doctor died
-
విషాదం: దొరక్క దొరికిన ఆస్పత్రి బెడ్.. అంతలోనే
జోగిపేట (అందోల్): బెడ్స్ కోసం పదులకొద్దీ ఆస్పత్రులు తిరిగారు. చివరకు ఎలాగో దొరికిందనుకుని బెడ్‌పై చేర్చినంతనే శ్వాస ఆగి కన్నుమూసిన వైద్యుడి విషాదమిది. సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని వాసవీనగర్ కాలనీకి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ కిష్టయ్య 25 ఏళ్లుగా బొడ్మట్‌పల్లి గ్రామంలో క్లినిక్‌ను ఏర్పాటు చేసి వైద్య సేవలందిస్తున్నారు. ఈ ప్రాంతంలోని 20-30 గ్రామాల్లో ఆయన వైద్యంపై అపార నమ్మకం. కిష్టయ్యకు కరోనా సోకడంతో శుక్రవారం అర్ధరాత్రి దాటాక 2.30 గంటల సమయంలో ఆయన కుమారులు హైదరాబాద్‌కు తరలించారు. 20కి పైగా ఆస్పత్రులు తిరిగినా ఎక్కడా బెడ్స్ దొరకలేదు. చివరికి శనివారం తెల్లవారుజామున ఓ ఆస్పత్రిలో బెడ్ దొరగ్గానే వెంటనే చేర్చారు. అయితే వైద్యులు నాడి చూసేసరికే శ్వాస ఆగిపోయింది. డాక్టర్ కిష్టయ్య జోగిపేట లైన్స్‌క్లబ్ సభ్యుడిగా కూడా ఉన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి ఇలా రోజుల వ్యవధిలోనే అస్వస్థతకు గురై మృత్యువాత పడడాన్ని బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతదేహానికి స్వగ్రామమైన బిజిలీపూర్‌లో కరోనా నిబంధనల మేరకు శనివారం అంత్యక్రియలు పూర్తిచేశారు. కడచూపునకు కూడా నోచుకోకపోవడంపై బంధువులు, స్నేహితులు బాధను వ్యక్తం చేస్తున్నారు. చదవండి: అందరికీ ఉచితంగా టీకా.. సీఎం కేసీఆర్ చదవండి: వేరే రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మరణాలు తక్కువే -
విషాదం: వైద్యురాలు దుర్మరణం
సాక్షి, తుమకూరు: ధార్వాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వైద్యులు దుర్మరణం చెందిన ఘటన మరవక ముందే మరో వైద్యురాలు రోడ్డు ప్రమాదానికి బలయ్యారు. శిరాకు చెందిన వైద్యురాలు వర్ణిక(33) తన పుట్టిన రోజు సంబరాల కోసం మామ, బీజేపీ నేత బి.గోవిందప్ప, భర్త స్వామిదర్శన్ తదితరులతో కారులో గోవా వెళ్లారు. బుధవారం తిరిగి వస్తుండగా రాణిబెన్నూరు సమీపంలోని బ్యాడగి సర్వీసు రోడ్డులో ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక వస్తున్న కారు లారీని ఢీకొంది. ప్రమాదంలో వైద్యురాలు వర్ణిక మృతి చెందగా గోవిందప్పకు భుజం, కాలు, వెన్నెముకకు గాయాలయ్యాయి. అత్త రత్నమ్మ, కుమారుడు మోహిత్‌కు చిన్నచిన్న గాయాలయ్యాయి. చదవండి: (ప్రాణం తీసిన ట్రిప్పు.. 9 మంది లేడీ డాక్టర్ల మృతి) -
బెంగాల్లో ప్రముఖ వైద్యుడి మృతి
కోల్‌కతా : ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న వైద్యలను కూడా మహమ్మరి రోగం వదలట్లేదు. పశ్చిమబెంగాల్లో 60 ఏళ్ల ప్రముఖ సీనియర్ ఆర్థోపెడిక్ వైద్యుడు బిప్లాబ్ కాంతిదాస్ గుప్తా ఈ వైరస్ కారణంగా సోమవారం చనిపోయారు. రాష్ర్టంలో కోవిడ్ కారణంగా మరణించిన మొట్టమొదటి వైద్యుడు ఈయనే అని అధికారులు వెల్లడించారు. ఇదివరకే శ్వాసకోస ఇబ్బందులతో భాదపడుతున్నా తన కర్తవ్యాన్ని వీడకుండా రోగులకు వైద్యు సేవలందించారు. కోవిడ్ లక్షణాలతో సాల్ట్ లేక్ అనే ప్రైవేట్ హాస్పిటల్లో చేరగా, అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ సోమవారం ఆయన మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం ప్రకటించారు. మీరు చేసిన త్యాగం ఎప్పటికీ మరిచిపోం అంటూ ఆయన సేవలను కొనియాడారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. We have lost Dr Biplab Kanti Dasgupta Assistant Director, Health Services, West Bengal in the early hours of today. He was Assistant Director of Health Services, Central Medical Stores. We are deeply pained with his untimely demise. (1/2) — Mamata Banerjee (@MamataOfficial) April 26, 2020 పశ్చిమ బెంగాల్ వైద్యుల ఫోరం కూడా కాంతిదాస్ గుప్తా మరణానికి సంతాపం తెలిపింది. మరోవైపు వైద్యులకు సరిపడా పీపీఈ కిట్లు ప్రభుత్వం అందిచట్లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇదే రకమైన నిర్లక్ష్య ధోరణి వహిస్తే మరికొంత మంది వైద్యులు మృత్యువాత పడే అవకాశం ఉందని ఆరోపించింది. ఇప్పటివరకు బెంగాల్లో కోవిడ్ కేసుల సంఖ్య 633 ఉండగా, 18 మంది చనిపోయినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవా సిన్హా వెల్లడించారు. (మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆరోపణలు) -
కోవిడ్‌కు వైద్యుడు బలి
బీజింగ్/టోక్యో/న్యూఢిల్లీ: కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న వుహాన్ నగరంలో మరో వైద్యుడు చనిపోయారు. మంగళవారం నాటికి ఈ వైరస్‌తో మృతి చెందిన వారి సంఖ్య 1,868కు, బాధితుల సంఖ్య 72,436కు చేరిందని యంత్రాంగం తెలిపింది. కోవిడ్‌పై మొదటిసారిగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు యత్నించిన వుహాన్ సెంట్రల్ ఆస్పత్రి ఆఫ్తల్మాలజిస్ట్ లి వెన్లియాంగ్ సహా ఆరుగురు వైద్య సిబ్బంది కోవిడ్‌తో చనిపోయినట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. మరో 1,700 మంది సిబ్బందికి వ్యాధి లక్షణాలు బయటపడినట్లు కూడా వెల్లడించింది. తాజాగా వుహాన్ వుచాంగ్ ఆస్పత్రి హెడ్, న్యూరో సర్జన్ డాక్టర్ లియు ఝిమింగ్ ఈ వైరస్ కారణంగానే మృతి చెందారని అధికార మీడియా ధ్రువీకరించింది. వుహాన్‌లో ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు అన్నారు. వ్యాధి బయటపడిన మొదట్లో అవగాహన లోపం కారణంగానే వైద్య సిబ్బందికి వైరస్ సోకిందని నిపుణులు అంటున్నారు. వ్యాధి తీవ్రతను బయటకు తెలియకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం కూడా ఇందుకు తోడైందని భావిస్తున్నారు. అయితే, చైనా కొత్త ఏడాది సెలవులను ముగించుకుని తిరిగి ఉద్యోగాల్లో చేరేందుకు నగరాలకు వచ్చే వారికి కోవిడ్ ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఓడలో ఆరుగురు భారతీయులకు కోవిడ్ కోవిడ్ భయంతో జపాన్ రాజధాని టోక్యో తీరంలో నిలిపేసిన డైమండ్ ప్రిన్సెస్ ఓడలో బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఓడలోని 3,711 మందిలో సోమవారం నాటికి 542 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణయిందని అధికారులు తెలిపారు. బాధితుల్లో ఆరుగురు భారతీయులు ఉన్నారని, వీరి పరిస్థితి మెరుగవుతోందని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో చైనా విజయం సాధిస్తుందని భారత్‌లో ఆ దేశ రాయబారి సున్ వీన్డాంగ్ అన్నారు. వుహాన్‌కు ప్రత్యేక విమానం వుహాన్‌కు 20వ తేదీన ప్రత్యేక విమానాన్ని పంపనున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. సీ–17 రకం భారీ సైనిక విమానంలో చై నాకు మందులు, ఇతర వైద్య సామగ్రిని తీసుకెళ్తామని, తిరుగు ప్రయాణంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను తీసుకువస్తామని సై నిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు ప్రభు త్వం వుహాన్ సహా హబే ప్రావిన్స్ నుంచి 640 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చింది. హుబే ప్రావిన్స్‌లో ఇంకా 100 మంది వరకు భారతీయులున్నట్లు అధికారులు తెలిపారు. టాయిలెట్ పేపర్ల చోరీ కోవిడ్ భయంతో జపాన్‌లో మాస్కులకు డిమాండ్ పెరిగిపోయింది. దుకాణాల్లో మాస్కుల కొరత ఏర్పడింది. దీంతో 65 మాస్కులుండే ఒక్కో బాక్స్ రూ.32 వేల వరకు ధర పలుకుతోంది. సోమవారం కోబె నగరంలోని రెడ్‌క్రాస్ ఆస్పత్రిలో 6 వేల మాస్కులున్న బాక్సులను దొంగలు మాయం చేశారు. హాంకాంగ్‌లోనూ మాస్కులు, టాయిలెట్ పేపర్ కొరత ఏర్పడింది. టాయిలెట్ పేపర్ లోడుతో వెళ్తున్న వాహనాన్ని కొందరు దుండగులు అడ్డగించి అందులోని సరుకునంతా లూటీ చేశారు. -
‘కరోనా’పై అప్రమత్తం చేసిన వైద్యుని మృతి
వుహాన్ : కరోనా వైరస్ చైనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వుహాన్ నగరంలోని వుచాంగ్ హాస్పిటల్ ప్రధాన ఆసుపత్రి డైరక్టర్ కోవిడ్-19 బారిన పడి మంగళవారం ప్రాణాలు కోల్పోయారు. లియూ చిమింగ్.. కరోనా వైరస్ కారణంగా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. లియూ చిమింగ్‌ను కాపాడేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమైనట్లు వైద్యులు వెల్లడించారు. లియూ చిమింగ్ మరణాన్ని చైనా అధికారిక టీవీ చానెల్ ధ్రువీకరించింది. కాగా కరోనా వైరస్ గురించి ముందస్తు హెచ్చరిక జారీ చేసిన వైద్యుడు లియూ చిమింగ్ మృతి చెందడం పట్ల చైనాలో లక్షలాది మంది ఆయనకు సంతాపం ప్రకటించారు. ('వీరి ప్రేమ ముందు ఏ వైరస్ నిలబడలేదు') కాగా లియూ మృతిపై సోమవారం రాత్రి సోషల్‌మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. లియూ చిమింగ్ సోమవారం రాత్రే మృతి చెందినట్లు హుబీ హెల్త్ కమిషన్ తమ బ్లాగ్‌లో వెల్లడించింది. అయితే వెనువెంటనే ఆయన మరణించలేదని, చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. కాగా లియూ చిమింగ్ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 10.30 గంటలకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా ఇప్పటి వరకు కోవిడ్-19 వల్ల చైనాలో సుమారు 1868 మంది మరణించినట్లు చైనా ఆరోగ్య సంస్థ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. కాగా కోవిడ్ దాటికి మెడికల్ సిబ్బందికి కూడా పెను ప్రమాదం ఉన్నట్లు రిపోర్ట్ అంచనా వేసింది. (‘కరోనా’ అసలు కథ.. 40 ఏళ్ల క్రితమే ఆ బుక్‌లో!) -
సాయానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన డాక్టర్..
ముంబై : ఎదుటి వాళ్లు ఆపదలో ఉంటే సహాయం చేసే రోజులు ఎప్పుడో పోయాయి. సొంత వాళ్లు ప్రమాదంలో ఉన్నా పట్టించుకోని రోజులు ఇవి. అయితే ముంబైలో జరిగిన ఓ సంఘటన మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. తోటి వ్యక్తికి సహాయం చేద్దామని ప్రయత్నించిన ప్రముఖ వైద్యుడు అనూహ్యంగా మృత్యువాత పడ్డారు. బస్సు రూపంలో వచ్చిన మృత్యువు అతన్ని కబళించేసింది. ఈ దుర్ఘటన ఆదివారం రాత్రి మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం పూణెకు చెందిన వెన్నెముక నిపుణుడు డాక్టర్ కేతన్ ఖుర్జేకర్, మరో ఇద్దరు ఆర్థోపెడిక్ వైద్యులతో కలిసి ముంబై నుంచి పూణేకు క్యాబ్‌లో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు సోమటనే గ్రామ సమీపానికి చేరుకున్న సమయంలో టైరు పాడైంది. దీంతో టైరు మార్చడానికి డ్రైవర్ కిందకు దిగాడు. అయితే మిగిలిన డాక్టర్లు కిందికి దిగి రిలాక్స్ అవుతుండగా, డాక్టర్ ఖుర్జేకర్ మాత్రం డ్రైవర్‌కు సాయం చేస్తున్నారు. ఇంతులో అకస్మాత్తుగా ఓ ప్రైవేట్ బస్సు వెనకనుంచి వీరిని ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో వైద్యుడు ఖుర్జేకర్, క్యాబ్ డ్రైవర్ జ్ఞానేశ్వర్ భోంస్లే (27)అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. గాయపడిన మిగతా ఇద్దరు వైద్యులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలోఅసువులు బాసిన డాక్టర్ ఖుర్జేకర్ వృత్తిలో గోల్డ్ మెడలిస్ట్ కావడం విశేషం. అంతేగాక ఓ ఆసుపత్రిలో వెన్నెముక శస్త్రచికిత్స విభాగానికి అధిపతి. ఆయన సుమారు 3,500 క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేయడం పేరుగాంచారు. -
ఇంజక్షన్ వికటించి వైద్యుడు మృతి
సాక్షి, చెన్నూర్(ఆదిలాబాద్) : మండల కేంద్రానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు బొడిగె రవికిరణ్ (48)శుక్రవారం ఇంజక్షన్ వికటించి మృతి చెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. వివరాలు రవికిరణ్ ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడని కొద్ది కాలంగా పెరాలసిస్ వ్యాధితో బాధ పడుతున్నాడని ఎస్సై తెలిపారు. ఈ నేపథ్యంలో పెరాలసిస్‌కు సంబంధించిన ఇంజక్షన్ తీసుకోవడంతో కింద పడిపోయాడని ఎస్సై తెలిపారు. వెంటనే కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలో మృతి చెందాడని తెలిపారు. మృతుడి కుమారుడు కృష్ణచైతన్య పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్డమ్ నిమిత్తం చెన్నూరు తరలించినట్లు ఎస్సై తెలిపారు. రవికిరణ్ సొంతగా ఇంజక్షన్ తీసుకున్నాడా లేకా ఎవరైన ఇచ్చారా అనేది విచారణలో తెలుసుకుంటామన్నారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన రవికిరణ్ గత 20 ఏళ్ల నుంచి భీమారంలో ఆర్ఎంపీ వైద్యుడుగా సేవలు అందిస్తున్నారు. కాగా రవి కిరణ్‌కు భార్య తోపాటు కూతురు, కుమారుడు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వైద్యుడి మృతి
నిడదవోలు రూరల్: మండలంలోని తాడిమళ్ల పీహెచ్సీ వైద్యాధికారిగా పనిచేసిన పత్తనంక శ్రీకాంత్(32) సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతిచెందారు. ఈనెల 1వ తేదీ నుంచి విశాఖపట్టణంలోని కేజీహెచ్‌లో కంటివైద్యనిపుణుడు(ఆప్తమాలజీ)లో శ్రీకాంత్ పీజీ కోర్సు చేస్తున్నారు. నిడదవోలులోని ఆయన నివాసం నుంచి తెల్లవారుజామున విశాఖపట్టణం వెళ్లేందుకు రాజమండ్రి రైల్వేస్టేషన్‌కు బైక్‌పై వెళుతుండగా తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక సమీపంలోని కాటన్బ్యారేజిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. ఈవిషాద వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యలు, నిడదవోలు, తాడిమళ్ల పీహెచ్సీ పరిధిలోని వైద్య సిబ్బంది దుఖఃసాగరంలో మునిగిపోయారు. రోగులతో ఆప్యాయంగా.. నిడదవోలుకు చెందిన ప్రముఖ ఆడిటర్ సురేంద్రకుమార్ కుమారుడైన శ్రీకాంత్ వైద్యవిద్యను అభ్యసించి 2014 నుంచి తాడిమళ్ల పీహెచ్సీలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. రోగులను ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని ప్రతి ఒక్కరూ గుర్తుచేసుకుంటున్నారు. 2014 నుంచి 2018 వరకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు, మెరుగైన వైద్యసేవలు అందించడంతో మూడుసార్లు జిల్లాస్థాయిలో ఉత్తమ అవార్డులు కైవసం చేసుకున్నారు. గత రెండేళ్లుగా సమిశ్రగూడెం పీహెచ్సీకీ కూడా అదనపు వైద్యుడిగా సేవలందిస్తున్నారు. ఇటీవల జరిగిన మండల పరిషత్ పాలకవర్గ సమావేశంలో తాడిమళ్ల పీహెచ్సీ శిథిలావస్థకు చేరుకుందని, నూతన భవనానికి సంబంధించిన ప్రతిపాదనలను అధికారులకు శ్రీకాంత్ అందజేశారు. వైద్యపరీక్షలకు వచ్చే పేద గర్భిణీలకు రక్తహీనత ఇబ్బందులు ఉంటే ఆయనే స్వయంగా కొంత నగదును ఇచ్చి పండ్లు, పౌష్టికాహారం తీసుకోమని సూచించేవారని సిబ్బంది చెబుతున్నారు. శ్రీకాంత్‌కు రెండేళ్ల క్రితం వీణ బాలకృష్ణన్‌తో వివాహం కాగా ఆమె కేరళలో దంతవైద్యం(బీడీఎస్) చేస్తున్నారు. మరణవార్త తెలియగానే నిడదవోలు చేరుకున్న భార్య శ్రీకాంత్ మృతదేహం చూసి గుండెలవిసేలా రోదించారు. ఆమె ప్రస్తుతం మూడోనెల గర్భిణీ అని బంధువులు చెబుతున్నారు. పలువురి సంతాపం వైద్యాధికారి పి.శ్రీకాంత్ భౌతిక కాయాన్ని ఆయన నివాసంలో నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, మునిసిపల్ చైర్మన్ బొబ్బా కృష్ణమూర్తి, తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఎ.ఆంజనేయులు, కమిషనర్ జి.కృష్ణమోహన్, డెప్యూటీ ఎంహెచ్ఓ శైలజ, వైద్యులు ఎవీఆర్ఎస్ తాతారావు, బి.శ్రీనివాసరావు, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులతో పాటు ఆసుపత్రుల సిబ్బంది, రాజకీయ నాయకులు, బంధువులు నివాళులర్పించి ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. -
తేనెటీగల దాడిలో డాక్టర్ మృతి
స్టేషన్ ఘన్పూర్: తేనెటీగల దాడిలో ఓ వెటర్నరి డాక్టర్ మృతిచెందాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం నగరంపల్లి శివారులో గురువారం చోటు చేసుకుంది. ఘన్‌పూర్‌లో పశువుల డాక్టర్‌గా పని చేస్తున్న మల్లేశం(46) విధి నిర్వాహణలో భాగం నగరంపల్లి గ్రామంలో పశువులకు టీకాలు వేయడానికి బైక్‌పై వెళ్తుండగా.. మార్గ మధ్యలో తేనెటీగలు దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినా.. పెద్ద సంఖ్యంలో తేనెటీగలు ఆయనను కుట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. -
కేంద్ర మంత్రిపై రాష్ట్రపతికి ఫిర్యాదు
ఆగ్రా: గత శనివారం రాత్రి యమునా ఎక్స్ ప్రెస్వేపై ప్రమాదానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాన్వాయే కారణమని బాధితులు ఆరోపించారు. ఆ రోడ్డు ప్రమాదంలో ఆగ్రాకు చెందిన వైద్యుడు రమేష్ నగార్ మృతి చెందగా, పలువురు వ్యక్తులు గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి స్మృతి ఇరానీ పై చర్య తీసుకోవాలని మృతిచెందిన డాక్టర్ కుమారుడు అభిషేక్ నగార్ తాజాగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశాడు. ఈ విషయంలో జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని అభిషేక్, ప్రణబ్ ను కోరాడు. తమ ఫిర్యాదులో కాన్వాయ్ నెంబర్ పేర్కొన్నప్పటికీ మథుర పోలీసులు అందుకు నిరాకరించారని రాష్ట్రపతికి రాసిన లేఖలో అభిషేక్ పేర్కొన్నాడు. ఆ వాహనం నెంబర్ డీఎల్ 3సీ బీఏ 5315 (DL 3C BA 5315) అని వెల్లడించాడు. తన తండ్రి ఓ వివాహానికి బైక్ పై వెళ్లుండగా ఈ ప్రమాదం జరిగిందని, ఈ ఘటనలో తన కూతురు సాందిలి(12), మరో చిన్నారి పంకజ్(8) గాయపడ్డారని వివరించాడు. మంత్రి కాన్వాయ్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని, స్మృతి ఇరానీ ఆ గాయపడ్డ ఇద్దరు చిన్నారులను చూసి కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయిందని తమకు న్యాయం చేయాలని తన లేఖలో రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాడు.