
ప్రతీకాత్మక చిత్రం
తుమకూరు/ కర్ణాటక: కొద్దిరోజుల్లో పెళ్లిపీటలెక్కి కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన యువకున్ని కరోనా మహమ్మారి చితికి చేర్చింది. మొబైల్‌షాపులో పనిచేస్తున్న 29 ఏళ్ల యువకుడు కరోనాతో చనిపోయాడు. ఇతని స్వస్థలం జిల్లాలోని చిక్కనాయకనహళ్లి తాలూకా హాలుకట్టి గొల్లరహట్టి. ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. మూడు రోజుల క్రితం అనారోగ్యంగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది.
వెంటనే జిల్లా ఆస్పత్రికి వెళ్లగా అక్కడ బెడ్లు ఖాళీ లేవన్నారు. తిపటూరుకు వెళ్లగా అక్కడ కూడా చేర్చుకోలేదు. ఈ క్రమంలో హాసన్ జిల్లా ఆస్పత్రిలో చేర్చేందుకు తీసుకువెళ్తుండగా మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశాడు. తుమకూరులోనే వైద్యం చేసి ఉంటే బతికేవాడు, పెళ్లికొడుకు కావాల్సినవాడు శ్మశానానికి వెళ్లావా నాన్నా అంటూ తల్లిదండ్రులు భోరున విలపించారు. వారి రోదిస్తున్న తీరు అందరిచేత కంటతడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment