బెంగళూరు: ఎంతో గారాబంగా పెంచుకున్న చిలుక ఎగిరిపోయిందని బాధపడుతోంది కర్ణాటక తుమకూరుకు చెందిన ఓ కుటుంబం. ఇంట్లో ఓ కుటుంబసభ్యుడిగా ఉన్న చిలుకను బాగా మిస్ అవుతున్నట్లు చెబుతోంది. దాని ఆచూకీ చెప్పిన వారికి రూ.50 వేలు నజరానా ఇస్తామని ప్రకటన కూడా ఇచ్చారు కుటుంబసభ్యులు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను తుమకూరు వ్యాప్తంగా అతికించారు. ఇవి కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
'మా చిలుక కన్పించడం లేదు. దానికి మాకు చాలా అనుబంధం ఉంది. మీకు ఎక్కడైనా కన్పిస్తే చెప్పండి. రూ.50 వేలు ఇస్తాం. మీ ఇంటి బాల్కనీ, కిటీకీలు వెతకండి' అని చిలుక యజమానులు పల్లవి, అర్జున్ ప్రకటనలో తెలిపారు.
#Karnataka Family Announces Rs 50K Reward For Finding Missing #Parrot #Trending #Viralvideo #India pic.twitter.com/cTVRLVjlKZ
— IndiaObservers (@IndiaObservers) July 19, 2022
వీరిది జంతు ప్రేమికుల కుటుంబం. కొన్నేళ్లుగా ఆఫ్రికాకు చెందిన రెండు చిలుకలను పెంచుకుంటున్నారు. అయితే అందులో ఒకటి శనివారం నుంచి కన్పించడం లేదు. దాని పేరు రుస్తుమా. అది ఎక్కడికో వెళ్లిపోయి ఉంటుందని వీళ్లు భావిస్తున్నారు. రెండున్నరేళ్లకుపైగా ఈ చిలుక వీళ్లతో ఉంది. రెండుసార్లు దానికి ఘనంగా పుట్టినరోజు వేడుక కూడా చేసినట్లు తెలుస్తోంది.
చదవండి: అక్రమ మైనింగ్ ఆపేందుకు వెళ్లిన డీఎస్పీ.. ట్రక్కుతో తొక్కించి చంపిన మాఫియా గ్యాంగ్
Comments
Please login to add a commentAdd a comment