తేనెటీగల దాడిలో డాక్టర్ మృతి
స్టేషన్ ఘన్‌పూర్: తేనెటీగల దాడిలో ఓ వెటర్నరి డాక్టర్ మృతిచెందాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం నగరంపల్లి శివారులో గురువారం చోటు చేసుకుంది. ఘన్‌పూర్‌లో పశువుల డాక్టర్‌గా పని చేస్తున్న మల్లేశం(46) విధి నిర్వాహణలో భాగం నగరంపల్లి గ్రామంలో పశువులకు టీకాలు వేయడానికి బైక్‌పై వెళ్తుండగా.. మార్గ మధ్యలో తేనెటీగలు దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినా.. పెద్ద సంఖ్యంలో తేనెటీగలు ఆయనను కుట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.