంలో రెస్టారెంట్లు, పబ్బులు, టీవీ చానళ్ల కార్యాలయాలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన హోటల్ చివరి అంతస్థుపైన రూప్‌టాప్‌లో ఉంది. ఇక్కడ మంటలు చెలరేగి మిగతా అంతస్థులకు వేగంగా వ్యాపించడంతో భయంతో జనం పరుగులు తీశారు. ప్రాణభయంతో పరుగులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగెత్తామని ప్రమాదం నుంచి బయటపడిన డాక్టర్ సులభ కేజీ ఆరోరా చెప్పారు. చాలా మంది మహిళలు ప్రాణభయంతో పురుషుల మరుగుదొడ్డిలోకి పరుగెత్తడం తాను చూశానని తెలిపారు. మంటలు వేగంగా వ్యాపించడంతో తొక్కిసలాట జరిగిందని, రెస్టారెంట్ వెనుక డోర్ నుంచి సిబ్బంది తనను రక్షించారని ఆమె వెల్లడించారు. ఊపిరాడక చనిపోయింది తన సోదరి ప్రీతి రాజగారియా(48) ఊపిరాడక చనిపోయిందని ఆమె సోదరుడు అజయ్ అగర్వాల్ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ‘ప్రీతి తన కుమార్తె రుచీతో కలిసి డిన్నర్‌కు వెళ్లింది. అగ్నిప్రమాదం గురించి తెలియడంతో బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా వీరిద్దరూ విడిపోయారు. రచి మెట్ల కిందకు పరుగు తీసింది. ప్రీతి వాష్‌రూములో ఇరుక్కుపోయి, ఊపిరాడక చనిపోయింద’ని అజయ్ తెలిపాడు. మృతుల్లో ఎక్కువ మంది ఊపిరాడకపోవడం వల్లే చనిపోయారని గుర్తించారు. ప్రమాదానికి ముందు స్నేహితురాలితో ఖుష్బు(కుడి) పుట్టినరోజున విషాదం ఖుష్బు అనే మహిళ తన 29 పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీకి హాజరైన పలువురు మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని ‘రాయిటర్స్’ వెల్లడించింది. పుట్టినరోజు జరుపుకున్న ఖుష్బు కూడా మృతి చెందినట్టు ఆమె తాతయ్య తెలిపారు. అద్దాల గోడలు పగులగొట్టి, లోపలికి ప్రవేశించి బాధితులను కాపాడినట్టు అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. విచారణకు ఆదేశం ఈ ఘటనపై విచారణకు బీఎంసీ మేయర్ విశ్వనాథ్ మహదేశ్వర్ ఆదేశించారు. నివేదిక ఆధారంగా బాధ్యలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కమలా మిల్స్‌పై పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సామాజిక కార్యకర్త మంగేశ్ కాలాస్కర్ వెల్లడించారు. దీని నిర్మాణంలో ఎటువంటి పొరపాట్లు లేవని అధికారులు సమాధానం ఇచ్చారని తెలిపారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు -
సోలార్ పవర్ వచ్చేస్తోంది..
సాక్షి, అమరావతి : సౌరశక్తి ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేసే ప్రక్రియ జిల్లాలో సాగుతోంది. రూఫ్ టాప్‌లో తమ అవసరాలకు అనుగుణంగా సోలార్ పవర్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. సొలార్ నెట్ మీటరింగ్ ద్వారా వచ్చే విద్యుత్తులో మనకు కావలసినంత వాడుకోగా మిగిలిన విద్యుత్తును గ్రిడ్‌కు పంపే వెసులుబాటు ఉంది. దీనివల్ల మిగిలిన విద్యుత్తుకు డిస్కంలు డబ్బులు చెల్లిస్తాయి. ఇందులో ఒకటి నుంచి ఐదు కిలోవాట్ల వరకు వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకోవచ్చు. కిలో వాట్ ఏర్పాటుకు రూ.89,998 ఖర్చు కానుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నెడ్ క్యాప్ ద్వారా కిలో వాట్‌కు రూ.15,000, కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.22,500 వెరసి మొత్తం రూ.37,500 సబ్సిడీ ఇవ్వనున్నారు. జిల్లాలో మూడు మెగా వాట్ల సోలార్ విద్యుత్తు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. కిలోవాట్ సోలార్ ప్లాంట్ల ద్వారా 4–5 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి కానుంది. జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 58 మంది 240 కిలోవాట్ల సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తులు వచ్చాయి. మొదట దరఖాస్తు చేసుకున్న వారి ఆప్లికేషన్ల ప్రాధాన్యత క్రమంలో సోలార్ పవర్‌ను ఏర్పాటుకు అనుమతి ఇవ్వనున్నారు. మూడు మెగా వాట్ల వరకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూ.15000 ఇస్తుంది. దీనిని మించితే రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ రాదు. కేంద్రం విడుదల చేసే సబ్సిడీ మాత్రమే వస్తుంది. ఓ సోలార్ విద్యుత్తు ఉపకరణాలు ఏర్పాటు చేసుకుంటే బ్యాటరీలు ఉండవు కనుక ఎటువంటి నిర్వహణ ఖర్చు ఉండదు. రెస్కో సిస్టం ద్వారా.. జిల్లాలో లాభ సాటి లేని 16 రకాల ప్రభుత్వ సంస్థల్లో సోలార్ పవర్‌ను రెస్కో సిస్టం ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ప్రయివేటు కంపెనీలే పెట్టుబడి పెట్టి ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ సోలార్ పవర్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం యూనిట్ విద్యుత్తుకు చెల్లిస్తున్న ధర కంటే తక్కువకే విద్యుత్తును సరఫరా చేస్తారు. 18–25 సంవత్సరాల పాటు వారి ఆధీనంలో ఉంటాయి. తరువాత ప్రభుత్వ సంస్థలకే సోలార్ పరికరాలను అప్పగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో ప్రయోగాత్మకంగా జీజీహెచ్, నీటిపారుదలశాఖ కార్యాలయాలు, లాంఫాంలో త్వరలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలో 440 కిలో వాట్ల సోలార్ పవర్, ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు పలు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో అక్షర సోలార్ పవర్ 500 కిలో వాట్లు, సీరిస్ ఎనర్జీ సిస్టం 500, పీఈసీ లిమిటెడ్ 500, శ్రీరాయలసీమ హైస్రె్టన్త్ హైపో 500, యాక్సస్ సోలార్ లిమిటెడ్ 1000, జున్నా సోలార్ సిస్టం 500, ప్రీమియర్ సోలార్‌సిస్టం 500, వైయోమా ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ 500, పీపీఎస్ ఎన్వీరో పవర్ లిమిటెడ్ 1000, సన్ టెక్నాలజీస్ 1000, అతిథి సోలార్ ప్రైవేటు లిమిటెడ్ 500, నోవాస్ గ్రీన్ ఎనర్జీ సిస్టం 500 కిలోవాట్లు ఉన్నాయి. ఎంతో ఉపయోగం.. సోలార్ పవర్‌ను ఏర్పాటు చేసుకుంటే ఐదేళ్లలోనే పెట్టుబడి వస్తుంది. దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. వాతావరణ కాలుష్యం ఉండదు. విద్యుత్తు ఆదా అయితే రైతులకు ఉపమోగపడుతుంది. వ్యక్తిగతంగా తమ ఇంటి పైకప్పులపై సోలార్ పరికరాలను ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. హరినాథ్, నెడ్‌క్యాప్ మేనేజరు, గుంటూరు -
దేశవ్యాప్తంగా ఎల్ఈడీలు
రూ.12వేల కోట్ల ఆదా లక్ష్యం: పీయూష్ గోయల్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎల్ఈడీ బల్బుల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా నాలుగేళ్లలో దాదాపు రూ.12 వేల కోట్లను ఆదా చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేయడం ద్వారా పీక్ అవర్స్‌లో ఏకంగా 10 వేల మెగావాట్ల విద్యుత్‌ను పొదుపు చేయవచ్చని భావిస్తోంది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఫేస్బుక్లో పలు ప్రశ్నలకు జవాబుగా ఈ వివరాలు వెల్లడించారు. 2019 నాటికి ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టనున్నామని, ఆ బల్బుల ధరలు తగ్గేలా చూస్తామని ఆయన చెప్పారు. అంతేగాకుండా తక్కువ విద్యుత్ ఉపయోగించుకునేలా తయారు చేసే స్టార్ రేటెడ్ ఉపకరణాలను వినియోగించేలా, పారిశ్రామికంగానూ విద్యుత్‌ను సమర్థవంతంగా వినియోగించేలా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. వీటన్నింటివల్ల ఏటా 10 వేల కోట్ల యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయవచ్చని, ఇది దేశ మొత్తం వినియోగంలో పదిశాతమని పేర్కొన్నారు. ‘రూఫ్‌టాప్’కు ప్రోత్సాహం ఇళ్ల(రూఫ్ టాప్)పై సౌర ఫలకాల ఏర్పాటుద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గోయల్ చెప్పారు. వచ్చే ఏడేళ్లలో దీని ద్వారా 40,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.