Tumakuru
-
క్యాన్‌లో పెట్రోల్ పోయించుకుంటూ ఉండగా ఒక్కసారిగా మంటలు
-
దేశంలో అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రం.. ప్రారంభించిన మోదీ..
బెంగళూరు: కర్ణాటక తుమకూరులో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా తేలికపాటి హెలికాప్టర్‌ను కూడా మోదీ ఆవిష్కరించారు. మోదీతో పాటు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. PM Shri @narendramodi dedicates HAL helicopter factory to the nation in Tumakuru, Karnataka. pic.twitter.com/dqAZMsJXnI — BJP (@BJP4India) February 6, 2023 మోదీ శంకుస్థాపన చేసిన హెచ్ఏఎల్ హెలికాప్టర్ తయారీ కేంద్రం దేశంలోనే అతిపెద్దది. 615 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. భారత్‌లో హెలికాప్టర్ల అవసరాలను ఒక్క చోటు నుంచే తీర్చాలనే ఉద్దేశంతో కేంద్రం దీన్ని ప్రారంభించింది. ఈ ఫ్యాక్టరీలో మొదటగా లైట్ యుటిలిటీ హెలికాప్టర్లు(తేలికపాటి హెలికాప్టర్లు) మాత్రమే తయారు చేస్తారు. వీటిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్ చేశారు. మూడు టన్నుల బరువుండే ఈ సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్లను అత్యంత సులభంగా నడపవచ్చు. ఈ హెలికాప్టర్ తయారీ కేంద్రం నుంచి తొలుత ఏడాదికి 30 హెలికాప్టర్లు ఉత్పత్తి చేస్తారు. ఆ తర్వాత విడతల వారీగా ఏడాదికి 60, 90 హెలికాప్టర్లను తయారు చేసేలా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతారు. ఈ కేంద్రం నుంచి 3-15 టన్నుల బరువుగల 1000 హెలికాప్టర్లను తయారు చేయాలని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే 20 ఏళ్లలో రూ.4లక్షల కోట్ల వ్యాపారం చేయాలని భావిస్తోంది. చదవండి: మద్రాస్ హైకోర్టు జడ్జిగా విక్టోరియా గౌరి నియామకంపై వివాదం.. -
ప్రధాని మోదీ కోసం వక్కలపేటా, హారం
సాక్షి, తుమకూరు: ప్రధాని నరేంద్రమోదీ సోమవారం తుమకూరు జిల్లాలో పర్యటించనుండగా ఆయన కోసం అపురూపమైన హారం, తల పేటా సిద్ధమయ్యాయి. జిల్లా వ్యవసాయ సంస్కృతికి అద్దం పట్టేలా వక్కలతో తీర్చిదిద్దిన హారం, పేటా సిద్ధమయ్యాయి. జిల్లాలో వక్క, టెంకాయ తోటలు విస్తారంగా ఉండడం తెలిసిందే. నేడు ప్రధాని మోదీ పర్యటన శివాజీనగర: ప్రధాని నరేంద్రమోదీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం బెంగళూరుకు వస్తున్నారు. నెల రోజుల్లో మోదీ రావడం ఇది మూడవసారి. ప్రత్యేక విమానంలోఉదయం 8.20 గంటల సమయంలో డిల్లీ నుంచి బయలుదేరి 11 గంటలకు బెంగళూరుకు చేరుకొంటారు. నగరంలో జరిగే భారత ఇంధన వారోత్సవాన్ని ప్రారంభిస్తారు. అనంతరం తుమకూరు జిల్లాకు వెళ్తారు. (చదవండి: ఎన్ఐఏ చేతికి ‘ఉగ్ర త్రయం’ కేసు ) -
శభాష్ డ్రైవరన్న.. చెరువులో మునిగిపోతున్న బాలికలను రక్షించి..
సాక్షి, బెంగళూరు: చెరువులో మునిగిపోతున్న ఇద్దరు బాలికలను ఆర్టీసీ డ్రైవర్ ప్రాణాలతో కాపాడిన ఘటన ఆదివారం సాయంత్రం తుమకూరు జిల్లా శిర తాలూకా హందికుంటె అగ్రహరలో చోటుచేసుకుంది. వివరాలు.. కేఎస్‌ఆరీ్టసీ డిపోకు చెందిన డ్రైవర్ మంజునాథ్ ఆదివారం సాయంత్రం ప్రయాణికులతో నాగప్పనకహళ్లి గేట్ మార్గంలో వస్తుండగా సుదూరంలో ఉన్న చెరువులో ఇద్దరు బాలికలు మునిగిపోతున్నట్లు గుర్తించాడు. వెంటనే బస్సును పక్కకు నిలిపి నీటిలో దూకాడు. ఇద్దరిని పట్టుకుని ఒడ్డుకు చేర్చాడు. డ్రైవర్ సాహసాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. డ్రైవర్ మంజునాథ్ మాట్లాడుతూ... పిల్లలు మునిగిపోతుండగా అక్కడే చెరువు వద్ద తల్లి ఏడుస్తుండటాన్ని గమనించి వెంటనే బస్సు ఆపి చెరువులో దూకి చిన్నారులను రక్షించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంజునాథ్‌ను డిపో మేనేజర్, సిబ్బంది ఘనంగా సన్మానించారు. -
అనాథలమని ఆవేదన చెంది.. ముగ్గురు అక్కచెల్లెళ్ల ఆత్మహత్య..
సాక్షి, బెంగళూరు: తమకు ఎవరూ లేరనే ఆవేదనతో ముగ్గురు అక్కచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘోరం కర్ణాటకలోని తమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకా బరకనహాల్ తాండాలో గురువారం వెలుగుచూసింది. అక్కాచెల్లెల్లైన రంజిత924), బిందు(21),చందన(18)ల తల్లిదండ్రులు చాలా ఏళ్ల కిందటే మరణించారు. వీరిని అమ్మమ్మ పోషిస్తోంది. ఆమె కూడా మూడు నెలల క్రితం మరణించడంతో ముగ్గురూ కుంగిపోయారు. తాము అనాథలం అయిపోయామని బాధపడేవారు. రంజిత, బిందు ఓ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. చందన పీయూసీ చదువుతోంది. 9 రోజుల నుంచి ముగ్గురూ ఇంటి నుంచి బయటకు రాలేదు. గురువారం ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు విషయాన్ని తెలిపారు. వారు వచ్చి ఇంటి పైకప్పు తీసి పరిశీలించగా ముగ్గురూ ఉరివేసుకున్నట్లు కనిపించారు. మృతదేహాలు కుళ్లిపోవడంతో వాటిని చిక్కనాయకనహళ్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్గానికి తరలించారు. చదవండి: నిబంధనలకు ‘నిప్పు’.. ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలు -
కర్నాటకలో కాంట్రాక్టర్ ఆత్మహత్య.. బీజేపీ ప్రభుత్వమే కారణమా?
కర్నాటకకు చెందిన మరో కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులకు బిల్లులు క్లియర్ కాకపోయిన కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. కాంట్రాక్టర్ ఆత్మహత్య సందర్భంగా తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదంటూ సూసైడ్ నోట్లో ఉండటం గమనార్హం. వివరాల ప్రకారం.. తుమకూరు జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ టీఎన్ ప్రసాద్(50) ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి బిల్లులు క్లియర్ కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్ కింద రూ.16 కోట్ల విలువైన నిర్మాణ పనులను కాంట్రాక్టర్ ప్రసాద్ చేపట్టారు. అయితే బిల్లుల బకాయిలను ప్రభుత్వం క్లియర్ చేయకపోవడంతో అప్పులపాలయ్యాడు. దీంతో, అప్పులు చెల్లించకలేక తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదంటూ సూసైడ్ నోట్లో ఉందని చెప్పారు. మరోవైపు.. ప్రసాద్ మృతిపై కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు బలరాం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కాంట్రాక్ట్‌ను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్ ప్రసాద్ భారీగా రుణాలు పొందాడని బలరాం చెప్పుకొచ్చారు. ఆ అప్పు తీర్చేందుకు ఐదు నెలల కిందట తన ఇంటిని కూడా అమ్మేశాడని తెలిపారు. బిల్లుల క్లియరెన్స్‌లో ఆలస్యం వల్ల తాను మనోవేదనకు గురవుతున్నట్టు తనతో చర్చించినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో కర్నాటకలోని బీజేపీ సర్కార్‌పై విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. 40 శాతం కమీషన్ ఇవ్వకపోతే బిల్లులు పాస్ కావంటూ కొందరు కాంట్రాక్టర్లతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఇలా ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. -
పొలిటికల్ పార్టీపై మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి క్లారిటీ.. 'ఆ రోజే అన్ని చెబుతా'
సాక్షి, బెంగళూరు: డిసెంబరు 25వ తేదీన అన్నీ చెబుతానని మాజీ మంత్రి తెలిపారు. తుమకూరు నగరంలో ఉన్న సిద్దగంగా మఠాన్ని మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి, భార్య లక్ష్మి అరుణ సందర్శించారు. శివకుమార స్వామి సమాధి వద్ద పూజలు చేసి మఠాధ్యక్షుడు సిద్దలింగ స్వామిని కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మఠం ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 14 సంవత్సరాల నుంచి మఠాన్ని సందర్శిస్తున్నట్లు తెలిపారు. బసవణ్ణ ఆదర్శంగా ఎలాంటి ప్రచారం లేకుండా లక్షల మందికి సేవ చేసిన ఘనత దివంగత శివకుమార స్వామిదని అన్నారు. తనకు మానసికంగా, దైహికంగా శక్తిని ఇచ్చేది మఠాలేనని చెప్పారు. మఠంలో ఎలాంటి రాజకీయాలను మాట్లాడనని, ఈ నెల 25వ తేదీన బెంగళూరులో మీడియా సమావేశం నిర్వహించి అన్ని విషయాలనూ అక్కడ వెల్లడిస్తానని చెప్పారు. చదవండి: (ఉజ్వల లబ్ధిదారులకు రూ.500కే సిలిండర్) -
మద్యం మత్తులో విద్యార్థులను చితక బాదేశాడు
సాక్షి, బెంగళూరు(తుమకూరు): మద్యం మత్తులో పాఠశాల పరిపాలన విభాగం సభ్యుడు విద్యార్థులను చితకబాదిన ఘటన తుమకూరు తాలూకా మల్లసంద్ర విశ్వభారతి వసతి పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. పాఠశాల పరిపాలన విభాగం సభ్యుడైన భరత్ నాలుగు రోజుల క్రితం రాత్రి 10 గంటల సమయంలో మద్యం తాగి వసతి భవనానికి వచ్చాడు. పడుకుని ఉన్న 40 మంది విద్యార్థులను నిద్ర లేపి ఇంత త్వరగా పడుకుంటారా అంటూ కట్టెతో, బెల్టుతో చితకబాదాడు. దీంతో ఓ విద్యార్థి చేయి విరిగింది. ఇద్దరు విద్యార్థుల మర్మాంగాలకు గాయం కాగా, పలువురి వీపులపై గాయాలయ్యాయి. అప్పటి నుంచి భరత్ కనిపించకుండా పోయాడు. జరిగిన ఘటనను బాధిత విద్యార్థులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావడంతో వారు గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: (అప్పులే దారుణానికి ఒడిగట్టేలా చేశాయి.. వీడిన టెక్కీ రాహుల్ అదృశ్యం మిస్టరీ) -
ఫ్రిజ్‌లో నాగుపాము
తుమకూరు: తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకా కొత్తగెరె గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తికి చెందిన ఇంటిలో నాగుపాము దూరింది. శనివారం ఉదయం ఇంటిలోకి ప్రవేశించిన నాగుపాము ఫ్రిజ్ వెనుకభాగంలోకి చేరింది. కుటుంబ సభ్యులు స్నేక్ నిపుణుడు మహాంతేశ్కు సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకుని పామును పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టారు. -
పురిటిలో మృత్యు ఘోష.. వైద్యుల నిర్లక్ష్యం.. తల్లి, కవలలు మృతి
వైద్యో నారాయణ హరి అన్న నానుడికి కళంకం తెస్తున్నారు కొందరు వైద్యసిబ్బంది. ఏమాత్రం కనికరం లేకుండా వైద్యాన్ని నిరాకరించడం తమ గొప్పగా భావిస్తారు వీరు. నిరుపేద గర్భిణి కాన్పు కోసం వస్తే వైద్యం చేయడానికి బదులు, దయాదాక్షిణ్యం లేకుండా వెనక్కి పంపేశారు. ఇంట్లో ఆ అభాగ్యురాలు కవలలకు జన్మనిచ్చి తుదిశ్వాస విడిచింది. అమ్మ లేని లోకం దండగ అనుకున్నారో ఏమో.. ఆ శిశువులు కూడా తల్లి వెంటే వెళ్లారు. ఈ దారుణం ఏ మారుమూలో పల్లెలోనో కాదు, విద్యా వైద్య సేవలకు పేరుగన్న తుమకూరు నగరంలో చోటుచేసుకుంది. సాక్షి, బెంగళూరు: తుమకూరు నగరంలో ఉన్న జిల్లా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల నిండు బాలింత ప్రాణం గాలిలో కలిసింది. పురుటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చింది, అయితే నీకు ఆరోగ్య కార్డు లేదు, చికిత్స చేయలేం అని వైద్యసిబ్బంది కఠినంగా తిరస్కరించారు. దీంతో ఆమె ఇంటికి వెళ్లిపోగా, అక్కడ కవల పిల్లలు జన్మించారు, కానీ తీవ్ర రక్తస్రావం జరిగి కన్నుమూసింది. వైద్యసిబ్బంది అలసత్వం ముగ్గురి ప్రాణాలు తీసిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తెల్లవారుజామున ఆస్పత్రికి వెళ్లగా ఈ అమానుష సంఘటన తుమకూరులో జరిగింది. భారతీ నగరలోని అభయాంజనేయ స్వామి దేవాలయం వీధిలో కస్తూరి (30) అనే మహిళ నివసిస్తోంది. తమిళనాడుకు చెందిన కస్తూరి ఇక్కడకు వచ్చి నెల రోజులు అవుతోంది. ఆమె ఆరేళ్ల కుమార్తె ఉంది. ఆర్థిక సమస్యలతో భర్త 4 నెలల కిందట బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. నిండు గర్భిణి అయిన కస్తూరికి గురువారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రసవ వేదన ప్రారంభం కావడంతో చుట్టుపక్కల మహిళలు ఆమె చేతికి కొంత డబ్బిచ్చి ఒక వృద్ధురాలిని తోడిచ్చి ఆటోలో జిల్లా ఆస్పత్రికి పంపించారు. జిల్లా ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు వైద్యం చేయడానికి బదులుగా గర్భం దాల్చినప్పుడు ఆస్పత్రిలో నమోదు చేసుకుని కార్డు తీసుకున్నారా? అని అడగ్గా ఆమె లేదు అని చెప్పింది. ఆధార్, రేషన్ కార్డు అడిగారు. ఆధార్ కార్డు అడ్రస్ చూపగా తమిళనాడు చిరునామాతో ఉంది. అంతే.. మేం వైద్యం చేయం, బెంగళూరు నగరంలోని విక్టోరియా ఆస్పత్రికి వెళ్లండి అని వైద్యసిబ్బంది సలహా ఇచ్చారు. తీవ్ర రక్తస్రావమై దిక్కుతోచని కస్తూరి ఆటోలో ఇంటికి తిరిగివచ్చింది. కొంతసేపటికి ఆమెకు ప్రసవమై ఇద్దరు మగ పిల్లలు పుట్టారు. కానీ తీవ్రంగా రక్తస్రావం కావడంతో పాటు చూసేవారెవరూ లేకపోయారు. కొంతసేపటికి విలవిలలాడి తల్లీ బిడ్డలు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. తల్లిని కోల్పోయి కూతురు విలపిస్తూ ఉండగా అందరూ అక్కడకు చేరారు. ముగ్గురు సస్పెండ్ అంతా జరిగాక ఉన్నతాధికారులు చర్యలకు దిగారు. డాక్టర్ ఉషా, మరో ఇద్దరి సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి మంజునాథ్ ప్రకటించారు. రాత్రికి ఆరోగ్యమంత్రి సుధాకర్ చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మేయర్, కార్పొరేటర్ల నిరసన ఈ దారుణంపై స్థానిక ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు వైద్యుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. 22వ వార్డు కార్పొరేటర్ శ్రీనివాస్, మేయర్ ప్రభావతి, ఉప మేయర్ టి.కే.నరసింహమూర్తి, కార్పొరేటర్ నయాజ్ అహ్మద్‌లు బాధితురాలి ఇంటికి వెళ్లి చుట్టుపక్కలవారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. తల్లీపిల్లల మృతదేహానికి నివాళులర్పించారు. జిల్లా ఆస్పత్రి వైద్యులు, డిహెచ్ఈ ఇక్కడికి వచ్చేదాకా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని తెలిపారు. ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది, వైద్యులు అందరు లంచాలకు అలవాటు పడి సక్రమంగా వైద్యం చేయడంలేదని, ఆస్పత్రి మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. జిల్లా ఆస్పత్రి సర్జన్ డాక్టర్ వీణా వచ్చి ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. కస్తూరికి తల్లి కార్డు లేక పోవడంతో వెనక్కి పంపించారని చెప్పారు. గర్భిణి ప్రతినెలా ఆస్పత్రిలో ఆరోగ్య పరీక్షలు చేయంచుకునే సమయంలో వారికి తల్లి కార్డు ఇస్తారని అన్నారు. ఇకపై ఇలా జరగుకుండా చూసుకుంటామని, దీనికి ఎవరు బాధ్యులు అనేదానిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. -
బీకాం విద్యార్థిని ఆత్మహత్య.. తల్లిదండ్రుల మాటలే..
సాక్షి, బెంగళూరు(తుమకూరు): చదువులో రాణించలేననే భయంతో ఓ యువతి సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. తుమకూరు తాలూకా బెళ్లావిలో పవిత్ర (18) అనే విద్యార్థిని బీకాం డిగ్రీ మొదటి ఏడాది చదువుతోంది. అయితే ఎప్పుడు ఆటలాడుతూ సమయం వృథా చేస్తావా? చదువుకో అని తల్లిదండ్రులు చెప్పిన మాటలే ఆ పవిత్రకు చేదుగా అనిపించాయి. దీనికి తోడు పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే తల్లిదండ్రులు కోపడుతారని, అలాగే మొబైల్ కొనివ్వరని మనోవేదనకు గురై ప్రాణాలు తీసుకుందని పోలీసులు తెలిపారు. చదవండి: (రోడ్డు ప్రమాదంలో డాక్టర్ ఎస్.పి.నాయుడు మృతి) -
బడిలోనే బార్.. ఆ టీచరమ్మ రూటే వేరు
తుమకూరు (బెంగళూరు): గురువు అంటే దేవునితో సమానం, కానీ ఓ మహిళా ఉపాధ్యాయురాలు పాఠశాలనే బార్గా మార్చుకుంది. మద్యం తాగుతూ మత్తులో నానా యాగీ చేస్తూ ఆ వృత్తికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది. ఈ సంఘటన విద్యాకేంద్రంగా ప్రసిద్ధి చెందిన తుమకూరు జిల్లాలో జరిగింది. వివరాలు.. తుమకూరు తాలూకాలోని చిక్కసారంగిలోఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గంగలక్ష్మమ్మ అనే ఉపాధ్యాయురాలు గత 25 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తోంది. గత 5 సంవత్సరాల నుంచి ఆమె మద్యానికి బానిస అయ్యింది. ఈ మత్తులో నానా హంగామా చేస్తోంది. టేబుల్లో మద్యం సీసాలు ఈ విషయమై గ్రామస్తులు, బాలల తల్లిదండ్రులు ఆమెకు అనేకసార్లు మందలించినా తీరుమారలేదు. దీంతో బీఈఓకు ఫిర్యాదు చేయడంతో గురువారం వచ్చి విచారించారు. ఉపాధ్యాయురాలి టేబుల్లో మద్యం సీసాలు ఉన్నాయని విద్యార్థులు తెలిపారు. వాటిని తీయాలని బీఈఓ ఆదేశించడంతో ఆమె టేబుల్‌కు తాళం వేసి భీష్మించుకుంది. బీఈఓ, తల్లిదండ్రులు కలిసి టేబుల్‌ను బయటికి తీసుకొని వచ్చి తాళం పగలగొట్టి చూసి ఒక బాటిల్, రెండు ఖాళీ సీసాలు ఉన్నాయి. ఇంతలో నేను ఆత్మహత్యా చేసుకుంటానంటూ ఉపాధ్యాయురాలు కేకలు వేయగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. మద్యం సీసాలను సీజ్‌చేశారు. చదవండి: (ట్రూ లవ్ నెవర్ ఎండ్స్.. నేనూ నీ దగ్గరకే వస్తున్నా..) -
భయానక రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
సాక్షి, బెంగళూరు: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. తుముకూరు జిల్లాలోని బాలినహళ్లిలో ఓ లారీ జీపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా.. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రమాదంలో మృతుచెందిన వారిని రాయచూర్ జిల్లావాసులుగా గుర్తించారు. అయితే, 48వ నెంబర్ జాతీయ రహదారిపై రాయచూర్ నుంచి బెంగళూరు వస్తున్న జీపును ఓవర్టేక్ క్రమంలో లారీ ఢీకొట్టినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
ఒకే కుటుంబంలో ఐదుగురిని కాటేసిన పాము
తుమకూరు: ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి పాము కాట్లు.. వారిలో ఐదుగురి మృత్యువాత.. ఇలా చనిపోయిన వారంతా పురుషులే.. ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా కొరటగెరె తాలూకా తొగరిఘట్ట గ్రామంలో ధర్మణ్ణ కుటుంబంలో ప్రతి నాలుగైదేళ్లకు ఒకరు పాము కాటుకు గురవుతున్నారు. గడిచిన 20–25 ఏళ్లలో పాముల కాటుతో ధర్మణ్ణ ఉమ్మడి కుటుంబంలో ఆయనతో పాటు హనుమంతప్ప, వెంకటేశ్, శ్రీనివాస్, ఇటీవల గోవిందరాజు మరణించారు. పాముకాటు బాధిత కుటుంబం గత బుధవారం రాత్రి గోవిందరాజు పొలంలో నీరు పెడుతుండగా పాము కాటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే ప్రాణాలు విడిచాడు. చనిపోయిన వారంతా దాదాపు ఒకే ప్రదేశంలో పాము కాట్లకు గురయ్యారు. ధర్మణ్ణ ఒక రోజు తన పొలం వద్ద ఉన్న ఒక పెద్ద చెట్టును ఉన్నపళంగా నరికేశాడు. ఆ చెట్టు శాపమే ప్రస్తుతం ఈ మరణాలకు కారణమని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అయితే ఆ చెట్టు ఆ తర్వాత కాలంలో మళ్లీ చిగురించి చెట్టుగా ఎదిగింది. పాము పగ పోవాలని గ్రామస్తులు స్థానిక మునియప్ప ఆలయంలో నిత్య పూజలు చేపట్టారు. -
లవర్‌తో భార్య పరార్.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి భర్త ఆత్మహత్య
బెంగళూరు: వివాహేతర సంబంధాలు జీవితాలనే నాశనం చేస్తున్నాయి. ఓ మహిళ తన ప్రియుడితో వెళ్లిపోయిన క్రమంలో మనస్తాపం చెందిన భర్త తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన కర్ణాటకలోని తుమకూర్ జిల్లా, పీహెచ్ కాలనీలో గురువారం వెలుగు చూసింది. మృతుడిని సమీయుల్లాగా గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సమీయుల్లాకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొద్దిరోజుల కింద భార్య సహీరా బాను.. ప్రియుడితో కలిసి సౌదీ అరేబియాకు వెళ్లిపోయింది. అక్కడ పనిమనిషి ఉద్యోగం చేస్తూ.. ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది. భర్తకు అప్పుడప్పుడు వీడియో కాల్స్ చేస్తూ వారు తిరిగే ప్రదేశాలను చూపించేది. ఈ క్రమంలో ఇంటికి రమ్మని భర్త ఎంత బతిమిలాడినా ఆమె మనసు కరగలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సమీయుల్లా.. తన ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి అనంతరం తానూ విషం తాగాడు. ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గ మధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురు పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని బెంగళూరు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: బిహార్‌లో నకిలీ పోలీస్ స్టేషన్.. 8 నెలలుగా వసూళ్ల పర్వం -
భర్త, పిల్లలు వద్దు ప్రియుడే కావాలి.. వీడియో కాల్స్ చేసి..
తుమకూరు: భర్త, ముగ్గురు పిల్లలను వదిలి ప్రియునితో కలిసి దుబాయ్‌కి వెళ్లిపోయిందో మహిళ. తరువాత కాల్స్ చేస్తూ ఆటపట్టిస్తోంది. ఈ హింసను తట్టుకోలేక ఆ భర్త ముగ్గురు పిల్లలకు పురుగుల మందు ఇచ్చి తాను తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదం కర్నాటకలో చోటుచేసుకుంది. వీడియో కాల్స్‌తో హేళన.. తుమకూరులోని పిహెచ్ కాలనీలో సమీవుల్లా (45) భార్య సాహెరా బాను, ముగ్గురు పిల్లలతో నివసిస్తున్నాడు. నాలుగేళ్ల కిందట సాహెరాబాను ప్రియునితో కలిసి దుబాయ్‌కి వెళ్లిపోయింది. అప్పటినుంచి సమీవుల్లా ఒక్కడే ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకును పోషిస్తూ జీవిస్తున్నాడు. మరోవైపు సాహెరా బాను దుబాయ్ నుంచి తన పిల్లలకు వీడియో కాల్ చేస్తూ హేళనగా మాట్లాడేది. ఈ పరిణామాలతో విరక్తి చెందిన సమీవుల్లా గురువారం ఉదయం పిల్లలకు పురుగుల మందు తాగించి, తాను కూడా సేవించాడు. కొంతసేపటికే సమీవుల్లా చనిపోగా, పిల్లలు ప్రాణాలతో కొట్టుమిట్టాడడం చూసిన ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అంబులెన్సులో బెంగళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. ఇది కూడా చదవండి: అన్నతో కాళ్లు మొక్కించారని కోపం.. ప్రాణం తీసిన రెండేళ్ల కిందటి మెసేజ్ -
మహాత్మా మన్నించు..
దేశమంతటా తిరంగా ఉత్సవాల్లో మునిగితేలుతోంది. స్వాతంత్య్ర సంగ్రామంలో జాతిని నడిపించి అహింసా విధానంలో స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన గాంధీజీకి జేజేలు పలుకుతున్నాం. కానీ ఆయన విశ్రమించిన భవనాల బాగోగులూ ఎవరికీ పట్టడం లేదు. తుమకూరు: జాతి పిత మహాత్మా గాంధీ నడయాడిన స్థలాలు ఎంతో పేరుపొంది నేడు పర్యాటక ప్రదేశాలుగా మారాయి. ఆ మహానుభావుడు బసచేసిన భవనాలు స్మారక కట్టడాలుగా పేరు పొందాయి. కానీ తుమకూరు జిల్లాలోని తిపటూరులోని ఓ కట్టడానికి ఆ భాగ్యం కలగలేదు. గాంధీజీ సేదతీరిన ఒకనాటి ఇల్లు నేడు కనీస పర్యవేక్షణ లేక అధ్వాన్నంగా మారిందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు. తిపటూరులోని పాత బీడిఓ కార్యాలయం ప్రస్తుతం తాలూకా పంచాయతీ ఆఫీసు వెనుక భాగంలో ఉన్న ఓ ఇల్లు ఉంది. స్వాతంత్య్రోద్యమ కాలంలో.. 1927 ఆగస్టు 21వ తేదీన దేశమంతటా పర్యటిస్తూ తిపటూరుకు వచ్చిన బాపూజీ ఇదే గదిలో విశ్రాంతి తీసుకున్నారు. అక్కడే ఉన్న చేద బావి నీటిని ఉపయోగించారు. అలా ఆ భవనం చరిత్రకెక్కింది. 1915– 1948 వరకు సంఘటనలతో కూడిన డీటైల్డ్ క్రోనాలజీ అనే పుస్తకంలో కూడా నమోదు చేశారు. జయదేవ హాస్టల్ ఆవరణలో సభలో గాంధీజీ ప్రసంగిస్తూ స్వరాజ్య సంగ్రామంలో పాల్గొనాలని ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ఈ ఘన చరిత గల భవనం నేడు నిర్లక్ష్యపు చీకట్లో మగ్గుతోంది. చుట్టూ చెత్త పేరుకుపోయింది. జిల్లా యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. తుమకూరు కాలేజీ మైదానం గది కూడా.. అలాగే తుమకూరు నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉన్న మహాత్మా గాం«దీజీ స్మారక భవనం పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎమ్మెల్యే పరమేశ్వర్ ఆదివారం ఆ భవనాన్ని పరిశీలించారు. 1932లో, 1937లో గాం«దీజీ పలుమార్లు తుమకూరు జిల్లాకు వచ్చారని, అప్పుడు కాలేజీ మైదానంలో ఉన్న గదిలో బస చేశారని చెప్పారు. ఆ గదిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఇప్పటికైనా సంరక్షించాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: వీడియో: స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు.. ఈ పాటలు విన్నప్పుడల్లా ఉప్పొంగే దేశభక్తి -
రుస్తంను కనిపెట్టాడు.. జాక్‌పాట్ కొట్టాడు
వైరల్: రుస్తం.. పర్షియన్ పురాణాల్లో ఓ వీరుడి పేరు. అలాంటి పేరును ఇక్కడో వ్యక్తి తాను ప్రేమగా పెంచుకున్న చిలుకకు ఆ పేరు పెట్టుకున్నాడు. కానీ.. అది కనిపించకుండా పోయేసరికి అల్లలాడిపోయాడు. ఆచూకీ చెప్పినా.. తెచ్చి ఇచ్చినా మంచి పారితోషకం ఇస్తానని ప్రకటించాడు. అంతేకాదు పోస్టర్లతో పాటు నగరం అంతటా ప్రకటన ఇచ్చాడు. కనిపించకుండా పోయిన తను రుస్తంను పట్టి తెచ్చిస్తే యాభై వేల రూపాయల క్యాష్ ప్రైజ్ ప్రకటించాడు కూడా. ఆ ప్రకటన చూసి శ్రీనివాస్ అనే ఓ స్థానికుడు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఫలితంగా.. రుస్తం దొరక్కగా.. ఓ ఓనర్ మరో 35 వేల రూపాయలను అదనంగానే ఇచ్చాడు. కర్ణాటక తుమ్మకూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. అర్జున్ అనే వ్యక్తి ఓ ఆఫ్రికన్ చిలుకను రెండున్నరేళ్లుగా పెంచుకుంటున్నాడు. దానికి రుస్తం అని పేరు పెట్టారు. అది ఆ కుటుంబంతో మమేకం అయిపోయింది. అయితే జులై 16వ తేదీ ఇంట్లోంచి ఎగిరిపోయి.. అది మళ్లీ తిరిగి రాలేదు. దీంతో అర్జున్ ఒక ప్రకటన ఇచ్చాడు. అయితే ఆ ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో చెట్లలో గాయపడి.. ఆకలితో, భయంతో ఉన్న తన రుస్తంను శ్రీనివాస్ చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇచ్చారని, అందుకే అదనంగా పారితోషకం ఇచ్చానని అర్జున్ చెప్తున్నాడు. ఇన్స్టంట్ అదృష్టం కూడా ఊరికే రాదు.. అందుకూ ఏదో ఒక ప్రయత్నం చేయాల్సిందే అని అంటున్నారు ఈ ఘటన చూసిన కొందరు. -
రుస్తుమా ఎగిరిపోయింది.. కనిపెట్టిన వారికి రూ.50వేల నజరానా
బెంగళూరు: ఎంతో గారాబంగా పెంచుకున్న చిలుక ఎగిరిపోయిందని బాధపడుతోంది కర్ణాటక తుమకూరుకు చెందిన ఓ కుటుంబం. ఇంట్లో ఓ కుటుంబసభ్యుడిగా ఉన్న చిలుకను బాగా మిస్ అవుతున్నట్లు చెబుతోంది. దాని ఆచూకీ చెప్పిన వారికి రూ.50 వేలు నజరానా ఇస్తామని ప్రకటన కూడా ఇచ్చారు కుటుంబసభ్యులు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను తుమకూరు వ్యాప్తంగా అతికించారు. ఇవి కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 'మా చిలుక కన్పించడం లేదు. దానికి మాకు చాలా అనుబంధం ఉంది. మీకు ఎక్కడైనా కన్పిస్తే చెప్పండి. రూ.50 వేలు ఇస్తాం. మీ ఇంటి బాల్కనీ, కిటీకీలు వెతకండి' అని చిలుక యజమానులు పల్లవి, అర్జున్ ప్రకటనలో తెలిపారు. #Karnataka Family Announces Rs 50K Reward For Finding Missing #Parrot #Trending #Viralvideo #India pic.twitter.com/cTVRLVjlKZ — IndiaObservers (@IndiaObservers) July 19, 2022 వీరిది జంతు ప్రేమికుల కుటుంబం. కొన్నేళ్లుగా ఆఫ్రికాకు చెందిన రెండు చిలుకలను పెంచుకుంటున్నారు. అయితే అందులో ఒకటి శనివారం నుంచి కన్పించడం లేదు. దాని పేరు రుస్తుమా. అది ఎక్కడికో వెళ్లిపోయి ఉంటుందని వీళ్లు భావిస్తున్నారు. రెండున్నరేళ్లకుపైగా ఈ చిలుక వీళ్లతో ఉంది. రెండుసార్లు దానికి ఘనంగా పుట్టినరోజు వేడుక కూడా చేసినట్లు తెలుస్తోంది. చదవండి: అక్రమ మైనింగ్ ఆపేందుకు వెళ్లిన డీఎస్పీ.. ట్రక్కుతో తొక్కించి చంపిన మాఫియా గ్యాంగ్ -
ఘనంగా మంత్రి కుమారుడి వివాహం
తుమకూరు (కర్ణాటక): తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకా జే.సి.పురంలో గురువారం రాష్ట్ర మంత్రి జే.సి.మాదుస్వామి కుమారుడు డాక్టర్. జే.ఎం. అభిజ్ఞ, డాక్టర్. ఎస్.ఎం. అశ్వినిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వేడుకకు మఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, హోం మంత్రి జ్ఞానేంద్ర, మాజీ సీఎం సిద్దరామయ్య, మాజీ ప్రధాని దేవెగౌడ, ఒక్కలిగ మఠాధ్యక్షుడు నిర్మలానందనాథ స్వామిజీ తదితర ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. -
కాన్పు చేసిన నర్సులు.. బిడ్డతో సహా గర్భిణి మృతి
సాక్షి, బెంగళూరు: పండంటి బిడ్డకు జన్మ ఇవ్వాల్సిన గర్భిణి వైద్య సేవలు అందక కన్నుమూసింది. ఈ విషాద ఘటన తుమకూరు జిల్లాలోని హొసకెర పీహెచ్సీలో చోటు చేసుకుంది. వివరాలు.. మధుగిరి తాలూకా బ్రహ్మదేవరహళ్లికి చెందిన కమలమ్మ(28) కు పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ఎంతసేపైనా రాకపోవడంతో కారులో హొసకెరె పీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు లేకపోవడంతో నర్సులే కాన్పు చేసేందుకు ఉపక్రమించారు. ఈక్రమంలో పరిస్థితి విషమించి కడుపులో ఉన్న బిడ్డతో సహా గర్భిణి మృతి చెందింది. వైద్యులు లేకపోవడం వల్లనే తన భార్య మృతి చెందినట్లు భర్త కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: అమానుషం.. అస్పత్రి మరుగుదొడ్డిలో ఆడ శిశువు మృతదేహం -
శ్రుతిమించిన ప్రేమికుల ప్రవర్తన.. వీడియోలు తీసి సోషల్ మీడియాలో
తుమకూరు (కర్ణాటక): నగరంలోని ఉద్యానవనంలోకి వచ్చే ప్రేమికుల ప్రవర్తనపై స్థానికులు మండిపడుతున్నారు. ఇక్కడి స్మార్ట్‌సిటీ ఉద్యానవనానికి అనేక మంది ఉదయం, సాయంత్రం వేళల్లో సేద తీరడానికి వస్తుంటారు. అదే సమయంలో కళాశాలల్లో చదువుకుంటున్న ప్రేమజంటలు ఇక్కడికి వచ్చి శ్రుతిమించి వ్యవహరిస్తున్నారు. ఈ దృశ్యాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి: (సామాజిక మాధ్యమాల్లో భార్య నగ్న దృశ్యాలు.. కస్టమర్లు ఒప్పుకుంటే..) -
లాడ్జికి రావాలని ఒకర్ని.. ఇంట్లో ఎవరూ లేకుంటే వచ్చేస్తా అని మరొకర్ని..
తుమకూరు (కర్ణాటక): నగరంలోని బెస్కాం ఆఫీసులో మహిళా సిబ్బందిని తిపటూరు సబ్టౌన్ రెవెన్యూ శాఖలో అసిస్టెంట్‌గా పనిచేసే బీకే జగదీశ్ లైంగిక వేధిస్తున్నట్లు ఏడుగురు మహిళా సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఓ ఉద్యోగిని మాట్లాడుతూ జగదీశ్‌ను తాను అన్న అని పిలుస్తానని, అలా పిలవరాదని అసభ్యంగా మాట్లాడాడని తెలిపారు. డ్యూటీ అయిపోయాక ఫోన్లు చేస్తూ ఇంట్లో ఎవరూ లేకుంటే.. వచ్చేస్తా.. ఓకేనా అంటూ వేధిస్తున్నట్లు వాపోయారు. లాడ్జికి రావాలని వేధించినట్లు మరో ఉద్యోగిని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సోమశేఖర్‌గౌడ స్పందిస్తూ జగదీశ్‌ను మరో ప్రాంతానికి బదిలీ చేస్తామని చెప్పారు. చదవండి: (ఆరు నెలలుగా బాలికపై లైంగిక దాడి.. ఒంటిపై పంటిగాట్లు గుర్తించి..) -
విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు..
బెంగళూరు(తుమకూరు): ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హేమావతి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తుమకూరు జిల్లా చేళూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతులను కేబీ క్రాస్ హేమావతి కాలువ కార్యాలయంలో సహాయ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న రమేష్(55), అతని భార్య మమత(46), కుమార్తె శుభ(25)గా గుర్తించారు. ఈ ముగ్గురు గురువారం సాయంత్రం కారులో సాగరనహళ్లి గేట్ వద్దకు చేరకుని హేమావతి కాలువలోకి ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో కాలువలో శవాలు తేలుతుండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (పాపం ప్రేమను గెలిపించుకోవాలనుకున్నాడు.. అదే శాపమై..) -
కర్కోటక తండ్రి.. కుమారుని గృహ నిర్బంధం
సాక్షి, తుమకూరు: డబ్బులు, ఆస్తి కోసం సొంత కొడుకునే తల్లిదండ్రులు పిచ్చివానిగా ప్రచారం చేసి ఇంట్లో బంధించి హింసించిన అమానవీయ ఘటన ఇది. ఈఘటన తిపటూరు తాలూకా నొణవినకెరె హోబళి నెల్లికెరె గ్రామ పంచాయతీ పరిధిలోని చిగ్గావి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన సోమశేఖరయ్య కుమారుడు మంజునాథ్ (23) బాధితుడు. సోమశేఖరయ్య మంజునాథ్‌ను సరిగా చూసుకునేవాడు కాదు. ఇటీవల కొబ్బరి పంట అమ్మగా వచ్చిన రూ.3 లక్షలను కూడా కూతురు, అల్లునికి ఇచ్చాడు. మంజునాథ్ ఖర్చుల కోసం రూ.2 వేలు ఇమ్మని ప్రాధేయపడితే రూపాయి కూడా ఇవ్వనని చెప్పి కొట్టి గదిలో వేసి బంధించారు. అతనికి పిచ్చిపట్టిందని అందరికీ చెప్పారు. ఈ నెల 23న సీనియర్ సివిల్ జడ్జి నూరున్నీసాకు ఒక వ్యక్తి మంజునాథ్ దీనగాథను వివరించాడు. వెంటనే జడ్జి, పోలీసులతో కలిసి వచ్చి మంజునాథ్‌ను గృహ నిర్బంధం నుంచి విడిపించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కర్కోటక తండ్రిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. చదవండి: (ఉషా అందుకు నిరాకరిచండంతో.. చెరువు వద్దకు పిలిచి..)