Dharwad Road Accident: Lady Doctor Deceased At Road Accident In Dharwad | వైద్యురాలు దుర్మరణం - Sakshi
Sakshi News home page

విషాదం: వైద్యురాలు దుర్మరణం

Published Thu, Jan 21 2021 4:25 AM | Last Updated on Thu, Jan 21 2021 10:44 AM

Lady Doctor Deceased In Road Accident At Tumkuru - Sakshi

వర్ణిక (ఫైల్‌)

సాక్షి, తుమకూరు: ధార్వాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వైద్యులు దుర్మరణం చెందిన ఘటన మరవక ముందే మరో వైద్యురాలు రోడ్డు ప్రమాదానికి బలయ్యారు. శిరాకు చెందిన వైద్యురాలు వర్ణిక(33) తన పుట్టిన రోజు సంబరాల కోసం  మామ, బీజేపీ నేత బి.గోవిందప్ప, భర్త స్వామిదర్శన్‌ తదితరులతో కారులో గోవా వెళ్లారు. బుధవారం తిరిగి వస్తుండగా రాణిబెన్నూరు సమీపంలోని బ్యాడగి సర్వీసు రోడ్డులో ముందు వెళ్తున్న లారీ డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశాడు. దీంతో వెనుక వస్తున్న కారు లారీని ఢీకొంది. ప్రమాదంలో వైద్యురాలు వర్ణిక మృతి చెందగా  గోవిందప్పకు భుజం, కాలు, వెన్నెముకకు గాయాలయ్యాయి. అత్త రత్నమ్మ, కుమారుడు మోహిత్‌కు చిన్నచిన్న గాయాలయ్యాయి. చదవండి: (ప్రాణం తీసిన ట్రిప్పు.. 9 మంది లేడీ డాక్టర్ల మృతి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement