ఘటనను వివరిస్తున్న హాస్టల్ విద్యార్థులు, బెల్టుతో బాదాడని కమిలిన గుర్తులను చూపుతున్న బాధితులు
సాక్షి, బెంగళూరు(తుమకూరు): మద్యం మత్తులో పాఠశాల పరిపాలన విభాగం సభ్యుడు విద్యార్థులను చితకబాదిన ఘటన తుమకూరు తాలూకా మల్లసంద్ర విశ్వభారతి వసతి పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాలు.. పాఠశాల పరిపాలన విభాగం సభ్యుడైన భరత్ నాలుగు రోజుల క్రితం రాత్రి 10 గంటల సమయంలో మద్యం తాగి వసతి భవనానికి వచ్చాడు. పడుకుని ఉన్న 40 మంది విద్యార్థులను నిద్ర లేపి ఇంత త్వరగా పడుకుంటారా అంటూ కట్టెతో, బెల్టుతో చితకబాదాడు. దీంతో ఓ విద్యార్థి చేయి విరిగింది.
ఇద్దరు విద్యార్థుల మర్మాంగాలకు గాయం కాగా, పలువురి వీపులపై గాయాలయ్యాయి. అప్పటి నుంచి భరత్ కనిపించకుండా పోయాడు. జరిగిన ఘటనను బాధిత విద్యార్థులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావడంతో వారు గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు.
చదవండి: (అప్పులే దారుణానికి ఒడిగట్టేలా చేశాయి.. వీడిన టెక్కీ రాహుల్ అదృశ్యం మిస్టరీ)
Comments
Please login to add a commentAdd a comment