
భయానక రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందగా.. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సాక్షి, బెంగళూరు: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. తుముకూరు జిల్లాలోని బాలినహళ్లిలో ఓ లారీ జీపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా.. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రమాదంలో మృతుచెందిన వారిని రాయచూర్ జిల్లావాసులుగా గుర్తించారు. అయితే, 48వ నెంబర్ జాతీయ రహదారిపై రాయచూర్ నుంచి బెంగళూరు వస్తున్న జీపును ఓవర్‌టేక్ క్రమంలో లారీ ఢీకొట్టినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.