
తుమకూరు: తన ప్రేమ పెళ్లిని తండ్రి నిరాకరించాడనే ఆగ్రహంతో కన్న కుమారుడే తండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటన తుమకూరు జిల్లాలోని శిరా తాలుకాలోని ద్వారనకుంటె గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు... గ్రామానికి చెందిన లక్ష్మణ్ (50), హరీశ్ (28) తండ్రి కుమారుడు. ఈ క్రమంలో హరీశ్ విడాకులు తీసుకున్న మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లిని తండ్రి తీవ్రంగా వ్యతిరేకించాడు. శనివారం రాత్రి మరోసారి తండ్రి, కుమారుడి మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో హరీశ్ తండ్రిని తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టనాయకనహళ్లి పోలీసులు హరీశ్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.
చదవండి: కరోనాకు మరో నిర్మాత బలి
Comments
Please login to add a commentAdd a comment