
తుమకూరు: ఇంటి పైకప్పు కూలడంతో ఓ మహిళ మృతి చెందిన ఘటన తుమకూరు జిల్లా శిరా తాలూకా గౌడగెరె సమీపంలో ఉన్న యరువరహళ్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రత్నమ్మ (55) తన ఇంటి పక్కనే ఉన్న లక్ష్మమ్మ ఇంటికి వచ్చింది. పనికి రావాలని చెబుతుండగా ఒక్కసారిగా పైకప్పు కూలిపోయి రత్నమ్మపై పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇదే సమయంలో ఇంటిలో ఉన్న లక్ష్మమ్మ, వెంకటేశ్‌లు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. శిరా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment