Ghaziabad Traffic Police has fined a car owner: ఇటీవలకాలంలో సోషల్ మాధ్యమాల్లో స్టార్‌డమ్ కోసమో లేక ప్రత్యేక ఆకర్షణగా ఉండేందుకో కొన్ని విచిత్రమైన ఫీట్‌లు చేస్తుంటారు. అవి ఒకోసారి ప్రాణాంతకంగా మారడమో లేక పోలీసులు ఆగ్రహానికి గురై కటకటాల పాలవడమో జరుగుతుంటుంది. అచ్చం అలాంటి సంఘటనే ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే...ఘజియాబాద్‌లోని రద్దీగా ఉండే ఢిల్లీ మీరట్ ఎక్క్‌ప్రెస్ హైవేలో ఇద్దరు యువకులు మద్యం సేవించి కారు పై డ్యాన్స్ చేశారు. అయితే ఆ కారుని ఒక వ్యక్తి నడుపుతుండగా ..మరో వ్యక్తి ప్యాసింజర్ సీట్‌లో కూర్చున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. దీంతో మోహిత్ గుర్జార్ అనే ఒక సోషల్ మీడియా వినియోగ దారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అంతేకాదు ఆ వాహనాన్ని మారుతి సుజికి ఎర్టిగా గుర్తించారు.
వీడియోలో కనిపిస్తున్న నెంబర్ ప్లేట్ ఆధారంగా ఆ వాహన యజమాని పై ట్రాఫిక్ పోలీసులు సుమారు రూ. 20 వేలు జరిమానా విధించారు. ఈ ఘటన ఘజియాబాద్‌లో బులంద్‌షహర్ రోడ్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో రాత్రి 8 గం.ల సమయంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినందుకుగానూ అతని వాహన రిజిస్ట్రేషన్‌ని రద్దు చేశారు. ఈ మేరకు ఆ ఘటనకు సంబంధించిన వీడియోతోపాటు, ఫైన్ వేసిన ఈ చలానా కాపీని కూడా ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Meanwhile in Ghaziabad, a group of boys, visibly drunk, dancing on the roof of their car on the Delhi-Meerut expressway.
— Prashant Kumar (@scribe_prashant) April 2, 2022
Hope @ghaziabadpolice makes them dance to their tunes in the lockup sooner. pic.twitter.com/mJck8JQ4Kh
Comments
Please login to add a commentAdd a comment