కోల్‌కతా : ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న వైద్యలను కూడా మహమ్మరి రోగం వదలట్లేదు. పశ్చిమబెంగాల్‌లో 60 ఏళ్ల ప్రముఖ సీనియర్ ఆర్థోపెడిక్ వైద్యుడు బిప్లాబ్ కాంతిదాస్ గుప్తా ఈ వైరస్ కారణంగా సోమవారం చనిపోయారు. రాష్ర్టంలో కోవిడ్ కారణంగా మరణించిన మొట్టమొదటి వైద్యుడు ఈయనే అని అధికారులు వెల్లడించారు. ఇదివరకే శ్వాసకోస ఇబ్బందులతో భాదపడుతున్నా తన కర్తవ్యాన్ని వీడకుండా రోగులకు వైద్యు సేవలందించారు.
కోవిడ్ లక్షణాలతో సాల్ట్ లేక్ అనే ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరగా, అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ సోమవారం ఆయన మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం ప్రకటించారు. మీరు చేసిన త్యాగం ఎప్పటికీ మరిచిపోం అంటూ ఆయన సేవలను కొనియాడారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
We have lost Dr Biplab Kanti Dasgupta
— Mamata Banerjee (@MamataOfficial) April 26, 2020
Assistant Director, Health Services, West Bengal in the early hours of today.
He was Assistant Director of Health Services, Central Medical Stores.
We are deeply pained with his untimely demise. (1/2)
పశ్చిమ బెంగాల్ వైద్యుల ఫోరం కూడా కాంతిదాస్ గుప్తా మరణానికి సంతాపం తెలిపింది. మరోవైపు వైద్యులకు సరిపడా పీపీఈ కిట్లు ప్రభుత్వం అందిచట్లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇదే రకమైన నిర్లక్ష్య ధోరణి వహిస్తే మరికొంత మంది వైద్యులు మృత్యువాత పడే అవకాశం ఉందని ఆరోపించింది. ఇప్పటివరకు బెంగాల్‌లో కోవిడ్ కేసుల సంఖ్య 633 ఉండగా, 18 మంది చనిపోయినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవా సిన్హా వెల్లడించారు. (మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆరోపణలు)
Comments
Please login to add a commentAdd a comment