Published
Mon, Jul 4 2016 7:07 PM
| Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
ఇద్దరు టెక్కీల జల సమాధి
తుమకూరు(కర్ణాటక): విహారానికి వచ్చిన ఐదుగురు టెక్కీల్లో ఇద్దరు జల సమాధి అయ్యారు. ఈ ఘటన తుమకూరు నగర సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బెంగళూరుకు చెందిన కార్తీక్ (28), వరుణ( 26)తోపాటు మరో ముగ్గురు టెక్కీలు కోరమంగళలో ఉన్న హెచ్‌పీ కంపెనీలో పని చేస్తున్నారు.
వీక్‌ఎండ్ కావడంతో ఆదివారం దేవరాయణదుర్గకు వచ్చారు. అక్కడ మద్యం తాగి సమీపంలోని చెరువులో ఈతకు వెళ్లారు. కార్తిక్ నీటిలో మునిగి పోతుండగ కాపాడటానికి వెళ్లిన వరుణ కూడా గల్లంతయ్యాడు. మిగతా ముగ్గురు అప్రమత్తమై క్యాత్సంద్ర పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం ఎగ్జామినేషన్ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.